#ancinet lingam
Explore tagged Tumblr posts
Video
youtube
ఆసియా అంతటా సనాతన జాడలు!! వెలికితీయబడిన లక్షలాది శివ లింగాలు!!
Hey guys, మన భారతదేశంలో అనేక లింగాలను మరియు ఇతర పురాతన విగ్రహాలను ఎలా వెలికి తీశారో అని నా ముందు వీడియోలో నేను మీకు చూపించాను. అయితే ఈ వీడియోలో, మన భారతదేశం వెలుపల వెళ్లి, హిందూ మతానికి సంబంధించిన వాటిని archaeologistsలు ఏదైనా కనిపెట్టారా అని చూడబోతున్నాము. ఈ అద్భుతమైన పింక్ కలర్ లో ఉన్న ఒక పెద్ద లింగం కనుగొనబడింది, ఇది భారతదేశంలో లేదు, ఈ లింగాన్ని Vietnam దేశంలో కనిపెట్టారు. వియట్నం భారతదేశానికి వేల మైళ్ల దూరంలో ఉంది, అయితే ఇది లింగమే అని చెప్పడంలో సందేహమే లేదు, మధ్యలో సిలిండర్ మరియు యోని అని పిలువబడే బేస్ కూడా ఉంది. దీన్ని కనిపెట్టి రెండు సంవత్సరాళ్ళైతుంది. ఇది కనీసం 1100 సంవత్సరాల నాటిదని Archaeologistsలు చెప్తున్నారు, ఇది ఒక దృఢమైన రాతితో తయారు చేయబడిన ఏకశిలా లింగం.
ఇది చూడడానికి చాలా అద్భుత��గా కనిపిస్తుంది కదా, ఇది చాలా స్మూత్‌గా, చాలా అందంగా ఉంది, ��ీన్ని చూస్తుంటే అక్కడికి వెళ్లి తాకాలనిపిస్తుంది కదా. ఇక్కడ ఇది భూమి కింద ఖననం చేయబడిందని మీరు స్పష్టంగా చూడవచ్చు ఇంకా archaeologistsలు ప్రతిదాన్ని చాలా పద్ధతిగా తవ్వకం ఎలా చేస్తారో అని కూడా మీరు చూడవచ్చు. మరి మీకు ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు, భారతదేశానికి చాలా దూరంగా ఉన్న వియట్నంలో ఈ హిందూ కళాఖండాన్ని భూగర్భంలో ఎందుకు పాతిపెట్టారు? ఎందుకో అని నేను మీకు చెప్తాను, కానీ అంతకంటే ముందు, వియట్నంలో వెలికితీసిన మరొక వింత లింగాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. ఇది కొన్ని సంవత్సరాలకు ముందు, ఈ లింగాన్ని మరొక ప్రదేశంలో తవ్వి బయటికి తీశారు. ఇదిగో, ఈ లింగం యొక్క colour ని చూడండి, ఇది చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. మనం ఇంతకు ముందు చూసిన pink colour లింగం కంటే ఈ లింగం చాలా పాతది, అంటే ఇది దాదాపు 4వ శతాబ్దానికి చెందినదని archaeologistsలు అంటున్నారు.
అంటే 1700 ఏళ్ల నాటిది కావచ్చు, ఈ సిలిండర్ ని చూడండి, ఇది ఎలాంటి రాయి, పురాతన కాలంలో ఇంత పాలిష్ ఎలా సాధించారు? అసలు ఇది ఎలా సాధ్యమైంది? సిలిండర్ ని వేరొక రకమైన రాయితో తయారు చేశారు, కానీ పీఠాన్ని ఎర్రటి రాయితో తయారు చేశారు, ఒకవేళ తెల్లటి ఇసుకరాయి బ్లాక్‌లను దానికి కింద పేర్చి ఉండవచ్చు, ఆపై వాటి చుట్టూ ఇటుకలను అమర్చి పెట్టుండొచ్చు. కాబట్టి 1700 సంవత్సరాలకు ముందు చాలా సంక్లిష్టమైన మరియు ఖచ్చితమైన ఇంజనీరింగ్ టెక్నిక్ ని ఉపయోగించారు. అయితే ఇక్కడ కనిపించే విగ్రహం ఇది ఒక్కటి మాత్రమే కాదు, వాటిలో వినాయకుని విగ్రహాలు కూడా దొరికాయి, outlineని నుండి చూడండి, మీరు దాని తల మరియు చెవులను చూడవచ్చు. ఇంకా ఇదే ప్రదేశంలో అనేక ఇతర లింగాలు దొరికాయి.
ఇక్కడ క్రిస్టల్ క్వార్ట్జ్‌తో తయారు చేసిన లింగాన్ని కనుగొన్నట్లు Archaeologistsలు తెలిపారు, దాదాపు అవి 3.5 టన్నుల బరువు ఉంటుంది. 3.5 టన్నులు అంటే 3000 కిలోగ్రాములు కంటే ఎక్కువగా ఉంటుంది. వియట్నం దేశంలో మొత్తం దొరికిన అతి పెద్ద విలువైన రత్నం ఇదే అని వియట్నం ప్రభుత్వం ప్రకటించింది. మరియు కంబోడియా దేశంలో కో కెర్ అనే ప్రదేశంలో ఒక పెద్ద స్ఫటిక లింగం గురించి నేను చెప్పిన సమాచారం మీకు గుర్తు ఉందని అనుకుంటున్నాను. కానీ కో కెర్ యొక్క అసలు పేరు లింగపురం, దీని అర్థం లింగాల నగరం అనేది నిజమైన అర్ధం. కంబోడియాలో ఉన్న ఆ ప్రాంతంలో, ప్రతిచోటా శిథిలమైన లింగాలు కనిపిస్తాయి. నేలపై ధ్వంసమైన లింగాలు మనకు కనిపిస్తాయి. కానీ అక్కడ వందలాది శిథిలమైన లింగాలు చాలా గోరమైన స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఈ లింగాన్ని చూడండి, ఇది ఒక శిథిలమైన ఆలయం లోపల ఉంది. లింగం క��ంద ఉన్న సగాన్ని ఎవరో కావాలనే కత్తిరించి, ఒక గట్టిగా ఉండే గొడ్డలితో పదే పదే కొట్టి పగలగొట్టారు, అలా కాదంటే ఇది ఇప్పుడు ఈ స్థితిలో ఉండదు. ఈ లింగం నేటికీ ఇలా నిలబడి ఉండడమే ఒక అద్భుతం.
కంబోడియాలో ఇలాంటి వెయ్యేళ్ల నాటి పురాతన లింగాలు, విలువైన పురాతన కళాఖండాలు పూర్తిగా శిథిలావస్థలో పడి ఉన్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం పూర్తిగా రాళ్లతో అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఎవరూ కూడా ఈ లింగాన్ని చేరుకోలేకపోతున్నారు. ఇప్పుడు, ఈ ప్రాంతంలో భూమట్టానికి పైన ఉన్న లింగాలు మాత్రమే కాకుండా, చాలా లింగాలు భూగర్భం లోపల కూడా పాతిపెట్టబడ్డాయి. నేను మీకు కంబోడియాలో ఉన్న పెద్ద పెద్ద లింగాలు ఆల్రెడీ చూపించాను, కానీ ఇప్పుడు రీసెంట్ గా కనిపెట్టిన లింగాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. దీన్ని చూడండి, ఇది recentగా అడవుల్లో కనుగొనబడింది మరియు ఇది సుమారు వెయ్యి సంవత్సరాల నాటిది. ఇది ఏంటిది? ఇది చూడడానికి యోని అంటే లింగం యొక్క పీఠంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పవచ్చు.
దానిపై అంత మంది నిలబడి ఉన్నారో అంటే, అప్పుడు ఈ లింగం యొక్క size ఎంత పెద్దగా ఉంటుందో అని అర్థం చేసుకోండి. నిజానికి ఈ square షేప్ లో ఉన్న ఈ రంధ్రం లోపల ఒక పెద్ద సిలిండర్ ని పెట్టుంటారు. ఆ లింగం నేల మట్టం నుండి దాదాపు 20 అడుగుల ఎత్తులో ఉంటుంది. తరువాతి నాగరికతల నుండి వచ్చిన వాళ్ళు లింగాలను ఎప్పుడూ నాశనం చేసారని నేను మీకు పదేపదే చూపించాను. ఈ లింగాన్ని కూడా కావాలనే ధ్వంసం చేసేసారు. కంబోడియాలో ప్రతి నెలా కనీసం ఒక కొత్త లింగాన్ని వెలికి తీస్తున్నారు, ఈ లింగం గత సంవత్సరంలో వెలికి తీయబడింది. కంబోడియన్లు అనేక హిందూ కళాఖండాలను కూడా వెలికితీస్తూనే ఉన్నారు, ఇది తాబేలు, దీనిని సంస్కృతంలో కుర్మ అని పిలుస్తారు, మట్టిలో పాతిపెట్టబడిన దీన్ని రెండు సంవత్సరాల క్రితం కనిపెట్టారు.
- Praveen Mohan Telugu
#Ancient India#ancinet lingam#asia continent#lord shiva#ancinet ruins#Hinduism#hindu artifacts#vietnam#archeologists#మననిజమైనచరిత్ర#హిం���ుత్వం#ప్రవీణ్_మోహన్
1 note
·
View note