Tumgik
#lordsivacarvings
praveenmohantelugu · 1 year
Video
youtube
ఎన్నో ఏళ్లుగా దాగిఉన్న పరమేశ్వరుని చెక్కడాలు! లక్షల్లో ఒకరికే ఇవి కనిపిస్తుంది!
Hey guys, నేను ఇప్పుడు, తమిళనాడులో కుడుమియన్మలై అనే గ్రామంలో ఉన్న చాలా పురాతనమైన గుడిలో ఉన్నాను, ఈ గుడి వెనుక ఉన్న ఒక కొండలో పురాతన శిల్పాలు ఉన్నాయని కొంతమంది చెప్తున్నారు, ఆ శిల్పాలను గత 1000 సంవత్సరాల వరకు ఎవరూ చూడలేదని నాకు   చెప్తున్నారు. ఈ శిల్పాలను మనం దూరం నుండి చూడవచ్చు, అది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది, అది ఇంచుమించు wrist watch అంటే చేతి గడియారం యొక్క పెద్ద size శిల్పంలా చెక్కినట్లు ఉంది కదా. మధ్యలో ఒక డయల్ ఉంది మరియు దాని రెండు వైపులా strap ఉంది. కానీ ఈ చెక్కడం నిజానికి దేన్నీ చూపిస్తుంది? 
మనం ఈ వివరాలను ఎలా గమనించి పరిశీలించగలం? ఈ ప్రదేశానికి ఇప్పుడు ఎవరూ వెళ్లకూడదని నాకు చెప్తున్నారు, ఎందుకంటే అక్కడ, దారిలో రాళ్ళు పడిపోయాయి ఉన్నాయి కాబట్టి, అది చాలా ప్రమాదమని అంటున్నారు, So, 1000 సంవత్సరాలుగా ఎవరూ ఈ శిల్పాన్ని చూడనేలేదు. So, ఎవరు చూడని, ఈ శిల్పం గురించి, డాక్యుమెంట్ చేయడానికి నేను ఇప్పుడు డ్రోన్‌ని use చేయబోతున్నాను. మనం దీని దగ్గరికి వెళ్లేకొద్దీ ఈ మధ్యలో ఉన్నదీ ఒక డయల్ కాదని, ఇక్కడ ఒక పెద్ద జంతువు ఉందని మనకు అర్థమైంది. ఇక్కడ కొన్ని బొమ్మలు, ఈ జంతువుపై కూర్చున్నట్టు ఉండడం మనం చూడవచ్చు. వాళ్లంతా ఎవరు, వాళ్ళు ఏమి చేస్తున్నారు? 
అక్కడ ఉన్న జంతువు మరేంటో కాదు, అది ఒక నంది, నంది పైన ఇద్దరు వ్యక్తులు కూర్చుని ఉన్నారు కదా.  ఒకరు శివుడు, ఆయనకు 4 చేతులు ఉన్నట్టు చూపించారు, ఆయన పక్కనే, తన భార్య పార్వతి దేవి కూర్చుని ఉండడం మీరు చూడవచ్చు. మీరు, బాగా గమనించి చూస్తే, ఆయన, తన చేతుల్లో, ఏమి పట్టుకున్నాడో, అని కూడా చూడవచ్చు. ఈ నందిని చాలా అందంగా అలంకరించారు, నంది మేడలో చూశారంటే step step గా పూసల దండ కూడా ఉంది చూడండి, ఈ నంది ఎలా గంభీరంగా నిలబడి ఉందో చూడండి, చాలా కోపంగా ఉన్నట్టు ఉంది, దాని నోటి నుండి నాలుక బయటకు వచ్చినదాన్ని కూడా మీరు చూడవచ్చు. కానీ, ఈ నంది పక్కన, ఒక interesting అయిన వ్యక్తి నిలబడి ఉన్నాడు చూడండి. 
ఎవరు ఇతను? అతను తన చేతుల్లో ఏమి పట్టుకున్నాడు? అది దేవుళ్ళ కోసం పట్టుకున్న ఒక పెద్ద గొడుగా? లేక మరేదైనా అయ్యుంటుందా? అతని hairstyle చూసి నేను షాక్ అయ్యాను, అతని జుట్టుని చూసినప్పుడు, ఒక electric pole ద్వారా current shock కొట్టినట్టు ఉంది కదా. ఇంతకీ అతను మనిషేనా లేక మరేదైనానా? కానీ ఈ మనుషులంతా ఎవరు? ఈ రెండు వైపులా, చాలా వింత బొమ్మలు ఉన్నాయి, వాళ్లంతా ఎవరు? మనం, ఇందులోకి వెళ్లేముందు, మీ mindలో already ఒక ముఖ్యమైన ప్రశ్న మెదులుతూ ఉంది కదా. పురాతన నిర్మాణ దారులు, వీటిని, ఇక్కడ ఎందుకు చెక్కారు? ఈ కొండ చుట్టూ చాలా ఖాళీ స్థలం ఉంది, మరియు వాళ్ళు ఇప్పటికే ఈ కింద ఒక పెద్ద గుడినే నిర్మించారు, వీటి గురించి ఒకసారి ఆలోచించండి. 
పురాతన నిర్మాణ దారులు, ఆ గుడి లోపల కూడా వీలైనంత వరకు చెక్కారు, కానీ అప్పటికి వాళ్ళు satisfy కాలేదా? ఎవరు పోలేని ప్రదేశానికి వెళ్లి, దీనిపైనా ఎక్కి ఈ బొమ్మలను ఇక్కడ ఎందుకు చెక్కారు?   ఇప్పుడు కూడా మనం దీని పైన ఎక్కి ఈ ప్రదేశానికి చేరుకోవడం అనేది అంత సులభం కాదు. ఈ ప్రాంతానికి చేరుకోవడానికి సరైన దారి కూడా లేదు. కానీ ఇక్కడ, నా ప్రశ్న ఏంటంటే, దీన్ని గుడి compound నుండి విడిగా ఎందుకు చెక్కారు అది మాత్రమే కాకుండా, ఎవరు పోలేని ఒక విచిత్రమైన ప్రదేశంలో ఎందుకు చెక్కాలి? ఈ చెక్కడం ఇక్కడ ఉందని కొంతమంది స్థానికులకు మాత్రమే తెలుసు, visitorsకు లేదా researchesకు దీని గురించి ఏం తెలీదు. కానీ, ఈ శిల్పం గురించి మీకు తెలిసినా కూడా, మీరు దానిని స్పష్టంగా చూడలేరు. 
మీరు డ్రోన్‌ని తీసుకొని వెళ్తేనే దాన్ని మీరు చూడగలుగుతారు. So, ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, పురాతన నిర్మాణ దారులు ఎవరు పోలేని ఒక ప్రదేశంలో ఇలాంటి ఒకదాన్ని చెక్కాలని ఎందుకు నిర్ణయించుకున్నారు? ఏ Historian లేదా Archeologistలు దీని గురించి detailగా analyse చేయలేదు. ఇప్పటివరకు ఎవరూ చూపించని ఈ శిల్పాలను, మొట్ట మొదటి సారి మన ప్రవీణ్ మోహన్ ఛానెల్‌లో డాక్యుమెంట్ చేసి అందరికి చూపిస్తున్నందుకు చాలా గర్వాంగా భావిస్తున్నాను. ఈ చెక్కడాలు గురించి ఇంటర్నెట్‌లో ఎక్కడా కూడా  మీరు చూడలేరు. ఈ శిల్పాలను ఇక్కడ చెక్కేది ఎలా ఉందంటే, సాయంత్రం సమయంలో, ఒక మంచి dress వేసుకొని, costly అయినా jeweller వేసుకొని, watch, perfume ఇవన్నీ వేసుకొని ready ��య్యారు, కానీ బయటికి ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని meet చేయకుండా ఇంట్లోనే పడుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి చూడండి. 
మనం మంచిగా dress వేసుకుని ready అయ్యామంటే ఇతరులకు మంచిగా కనిపించాలనే కదా? అదేవిధంగానే, ఈ శిల్పాలను కూడా ఇక్కడ చెక్కారు అంటే ఇతరులు చూడాలనే కదా, ఇదే కదా logic, కానీ ఈ ప్రదేశం, ఆ ప్రయోజనాన్ని పూర్తిగా లేకుండా చేసింది. ఎందుకంటే ఎవరు ఇక్కడికి వచ్చి చూడరు కదా, అయితే ఎందుకు వాళ్ళు ఇక్కడ చెక్కారు? ఇక్కడ నిలబడి చెక్కడం అనేది సాధ్యం కూడా కాదని కొంతమంది స్థానికులు నాకు చెప్పినప్పటికీ, నిలబడి ఈ శిల్పాలను చెక్కడానికి ఇక్కడ తగినంత స్థలం ఉందని నేను అనుకుంటున్నాను, అక్కడ వెళ్లి కూర్చొని ఈ శిల్పాలను చూడాలనే నేను అనుకున్నాను, కానీ అది కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఈ place అంత convenient గా లేదు. పురాతన హిందూమత ప్రకారం, సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎప్పుడు కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది, పురాతన నిర్మాణ దారులు ఎప్పుడూ easyగా చేరుకోలేని ప్రదేశాలలోనే , చాలా కష్టమైన  శిల్పాలను మరియు చాలా ముఖ్యమైన శిల్పాలను చెక్కుతారు.
- Praveen Mohan Telugu
1 note · View note