#ancientindiantexts
Explore tagged Tumblr posts
Text
youtube
చెక్కడంలో దాగిఉన్న అంతర్గత వివరాలు! ప్రాచీన భారతీయుల అద్భుతమైన హస్తకళా!
Hey guys, ఈ రోజు నేను మీకు చాలా విచిత్రమైన, అంతర్గత వివరాలను చూపించబోతున్నాను. ఈ పురాతన శిల్పాన్ని చూడండి. ఇది చాలా విచిత్రంగా కనిపిస్తుంది కదా? ఇది నోరు తెరిచి ఉన్న, సింహం మాత్రమేనా? ఇక్కడ దాని మెడను చూడండి, దాని గొంతులో ఏదో ఇరుక్కుపోయినట్లు, ఏదో ఉబ్బెత్తుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఈ చెక్కడాన్ని చూడండి, ఇది ఇంతకు ముందు చూసిన శిల్పానికి పక్కనే ఉంది. ఈ శిల్పం మెడలో ఉబ్బినట్లు కనిపించడంలేదు చూడండి, కానీ గొంతు లోపల ఏదో ఉన్నట్టు మీరు చూడవచ్చు. ఈ రెండు చెక్కడాలు, నేల మట్టం నుండి 20 అడుగుల ఎత్తులో ఉన్నాయి, కాబట్టి నేను దీనికంటే betterగా photoను తీయలేకపోయాను, కానీ ఖచ్చితంగా, ఏదో ఒకటి, ఈ సింహం నోటి నుండి వస్తోంది, సరేన���?
మీలో కొందరు, ప్రవీణ్, మీరు ఎప్పుడూ లేని విషయాన్నీ, ఊహించుకుని చెప్తారు, ఇదంతా శిల్పులు చేసిన పొరపాట్లు మాత్రమే అయ్యుండొచ్చని మీరు అనుకోవచ్చు. దీన్ని చూడండి? ఏంటీ ఇది? అవునండి, ఒక వ్యక్తి, ఈ సింహం నోటి నుండి బయటకు వస్తున్నాడు. ఇక్కడ చూడండి, అతని చేతులు, అతని తలను చూడండి, సింహం నోటి నుండి అతని మొండెం మాత్రమే బయటకు ఉంది. అతని రెండు కాళ్లు పూర్తిగా సింహం నోటి లోపల ఉన్నాయి. పురాతన నిర్మాణదారులు, మనకు ఏం చెప్పడానికి ప్రయత్నించారు? ఇప్పుడు, ఈ photosను చూడండి, ఒక మనిషి, నోటి నుండి చాలా నెమ్మదిగా బయటకు రావడాన్ని, step-by-step చూపించారు చూడండి, అతని మొత్తం శరీరం, దాదాపు పూర్తిగా బయటకు రావడాన్ని మీరు చూడవచ్చు.
ఇక్కడ, ఈ మనిషి, సింహం నోటి నుండి పూర్తిగా బయటకు వచ్చేసాడు. మనం చిన్న వయసులో, ఫ్లిప్ పుస్తకాలను ఎలా తయారు చేసామో గుర్తుందా? ప్రతి పేజీలో మనం, ఒక నిర్దిష్ట ఫ్రేమ్‌ని తయారు చేసి, ఆ పేజీలను తిప్పినప్పుడు, ఒక వ్యక్తి, తుమ్మినట్లుగా ఒక కథను చెప్పగలము కదా. దీన్నే మనం, ఈ గుడిలో చూస్తున్నాము, ఎలా ఒక మనిషిని, సింహం, బయటకు వదులుతుందని, మనం ఇక్కడ step by step చూస్తున్నాము. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, మనం రివర్స్ డైరెక్షన్‌లో చూస్తున్నామని అనుకోవచ్చు, అంటే, ఒకవేళ సింహం, ఈ మనిషిని కొంచెం కొంచెంగా, తింటోందని మీరు అనుకోవచ్చు, అయితే, దీన్ని మీరు రివర్స్‌లో చూసినప్పుడు, ఆ సింహం, ఆ మనిషిని తింటున్నట్లే కనిపిస్తుంది, కానీ నేను అలా అనుకోవడంలేదు. ఎందుకు? ఎందుకంటే, అతను చాలా ప్రశాంతంగా ఉన్నట్లు, ఈ శిల్పాలలో చూపించారు, ఆ వ్యక్తి భయాన్ని కానీ, ఆందోళన వంటి భావోద్వేగాలను అతని ముఖంలో చూపించలేదు, ప్రాచీన భారతీయ శిల్పులు, ఈ విధమైన భావోద్వేగాలను చెక్కడంలో మాస్టర్స్.
ఇతను, సాధారణంగా, ఈ సింహం నోటి నుండి వస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ, దీని వెనుక ఉన్న కథ ఏంటీ? ఇతను ఆ సింహం నోటి లోపలికి ఎలా వెళ్లారు, తిరిగి బయటకు ఎలా వస్తున్నారు, ఇంతకీ ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు, ఈ చెక్కడాన్ని చూడండి. దీని పక్కనే ఉన్న వ్యక్తి వైపు, అలానే అతని తలపై ఉన్నదేంటి అనే దాని గురించి ప్రస్తుతానికి మాట్లాడుకోవద్దు. ఇక్కడ కుండా లాగ ఉన్న ఒక container పైన మీ దృష్టి పెట్టండి. దీనిని కుంభం అని పిలుస్తారు, ఒక gel లాంటి liquid దీని చుట్టూ చిమ్ముతున్నట్టు చూపించారు, కొన్ని రకాల ద్రవాలు, ఈ కంటైనర్ నుండి బయటకు వస్తున్నాయి. ఎందుకు? ఎందుకు ఇలా వస్తున్నాయంటే, దాని లోపల ఉన్న ఈ వ్యక్తి కారణంగానే. ఎవరు ఇతను? అతను, ఈ కుంభం లోపల ఏమి చేస్తున్నాడు? ఇది ఒక సాధువు యొక్క అరుదైన చెక్కడం, ఇతని పేరు వశిష్ట. ఇప్పుడు, వశిష్ట అ��టే ఎవరు? మన హిందూ మతం యొక్క, పురాతన గ్రంథమైన ఋగ్వేద రచయితలలో వశిష్ట ఒకరు. చాలా సాంప్రదాయిక అంచనాల ప్రకారం కూడా, ఋగ్వేదం 3000 సంవత్సరాల పురాతనమైనదిగా చెప్పబడింది. కానీ, వశిష్టను ఈ కంటైనర్ లోపల ఎందుకు చూపించారు? అతను, తన తల్లి గర్భంలో కాకుండా, గర్భం వెలుపల జన్మించిన ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ. పురాతన భారతీయ గ్రంథాలలో, చాలా ఆకర్షణీయమైన విషయాలన్నీ ప్రస్తావించారు. వశిష్ట మరియు అగస్త్య, వీరిద్దరూ కవల సోదరులు, వీళ్ళు కృత్రిమ మార్గాల ద్వారా జన్మించారని వారు పేర్కొన్నారు.
Praveen Mohan Telugu
#ancienttemple#ancientsculpture#strangesculpture#ancientcarvings#ancientbuilders#ancientindia#advancedancienttechnology#ancientindiansculptors#artificialwomb#vasishta#hinduism#rigveda#ancientindiantexts#agastya#mysteriousbags#hindutemples#advanceddevices#ancientweapons#Youtube
2 notes
·
View notes