#taprahm
Explore tagged Tumblr posts
Video
youtube
30 అడుగుల స్ఫటిక లింగం కంబోడియాలో కనుగొనబడింది? పురాతన కో కెర్ పిరమిడ్ అధునాతన సాంకేతికత?
హాయ్ గైస్, ఈ రోజు మనం 30 అడుగుల ఎత్తు గల ఒక పురాతన లింగం గురించి investigate చేయబోతున్నాము, అవును మీరు విన్నది correct ఎహ్, ఆ లింగం ముప్పై అడుగులు ఎత్తు ఉంటుంది, ఇది అద్దం లాంటి transparent గా ఉన్న crystalతో తయారు చేయబడింది. ఇంకా ఈ లింగం కొత్తది కాదు, ఇది వెయ్యి సంవత్సరాలకు ముందు తయారు చేయబడింది, ఇంకా కంబోడియాలోని అడవి మధ్యలో, పురాతన హిందువులచే కట్టబడిన ఒక గుడి లోపల ఈ లింగం ఉంచబడింది.
ఇంకా ఇదే ఆ స్ఫటిక లింగాన్ని కలిగి ఉన్న హిందూ దేవాలయం. మొదటి సారి దీన్ని చూసేటప్పుడు, నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే ఇది చూడడానికి హిందూ దేవాలయంలా అస్సలు కనిపించలేదు. దీనికి, ఇంకా మాయన్ పిరమిడ్ కి చాలా విషయాలు match అవుతున్నాయి, కానీ ఈ గుడిని శివ పరమేశ్వరుని కోసం కట్టబడిందని archeologistsలు confirmగా చెప్తున్నారు. అంతే కాకుండా archeologists లు ఇక్కడ రాతి శాసనాలను కనిపెట్టారు, అందులో ఒక పెద్ద లింగం ఇక్కడ ఉండేదని రాయబడిఉంది.
సాధారణంగా, నేను నిర్మాణాన్ని రాసిస్తాను, ఇంకా ఈ పిరమిడ్ యొక్క size, ఇంకా shape ఎలా ఉందని చూస్తాను, కానీ ఇప్పుడు ఇక్కడున్న ఈ స్పటిక లింగాన్ని చూడడానికి నేనువేచి ఉండలేను. ఇక్కడ ఉన్న ఈ అసలైన మెట్లు ఇప్పుడు పూర్తిగా పాడైపోయి, ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయి, కానీ మరొక వైపు కూడా మెట్లు ఎక్కువ ఉండాలని నేను అనుకుంటున్నాను. నేను ఈ పిరమిడ్ చుట్టూ నడిచివస్తున్నపుడు, నా ఊహ తప్పు అని అర్ధమైంది, అసలు మెట్లు పిరమిడ్ యొక్క ఒక వైపు మాత్రమే నిర్మించబడ్డాయి, ఇంకా మరొక వైపు మెట్లు లేవు, ఈ గోడలన్నీ చాలా గట్టివైన రాళ్లతో కట్టారు.
పిరమిడ్ వెనుక భాగంలో, ఒక వింత పూజాలు చేయడం నేను చూసాను. ఇక్కడ ఒక చిన్న గుడి ఉంది, బహుశా ఆ పెద్ద స్పటిక లింగం ఇక్కేడే ఉండుంటుందేమో, కానీ నేను అక్కడికెళ్లి చూసినప్పుడు స్థానిక కంబోడియన్లు ఏనుగు విగ్రహాన్ని ఆరాధించడం చూసి నేను ఆశ్చర్యపోయాను. కాంబోడియన్లు ఎక్కువగా ఇంగ్లీష్ లో మాట్లాడరు, ఆ పెద్ద స్పటిక లింగం ఎక్కడ ఉందని నేను వాళ్ళ దగ్గర ఇంగ్లీష్ లో అడిగాను, అందుకువాళ్ళు ఈ పిరమిడ్ పైభాగానికి చూపించారు. నేను ఇప్పుడు పిరమిడ్ పైకి వెళ్ళడానికి కొత్తగా కట్టిన చెక్క మెట్లను చూసాను కాబట్టి నేను దానిని ఎక్కడం ప్రారంభించాను.
స్పటికతో తయారు చేసిన 30 అడుగుల పొడవైన లింగం, పురాతనమైన ఈ పిరమిడ్ పైభాగంలో ఏర్పాటు చేసారా? అది చూడటానికి చాలా అద్భుతంగా ఉండుంటుందేమో కదా. పిరమిడ్ యొక్క రాళ్ళు నన్ను పిలుస్తున్నట్టుగా ఉన్నాయి, ఇవన్నీ వెయ్యి సంవత్సరాలకు ముందే వీటిని cut చేసి ఇక్కడ స్థాపించారు, కానీ నా లక్ష్యం మాత్రం, ఆ పెద్ద స్పటిక లింగాన్ని చూడడమే. చివరకు నేను పైకి చేరుకున్నాను, కానీ నేను చాలా disappoint అయ్యాను ఎందుకంటే నాకు ఇక్కడ క్రిస్టల్ లింగం కనిపించలేదు, కానీ, నేను పెద్ద పెద్ద విరిగిన శిల్పాలతో నాశనమైన ఆలయ నిర్మాణాన్ని చూసాను.
అక్కడ కాలి గది మాత్రమే ఉంది, దానికి రక్షణగా చెక్క తలుపులు వేసి ఉంచారు. ఏదేమైనప్పటికీ, ఈ విరిగిన రాతి దిమ్మెలపై ఎక్కాలని నాకు అనిపిస్తోంది. ఇలా చేయడం ప్రమాదకరమే, కాని నేను ఈ ప్రాంతంలో విచిత్రమైనదేదో ఉందని నాకు అనిపిస్తోంది. ఆపై నేను ఇక్కడ నిజంగా అసాధారణమైనదాన్ని కనిపెట్టాను. అది ఒక round ఐన hole, exactగా పిరమిడ్ మధ్యలో కట్టబడి ఉంది. దాని చుట్టూ నిర్మించిన పెద్ద పెద్ద గోడలు, ఇంకా square base యొక్క మిగిలిన వస్తువులు ఉన్నాయి చూడండి, ఈ రంధ్రంలో ఖచ్చితంగా ఒక పెద్ద స్థూపాకార లింగం ఉండుండాలి.
ఇది ఒక కట్టుకథ కాదు, ఒకప్పుడు ఇక్కడ ఒక పెద్ద లింగం ఉండేదని Archeologists and Historiansలు కచ్చితంగా చెప్తున్నారు, కానీ ఇది ఎలా రహస్యంగా మాయమైందని ఎవరికీ తెలియదు. ఎవరూ కూడా దీని దగ్గరకు రాకుండా ఉండడానికి కంబోడియా ప్రభుత్వం దీన్ని strictగా నిషేధించారు, కానీ నాకు ఆ పెద్ద రంధ్రాన్ని చాలా దగ్గరకు వెళ్లి చూడాలని ఉంది, కాబట్టి నేను నా జూమ్ లెన్స్ తీసుకొని, ఒక మంచి point కి చేరడానికి పైకి వెళ్ళాను. కొన్ని కోణాల నుండి చూస్తుంటే, ఇది కేవలం కొన్ని అడుగుల లోతుతో ఉన్నట్టుగా అసలు లోతులేని రంధ్రంలా కనిపిస్తుంది.
నేను దానిని వేరే angle నుండి చూడటానికి try చేసినప్పుడు, ఈ గుంత లోతుగా కనబడుతున్నదాన్ని మీరే చూడవచ్చు. నేను హోల్ ను పై వైపు నుండి చూడటానికి ప్రయత్నించినప్పుడు, నేను క్లిక్ చేసిన ఈ ఫోటోలను చూడండి, ఇది కేవలం హోల్ కాదు, రాళ్లను చాలా perfect గా కట్ చేసి చేయబడిన చాలా లోతైన హోల్ అని మనకు స్పష్టంగా కనబడుతుంది, దీని నుండి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఈ హోల్ ఎక్కడి వరకు వెళ్తున్నదని చూడలేము. ఈ హోల్ ఎంత వరకు లోతైనది?
ఈ హోల్ పిరమిడ్ దిగువ వరకు అంటే భూమి అడుగు భాగం వరకు వెళ్లే అవకాశం ఉందా? ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా లాంటి ఈజిప్టు పిరమిడ్లు లోపల విశాలమైన రహస్య గదులను కలిగి ఉన్నాయి. ఈ పిరమిడ్ లోపల కూడా రహస్య గదులు దాగి ఉన్నాయా? మన పురాతన హిందూ దేవాలయాలలో, ప్రజలు ఇప్పటికీ క్రిస్టల్ లింగాలను ఆరాధిస్తారు, వీటిని స్పాటిక లింగాలు అని అంటారు. నేను కొన్ని పెద్ద క్రిస్టల్ లింగామ్‌లను చూశాను, కాని ఖచ్చితంగా 30 అడుగుల పొడవైన అద్దం లాగ transparentగా ఉండే ఒక లింగం చాలా ప్రత్యేకంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రిస్టల్ లింగంగా ఉండుండాలి. originalగా కట్టబడియున్న పురాతన మెట్ల స్థానాన్ని చూడండి: 1000 సంవత్సరాలకు ముందు ఈ పిరమిడ్ పైకి ఎక్కి ఈ పెద్ద లింగాన్ని ఆచరించిన ప్రజలు ఈ అసలైన మెట్లనే ఉపయోగించుంటారు.
- Praveen Mohan Telugu
#Cambodia#HinduisminCambodia#Incredibletechnology#taprahm#praveenmohantelugu#ప్రవీణ్_మోహన్#Spatikalingam#kohkerpyramidincambodia#HaraHaraMahadev#Ancientlingam#tumblr feed#Tumblr tweet#tumbleweed#today video#todaypost#monday post#mondayvideo#MondayMotivation#mondaythoughts
1 note
·
View note
Photo

I was the first one in when Ta Prahm temple opened for guests the other morning. Sitting among the ruins hearing feet shuffle around the tall walls it sounded like they may be coming from a distant past. #cambodia #taprahm #alwaysinairplanemode #flightattendantlife #travel
2 notes
·
View notes