#Osmania University convocation day
Explore tagged Tumblr posts
Text
కరోనా వ్యాక్సిన్ తయారీ ఉస్మానియా యూనివర్సిటీ శాస్త్రవేత్తల ఘనతే!: ఓయూ ఛాన్సలర్, గవర్నర్ తమిళ సై డా.సౌందర్య రాజన్
1. యాంటీ డ్రోన్ టెక్నాలజీలో భారత్ నంబర్ వన్!: డా.సతీష్ రెడ్డి, డీఆర్డీవో చైర్మన్
2. ఉస్మానియా విశ్వవిద్యాలయం 81వ స్నాతకోత్సవ సెలెబ్రేషన్స్
హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం 81వ స్నాతకోత్సవం క్యాంపస్ లోని ఠాగూర్ ఆడిటోరియంలో ఇవాళ ఘనంగా జరిగింది. ఈ ఉత్సవానికి ముఖ్య అతిథిగా యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ తమిళ సై డా. సౌందర్య రాజన్, గెస్ట్ గా DRDO చైర్మన్, డిఫెన్స్ డిపార్ట్మెంట్ సెక్రెటరీ (R&D), శాత్రవేత్త డా. సతీష్ రెడ్డి హాజరై విద్యార్థుల కు గోల్డ్ మెడల్స్ అందజేశారు. 2018-19 ఏడాదికి గాను మొత్తం 70 గోల్డ్ మెడల్స్ లలో ప్రతిభ కనబర్చిన 58 విద్యార్థినులకు, 12విద్యార్థులకు గవర్నర్ తమిళ సై అందజేశారు. 2018 అకాడమిక్ ఇయర్ కిగాను కెమిస్ట్రీ లో ఎస్ సుశాంత్ 5 గోల్డ్ మెడల్స్, 2019-20 లో మహేష్కర్ శుభం 4 గోల్డ్ మెడల్స్, ఫోజియా ఉన్నిశా 3 అదే సబ్జెక్ట్ లో మెడల్స్ సాధించారు.
ఈ సందర్భంలో ఓయూ స్నాతకోపన్యాసం చేసిన డా. సతీష్ రెడ్డి డిఫెన్స్, డ్రోన్స్, రాకెట్స్, మిసైల్స్, ఎయిర్ ఫోర్స్, నావీ టెక్నాలజీలలో పురోగతి, కొంతవరకు స్వాలంబన సాధించామన్నారు. ఇదంతా యూనివర్సిటీలలో చదువుకుని శాస్త్రవేత్తలైన విద్యార్థులవల్లేనన్నారు.
గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ మాట్లాడుతూ..విద్య కు డా. అంబెడ్కర్, సర్వేపల్లి రాధాకృష్ణన్ ,రవీంద్ర నాథ్ టాగోర్, అబ్దుల్ కలాంల కృషి మారువలేనిదన్నారు. ఇవాళ ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా లాంటి వ్యాధులకు వ్యాక్సిన్ మన ఓయూలో చదువుకున్న శాస్త్రవేత్తలే అని తెలిపారు. గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థి, విద్యార్థులను అభినందించారు. గోల్డ్ మెడల్ రాకపోయినా బాధపడకూడదని, డిగ్రీ పట్టా కోసం రాత్రులు కష్టపడి చదివిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆడిటోరియంలో వైట్ అండ్ వైట్ డ్రెస్ కోడ్ ను, స్నాతకోత్సవం ఏర్పాట్లను మెచ్చుకున్నారు.
#Osmania University convocation day#Governer Tamil Sai Smt Soundarya Rajan#OU Chancelor#OU Vice Chancelor#deans#heads#students#teachers#drdo new delhi#hyderabad
0 notes