#జీవన్ముక్తుడు
Explore tagged Tumblr posts
mplanetleaf · 11 months ago
Video
youtube
Story of Jeevan Mukta | జీవన్ముక్తుడు! అద్భుత సత్యం | MPlanetLeaf
1 note · View note
chaitanyavijnanam · 2 years ago
Text
28 Jan 2023 Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹28, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే 🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀 మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి, Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami 🌻 🍀. శ్రీ సూర్య ప్రార్థన 🍀 ధ్యాయేత్సూర్యమనంత కోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : జీవన్ముక్తావస్థ - జీవన్ముక్తుడు బంధరహితుడై చరిస్తాడు. ఏ కర్మయూ అతనిని బంధించ నేరదు. ఏలనంటే, అహంకార స్ఫురణ అతనిలో ఉండదు గనుక . కర్మ చేయునది అతని యందలి విశ్వ ప్రకృతి గాని, అతడు గాదు. విశ్వప్రకృతి కతీతమైన పరతత్వంతో తాదాత్మ్యం చెంది పరిపూరుడై యుండుటయే అతనికి సహజ లక్షణం అవుతుంది.🍀
🌹. రథసప్తమి విశిష్టత (సంక్షిప్త) 🌹
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠ��� సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.
🌷🌷🌷🌷🌷
శుభకృత్‌, శిశిర ఋతువు,
ఉత్తరాయణం, మాఘ మాసం
తిథి: శుక్ల-సప్తమి 08:44:17 వరకు
తదుపరి శుక్ల-అష్టమి
నక్షత్రం: అశ్విని 19:07:13 వరకు
తదుపరి భరణి
యోగం: సద్య 11:54:27 వరకు
తదుపరి శుభ
కరణం: వణిజ 08:45:18 వరకు
వర్జ్యం: 15:01:10 - 16:39:06
మరియు 29:12:00 - 30:53:00
దుర్ముహూర్తం: 08:19:32 - 09:04:53
రాహు కాలం: 09:38:53 - 11:03:55
గుళిక కాలం: 06:48:51 - 08:13:52
యమ గండం: 13:53:57 - 15:18:59
అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50
అమృత కాలం: 11:45:18 - 13:23:14
సూర్యోదయం: 06:48:51
సూర్యాస్తమయం: 18:09:01
చంద్రోదయం: 11:37:38
చంద్రాస్తమయం: 00:35:44
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం
19:07:13 వరకు తదుపరి ధ్వాoక్ష
యోగం - ధన నాశనం, కార్య హాని
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
0 notes
dailybhakthimessages · 2 years ago
Text
🍀 28, JANUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀
🌹🍀 28, JANUARY 2023 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🍀🌹 1) 🌹 28, JANUARY 2023 SATURDAY, శనివారం, స్థిర వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹 🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - విశిష్టత - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀 2) 🌹 కపిల గీత - 125 / Kapila Gita - 125 🌹 🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 09 / 3. Salvation due to wisdom of Nature and Jeeva - 09 🌴 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 717 / Vishnu Sahasranama Contemplation - 717 🌹 🌻717. విశ్వమూర్తిః, विश्वमूर्तिः, Viśvamūrtiḥ🌻 4) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 678 / Sri Siva Maha Purana - 678 🌹 🌻. గణేశుని వివాహము - 2 / The celebration of Gaṇeśa’s marriage - 2 🌻 5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 299 / Osho Daily Meditations - 299 🌹 🍀 299. నీడ / SHADOW 🍀 6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 1 🌹 🌻427. 'నిస్సీమ మహిమ’ - 1 / 'Nisseema Mahima' - 1 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹28, జనవరి, January 2023 పంచాగము - Panchagam 🌹 శుభ శనివారం, Saturday, స్థిర వాసరే 🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀 మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని దైవాన్నర్థిస్తూ ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి, Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami 🌻
🍀. శ్రీ సూర్య ప్రార్థన 🍀
ధ్యాయేత్సూర్యమనంత కోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : జీవన్ముక్తావస్థ - జీవన్ముక్తుడు బంధరహితుడై చరిస్తాడు. ఏ కర్మయూ అతనిని బంధించ నేరదు. ఏలనంటే, అహంకార స్ఫురణ అతనిలో ఉండదు గనుక . కర్మ చేయునది అతని యందలి విశ్వ ప్రకృతి గాని, అతడు గాదు. విశ్వప్రకృతి కతీతమైన పరతత్వంతో తాదాత్మ్యం చెంది పరిపూరుడై యుండుటయే అతనికి సహజ లక్షణం అవుతుంది.🍀
🌹. రథసప్తమి విశిష్టత (సంక్షిప్త) 🌹
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.
🌷🌷🌷🌷🌷
శుభకృత్‌, శిశిర ఋతువు, ఉత్తరాయణం, మాఘ మాసం తిథి: శుక్ల-సప్తమి 08:44:17 వరకు తదుపరి శుక్ల-అష్టమి నక్షత్రం: అశ్విని 19:07:13 వరకు తదుపరి భరణి యోగం: సద్య 11:54:27 వరకు తదుపరి శుభ కరణం: వణిజ 08:45:18 వరకు వర్జ్యం: 15:01:10 - 16:39:06 మరియు 29:12:00 - 30:53:00 దుర్ముహూర్తం: 08:19:32 - 09:04:53 రాహు కాలం: 09:38:53 - 11:03:55 గుళిక కాలం: 06:48:51 - 08:13:52 యమ గండం: 13:53:57 - 15:18:59 అభిజిత్ ముహూర్తం: 12:06 - 12:50 అమృత కాలం: 11:45:18 - 13:23:14 సూర్యోదయం: 06:48:51 సూర్యాస్తమయం: 18:09:01 చంద్రోదయం: 11:37:38 చంద్రాస్తమయం: 00:35:44 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: మేషం యోగాలు: సౌమ్య యోగం - సర్వ సౌఖ్యం 19:07:13 వరకు తదుపరి ధ్వాoక్ష యోగం - ధన నాశనం, కార్య హాని ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి 🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
*🍀. రధసప్తమి, నర్మదా జయంతి, బీష్మాష్టమి శుభాకాంక్షలు - Ratha Saptami, Narmada Jayanti, Bhishma Ashtami Good Wishes to all 🍀 *ప్రసాద్ భరద్వాజ*
🌹🌻. రథసప్తమి - బీష్మాష్టమి విశిష్టత 🌻🌹
సప్త సప్త మహా సప్త, సప్త ద్వీపా వసుంధరా సప్తార్క పర్ణ మాధాయ సప్తమి రధ సప్తమి
ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడి జన్మదినమే రథసప్తమి. సూర్యుని గమనం ఏడు గుర్రముల�� పూన్చిన బంగారు రథం మీద సాగుతుందని వేదము "హిరణ్యయేన సవితారథేన" అని తెలుపుతుంది. సూర్య గమనం ప్రకారం ఉత్తరాయనము, దక్షిణాయనము అని రెండు విధములు. ఆషాఢమాసము నుండి పుష్యమాసము వరకు దక్షిణాయనము. సూర్యరథం దక్షిణాయనంలో దక్షిణ దిశగా పయనిస్తుంది. తరువాత సూర్యుడు మకరరాశి ప్రవేశం ఉత్తరాయన ప్రారంభ సూచకముగా రథసప్తమి అని పేరు వచ్చింది. అందుకే ఈరోజు పవిత్ర దినముగా భావించి భారతీయులు సూర్యుని ఆరాధిస్తారు. "భా" అంటే సూర్యకాంతి, "రతి" అంటే సూర్యుడు, కావున సూర్యుని ఆరాధించువారు అందరూ భారతీయులు. "భారతీ" అంటే వేదమాత. వేదమాత నారాధించు వారును భారతీయులే.
సూర్యగ్రహణతుల్యా సా శుక్లా మాఘస్య సప్తమీ, అరుణొదయవేళాయాం స్నానం తత్ర మహాఫలమ్‌. మాఘే మాసి సితే పక్షే సప్తమీ కోటిపుణ్యదా, కుర్యాత్ స్నానార్ఘ్యదానాభ్యా మాయురారోగ్యసంపదః.
మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానము. ఆ రోజున అరుణోదయ వేళ చేసిన స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానాదులన్ని అనేక కోట్ల రెట్లు పుణ్య ఫలములను ఆయురారోగ్య సంపదలను ఇచ్చును. సప్తమినాడు షష్ఠి తిథి గూడ యున్నచో షష్ఠీ సప్తమీ తిథుల యోగమునకు పద్మమని పేరు. ఈ యోగము సూర్యుని కత్యంత ప్రీతికరము. ఆ సమయమున ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీ స్నానము చేసినచో ఏడు జన్మములలో చేసిన పాపములు నశిస్తాయని గర్గమహాముని ప్రబోధము. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే మిగుల ప్రీతి. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ జన్మలోను, జన్మాంతరంలోను (రెండు), మానసిక, వాచిక, శారీరకములు (మూడు), తెలిసిచేసేవి, తెలియకచేసేవి (రెండు) కలిసి మొత్తం ఏడు పాపములు నేడు రోగాలకు కారణములు.
రథసప్తమి నాడు బంగారముతో గాని, వెండితో గాని, రాగితో గాని రథమును చేయించి, కుంకుమాదులు, దీపములతో నలంకరించి అందు ఎర్రని రంగుగల సూర్యుని ప్రతిమ నుంచి, పూజించి, గురువునకు ఆ రథమును దానమీయ వలెను, ఆ రోజు ఉపవాసముండి, సూర్య సంబంధమగు రథోత్సవాది కార్యక్రమములను చూచుచూ కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు కురియునని పురాణప్రబోధము. రథసప్తమి వ్రతము మన సంప్రదాయమున నిలచియుండుట భారతీయతకు చిహ్నము.
🌻. సూర్య స్తోత్రం 🌻 ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్
🌹.బీష్మాష్టమి విశిష్టత 🌹
ప్రతి సంవత్సరం రథ సప్తమి అనంతరం భీష్మ అష్టమి అనుసరించాల్సి ఉంటుంది. ఈ పవిత్రమైన రోజున ప్రతి ఒక్కరు మూడు దోసిళ్ల అర్ఘ్యం భీష్మ ప్రీతికి అనుసరించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను అందరూ భీష్మ తర్పణం అని అంటారు. ధర్మశాస్త్రం ప్రకారం, భీష్మ తర్పణం, యమ తర్పణం తండ్రి బతికి ఉన్నవారు కూడా చేయాల్సిందే. ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఈరోజున విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చ���స్తారు.
భీష్మాష్టమి రోజున విష్ణుమూర్తి పూజ అనంతరం ఆవునెయ్యితో పంచహారతి ఇవ్వాలి. దీపారాధనకు తామరవత్తులను వాడాలి. విష్ణుమూర్తి ఆలయాల్లో విష్ణు అష్టోత్తరం, సత్యనారాయణ వ్రతం, బ్రహోత్సవ దర్శనం, లక్ష తులసి పూజ వంటివి నిర్వహించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతారు. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు పురాణం, సత్య నారాయణ వ్రత పుస్తకాలను సన్నిహితులకు తాంబూలాలు ఇవ్వాలని పురోహితులు చెబుతున్నారు.
🌻. పాలు పొంగించే విధానం 🌻
సూర్యుని కిరణాలూ పడే చోట..లేదా..తులసిచెట్టు ఉండే దగ్గర ఓ పీటను పెట్టి దాన్ని పసుపుతో శుద్ధి చేసి, ముగ్గులుపెట్టి, సూర్యభగవానుడి ఫోటోను ఉంచాలి. గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. ఎర్రటి పుష్పాలతో అలంకరించాలి.
ఏడు చిక్కుడు కాయలను తీసుకుని రథంగా తయారుచేసుకోవాలి. ఈ రోజు సూర్యునికి నేతితో దీపం వెలిగించి ఆవు పిడకలను కర్పూరంతో వెలిగించి దానిపై ఇత్తడి పాత్ర ఉంచి ఆవుపాలు, బెల్లం, బియ్యం తో చేసిన పరమాన్నం చేసుకోవాలి. ఈ పరమాన్నం సూర్యునికి ఎంతో ప్రీతి.
🍀. భీష్మ అష్టమి తర్పణ శ్లోకం 🍀
వైయాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ చ | గంగాపుత్రాయ భీష్మాయ ఆజన్మ బ్రహ్మచారిణే ౧ భీష్మః శాన్తనవో వీరః సత్యవాదీ జితేంద్రియః | ఆభిరద్భిరవాప్నోతు పుత్ర పౌత్రోచితాం క్రియామ్ ౨ వసూనామవతారాయ శంతనోరాత్మజాయ చ | అర్ఘ్యం దదామి భీష్మాయ ఆజన్మబ్రహ్మచారిణే ౩ భీష్మాయ నమః ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం ఇదమర్ఘ్యం 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. కపిల గీత - 125 / Kapila Gita - 125🌹 🍀. ��పిల దేవహూతి సంవాదం 🍀 ✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్‌ భరధ్వాజ
🌴 3. ప్రకృతి పురుషుల వివేకము వలన మోక్షప్రాప్తి - 09 🌴
09. సానుబంధే చ దేహేఽస్మిన్నకుర్వన్న సదాగ్రహమ్| జ్ఞానేన దృష్టతత్త్వేన ప్రకృతేః పురుషస్య చ॥
ప్రాణుల యెడల మైత్రీభావమును కలిగి యుండ వలెను. దయాళువై యుండ వలెను. సుఖదుఃఖాది ద్వంద్వములకు వెరవక ధీరుడై యుండవలెను. ప్రకృతి పురుషులయొక్క వాస్తవస్వరూపమును తెలిసికొని, తత్త్వజ్ఞానియై, స్త్రీపుత్రాదుల యందును, దేహము పైనను నేను-నాది అను మిథ్యాభిమానమును త్యజింప వలెను.*
ఈ శరీరము యందు ఆసక్తిని తగ్గించాలి. దుష్టమైన కోరికనూ, ఆసక్తినీ తగ్గించాలి. ఒక్క దేహానికి మాత్రమే కాదు. స బంధు. పుత్ర మిత్రాదులతో ఉన్న దేహం యొక్క ఆసక్తిని తగ్గించాలి. ఈ భోగాలలో ఏదీ ఆత్మకోసం లేదు. ఇన్ని అనుబంధాలతో ఉన్న శరీరమునకు సత్ స్నేహాలు పెంచుకోవాలి. ఆ స్నేహాలు వలన భక్తి పెరిగితే మంచిదే, కానీ అసత్ స్నేహాలని దూరముగా ఉంచాలి. ప్రకృతి తత్వమునూ పురుష తత్వమునూ చక్కగా తెలుసుకోవడమే జ్ఞానం. అసదాగ్రహం - లేని దాన్ని గురించి పట్టుదల. శరీరము నేనే అనుకోవడం కూడా అసదాగ్రహమే. నేనూ-నాదీ అనుకోవడం కూడా అసదాగ్రహం. ఇది పోగొట్టుకోవాలి. జ్ఞానం కేవలం ఆత్మకే ఉంటుంది. జ్ఞానానికి నెలవు ఆత్మ.
సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 125 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj
🌴 3. Salvation due to wisdom of Nature and Jeeva - 09 🌴
09. sānubandhe ca dehe 'sminn akurvann asad-āgraham jñānena dṛṣṭa-tattvena prakṛteḥ puruṣasya ca
One's seeing power should be increased through knowledge of spirit and matter, and one should not unnecessarily identify himself with the body and thus become attracted by bodily relationships.
The conditioned souls are eager to identify with the body and consider that the body is "myself" and that anything in relationship with the body or possessions of the body is "mine." In Sanskrit this is called aham-mamatā, and it is the root cause of all conditional life. A person should see things as the combination of matter and spirit. He should distinguish between the nature of matter and the nature of spirit, and his real identification should be with spirit, not with matter. By this knowledge, one should avoid the false, bodily concept of life.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 717 / Vishnu Sahasranama Contemplation - 717🌹
🌻717. విశ్వమూర్తిః, विश्वमूर्तिः, Viśvamūrtiḥ🌻
ఓం విశ్వమూర్తయే నమః | ॐ विश्वमूर्तये नमः | OM Viśvamūrtaye namaḥ
విశ్వమూర్తిర్హరేర్యస్య విశ్వమూర్తిస్స ఉచ్యతే
పరమాత్ముడు సర్వాత్మకుడు, సర్వమును తానేయగువాడు కావున విశ్వము అంతయు ఈతని మూర్తియే.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 717🌹
🌻717. Viśvamūrtiḥ🌻
OM Viśvamūrtaye namaḥ
विश्वमूर्तिर्हरेर्यस्य विश्वमूर्तिस्स उच्यते / Viśvamūrtirhareryasya viśvamūrtissa ucyate
As He is all-pervading, the entire universe is His form - He is Viśvamūrtiḥ.
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka विश्वमूर्तिर्महामूर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् ।अनेकमूर्तिरव्यक्तश्शतमूर्तिश्शताननः ॥ ७७ ॥ విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।అనేకమూర్తిరవ్యక్తశ్శతమూర్తిశ్శతాననః ॥ 77 ॥ Viśvamūrtirmahāmūrtirdīptamūrtiramūrtimān,Anekamūrtiravyaktaśśatamūrtiśśatānanaḥ ॥ 77 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 . శ్రీ శివ మహా పురాణము - 678 / Sri Siva Maha Purana - 678 🌹 ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 20 🌴 🌻. గణేశుని వివాహము - 2 🌻
గణేశుడు విశ్వరూపప్రజాపతి యొక్క కుమార్తెలగు అతిశయించిన అందముగల ఇద్దరు కన్యలను ఆనందముతో వివాహమాడెను (13). అతనికి సుందరాంగనలగు ఆ ఇద్దరు పత్నులయందు ఇద్దరు పుత్రులు కలిగిరి. సిద్ధి అను నామెకు క్షేముడు, బుద్ధి అను నామెకు సర్వసుఖముల నిచ్చే లాభుడు కలిగిరి (14). ఈ గణేశుడు ఇద్ధరు భార్యమలయందు ఇద్దరు శుభపుత్రులను పొందినాడు. తల్లి దండ్రుల అంగీకారముతో నాతడు ఎడతెరపి లేని సుఖము ననుభవించుచున్నాడు (15). కుమారా! నీవు వారి మోసపూరితమగు ఆజ్ఞకు బద్ధుడవై సముద్రములతో అడవులతో కూడి యున్న భూమిని చుట్టి వచ్చితివి. దానికి లభించిన ఫలము ఇది (16).
కుమారా! నీవు ఆలోచింపుము. వ్యక్తికి ప్రభులగు తల్లిదండ్రులే మోసమును చేసినచో, ఇతరులు కూడ మోసమును ఎట్లు చేయకుందురు? (17) నీ తల్లి దండ్రులు చేసిన పని యోగ్యముగా లేదు. నీవు కూడ ఆలోచించుము. నా మనస్సునకు వారు చేసిన పని శుభకరమని తోచలేదు (18). తల్లి విషము నిచ్చినచో, తండ్రి అమ్మివేసినచో, రాజు సర్వస్వమును అపహరించినచో, ఎవనికి ఏమి చెప్పవలెను? (19) కుమారా! ఎవరైతే ఇట్టి గొప్ప అనర్ధమును కలిగించే కర్మను చేయుదురో, అట్టి వారి ముఖమును శాంతిని గోరు బుద్ధిశాలి చూడకుండుట మేలు (20).
వేదశాస్త్రము���ు, మరియు స్మృతులు ఇట్టి నీతిని దృఢముగా బోధించు చున్నవి. ఆ నీతిని నేను నీకు విన్నవించితిని. నీకు నచ్చిన రీతిని ఆచరింపుము (21).
సశేషం…. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 678🌹 *✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 20 🌴
🌻 The celebration of Gaṇeśa’s marriage - 2 🌻
By this marriage that was celebrated, Gaṇeśa has obtained two wives joyously. They are the excellent daughters of Prajāpati Viśvarūpa.
He has begot of his two wives of auspicious body two sons, Kṣema of Siddhi and Lābha of Buddhi. They bestow happiness on every one.
Begetting two sons of auspicious features of his wives Gaṇeśa is continuously enjoying happiness as conceived by your parents.
The entire earth consisting of oceans and jungles has been traversed by you due to their deceptive behest. O dear, this is the result of that.
O dear, consider. If parents begin to deceive or particularly if our masters begin to deceive, won’t others also begin to deceive.
Your parents have not done well. Just ponder over it. I don’t think their action has been good.
If mother were to poison her son, if father were to sell his son, if the king were to confiscate the assets of his subjects what can be said and to whom?
O dear, an intelligent peace-loving person shall never look at the face of the person who has committed this harmful deed.
This policy has been mentioned in the Vedas, Smṛtis and sacred texts. It has been intimated to you now. Do as you wish.”
Continues…. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media Tumblr media
🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 299 / Osho Daily Meditations - 299 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ
🍀 299. నీడ 🍀
🕉. అహాన్ని ఎవరూ చంపలేరు, ఎందుకంటే అహం కాదు. ఇది నీడ. నీడను చంపలేవు. 🕉
నీడతో పోరాడడం కూడా మూర్ఖత్వం. మీరు ఓడిపోతారు - నీడ చాలా శక్తివంతమైనది కాబట్టి కాదు, నీడ ఏమీ కాదు కాబట్టి! నీడతో యుద్ధం మొదలుపెడితే ఎలా గెలుస్తావు? ఇది అస్తిత్వం లేనిది; అలాగే అహం కూడా అంతే. అహం స్వయం యొక్క నీడ.
శరీరం నీడను సృష్టించినట్లే, నేను కూడా నీడను సృష్టిస్తుంది. మీరు దానితో పోరాడలేరు మరియు మీరు దానిని చంపలేరు; నిజానికి దాన్ని చంపాలనుకునేది అహం. దీనిని ఇలా మాత్రమే అర్థం చేసుకోగలరు. మీరు నీడను చంపాలనుకుంటే, కాంతిని తీసుకురండి, మరియు నీడ అదృశ్యమవుతుంది; మరింత అవగాహనను పెంచుకోండి. దానితో అహం అదృశ్యమవుతుంది.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
Tumblr media
🌹 Osho Daily Meditations - 299 🌹 📚. Prasad Bharadwaj
🍀 299. SHADOW 🍀
🕉. Nobody can kill the ego, because the ego is not anyrthing. It is a shadow you cannot kill a shadow 🕉
Even to fight with a shadow is foolish, you will be defeated-and not because the shadow is very powerful but because the shadow is not! If you start fighting with a shadow, how can you win? It is nonexistential; and so is the ego.
The ego is the shadow of the self, Just as the body creates a shadow, the self also creates a shadow. You cannot fight with it, and you cannot kill it; in fact, the one who wants to kill it is the ego. One can only understand. If you want to kill the shadow, bring light in, and the shadow will disappear; bring more awareness, and the ego will disappear.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 427 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 1 🌹 🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻 ✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్ సేకరణ : ప్రసాద్ భరద్వాజ 🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 91. తత్త్వాసనా, తత్త్వమయీ, పంచకోశాంతరస్థితా । నిస్సీమమహిమా, నిత్యయౌవనా, మదశాలినీ ॥ 91 ॥ 🍀
🌻 427. 'నిస్సీమ మహిమ’ - 1 🌻
హద్దులు లేని మహిమ కలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత మహిమకు హద్దులు లేవు. అన్నిటికినీ హద్దులు ఏర్పరచునది శ్రీమాత. ఆమెకు హద్దులు లేవు. అనంతము అపరిమితము అగు తత్త్వము హద్దుల నేర్పరచి అందుండుటయే గాక వాని నతిక్రమించి కూడ యుండును. సృష్టికి ఈవల ఆవల నిండియుండు ప్రజ్ఞ సృష్టి యందిమిడి యున్నట్లుగ గోచరించును. నిజమునకు ఆ ప్రజ్ఞయందే సృష్టి ఇమిడి యున్నది.
అల యందు సముద్రమున్ననూ అలను మించి సముద్ర మున్నది గదా! అద్దమందు కొండ యున్నట్లుగ యుండును. కాని కొండ పరిమాణమందు అద్దమెంత? అద్దమందలి కొండవలెనే పదునాలుగు భువనముల సృష్టియందు శ్రీమాత ఇమిడి యున్నట్లు గోచరించును. సృష్టి పరిమాణమును కాలము రూపమున కొలతలు వేయవచ్చును. కాని శ్రీమాత మహిమను, శ్రీమాతను కొలతలు వేయుట సాధ్యము కాదు.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 427 - 1 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️ Prasad Bharadwaj
🌻 91. Tatvasana tatvamaei panchakoshantarah sdhita Nisima mahima nitya-yaovana madashalini ॥ 91 ॥ 🌻
🌻 427. 'Nisseema Mahima' - 1 🌻
It means that Srimata has unlimited glory. Srimata's glory knows no bounds. Srimata limits everything. She herself has no boundaries. The infinite Divine limits itself to the boundaries but exists even beyond them. Prajna,Wisdom, which is full beyond creation, appears as if it is limited by creation. Truth is the creation exists within wisdom( Prajna).
There is a sea beyond the waves! It is like a hill in the mirror. But what is the size of the hill? It can be seen that Shrimata is involved in the creation of fourteen earths just like the reflection of hill in the mirror. The size of creation can be measured in terms of time. But it is not possible to measure Srimata' s glory and Srimata.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
నిత్యసందేశములు #DailyMessages
Join and Share https://t.me/ChaitanyaVijnanam https://t.me/Spiritual_Wisdom www.facebook.com/groups/chaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/ https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
0 notes
Photo
Tumblr media
🔔🌟🔔🌟🔔🌟🔔🌟🔔🌟🔔 *14-10-2017* 🙏🌹ఈరోజు *ధ్యానం యొక్క 866 వ రోజున* 💞🌟 విశ్వ వ్యాప్త కాంతి 🌟 సామూహిక 🎎🎎🎎 ధ్యానానికి స్వాగతం. ⏰ *10:10 p.m నుండి 11:11 p.m వరకు* 🎯 🌹🌹☘🌹🌹☘🌹🌹☘🌹 *ఆత్మ బోధ ఉపనిషత్తు* 🌹🌹☘🌹🌹☘🌹🌹☘🌹 *ఈరోజు అంశం : జీవన్ముక్తుడు ఎవరు* 🌻🌿🌻🌿🌻🌿🌻🌿🌻 ఊహాత్మక మరియు బాహ్య ఆనందాల పట్ల తన అన్ని బంధాలను వదులుకున్న వారు మరియు *ఆత్మ నుండి ఉద్బవించిన ఆనందంలో సంతృప్తి చెంది, కుండలో పెట్టిన దీపం వెలిగి నట్టు అంతర్ముఖంగా వెలిగే వాడే* జీవన్ముక్తుడు. 🌻🌿🌻🌿🌻🌿🌻🌿🌻 జీవన్ముక్తులందరూ అన్ని ఇంద్రియాల నుండి విడివడి వుంటారు, తన మనసును అంతర్ ముఖం చేసుకుంటారు, అది ఎలాంటి మాయ లేకుండా నిశ్చలంగా వుంటుంది. అప్పుడు ఆయన మనసు *ఉన్నత మైన బ్రహ్మ యొక్కఈ అంతర్ముఖ కాంతిని అనుభవిస్తాడు.* 🌻🌿🌻🌿🌻🌿🌻🌿🌻 *జీవన్ముక్త స్థితిలో* వారు ఉపాదులలో వుంటాడు, ఆకాశంలాగా కల్మషంలేకుండా వుంటాడు మరియు గాలిలాగా సరిగ్గా విడివడి వుండి కదులుతాడు. 🌻🌿🌻🌿🌻🌿🌻🌿🌻 🌹🌹☘🌹🌹☘🌹🌹☘🌹 దయచేసి ధ్యాన శక్తిని ఈ "విశ్వం అంతా" వ్యాప్తి చేయడానికి మనం అందరం కలిసి ధ్యానం చేద్దాము. 🙏💎💞🙏🌹💞🙏🌟💞 దయచేసి అద్బుతమైన 🔔 సంగీతంతో 🎶 విశ్వ వ్యాప్త ☯ కాంతి సామూహిక ధ్యానం చేయండి. *ఈరోజు మ్యూజిక్ సంఖ్య :536* ఆనందమయ అంతర్ ప్రయాణం చేయండి మాస్టర్స్. 💚🔆 *Light Workers* ---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
0 notes
chaitanyavijnanam · 2 years ago
Text
నిత్య ప్రజ్ఞా సందేశములు - 09 - 9. జీవన్ముక్త అనుభవం / DAILY WISDOM - 09 - 9. The Experience of the Jivanmukta
Tumblr media
🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 09 / DAILY WISDOM - 09 🌹 🍀 📖 సంపూర్ణమైన సాక్షాత్కారం నుండి 🍀 ✍️. ప్రసాద్ భరద్వాజ 🌻 9. జీవన్ముక్త అనుభవం 🌻 జీవన్ముక్తుడు తాను అందరికి ప్రభువుగా, సర్వజ్ఞుడుగా, అన్నింటిని ఆనందించేవాడిగా తనని తాను తెలుసుకుంటాడు. అస్తిత్వమంతా అతనిదే; సమస్త విశ్వం అతని శరీరం. అతను ఎవరికీ ఆజ్ఞాపించడు, ఎవరిచేత ఆజ్ఞాపించబడడు. అతను ఎల్లలు లేని జగత్సాక్షిగా తనని తాను తెలుసుకుంటాడు. ఈ స్థితి వర్ణించనలవి కానిది.
అతను ఏకకాలంలో 'నేను మాత్రమే ఉన్నాను' లేదా 'నేనే సర్వం' అనే భావనతో ఉనికిలో లోతుగా మునిగిపోతున్నట్లు అనిపిస్తుంది. అతను చైతన్యం యొక్క సరిహద్దులను విచ్ఛిన్నం చేస్తాడు. అనంతం లోకి అడుగుపెడతాడు. కొన్ని సమయాల్లో అతను అసంపూర్తిగా వ్యక్తిగత అనుభవం ద్వారా తెచ్చిన జ్ఞాపకంగా సాపేక్షత యొక్క స్పృహను లీలామత్రంగా కలిగి ఉంటాడు.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 9 🌹 🍀 📖 The Realisation of the Absolute 🍀 📝 Swami Krishnananda 📚. Prasad Bharadwaj 🌻 9. The Experience of the Jivanmukta 🌻
The Jivanmukta experiences his being the lord of all, the knower of all, the enjoyer of everything. The whole existence belongs to him; the entire universe is his body. He neither commands anybody, nor is he commanded by anybody. He is the absolute witness of his own glory, without terms to express it.
He seems to simultaneously sink deep into and float on the ocean of the essence of being, with the feeling “I alone am”, or “I am all”. He breaks the boundaries of consciousness and steps into the bosom of Infinity. At times he seems to have a consciousness of relativity as a faint remembrance brought about by unfinished individualistic experience.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Photo
Tumblr media
🔔🌟🔔🌟🔔🌟🔔🌟🔔🌟🔔 *13-10-2017* 🙏🌹ఈరోజు *ధ్యానం యొక్క 865 వ రోజున* 💞🌟 విశ్వ వ్యాప్త కాంతి 🌟 సామూహిక 🎎🎎🎎 ధ్యానానికి స్వాగతం. ⏰ *10:10 p.m నుండి 11:11 p.m వరకు* 🎯 🌹🌹☘🌹🌹☘🌹🌹☘🌹 *ఆత్మ బోధ ఉపనిషత్తు* 🌹🌹☘🌹🌹☘🌹🌹☘🌹 *ఈరోజు అంశం : ఆత్మారాముడుగా అవ్వడానికి మోహాన్ని విడిచి పెట్టండి* 🎎☃🎎☃🎎☃🎎☃🎎 ఎన్నో సంవత్సరాలు ఆత్మ యొక్క దివ్య స్వభావం మీద ధ్యాన సాధనతో సంపూర్ణంగా అజ్ఞానం (అవిధ్య) నుండి స్వేచ్చ పొంది, ఆత్మను తెలుసుకున్న వ్యక్తే జీవన్ముక్తుడు. *తాను తన శరీరం లో వుంటున్నా కూడా, స్థూల, సూక్ష్మ మరియు కారణ శరీరాల యొక్క విలక్షణతలను వదిలిన వాడు* జీవన్ముక్తుడు. 🎎☃🎎☃🎎☃🎎☃🎎 తన, సత్ చిత్ ఆనందం అయిన స్వభావం వున్నందున, మట్టిలో పెరిగిన పురుగు ఎంతో కాలం గూడులో వుండి మరియు చిమట యొక్క స్వభావం మరియు రూపం మీద ధ్యానం చేయటం వల్ల చిమటలా తయారు అయినట్టు. 🎎☃🎎☃🎎☃🎎☃🎎 *మోహం అనే మహాసముద్రాన్ని దాటి మరియు ఇష్టం మరియు అయిష్టం అనే అసురులను చంపి ప్రశాంతంగా తన స్వీయ ఆత్మారాముని ప్రకాశంలో నివశించే వాడు యోగి.* 🎎☃🎎☃🎎☃🎎☃🎎 🌹🌹☘🌹🌹☘🌹🌹☘🌹 దయచేసి ధ్యాన శక్తిని ఈ "విశ్వం అంతా" వ్యాప్తి చేయడానికి మనం అందరం కలిసి ధ్యానం చేద్దాము. 🙏💎💞🙏🌹💞🙏🌟💞 దయచేసి అద్బుతమైన 🔔 సంగీతంతో 🎶 విశ్వ వ్యాప్త ☯ కాంతి సామూహిక ధ్యానం చేయండి. *ఈరోజు మ్యూజిక్ సంఖ్య :535* ఆనందమయ అంతర్ ప్రయాణం చేయండి మాస్టర్స్. 💚🔆 *Light Workers* ---- 🔄♻🔁 *Connected with Universe*💓🌟🌕✨💥☣
0 notes