#ప్రవీణ్ మోహన్ తెలుగు
Explore tagged Tumblr posts
Link
మన పురాతన భారతీయులు గొప్ప మేధావులనడానికి ఆధారం ఇదే! 10,000 సంవత్సరాల రహస్యం బయటపడింది!
Hey guys, ఈ రోజు మనం ఆలురుట్టి కొండలో ఉన్న చాలా రహస్యమైన గుహను చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడున్న ఈ బాణం గుర్తు ద్వారం గుండా వెళ్ళమని చూపించడాన్ని మీరు చూడవచ్చు, ఈ ప్రదేశానికి సంవత్సరానికి 5 మంది కంటే తక్కువ మంది visitors మాత్రమే వస్తుంటారంట, అయితే ఈ గుహలో 5000 సంవత్సరాల నాటి శిల్పాలు ఉన్నాయని కొందరు చెప్తున్నారు. ఈ ప్లేస్ ని, Archaeological department వాళ్ళు రక్షించబడినప్పటికీ, ఈ ముళ్ల చెట్లు దట్టంగా పెరిగిపోయి కొంచం కూడా గ్యాప్ లేకుండా లోపలి పోవడానికి వీలు కాకుండా ఉంది. కానీ అక్కడ దూరంలో ఉన్న ఆ చెక్కడాలు మీకు కనిపిస్తున్నాయా. ఆ బండ మీద 2 చెక్కడాలు చెక్కబడ్డాయని మన కంటికికనిపిస్తుంది, ఇంకా దాని కింద ఒక పెద్ద గుహ కూడా ఉంది చూడండి.
ఈ రెండు ఆకారాలలో ఉన్నది ఎవరు? ఒకవేళ అందులో ఉన్నది బుద్ధ భగవానుడా? ఇవి దాదాపు 20 అడుగుల ఎత్తులో చెక్కబడి ఉన్నాయి కాబట్టి వాటిని నేలమట్టం నుండి చూసి గుర్తించడం చాలా కష్టం. first, నేను నా షూలను తీసేస్తాను, ఆప�� మనం డ్రోన్‌ని ఉపయోగించి అందులో ఉన్న వివరాలను పరిశీలించూద్దాం. ఇవి బౌద్ధ మత శిల్పాలు కావు; ఇవి జైనమతం అనే ప్రాచీన మతానికి చెందినవి. ఈ rectangle మధ్యలో లోతైన ధ్యాన స్థితిలో ఉన్న ఈ ఆకారం మహావీరుడు అయి ఉండవచ్చు. ఆయనకు రెండు వైపులా ఉన్న అటెండెంట్‌లు చేతిలో ఒక విచిత్రమైనదాన్ని పట్టుకుని ఉండడం మీరు చూడవచ్చు. అవి ఎంటివి? Archaeologistsలు దీన్ని చామరం అని అంటున్నారు, చామరం అంటే చేతితో తయారు చేసిన ఒక విసనకర్ర లాంటిదని చెప్పవచ్చు. okay ఈ theory convincingగానే ఉంది, ఎందుకంటే నేటివరకు కూడా, కొందరు వ్యక్తులు దేవాలయాలలో చామరాలను ఉపయోగిస్తున్నారు.
కానీ మీ కళ్ళు సహజంగా ఈ జంతువులను చూస్తున్నాయి కదా, అవి చూడడానికి చైనీస్ డ్రాగన్ లాగ కనిపిస్తున్నాయి కదా? ఎడమవైపున ఉన్న డ్రాగన్ నవ్వుతూ ఉంది, కుడి వైపున ఉన్న డ్రాగన్ కొంచం కోపంతో ఉన్నట్టు ఉంది. అవి ఖచ్చితంగా సింహాలు కావు, ఎందుకంటే వాటికి కొమ్ములు ఉన్నాయి చూడండి. అయితే ఈ శిల్పంలో మరో 2 జంతువులు దాగి ఉన్నాయి. అదేంటని మీరు చెప్పగలరా? అయన కూర్చుని ఉన్న సింహాసానికి రెండు వైపులా 2 పాములు చెక్కబడి ఉన్నాయి. ఇది ఒక శరీరాన్ని పంచుకున్న 2 తలల పాము అని కూడా మీరు చెప్పవచ్చు. కానీ ఇక్కడ వాటి తలపైన ఈకలు ఉన్నడం మీరు చూడవచ్చు. మరొక వైపు కూడా అదే వివరాలతో ఈకలతో ఉన్న తలను మీరు చూడవచ్చు. రెక్కలు ఉన్న సర్పాలను మన భారతదేశంలో మాత్రమే పూజించలేదు, మెక్సికోకు చెందిన మాయన్లు ఇప్పటికి కూడా పూజిస్తున్నారు.
ఈకలతో ఉన్న ఈ మాయన్ దేవుడిని కుకుల్కాన్ లేదా Quetzalcoatl అని పిలుస్తారు. మరియు అనేక మాయన్ సైట్‌లలో, సరిగ్గా అదే ఆకారాన్ని మీరు చూడవచ్చు, ఇక్కడ తలపై రెక్కలతో ఉన్న నాగులను తెరిచిన నోరుతో ఉన్నటు చూపిస్తారు. మరొక వైపు, మీరు ముందు చుసిన చెక్కడం కంటే చిన్నగా ఉన్న వ్యక్తిని చూడవచ్చు, ఈయన మరొక జైన సాధువు, లోతైన ధ్యానంలో జ్ఞానోదయాన్ని పొందుతున్నాడు, కానీ ఈయన assistantsలు ఎక్కడికి వెళ్పోయారో తెలియదు భోజనం చేయడానికి అనుకుంటున్నాను. కానీ నేను ఈ చెక్కడాలను చూసి చాలా confusedగా ఉన్నాను, కచ్చితంగా మీరు కూడా confusedగా ఉండాలి. ఎందుకు? మీరు ఒక పురాతన శిల్పి అని, మీరు చెక్కే శిల్పానికి నేను గైడ్ చేస్తున్నానని ఊహించుకోండి. ప్రపంచంలోని అత్యంత కఠినమైన రాళ్లలో ఒకటైన గ్రానైట్‌పై దేనినైనా చెక్కమని నేను మిమ్మల్ని అడుగుతున్నాననుకుందాం.
మీరు ఎలాంటి ఆధునిక సాధనాలను ఉపయోగించకూడదు, ఎందుకంటే archaeologistsల ప్రకారం చూసుకుంటే, పురాతన శిల్పులు ఆదిమ ఉలి మరియు సుత్తిని ఉపయోగించే చెక్కారు. వాటన్నిటికంటే, ��ాలుగా ఉన్న ఈ surfaceలో 20 అడుగుల ఎత్తులో ఉన్న ఈ కొండపైన మీరు ఈ శిల్పాలను చెక్కాలి. కింది నుండి కనీసం నిచ్చెనను సరిగ్గా పెట్టడానికి కూడా flat ఐన surface ఉందా అని చూడండి? సరే, మీరు ఏదోక విధంగా నిచ్చెనను ఇక్కడ ఉంచారని అనుకుందాం, కానీ ఈ ఆకారాలను ఖచ్చితంగా చెక్కడానికి, మీరు వాటిని ఉలి మరియు సుత్తితో గట్టిగా కొట్టాలి. అప్పుడు ఈ నిచ్చెన ఇంకా నిటారుగా నిలబడుతుందా, లేదా పడిపోతుందా? మీరు ఇక్కడ చూస్తున్నది ఒక అద్భుతం కంటే తక్కువ కాదని నా అభిప్రాయం. కానీ మనం ఇంకోక ఇంటరెస్టింగ్ ఐన detailని మిస్ చేసాము.మొదట, ఈ బండరాయితో ఉన్న layer ని కొంచం కొంచంగా చెక్కి తీసేసారు, ఒక నారెంజ్ పండులో ఉన్న తొక్కను ఎలా తీస్తామో అలా వాళ్ళు దీని తొక్కను తీసేసారు. వాస్తవానికి, వాళ్లు ఈ పై పొరను 3 అంగుళాల లోతు వరకు షేవ్ చేశారు.
ఎందుకలా చేశారు? ఎందుకంటే సాధారణంగానే రాళ్ల లోపల ఉన్న surface చాలా smoothగా ఉంటుంది. మీరు ఈ sides లను గమనిస్తే అది మీకు కనిపిస్తుంది. తర్వాత, వాళ్లు మరో 2 rectangular షేప్ లలో డిప్రెషన్‌లను తయారు చేసి, ఆపై దాని లోపల ఈ బొమ్మలను చెక్కడం ప్రారంభించారు. బహుశా ఈ గుహ లోపల మరిన్ని చెక్కడాలు ఉన్నాయేమో? ఇది 60 అడుగుల కంటే ఎక్కువ పొడవుగా విస్తరించి ఉన్న ఒక పెద్ద గుహ, ఇంకా ఇది entranceలోనే 8 అడుగుల ఎత్తు ఉంది మరియు మీరు లోపలికి వెళ్లే కొద్దీ ఎత్తు తగ్గిపోతు ఉంది. ఇది సహజమైన గుహనా? లేక artificialగా దీన్ని ఎవరైనా తయారు చేశారా? సుమారు 10 అడుగుల ఎత్తులో, మీరు ఈ రహస్యమైన గీతను చూడవచ్చు. ఇక్కడే మీరు చూసారంటే, పురాతన శిల్పులు సహజమైన శిలలపై చాలా జాగ్రత్తగా పని చేశారని మీరు గ్రహించారు. ఇది కేవలం రాతిపైన చెక్కిన గీత మాత్రమే కాదండి. ఈ గీత పైన, రాయి చాలా మందంగా ఉంది, ఇది కనీసం ఒక అంగుళం వరకు మందంగా ఉంటుంది మరియు ప్రతిదీ చూడడానికి కఠినమైనదిగా కనిపిస్తుంది.
- Praveen Mohan
#underground bed#ancient#Mysterious cave#advanced technology#Jainism#Ancient alience#Cave paintings#ancient India#Indian temples#Prehistoric site#నిజమైన చరిత్ర#ప్రవీణ్ మోహన్ తెలుగు
1 note
·
View note
Text
youtube
ఎందుకు వీటిని దాస్తున్నారు, వెనుక ఉన్న రహస్యం ఏంటీ? |ప్రవీణ్ మోహన్|
Hey guys, నా ముందు వీడియోలో, పురాతనమైన తిరుప్పెరున్తురై అనే ఆలయంలో, 27 నక్షత్రాలు లేదా చంద్ర స్టేషన్‌లను చెక్కారని నేను మీకు చూపించాను. ఈ వీడియోలో, నేను వాటికి సంబంధించిన మిగతా వివరాలలోకి వెళ్లాలనుకుంటున్నాను. ఈ నక్షత్ర వ్యవస్థల పక్కనే, మీరు అనేక వింత దేవుళ్లను చూడవచ్చు. ఎవరు వీళ్లంతా? మనం కొంచెం దగ్గరికి వెళ్లి పరిశీలిద్దాం, ఇది చంద్రుడు, వేద గ్రంథాల ప్రకారం చూసుకుంటే, ఈ చంద్రుడు ఒక పురుషుడు, ఇతను ఏం చేసాడంటే, ఈ 27 చంద్ర స్టేషన్లను, వివాహం చేసుకున్నాడు. ఈ పురాతన కథ చాలా వింతగా మరియు అర్థరహితంగా అనిపిస్తుంది - చంద్రుడు 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడా? అసలు ఏం అర్ధం కావడంలేదు కదా? 27 నక్షత్రాలే ఎందుకు ఉన్నాయి? ఆకాశాన్ని 25 లేదా 50 వేర్వేరు విభాగాలుగా ఎందుకు విభజించకూడదు? ఈ 27 నక్షత్రాలు, చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి తీసుకున్న 27 రోజులను సూచిస్తాయి.
So, చంద్రుడు ప్రతి నెలా ఒక్కో నక్షత్రంతో ఒక రోజు గడుపుతాడు, అంటే ప్రతి నక్షత్ర నెల లేదా 27 రోజుల సమయం పడుతుంది. దీని కారణంగానే, చంద్రుడు 27 నక్షత్రాలను వివాహం చేసుకున్నాడని, భారతీయ గ్రంథాలు చెప్పినప్పుడు, ఇది ఒక ప్రతీకాత్మకమైన అర్థం. నక్షత్రాలకు ఇటువైపు చంద్రుడిని చెక్కారంటే, అటువైపు ఏం చెక్కుంటారు ? అవును, సూర్య దేవుడ్నే చెక్కారు. ఇది అసాధారణమైన వర్ణన, సూర్య భగవానుడిని, 7 గుర్రాలు ఉన్న ఒక రథంలో ఉన్నట్టు చూపించలేదు. అదే విధంగా, మరొక interesting అయినా విషయం ఏంటంటే, సూర్యభగవానుడు, కాళ్ళు చెప్పులు లేకుండా ఉన్నాయి, అతని కాళ్ళలో చీలమండలను మీరు చూడవచ్చు మరియు అతని కాలి వేళ్ళను కూడా చూడవచ్చు. ఉత్తర భారతదేశంలో, సూర్యభగవానుడిని చూపించే విధానం కంటే ఇది చాలా భిన్నమైనది. ఉదాహరణకు, గుజరాత్ లో, మోధేరా సూర్య దేవాలయంలో, సూర్య దేవుడు పొడవాటి, గమ్ బూట్లు ధరించడం మీరు చూడవచ్చు. కానీ, ఇక్కడ దానికి పూర్తిగా విరుద్ధంగా చూపించారు. తరువాత ఇక్కడ చూడండి, ఒక విల్లు మరియు బాణం పట్టుకున్నట్లు ఒక అరుదైన శిల్పం ఇక్కడ ఉంది.
ఇది ఎవరో మీరు ��హించగలరా? ఇదే బుధుడు, అంటే బుధగ్రహం. ఈ చెక్కడం పైన చూడండి, ఇదే బుధ గ్రహమని నిర్ధారించుకోవడానికి, ఒక చిన్న శాసనం ఉంది. ఇక్కడ మరొక చెక్కడం ఉంది చూడండి, ఇది, ఏ దేవుడిని సూచిస్తుంది? అతను, మూడు వేర్వేరు ఆయుధాలను పట్టుకున్నట్లు చూపించారు చూడండి, ఒక త్రిశూలం, ఒక వజ్రాయుధం మరియు ఒక ఈటెను పట్టుకుని ఉన్నారు చూడండి. ఇతను ఎవరంటే, ఇతనే mars, అంటే అంగారక గ్రహాన్ని సూచిస్తాడు. ఆయనను సంస్కృతంలో మంగళ అని, తెలుగు భాషలో అంగారక గ్రహం అని పిలుస్తారు. ఇవన్నీ చాలా అరుదైన శిల్పాలు, ఆలయాలలో ఉన్న, గ్రహాలు మరియు ఖగోళ వస్తువుల యొక్క పెద్ద చెక్కడాలను మీరు చూడలేరు, సాధారణంగా చూశామంటే, నవగ్రహాల యొక్క చిన్న చిన్న విగ్రహాలుగా చూస్తాము, కానీ ఇక్కడ మీరు చూస్తున్నది చాలా అరుదైన విషయం. కానీ ఈ వీడియోలో, నేను మీకు ఎవరికీ తెలియని, ఒక రహస్యాన్ని చూపించాలనుకుంటున్నాను. ఈ అంగారక గ్రహానికి పైన, ఏం చెక్కారో చూడండి. అది ఏమై ఉంటుంది? ఇది చూడడానికి చంద్రవంకలాగా కనిపిస్తుంది, దాని లోపల ఉన్న ఒక చిన్న circleలో ఒక ముఖాన్ని కూడా చెక్కారు చూడండి.
ఈ ముఖం పైన, మీరు కళ్ళు, ముక్కు మరియు నోటిని చూడవచ్చు, నుదిటిపైన పెట్టిన, ఈ బొట్టును కూడా మనం చూడవచ్చు. ఇది అంగారక గ్రహానికి సంబంధించిన ఒక రహస్య చిహ్నం. ఈ ఆలయంలో, ఇలాంటి అనేక విచిత్రమైన వివరాలు దాగి ఉన్నాయి. ఆకాశంలో ఉన్న, ప్రతి స్వర్గపు శరీరంకి పైన, ఒక రహస్య చిహ్నానాన్ని చెక్కారు చూడండి. సూర్యుని యొక్క శిల్పానికి, పైన చూడండి, మళ్ళీ మీరు ఒక వింత patternను చూడవచ్చు. ఇది, ఏదో ఒక పరికరం లోపల తయారు చేసిన, ఒక complex అయినా ముడిలా కనిపిస్తుంది. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ స్ట్రింగ్ యొక్క సంక్లిష్టతను చూడండి, దీన్ని చాలా brilliantగా చెక్కారు కదా. ఈ రహస్య చిహ్నం, సూర్యుడికి ఎలా connect అయింది? దీని అర్థం ఏమై ఉంటుంది? సరే ఇప్పుడు మనం, చంద్రునికి పైన చూద్దామా, ఇక్కడ ఫాన్సీ ఈకలతో ఉన్న ఒక రహస్యమైన పక్షి కనిపిస్తుంది చూడండి. ఇది ఏ పక్షి? ఇది, చంద్రునికి ఎలా కనెక్ట్ అయింది?
బుధ గ్రహం పైన కూడా, ఇదేలాంటి patternను మనం చూడవచ్చు. ఈ రహస్య చిహ్నాలకు అర్థం ఏంటీ? ప్రతి గుర్తు క్రింద చెక్కబడి ఉన్న ఆయా గ్రహాలకు, ఇవన్నీ ఎలా సంబంధం కలిగి ఉన్నాయి? సరే, స్తంభాలను వదిలేసి, ఇప్పుడు మనం ceilingను చూద్దాం, ఇక్కడ నమ్మలేని కొన్ని వివరాలు ఉన్నాయి. ఇక్కడ, మీ దృష్టి వెంటనే ఈ రాతి గొలుసు పైకి ఆకర్షిస్తుంది. ఇవన్నీ ఈ, ceilingకు attach అయినా మెటల్ గొలుసులా? ఈ శిల్పాలను, చెక్కిన అదే పెద్ద రాతి బ్లాక్‌లో ఒక భాగంగా ఈ గొలుసులు ఉన్నాయి. పురాతన కాలంలో ఇంత అసాధారణమైన ఒక రాతి పని చేసి, దానిని చాలా ఎత్తులో ఉంచారు చూడండి. ఈ మధ్యలో, ఒక పెద్ద, circle shapeలో ఉన్న, ఒక 3డి pattern ఉంది చూడండి, కొంతమంది, ఇది rotate అవుద్దని కూడా చెప్తున్నారు. ఇందులో మరింత interesting అయినా విషయం ఏంటంటే, ఈ circle చుట్టూ చాలా శిల్పాలను చెక్కారు చూడండి.
Praveen Mohan Telugu
#Tirupperunturai#ancienttemple#lunarstations#strangegods#sungod#moderasuntemple#ancientcarvings#ancienttechnology#mysterioussymbols#planetmercury#ancientweapons#Youtube
1 note
·
View note
Link
యంగ్ హీరో రాజ్ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కొండా విజయ్‌కుమార్ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న యూత్ ఎంటర్‌టైనర్ ఒరేయ్ బుజ్జిగా... ఉగాది కానుకగా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో... యంగ్ హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ - "ఒరేయ్ బుజ్జిగా` ఒక కంప్లీట్ ఎంటర్ టైనర్. టీమ్ అందరూ ఎంతో ఫ్యాషన్ తో సినిమాని ముందుకు తీసుకెళ్లారు. థియేటర్ లో సినిమా చూసి రెండున్నర గంటలు నవ్వుతూనే ఉంటారు. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. ఎగ్జామ్స్ అయిపోయి హాలిడేస్ వస్తాయి. ఫ్యామిలీ అంతా వచ్చి హ్యాపీ గా నవ్వుకుని వెళ్లే సినిమా. ప్రతి ఒక్కరూ థియేటర్ లోనే సినిమా చూడండి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత రాధా మోహన్ గారికి, దర్శకుడు విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు" అన్నారు. హీరోయిన్ మాళవిక నాయర్ మాట్లాడుతూ - సినిమా ఒక టీమ్ క్రాఫ్ట్ అని అంటారు. నాకు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి సినిమా ఇంకా బాగా రావడానికి హెల్ప్ చేశారు. విజయ్ కుమార్ గారు సినిమా బిగినింగ్ నుండి నాకు గైడింగ్ స్పిరిట్ గా ఉన్నారు. ఆయన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అందరికీ ఒక హ్యుజ్ ఇన్‌స్పిరేషన్. ఆయన వల్లే టీమ్ అందరం ఇంత బాగా పెర్ఫామ్ చేయగలిగాం. మా నిర్మాత రాధామోహన్ గారు మేకింగ్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. అలాగే ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. రాజ్ తరుణ్ మంచి ఈజ్ తో నటించారు. ఆండ్రూ గారితో వర్క్ చేయడం అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. సినిమాలో మంచి హ్యూమర్ ఉంటుంది. మార్చి 25న సినిమా విడుదలవుతుంది. అందరు తప్పకుండా చూడండి అన్నారు. దర్శకుడు కొండా విజయ్ కుమార్ మాట్లాడుతూ - మా నిర్మాత రాధా మోహన్ గారితో చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. చాలా మంచి నిర్మాత. కథకు ఏమి కావాలో అన్ని ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు. సినిమాలో హ్యుజ్ ప్యాడింగ్ ఉంది. అందరు చక్కగా నటించారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ మన పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి తగిన సినిమా. మాళవిక నాయర్ న్యాచురల్ ఆర్టిస్ట్. ప్రతి ఒక్కరు ఇది నా సినిమా అని ఓన్ చేసుకొని అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ ఉంటుంది. అలాగే ఆండ్రూగారు, అనూప్ ఇలా అందరు మంచి మంచి టెక్నీషియన్స్ కుదిరారు. ఏ జోనర్ లో సినిమా చేయాలని మూడు సంవత్సరాలుగా నాలో నేను మధన పడి, ఆడియన్స్ అందరూ పడి పడి నవ్వుకునే సినిమా చేయాలని ఒరేయ్ బుజ్జిగా చేయడం జరిగింది. ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రుచులు ఉంటాయో ఈ సినిమాలో కూడా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ ఉగాదికి మీ ముందుకు వస్తున్నాం. మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరుకుంటున్నాను అన్నారు. చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహన్ మాట్లాడుతూ - "ఒరేయ్ బుజ్జిగా` నేను, విజయ్ కుమార్ స్టార్ బక్స్ లో కాఫీ తాగుతున్నప్పుడు ఈ స్టోరీ నేరేట్ చేశారు. అక్కడ స్టార్ట్ అయిన సినిమా ఈ ఉగాదికి పచ్చడిలా వస్తుంది. మా ఒరేయ్ బుజ్జిగా టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇప్పటికే విడుదలైన `కురిసెన, కురిసెన` పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ కి, ఫ్యామిలీస్ కి నచ్చే అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. ఇప్పటివరకు సినిమా చూసిన వారుకూడా చాలా ఎంటర్టైనింగ్ గాఉంది అని చెప్పారు. నంద్యాల రవి గారు మంచి డైలాగ్స్ రాశారు. అలాగే ఎడిటర్ ప్రవీణ్ చక్కగా ఎడిట్ చేశారు. విజయ్ కుమార్ గారు పక్కగా ప్రీ ప్రొడక్షన్ చేసుకోవడం వల్ల సినిమాకి అవసరమైన సన్నివేశాలే తీశారు. దాని వల్ల వర్కింగ్ డేస్ తగ్గి నిర్మాతలకి మంచి జరుగుతుంది. ఈ సినిమాకి యంగ్ టీమ్ వర్క్ చేయడం వల్ల అవుట్ ఫుట్ చాలా బాగా వచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ నాకు మంచి మిత్రుడు. ఈ సినిమాకి బ్రహ్మాండమైన ట్యూన్స్ ఇచ్చారు. వాణి విశ్వనాధ్ గారు హీరోయిన్ తల్లిగా ఒక ముఖ్యమైన పాత్ర చేశారు. ఆమెకు కూడా తెలుగులో మంచి రీఎంట్రీ అవుతుంది. పోసాని, నరేష్, సత్య ఇలా చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ఈ ఉగాది కానుగా మర్చి 25న సినిమా విడుదల చేస్తున్నాం. ఇప్పటికే మేము మొదలు పెట్టిన మొబైల్ పబ్లిసిటీ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ఈ సినిమాకి మార్చి 14న కరీంనగర్ లో, 19న తిరుపతిలో, 21 హైదరాబాద్ లో మూడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నాం. అలాగే 16 నుండి ఖమ్మం, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ లో కాలేజ్ విజిట్స్ చేస్తున్నాం. ఇటీవలే అరకు, గుంటూరులో జరిగిన ఈవెంట్స్ కి మేము అందరం వెళ్లడం జరిగింది. మార్చి 25 శార్వరినామ సంవత్సర ఉగాదికి మా సినిమా వస్తుంది. ప్రేక్షకులకి హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా. అందరూ చూసి ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను అన్నారు.
from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2TIhkww
0 notes