#tirupperunturaitemple
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 1 year ago
Text
youtube
ఇలాంటి వివరాలను మీరు ఏ ఆలయంలోనూ చూడలేరు? ప్రాచీన భారతీయుల పురాతన జ్ఞానంకి శభాష్!
Hey guys, ఈ రోజు మనం, తిరుప్పెరున్తురై లో ఉన్న ఒక పురాతనమైన ఆలయంలోకి వెళ్తున్నాము, ఇక్కడ కనిపించే కొన్ని అసాధ్యమైన శిల్పాలను నేను మీకు చూపించబోతున్నాను. కానీ wait చేయండి, మనం already ఒక అద్భుతాన్ని దాటి వచ్చేసాము. నిజానికి చెప్పాలంటే, రెండు అద్భుతాలు అని చెప్పొచ్చు. ఈ శిల్పాలను చూడండి. వీటి ఎత్తు చూడండి. అవునండి, ఇవన్నీ రాతితో తయారు చేసినవే, ఈ photoలో, నా heightను, అలానే ఈ విగ్రహాల heightతో compare చేసి చూడండి. ఒక్కో విగ్రహం దాదాపు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈరోజు ఉన్న modern యుగం యొక్క మార్కెటింగ్ ప్రపంచంలో, పదార్ధం కేవలం 10% మరియు మార్కెటింగ్ 90%, మనం నిరాడంబరత యొక్క ��ురాతన వ్యవస్థకు విలువ ఇవ్వడంలేదు. పురాతన నిర్మాణదారులు, ఉద్దేశపూర్వకంగానే, ఈ అసాధారణ శిల్పాలను గుర్తించలేని ప్రదేశాలలో ఉంచారు, మీరు వాటిని కోల్పోవాలని వాళ్ళు కోరుకున్నారు.
మీరు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే, అలానే కొంచెం లోపలికి వెళ్లి, వెంటనే U turn తీసుకొని, ఈ భారీ శిల్పాలను చూడాలి, కానీ, దీన్ని మీరు miss చేయడానికి, 99% అవకాశం ఉంది. బహుశా మీరు, వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా ఆలయంలోకి వెళ్లిపోవచ్చు. మీరు ఈ అద్భుతమైన ఆలయాన్ని చూసి ముగించి, ఇంటికి వెళ్లే సమయానికి, మీరు చాలా అలసిపోయి ఉంటారు, అప్పుడు ఈ 2 విగ్రహాలను చూశారంటే, మీరు సరిగ్గా వాటిని గమనించలేరు. So, పురాతన నిర్మాణదారులు, ఏదో ఒక కారణం చేతనే, వీటిని కనిపించకుండా ఇక్కడ ఉంచారు, కానీ ఎందుకు? ఈ శిల్పాల యొక్క భారీ ఎత్తు మాత్రమే, మనల్ని ఆశ్చర్యపడేలా చేయలేదు, ఇందులో ఉన్న సూక్ష్మ వివరాలను పరిశీలిస్తే, అది మరింత అద్భుతంగా ఉంటుంది. Left sideలో ఉన్న ఈ భారీ విగ్రహం పైన, 4 విభిన్న బ్యాండ్‌లు ఉన్నాయి. మొదటిది పగలు మరియు రాత్రికి ప్రతీకగా సూర్యుడు మరియు నెలవంక చంద్రుడు ఏకాంతరంగా వస్తున్నట్లు చూపిస్తుంది. దీని తరువాత ఉన్న bandను చూద్దాం, వరుసగా ఉన్న విచిత్రమైన, cylinderలను చూపిస్తుంది, ప్రతి సిలిండర్ కు, పైభాగంలో మెరుస్తూ ఉంటుంది, కానీ క్రింద భాగంలో కొన్ని patternలు ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్కటి ఒక సహస్రలింగంని సూచిస్తుంది, అంటే శివుని ఉనికిని సూచించే ఒక రకమైన లింగం.
దాని క్రింద, చక్రాలు మరియు శంఖాలు, పొదిగిన మరొక బ్యాండ్‌ని మనం చూడవచ్చు. ఈ చక్రం మరియు శంఖం, అన్నింటికి రక్షకుడు అయిన విష్ణువును సూచిస్తాయి, దాని క్రింద మీరు వృత్తాల సమూహంతో ఒక బ్యాండ్‌ను చూడవచ్చు. మీరు ఈ వృత్తాలను, లెక్కించినట్లయితే, మొత్తం 9 వృత్తాలు ఉంటాయి, అంటే అవి నవగ్రహాలు అని పిలవబడే, మన భూమిపై ప్రభావం చేసే, 9 స్వర్గ కారకాలను చూపిస్తున్నాయి. So, ఈ universe లో ఉన్న అన్ని విషయాలను, వాళ్ళు మాల సమూహంగా ధరించినట్లు చూపించారు. అతని జుట్టు మరియు అతని భయంకరమైన ముఖంలో, అద్భుతమైన వివరాలు చాలా ఉన్నాయి, కానీ నేను వాటిని వదిలేసి, ఇప్పుడు ఆయుధాల గురించి మాట్లాడబోతున్నాను. పైన ఉన్న, 2 చేతుల్లో, అతను కొన్ని విచిత్రమైన వస్తువులను పట్టుకున్నాడు. అవేంటని మీరు చెప్పగలరా? ఇది బాణాల సమూహాన్ని కలిగి ఉన్నఒక బ్యాగ్, దాని లోపల ఉన్న బాణాలను కూడా మీరు చూడవచ్చు, ఇక్కడ అతను కేవలం 2 వేళ్లతో ఒక బాణాన్ని బయటకు తీస్తున్నట్లు మీరు చూడవచ్చు. మరోక చేతిలో, ఏముందంటే, ఇది ఒక విల్లు, అతను చాలా పెద్దగా ఉన్నందున, అతని చేతిలో ఉన్న ఈ విల్లు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ నమ్మలేని ఒక విషయాన్నీ చెక్కారు. ఈ విల్లు యొక్క తీగను చూడండి, ఇది తగినంత స్థలంతో ఎలా వెళుతుందో చూడండి, కానీ ఇక్కడ అది అతని బొటనవేలును ఎలా గట్టిగా పట్టుకుంటుందో చూడండి.
అతను తన బొటనవేలును, ఈ విల్లు లోపల, చొప్పించినందున, ఈ స్ట్రింగ్ సాగుతుంది, అంటే ఆ tension కారణంగా, అంటే elastic tension అని పిలవబడే, దాని కారణంగా, అది అతని బొటనవేలును ఎంత గట్టిగా పెట్టుకుందో చూడండి. ఈ బొటనవేలు తర్వాత, మళ్ళీ, ఇక్కడున్న ఈ విల్లుకు మరియు తీగకు మధ్య, చాలా gap ఉండడం కూడా, మీరు చూడవచ్చు. ఇవి, మనం సాధారణంగా, కంటితో కూడా చూడలేని అద్భుతమైన వివరాలు, నేను నా DSLRతో జూమ్ చేసి, దీన్ని నేను మీకు చూపించాను, ఆ విధంగానే, నేను దీన్ని కనిపెట్టాను. ఈ చేతిలో, మీరు ఒక జంతువును చూడవచ్చు, అది నిజానికి ఒక జింక, అలానే, మరొక వైపు, మీరు ఒక చిన్న, గొడ్డలి వంటి ఆయుధాన్ని చూడవచ్చు. ఈ రెండు విషయాలను మాన్ మరియు Mazhu అని అంటారు, వీటికి వెనుక పెద్ద కథలు ఉన్నాయి.
Praveen Mohan Telugu
1 note · View note