#OnlineTransactions Banking CashTransactions UPI
Explore tagged Tumblr posts
Photo
క్షణాల్లో నగదు బదిలీ!
నగదు రహిత సేవల్ని విస్తృతం చేసేందుకు భారత ప్రభుత్వ పర్యవేక్షణలో వివిధ బ్యాంకులు యూనిఫైడ్ ఇంటర్ఫేస్ పేమెంట్ సేవల్ని ఆవిష్కరించాయి. అన్ని బ్యాంకుల యూపీఐ సేవల్నీ అనుసంధానం చేస్తూ ‘భీం’యాప్ వచ్చింది. ఇప్పుడు వినియోగదారులకూ, వ్యాపారులకూ మధ్య ఎటువంటి అవాంతరాలకూ అవకాశం లేని సరికొత్త నగదు రహిత సేవ అందుబాటులోకి వచ్చింది. అదే ‘భారత్ క్యూఆర్ కోడ్’ మరి దీని వివరాలేమిటో తెలుసుకుందామా! టీ దుకాణంలో చేసే రూ.10 చెల్లింపు నుంచీ షాపింగ్ మాల్‌లలో చేసే రూ.10వేల బిల్లు చెల్లింపు వరకూ ఇప్పుడందరూ నగదు రహిత చెల్లింపు విధానానికి అలవాటయ్యారు. అయితే, దీనికోసం డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ఎప్పుడూ మనతో ఉంచుకోవాలి. ఒక్కో కార్డుకు ఒక్కో పాస్‌వర్డ్‌ను పెట్టుకోవడం కష్టంగానే ఉంటుంది. మీ ఖాతా వివరాలు బహిర్గతం చేయకుండా, అన్ని ఖాతాలూ లేదా కార్డులకు కలిపి ఒకే తక్షణ నగదు బదిలీ సౌకర్యం ఉంటే బావుండనిపిస్తోందా? మీరు చిన్న వ్యాపారులైతే, పాస్ (పాయింట్ ఆఫ్ సేల్) యంత్రం అద్దె తదితరాలను భరించడానికి ఇబ్బందిగా ఉందా? ఈ సమస్యలన్నింటికీ పరిష్కారాన్ని చూపుతూ, ఇటు వినియోగదారులకీ అటు వ్యాపారులకీ అత్యంత సులభంగా నగదు రహిత లావాదేవీల నిర్వహణ అందుబాటులోకి వచ్చిన తక్షణ చెల్లింపుల సేవా సౌకర్యమే భారత్ క్యూఆర్ కోడ్. ఇక మీదట కార్డులు తీసుకెళ్లడం మర్చిపోయినా ఇబ్బంది లేదు. ఒక్కో కార్డుకు ఒక్కో పాస్‌వర్డ్ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాస్ యంత్రాలతో పనిలేదు. కేవలం మీ మొబైల్ ఫోనులో ఉన్న మీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా లేదా భీం యాప్ ద్వారా భారత్ క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు.
ప్రపంచంలోనే తొలిసారిగా భారత ప్రభుత్వం చొరవతో, ఆర్‌బీఐ, నేతృత్వంలో, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ అమలులోకి తెచ్చిన ఈ విధానం ద్వారా, భారత దేశంలో లావాదేవీలు జరుపుతోన్న ప్రధాన గేట్‌వేలు రూప��, వీసా, మాస్టర్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లకు ఒక ఉమ్మడి క్యూఆర్ కోడ్‌ను అభివృద్ధి చేసి, చెల్లింపుల వ్యవస్థలను సరళీకృతం అయ్యేలా చేశారు. మీకు రూపే కార్డుకు అనుసంధానమైన ఖాతా ఉన్నా.. వీసా కార్డు వాడుతున్నా, మీరు చెల్లింపు చేయాలనుకున్న వ్యాపారి మాస్టర్ కార్డు వాడుతున్నా ఇబ్బంది లేదు. మీరు స్టేట్ బ్యాంక్ ఖాతాదారుడైనా, మీరు చెల్లింపు చేయాల్సిన వ్యాపారికి ఆంధ్రాబ్యాంకులో ఖాతా ఉన్నా చిక్కులేమీ ఉండవు. మీ మొబైల్‌లోని భారత్ క్యూఆర్ కోడ్ సహాయంతో, మీ వ్యక్తిగత వివరాలు బహిర్గతం చేయనవసరం లేకుండా, క్షణాల్లో చెల్లింపు చేయవచ్చు.
0 notes