#కర్మ
Explore tagged Tumblr posts
mplanetleaf · 2 years ago
Video
youtube
కర్మ సిద్ధాంతం భగవద్గీత Bhagavadgita Ch 14:14–18 MPlanetLeaf
1 note · View note
social-yogi-shyam-satish · 3 days ago
Text
దక్షిణా దేవి
ఒక గోపిక ... సాక్షాత్తు లక్ష్మీదేవి అంశగా మారిపోవడం అనేది మనకి 'దక్షిణా దేవి' విషయంలో కనిపిస్తుంది. నిజానికి దక్షిణా దేవి గురించి చాలా తక్కువ మందికి తెలుసు.
రాధా కృష్ణుల ప్రేమ ప్రపంచంలో ... ప్రణయ తీరాల్లో విహరిస్తూ వున్న రోజుల్లో 'సుశీల' అనే గోపిక రాధకి ప్రధాన సహచరిగా వుండేది.గోలోకములో రాస లీలా వినోదములో తన్మయుడై యుండగా అతని దక్షిణ భాగము నుండి ఒక కన్య జనించెను. కృష్ణుని దక్షిణ పార్శ్వము నుండి పుట్టినది కావున ఆమెకు దక్షిణా దేవి అను పేరు గలిగెను .ఈమె శ్రీ కృష్ణుని యర్ధాంగి యగు రాధకు ప్రియసఖి రాధాకృష్ణులకు నిత్యము సేవలు చేయుచుండెను .
ఒకసారి ఆమె శ్రీ కృష్ణుడితో మాట్లాడుతూ ఊహించని విధంగా ఆయన తొడపై కూర్చుంది. దూరం నుంచి ఈ దృశ్యాన్ని చూసిన రాధ ... పరిగెత్తుకు రాసాగింది. అది చూసిన సుశీల అక్కడి నుంచి పారిపోయింది. తిరిగి ఆమె గోకులంలో ప్రవేశిస్తే ప్రాణాలు కోల్పోతుందని రాధ శాపం పెట్టింది..దక్షిణ ,గోలోకము వదలి వైకుంటము నందున్న లక్ష్మీలో ప్రవేశించెను .దక్షిణా దేవి యద్రుశ్యు రాలగుట వలన యజ్ఞ యాగాదులు చేసిన వారికి ఫలము దక్కకుండా బోయెను.
"దానం యజ్ఞా నాం వరూధం దక్షిణా " అని శ్రుతి (యజ్ఞములు పూర్తియైన తరువాత దక్షిణా దానము తప్పని సరి . ఆ దక్షిణ యజ్ఞ ఫలమును కవచము వలె కాపాడి ,యజమానునకి చ్చును ) దేవతలకు హవిర్భాగములు సరిగా అందకుండా పోయెను . ఈ విషయమును దేవతలు బ్రహ్మతో చెప్పుకొనిరి . బ్రహ్మ కోరికపై విష్ణువు , లక్ష్మి నుండి దక్షిణను వేరు చేసెను .యజ్ఞ సంబందమైన సమస్త కార్యములను సంపన్న మొనర్చుటకు దక్షిణాదేవిని తీసుకుని పోయి యజ్ఞ పురుషునికి ఇచ్చి పెండ్లి చేసెను .యజ్ఞ పురుషునికి దక్షిణ యందు ఫలుడు (ఫలము ) అను పుత్రుడు గలిగెను.
బ్రహ్మ ,కళ్యాణ సమయ మందు దక్షిణా యజ్ఞ పురుషులకు వర మిచ్చెను . "యజ్ఞము చేసిన తరువాత యోగ్యమైన దక్షిణ నీయనివారికి ఫలము లేక పోవును.దక్షిణా యుక్తమైన యజ్ఞమే ఫలము నిచ్చును " అని దక్షిణ లేని యజ్ఞముల ఫలము బలి చక్రవర్తికి చెందును.
" యే బ్రాహ్మణా బహు విదః తేభ్యో యద్దక్షి ణాన నయేత్ ,దురిష్టగ్ స్యాత్ " అని శ్రుతి (బాగుగా చదువుకొన్న బ్రాహ్మణులు, అధ్వర్యులు గాను ఋత్విక్కులు గాను ఇతర పాత్రల లోను నిలిచి యజ్ఞము జరిపించిన తరువాత వారి కియ్యవలసినంత దక్షిణ సరిగా నియ్యక పోయినచో యజమానికి అనర్��ము కలుగునని యర్ధము )
శ్రాద్ధ కర్మలయందు, యజ్ఞ కర్మల యందు, దేవతా ప్రీత్యర్ధం మొనరించిన సకల పూజా కార్యక్రమములందు యజ్ఞ కర్త దక్షిణ ఇవ్వకున్నను, పురోహితుడు దక్షిణ ఆర్జించని యెడల శ్రీ మహాలక్ష్మీ శాపముతో దరిద్రుడై భాదలను అనుభవించునని బ్రహ్మ వైవర్త పురాణం నందు వివరించబడినది.దక్షిణ ఇవ్వకుండా,తీసుకోకుండా చేయు కర్మ ఫలితాలు బలి చక్రవర్తికి చెందును.శ్రాద్ధ కర్మములందు అర్పించిన వస్తువులన్నియు బలి చక్రవర్తికి భోజన రూపమున చేరగలవు.
దక్షిణా దేవి స్తోత్రమును యజ్ఞ సమయమున పఠించిన వారికి సర్వ యజ్ఞ ఫలములు నిర్విగ్నంగా సంపన్నమగును.దక్షిణాదేవి దివ్య చరితా శ్రవణ మొనర్చిన వారికి ధనం, విద్య, స్ధిరాస్తులు, లభించును. అలాంటి దక్షిణా దేవిని పూజించిన వారికి వ్యాధుల బారి నుంచి బాధల బారి నుంచి విముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
#Yoga #Ayurveda #Yagya #Naturopathy
#PatanjaliYogPeeth #Gurukulam
#Patanjaliwellness #DivyaPharmacy
#PatanjaliResearchInstitute
#BharatSwabhimanTrust
#PatanjaliYogSamiti #MahilaPatanjaliYogSamiti
#YuvaBharat #KisanSevaSamiti
#YogPracharakVibhag #SocialMedia
#YCB #AYUSH #IDY #Swadeshi
#LegalCell #TeluguStates #APTGstates
#AndhraPradesh #TelanganaState #SouthIndia #BHARAT
Tumblr media
0 notes
gitaacharanintelugu · 3 days ago
Text
61. అనిశ్చిత మనస్సుకు నిశ్చితత
భగవద్గీతలోని మూడవ అధ్యాయం 'కర్మ యోగము' అని పిలువబడుతుంది. ఇది 2.71 శ్లోకం యొక్క విశదీకరణ. ఇక్కడ శ్రీకృష్ణుడు శాశ్వతమైన స్థితిని సాధించడానికి నిర్మమ, నిరహంకార మార్గమని చెప్పారు.
“మీరు బుద్ధిని ఉన్నతమైనదిగా భావిస్తే, నన్ను ఈ భయంకర కార్యమైన యుద్ధంలో ఎందుకు నిమగ్నం చేస్తున్నారు (3.1)? ప్రసంగంతో నన్ను కలవరపెట్టకుండా నా క్షేమం కోసం అన్నిటికంటే ఏది మంచిదో నాకు నిశ్చయంగా చెప్పండి” అని అర్జునుడు అడుగుతాడు (3.2).
భావోద్వేగానికి లోనై సరైన సాక్ష్యాధారాలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం, నిర్ధారణలకు రావడం, అంచనాలు వేయడం వదిలి వేయమని శ్రీకృష్ణుడు అంతకు ముందే సూచించారు (2.50). యుద్ధంలో తన బంధువులను చంపడం వలన ఎలాంటి మేలు జరగదని అర్జునుడు యుద్ధం నుంచి వైదొలగాలని ప్రయత్నిస్తాడు (1.31). తదనంతరం, అనేక విధాలుగా అతను తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ప్రస్తుత ప్రశ్న కూడా అవగాహన కోసం అన్వేషణ కాకుండా స్వీయ సమర్ధనలో భాగంగా కనిపిస్తుంది.
మన పరిస్థితి అర్జునుడి కంటే భిన్నంగా లేదు ఎందుకంటే మనం మన స్పృహలోకి రాకముందే మతం, జాతి, కుటుంబ స్థితి, కులం, జాతీయత, లింగం మొదలైన వాటి ఆధారంగా గుర్తించబడతాము. జీవితాంతం వాటిని సమర్థించుకోవడానికి పోరాడుతూనే ఉంటాము.
రెండవది, అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి నిశ్చయత కోసం ఎదురు చూస్తూన్నాడు. అశాశ్వతం, అనిశ్చయత అనేవి లోక రీతుల ప్రమాణం అయినప్పటికీ మనమందరం మనకు హాయినిచ్చే నిశ్చయత కోసం ఎదురు చూస్తాము. హేతుబద్ధమైన నిర్ణయాల కోసం ఆధారాలను సేకరించేందుకు అనిశ్చయతతో వేచి ఉండడానికి ధైర్యం, ఓర్పు కావాలి. కానీ శాశ్వతమైన నిశ్చితత్వ అనేది మన జీవన  అనుభవాల నుండి వస్తుంది. ఈ అనుభవాలని పుస్తకాల నుండి లేదా ఇతరుల నుండి అరువు తెచ్చుకోలేము కాబట్టి మనమందరం కష్టపడి సంపాదించాలి. ఇది కారు నడపడం లేదా సైకిల్ తొక్కడం లాగా ప్రతి ఒక్కరూ స్వయంగా నేర్చుకోవాలి. ఇది ప్రతి ఒక్కరికీ తన సొంత అనుభవం.
0 notes
jonnalagaddajyothi · 5 days ago
Video
youtube
పెళ్ళికి జాతకం అవసరమా#matchmaking #brahminmatrimony #hindumatrimony#telu...
#పెళ్ళికి #జాతకం #అవసరమా #పెళ్లి #TeluguMarriage #Matchmaking #జైశ్రీరాం #వివాహం #రాసిపెట్టిఉండాలి #మనిషి #Man #Woman #girl #boy #bride #bridegroom #groom #పెళ్లిపెటాకులు #సుఖం #సంతోషం #ఆనందం #happiness #విడాకులు #divorce #కర్మ #destiny #జ్యోతిష్కులు #Astrology #Horoscope #వివాహంకుదిరింది #బంధం #బంధాలు #పండితుడు #pandit #పరమశుం�� #శుంఠ #కర్మసాక్షి #ఖగోళశాస్త్రం
0 notes
Video
youtube
|| లోగుట్టు పెరుమాళ్లకెరుక || 
పూర్వకాలంలో పెరుమాళ్లు అనే భక్తుడు ఉండేవాడు. అతను ఊరూరా తిరిగి, దేవుడి మహిమలనుగురించి కథలు చెబుతూ వుండటం, ప్రజలకు వేదాంతం బోధిస్తూ వుండటం పనిగా పెట్టుకున్నాడు. అతను గొప్ప భక్తుడని అందరూ నమ్మేటందుకు తగినట్టుగా పెరుమాళ్లు గెడ్డం పెంచి, కాలి గుడ్డ లు కట్టుకునేవాడు. రుద్రాక్షమాలలూ అవ్వి వేసుకొనేవాడు. అతను ఊరూరా తిరిగి ఉపన్యసించేవాడు. "అన్నలారా, అక్కలారా, తల్లులారా!. తండ్రులారా! ఎల్లప్పుడూ సత్యమే పల కండి. ఎవళ్ళనూ మోసంచేయకండి. పుణ్యకార్యాలు చేసి తరించండి. నీ సొము నా సొమ్ము అనే భేదబుద్ధి పెట్టుకోకండి. కర్మ, అనగా పని చేయటమే మనవంతు,
 #chinnanatichandamamakathalu #chandamama #chandamamakathalu #chandamamastories #neethikathalu #neethikathalutelugu #neethikathalutelugustories #telugustories #telugustory #telugulokathalu #telugunoval #teluguaudiobook #telugumoral #telugumoralstories #stories #storiesforkids #storiesforchildren #storiesforall #storiesintelugu #MoralStory #moralstories #moralstoriesforkids #moralstoriesforchildren #bedtimestory #bedtimestories #bedtimestoriesforkids #bedtimestoriesforchildren #bedtimestoriesintelugu
0 notes
chaitanyavijnanam · 2 months ago
Text
సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం (Meaning of - Sadhana Panchakam Stotra by Sri Adisankaracharya for the possibility of soul realization)
Tumblr media
🌹సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. 🌹 ప్రసాద్‌ భరధ్వాజ
శ్రీ ఆది శంకరాచార్య విరచిత సాధనా పంచకమ్ అనేది ఒక మహత్తరమైన గ్రంథం, ఇందులో మానవుడు తన జీవితాన్ని ఎలా సాధించుకోవాలో, ఎలా దైవానుసంధానం చేసుకోవాలో, ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలో 5 శ్లోకాల్లో వివరిస్తారు. ఇది ధ్యానం, భక్తి, కర్మ మొదలైన పద్ధతులను సాధన చేయడానికి ఒక మార్గదర్శిని. ఇందులోని ప్రతీ శ్లోకం మానవుడికి ఆత్మవిచారం, దైవానుసంధానం, సద్గుణాల వృద్ధి కోసం మార్గనిర్దేశకంగా ఉంటుంది. శంకరాచార్యులు దీని ద్వారా సత్యానికి చేరుకునే మహామార్గాన్ని చూపించారు. ఇది వేదాలు మరియు ఉపనిష��్తుల మార్గాన్ని అనుసరించిన అనేక మంది మహాత్ములచే సూచించబడిన మార్గం. ఏ సాధకుడైనా ఈ సూచనలను ఆచరణలో పెట్టినచో, అతడు తప్పక నిష్ప్రయోజకమైన, స్వయం నష్టకరమైన ప్రతివాదాలు మరియు తప్పుడు నిర్ణయాలలో చిక్కుకోకుండా, సరైన మార్గాన్ని అనుసరించగలడు.
1వ శ్లోకం :
వేదోనిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేశస్య విధీయతా మపచితిః కామ్యేమన స్త్య జ్యతామ్ పాపౌఘః పరిభూయతాం భవసుఖే దోషోనుసంధీయతాం ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతామ్
నిత్యము వేదము చదువుము. వేదము చెప్పిన కర్మలను చేయుము. ఈశ్వరుని పూజిం��ుము. కోరికలను విడిచిపెట్టుము. పాపములను పరిహరించుము. సంసారము నందలి దోషము తెలిసి కొనుము. ఆత్మజ్ఞాన మునకు ప్రయత్నించుము. ఇంటిని విడిచి బయటకు వెళ్ళుము.
2వ శ్లోకం :
సంగః సత్సు విధీయతాం భగవతో భక్తిర్ధృఢా ధీయతాం శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశు సంత్యజ్యతామ్ సద్విద్వాను పసర్ప్యతాం ప్రతిదినం తత్పాదుకా సేవ్యతామ్ బ్రహ్మైవాక్షరమర్ధ్యతాం శ్రుతిశిరోవాక్యం సమాక ర్ణ్యతామ్|
సత్పురుషుల స్నేహము చేయుము. భగవంతుని యందు దృఢమయిన భక్తిని నిలుపుము. శాంతిని సాధింపుము. దుష్ట కర్మలను విడిచి పెట్టుము. పండితుల దగ్గరకు వెళ్ళుము. వారి పాదములను సేవించుము. ఏకాక్షరమయిన ప్రణవమును, యాచింపుము. వేదాంత శ్రవణము చేయుము.
3వ శ్లోకం :
వాక్యార్థశ్చ విచార్యతాం శ్రుతిశిరః పక్షస్సమాశ్రీయతాం దుస్తర్కాత్స్యు విరమ్యతాం శ్రుతిమత స్తర్కోను సంధీయతాం బ్రహ్మైవస్మి విభావ్యతా మహరహో గర్వః పరిత్యజ్యతామ్ దేహో హమ్మతి రుజ్ఝ్యతాం బుధజనైర్వాదః పరిత్యజ్యతామ్!
వేదాంత వాక్య విచారము చేయుము. వేదాంత పక్షమును ఆశ్రయించుము. దుష్టమయిన తర్కమును విడిచి వేద విహితమయిన తర్కమును చేయుము. రాత్రిం బవళ్ళు బ్రహ్మను అని భావన చేయుము. గర్వము విడిచి పెట్టుము. శరీరము నందు ఆత్మ బుద్దిని విడిచి పెట్టుము. పండితులతో వాదన చేయకుము.
4వ శ్లోకం :
క్షుద్వ్యాధిశ్చ చికిత్స్య తాం ప్రతిదినం భిక్షౌషధం భుజ్యతాం స్వాద్వన్నం నచ యాచ్యతాం విధివశాత్ప్రా ప్తేనసంతుష్యతామ్ శీతోష్ణాది విషహ్యతాం న తు వృధావాక్యం సముచ్చార్యతాం ఔదాసీన్య మభీప్స్యతాం జనకృపానైష్ఠుర్య ముత్సృజ్యతామ్
ఆకలియను రోగము పోవుటకు భిక్షయను మందును తినుము. రుచికరములయిన అన్నమునకు ఆశ పడకుము. దైవ వశమున లభించినచో సంతసింపుము. వేడిని చలిని సహించుము. వ్య��్థముగా మాట్లాడకుము. ఉదాసీనుడవయి యుండుము. జనుల దయకు ఆశ పడకుము.
5వ శ్లోకం :
ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం పూర్ణాత్మా సుసమీక్ష్యతాం జగదిదం తద్బాధితం దృశ్యతామ్ ప్రాక్కర్మ ప్రవిలాప్యతాం చితిబలా న్నాప్యుత్తరైః శ్లిష్యతాం ప్రారబ్ధ స్త్విహ భుజ్యతా మధ పరబ్రహ్మాత్మ నాస్థీయ తామ్
ఏకాంతము నందు సుఖము గానుండుము. బ్రహ్మ యందు చిత్తము నిలుపుము. ఈ జగత్తును ఆత్మ స్వరూపముగా భావించుము జగత్తు నశించునది అని తెలియుము. పూర్వకర్మను, జ్ఞానబలము వలన నాశనము చేసుకొనుము. ఆగామి కర్మల యందు కోరికను విడిచి పెట్టుము. ప్రారబ్ధము అనుభవించుము. పరబ్రహ్మ యందు స్థిరముగా నుండుము.
ఫలశ్రుతి :
యః శోక పంచకమిదం పఠతే మనుష్య: సంచింత యత్యను దినం స్థిర తాముపేత్య తస్యాశు సంసృతి దవానల తీవ్ర ఘోర తాపః ప్రశాంతి ముపయాతి చితి ప్రభాదాత్
ఈ అయిదు శ్లోకములను ప్రతిదినము స్థిరమయిన సమ బుద్ధితో చదివి ఆలోచించిన వారికి అత్మ సాక్షాత్కారము వలన సంసారమనెడు, దావాగ్ని నశించి శాంతి లభించును.
ఇతి శ్రీ ఆది శంకరాచార్య విరచిత సాధనా పంచకమ్ సంపూర్ణమ్‌.
జైగురుదేవ్‌.
🌹🌹🌹🌹🌹
0 notes
venkatachandra8 · 2 months ago
Text
కర్మ ఎలా పనిచేస్తుంది? | Uncover the Secret of the Law of Karma with Ma...
youtube
0 notes
kapilagita · 3 months ago
Text
కపిల గీత - కపిల దేవహూతి సంవాదం - దేవహూతి కుమారుడు కపిల భగవానుని బోధనలు - పరిచయం
youtube
*🌹 కపిల గీత - కపిల దేవహూతి సంవాదం - దేవహూతి కుమారుడు కపిల భగవానుని బోధనలు - పరిచయం 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*
*కపిల మహర్షి, దేవహూతి కుమారుడిగా ప్రసిద్ధి పొందిన కపిల భగవానుడు, సాంఖ్య యోగం అనే తత్వాన్ని వివరించారు. ఈ తత్వం ఆత్మ, భగవంతుడు మరియు భౌతిక ప్రపంచం మధ్య ఉన్న సంబంధాన్ని బోధిస్తుంది. కపిల మహర్షి భౌతిక ప్రపంచం మాయలో జీవులు కర్మ బంధాలకు లోనవుతారని, భక్తి యోగం ద్వారా కర్మ బంధాల నుంచి విముక్తి పొందవచ్చని చెప్పారు. ఆయన నియమబద్ధ జీవనాన్ని, భక్తి యోగాన్ని పాటించడం ద్వారా పరమాత్మను సాక్షాత్కరించడమే ఆధ్యాత్మిక పరిణామం అని బోధించారు.*
🌹🌹🌹🌹🌹
0 notes
iskconraichur · 5 months ago
Video
youtube
శ్రీమద్ భాగవతం 2.1.8 || అకామ సకామ కర్మ || #iskconraichur​ #iskcontelugu ...
0 notes
msbnarayan · 7 months ago
Video
youtube
మైరావణుని వధ It's my 848th Videt. My next 849 th Video " కర్మ ఫల నిర్ణయం" follows on 04/06/2024.
0 notes
mplanetleaf · 2 months ago
Video
youtube
What is Cosmic Plan? in Telugu | MPlanetLeaf
0 notes
social-yogi-shyam-satish · 3 months ago
Text
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
శ్రాద్ధ కర్మలలో స్వధాదేవి నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుంది.
బ్రహ్మ దేవుని యొక్క పెద్దకుమారుడు అగ్ని అని విష్ణు పురాణం లో చెప్పబడి ఉన్నది . అగ్ని దేవుని భార్య పేరు స్వాహా . హోమాలు చేస్తూ లేదా పూజలు చేస్తూ మంత్రాలు చదివేటప్పుడు చివరి లో "స్వాహా " అనడం జరుగుతుంది . ఈ స్వాహా అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్ధనలు, మంత్రాలు అన్ని దేవునికి చేరుతాయి .
అగ్ని దేవునికి 2 తలలు, తలపైన 2 +2 కొమ్ములు, 7 నాలుకలు, 7 చేతులు, 3 కాళ్ళు ఉంటాయి. ఈయనకి దక్షిణంలో భ��ర్య స్వదా దేవి, ఎడమ వైపున స్వాహ దేవి ఉంటుంది. దైవ కార్యాల్లో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమ౦ చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాల్లో స్వదాదేవి తన పాత్ర పోషిస్తుంది.
స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది. శరదృతువులోని అశ్వయుజ కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రము నాడు, కానిచో శ్రాద్ద దినమున స్వధాదేవిని పూజించి శ్రాద్దము నాచరింపవలెను. ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిల యందు ఆవాహనము చేసికొని ధ్యానించి మూల మంత్రముతో పాద్యము మొదలగు ఉపచారములను సమర్పించవలెను. "ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యైస్వాహా" అను మూలమంత్రముచే ఆమెను పూజించి స్తోత్రము చేసి నమస్కరింపవలెను.
బ్రహ్మదేవుడు, పితృదేవతా గణాలకు శ్రాద్ధ కర్మలలో తర్పణ పూర్వకంగా సమర్పించే పదార్ధాన్ని ఆహారంగా నియమించాడు. బ్రాహ్మణులు తర్పణాలు ఇస్తున్నప్పటికీ పితృదేవతలకు సంతృప్తి కలుగలేదు. ఆ పితృగణాలు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన ధ్యాన నిమగ్నుడై మానస పుత్రికను సృష్టించి, ఆమెను గుణవతిగా , విద్యావతిగా తీర్చిదిద్ది , ఆ కన్యకు "స్వధాదేవి" అని నామకరణం చేసాడు. పితృదేవతలకు పత్నిగా స్వధా దేవిని నియమించాడు. ఆనాటి నుండి పితృదేవతలు, మహర్షులు,విప్రులు ,మానవులు "స్వధాదేవి"ని పూజిస్తూ, ఆమె అనుగ్రహంతో పితృదేవతలను సంతృప్తి పరుస్తూ వచ్చారు.
"బ్రాహ్మణో మానసీం శశ్వత్సుస్థిర యౌవనాం |
పూజ్యానాం పితృ దేవానాం శ్రద్దానాం ఫలదాం భజే "||
అని స్వధాదేవిని ప్రార్ధిస్తూ ఉంటారు.
పరాశక్తి అంశావతారంగా స్వధాశక్తి ఆవిర్భవించి, పితృదేవతలకు సంతృప్తిని ప్రసాదించింది. శ్రాద్ధ కర్మలలో, బలితర్పణాల్లొ,తీర్ధస్నానాల్లో స్వధాదేవి నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుందని వ్యాసమహర్షి వివరించాడు.
స్వధాదేవి స్తోత్రం
స్వధోచ్చారణమాత్రేణ తీర్ధస్నాయీభవేన్నరః ı
ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయ ఫలంలభేత్ ıı
స్వధా స్వధా స్వధేత్యేవం యది వారత్రయం స్మరేత్ ı
శ్రాద్దస్య ఫలమాప్నోతి తర్పణస్య జిలైరపి ıı
శ్రాద్దకాలే స్వధా స్తోత్రం యః శృణోతి సమాహితః ı
సలభేట్ శ్రాద్ద శంభూతం ఫలమేవన సంశయః ıı
స్వధా స్వధా స్వధేత్యేవం త్రిసంధ్యం యః పఠేన్నరః ı
ప్రియాంవినీతాం సలభేత్ సాధ్వీం పుత్రగుణాన్వితామ్ ıı
పితౄణాం ప్రాణతుల్యాత్వం ద్విజజీవన రూపిణీ ı
శ్రాద్దాదిష్ఠాతృ దేవీచ శ్రాద్దాదీనాం ఫలప్రధా ıı
నిత్యాత్వం సత్యా రూపాసి పుణ్యరూపాసిసువ్రతే ı
ఆవిర్భావతిరోభావౌ సృష్టౌచ ప్రళయేతవ ıı
ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణాతధా ı
నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః ıı
కర్మ పూర్త్యర్దమే వైతా ఈశ్వరేణ వినిర్మితాః ı
ఇత్యేవ ముక్త్వా సబ్రహ్మా బ్రహ్మలోకే స్వసంసది ıı
తస్ధౌచ సహసాసద్యః స్వధాసా విర్బభూవహి ı
తధా పితృభ్యః ప్రదదౌ తామేవకమలాననామ్ ıı
తాం సంప్రాప్యయయుస్తేచ పితరశ్చ ప్రహర్షితాః ı
స్వధా స్తోత్ర మిదంపుణ్యంయః శృణోతి సమాహితః ıı
సుస్నాతః సర్వతీర్ధేషు వాంఛితం ఫలమాప్నుయాత్ ıı
0 notes
gitaacharanintelugu · 11 days ago
Text
60. విషాదం నుంచి జ్ఞానోదయం దాకా
“సమస్త దిశలనుండి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును పరిపూర్ణమై నిశ్చలముగానున్న సముద్రమును ఏమాత్రము చలింపజేయకుండగనే అందులో లీనమగును. అట్లే సమస్త భోగములును స్థితప్రజ్ఞుని యందు ఎట్టి వికారములను కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందజాలడు (2.70). కోరికలన్నింటిని త్యజించి, నిర్మమ, నిరహంకార, నిస్పృహ స్థితిలో చరించునట్టి పురుషుడే శాంతిని పొందును (2.71). ఇదియే బ్రహ్మప్రాప్తి కలిగిన పురుషుని స్థితి. ఈ బ్రాహ్మీస్థితి��ి పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. అంత్యకాలమునందును ఈ బ్రాహ్మీస్థితి యందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందమును పొందును” (2.72) అని శ్రీకృష్ణుడు బోధిస్తున్నారు.
శ్రీకృష్ణుడు ఈ శాశ్వతమైన స్థితిని (మోక్షం) పోల్చడానికి సముద్రాన్ని ఉదాహరణగా ఇస్తారు. ఇంద్రియాల ద్వారా నిరంతరం పొందే ప్రేరణలు, ప్రలోభాలు, కోరికలు ప్రవేశించినప్పటికీ ఒక సముద్రం వలె, శాశ్వతమైన స్థితిని పొందిన మనుజుడు స్థిరంగా ఉంటాడు. రెండవది, నదులు సముద్రంలో కలిసినప్పుడు అవి తమ ఉనికిని కోల్పోతాయి. అదేవిధంగా, కోరికలు శాశ్వతమైన స్థితిని చేరుకొన్న ఒక వ్యక్తిలోకి ప్రవేశించినప్పుడు అవి తమ ఉనికిని కోల్పోతాయి.
మూడవది, ఏదైనా విషయం మనకు దుఃఖదాయకంగా మారితే దానికి కారణం బాహ్య ప్రపంచము మనలో కలిగించే ఉద్రేకాలను మనము నియంత్రించలేకపోవడమే. అందుకే, సముద్రం వలె మనం కూడా అటువంటి అస్థిరమైన, అనిత్యమైన ఉద్వేగాలను, ఉద్రేకాలను విస్మరించడం నేర్చుకోవాలి అని శ్రీకృష్ణుడు చెబుతున్నారు (2.14).
మనకు ఉన్న అవగాహన ప్రకారం ప్రతి కర్మకు కర్త, కర్మఫలం ఉంటాయని అనుకుంటాము. అంతకుముందు, శ్రీకృష్ణుడు మనకు కర్మను, కర్మఫలాలను వేరు చేసే మార్గాన్ని అందించారు (2.47). ఇప్పుడు ఆయన కర్త, కర్మలను వేరు చేయడానికి అహంకారం, కర్తృత్వ భావాలను వదిలివేయమని సలహా ఇస్తున్నారు. ఈ శాశ్వతమైన స్థితి అంటే మోక్షాన్ని పొందిన తర్వాత తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. అప్పుడు ఏ కర్మ అయినా ఈ బ్రహ్మాండము యొక్క కోటానుకోట్ల చర్యలలో ఒకటిగా ఉండిపోతుంది.
భగవద్గీతలో సాంఖ్యయోగం (రెండవ అధ్యాయం) ద్వారా విషాదం (ప్రథమ అధ్యాయం) తర్వాత శాశ్వతమైన స్థితి వస్తుంది ఎందుకంటే ఇది ప్రకృతి యొక్క నియమం. శ్రీకృష్ణుడు అర్జునుడి విషయంలో చేసినట్లుగా విషాదమును కూడా సానుకూలంగా ఉపయోగించినప్పుడు దానికి మోక్షాన్ని తీసుకురాగల సామర్థ్యం ఉంటుంది.
0 notes
jonnalagaddajyothi · 23 days ago
Video
youtube
కర్మ సిద్ధాంతం అంటే ఇదే #matrimony #astrology #jyotsiyam #astrologypredi...
#ProjectJ #bhakthi #bhakti #religion #horoscope #astroremedies #astrologynumerology #devotional #motivation #fortunetelling #fortuneteller @JonnalagaddaJyothi #chittitantralu #astrology #instagramstories #instagramvideos #numerology #jonnalagaddajyothi #instagramreels #viralvideos #shorts #viralshorts #youtubeshorts #jyothimatrimony #hindumatrimony #astrology #teluguastrologer #indianastrology #telugu #jyothis #teluguastrology #horoscope #jyothirmayi #teluguhoroscope #motivation #astrologersofig #love #paid #explore #f #newage #spiritualastrology #allcastesmatrimony #allcastematrimony #predictions #explore #astrologypredictions #zodiac #storyteller #jonnalagaddajyothistoryteller #StorytellerJyothi #StorytellerRamana #RamanamurthyStoryteller #tending #reelsinstagram #reelitfeelit #instagood #trendingvideos #matchfixingvideos #matrimony #instantmarriages #Salary #MonthlySalary #SalaryPackage #YearlyPackage #YearlySalary #Bride #Bridegroom #Groom #Marriage #Pelli #SouthIndianMarriage #MonthlyIncome #YearlyIncome #telugumatrimonyfreesearch #reels #reelsinstagram #trending #explore #foryou #reelsindia #viral #reel #explorepage #instagramreels #instagood #instapostviral #instareels #instareelsindia #instamood #reelsvideo #reelkarofeelkaro #reelitfeelit #instareel #freetelugumatrimony #matrimonytelugu #freematrimony #matrimony #marriagebureau #matrimonybrides #bridewantedformarriage #communitymatrimonybrides #marriageprofiles #matrimonygrooms #telugumatrimonyfreelogin #telugumarriagebureau #telugubrides #telugugrooms #trendingmatrimony #trendingreels #trending #matchfixingvideos #matrimony #instantmatrimony #PremiumMatrimony #QuickMatrimony #InstantMarriages #PremiumMarriages #QuickMarriages #DoctorMatrimony #MatchFixingVideos #Matrimony #InstantMarriage #Maargaseershamu #margasiramasam #margasiramasam2024 #margasira #Margashirsha #margashirshamasam2024 #margashirshamasam #DattatreyaJayanti #VivahPanchami #GitaJayanti #MargashirshaPurnima #MargashirshaAmavasya #మార్గశిరమాసం #మార్గశిర #మార్గశిరమాసం2024 #మార్గశిరమాసంఅర్ధనక్షత్రం2024 #మార్గశిరమాసంఅర్ధనక్షత్రం #మార్గశిరఏకాదశి #పోలిస్వర్గం #సుబ్రహ్మణ్యషష్టి #కాలభైరవాష్టమి #గీతాజయంతి #హనుమద్ర్వతం  #దత్తజయంతి
0 notes
chaitanyavijnanam · 2 months ago
Text
సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. (Sadhana Panchakam Stotram - Meaning - A composition by Sri Adi Shankaracharya for attaining Self-realization.)
youtube
🌹 సాధనా పంచకమ్ స్తోత్రము - భావము - ఆత్మ సాక్షాత్కార సాధ్యతకు శ్రీ ఆదిశంకరాచార్య విరచిత పాఠం. 🌹
ప్రసాద్ భరద్వా��
శ్రీ ఆది శంకరాచార్య విరచిత సాధనా పంచకమ్ అనేది ఒక మహత్తరమైన గ్రంథం, ఇందులో మానవుడు తన జీవితాన్ని ఎలా సాధించుకోవాలో, ఎలా దైవానుసంధానం చేసుకోవాలో, ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందాలో 5 శ్లోకాల్లో వివరిస్తారు. ఇది ధ్యానం, భక్తి, కర్మ మొదలైన పద్ధతులను సాధన చేయడానికి ఒక మార్గదర్శిని. ఇందులోని ప్రతీ శ్లోకం మానవుడికి ఆత్మవిచారం, దైవానుసంధానం, సద్గుణాల వృద్ధి కోసం మార్గనిర్దేశకంగా ఉంటుంది. శంకరాచార్యులు దీని ద్వారా సత్యానికి చేరుకునే మహామార్గాన్ని చూపించారు. ఇది వేదాలు మరియు ఉపనిషత్తుల మార్గాన్ని అనుసరించిన అనేక మంది మహాత్ములచే సూచించబడిన మార్గం. ప్రతిరోజూ ఈ శ్లోకాలను పఠ��ంచి ధ్యానించడం ద్వారా భౌతిక బాధల నుండి విముక్తి మరియు శాంతి పొందవచ్చు.
🌹🌹🌹🌹🌹
0 notes
antarmukha-siddha-yogam · 8 months ago
Video
youtube
చేసిన కర్మ ఫలితము వెంఠనే ఎందుకు అనుభవించడములేదు
0 notes