#THRILLERmovieactressapsararani
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
ఈ థ్రిల్లర్ 'అప్సరస'... మ్యాటర్ చాలా ఉంది..!
Tumblr media
లాక్ డౌన్ లోనూ వరుసగా సినిమాలు అనౌన్స్ చేస్తూ.. ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేస్తున్నాడు రాంగోపాల్ వర్మ. అయితే.. ఇటీవలే నగ్నం... అనే సినిమా ద్వారా ఓ బ్యూటీని బోల్డ్ గా పరిచయం చేశాడు. ఆ తర్వాత.. మరో బ్యూటీని ట్విట్టర్ లో పరిచయం చేశాడు వర్మ. అప్సరరాణిగా ఓ హాట్ బ్యూటీని ఇంట్రడ్యూస్ చేశారు. బోల్డ్ గా ఉన్న ఫొటోలతో  అప్సరరాణిని పరిచయం చేశాడు. అయితే.. ఇంత హాట్ బ్యూటీని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడని నెటిజన్లు వెతకడం మొదలుపెట్టారు. నెట్టింట్లో గాలిస్తే అసలు విషయం బయటపడింది. ఈ అప్సరసలాంటి అప్సర ఎవరో కాదు.. ఆల్రెడీ తెలుగులో సినిమాలు చేసిన బ్యూటీనే అనే విషయం బయటపడింది. ఈ నిషా కళ్ల పాప అసలు పేరు అంకెతా మహారాణా. పుట్టింది ఒరిస్సా. ప్రస్తుతం ఉంటున్నది హైదరాబాదే. అయితే.. ఈ బ్యూటీలో గతంలో తెలుగుతో పాటు ఒడియాలో రె��డు మూడు సినిమాలు చేసింది. తెలుగులో 4 లెటర్స్, ఉల్లాల ఉల్లాల సినిమాల్లో ఈ బ్యూటీ లీడ్ రోల్స్ లో కనిపించింది.   అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో.. ఈ బ్యూటీని ఎవరూ గుర్తు పట్టలేదు. అయితే.. ఉల్లాల ఉల్లాల మూవీ పోస్టర్ చూస్తే మాత్రం ఈ హాట్ బ్యూటీని ఇట్టే గుర్తు పట్టేయచ్చు. వైట్ అండ్ రెడ్ డ్రెస్ లో ఓ గుర్రానికి గులాబీ పువ్వు ఇస్తున్న పోస్టర్ ని కుర్రకారు ఎప్పటికీ మరిచిపోరు. కానీ.. ఈ పాపే.. ఆ పాప.. అని గుర్తుపట్టలేకపోయారు. ఉల్లాల ఉల్లాల మూవీ ఆడియో ఫంక్షన్ కు రాంగోపాల్ వర్మ కూడా హాజరయ్యాడు. అక్కడే ఈ సెక్సీ బ్యూటీ మీద కన్నేశాడట వర్మ. అక్కడే అంకెతా మహారాణాను చూసిన వర్మ... ఆమెతో ఓ మూవీ చేయాలని ఫిక్సయ్యాడట. ఆమెకు నటనలో మరిన్ని మెలకువలు నేర్పించి ఇప్పుడు అప్సరగా ప్రపంచానికి పరిచయం చేశాడు. Read the full article
0 notes