#AncinetSite
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 3 years ago
Video
youtube
జైనులు ఇక్కడికి రావడానికి అవసరం ఏంటి? వీళ్లు ఇక్కడ ఏం చేస్తున్నారు?
Hey guys, ఈ రోజు మనం Indiaలోని కలుగుమలై అనే ఈ కొండను చూద్దాం రండి. ఈ కొండ పైన, చాలా అందమైన శిల్పాలు, రాళ్లతో చేసిన bed ఇంకా ఒక విచిత్రమైన గుహ ఉంది. చాలా మంది ఈ కొండ దెగ్గరకు రారు, ఎందుకంటే ఇక్కడ పొద ఇంకా  ముళ్ళుతో ఉన్న తుమ్మ  చెట్లు ఉన్నాయి. మీరు వాటి గుండా వెళ్తే, మీరు చాలా పురాతనమైన నూట యాభై(150)  శిల్పాలను చూడవచ్చు. ఇవన్నీ చాల పాత శిల్పాలు ఇవి కనీసం 1200 సంవత్సరాల పాతబడినవి. ఈ శిల్పాలు చాలా అద్భుతమైనవి, దాదాపు 1200 సంవత్సరాల తరువాత కూడా పూర్తిగా చెక్కుచెదరకుండా ఉండటాన్ని మీరు చూడవచ్చు. ఈ శిల్పాలు జైన మతానికి చెందినవి. 
జైన మతం చాలా పురాతన మతం, ఇంకా ఈ మతంలో చాలా advanced ఐన spiritual  అంటే  ఆధ్యాత్మిక విషయాలు  ఉన్నాయి. ఇది ఒకప్పుడు Indiaలో చాలా పేరు పొందిన మతం. కానీ ఈ రోజు India లో జైన మతానికి చెందివ వాళ్ళు  కేవలం 0.4% ఎహ్ ఉన్నారు. జైన మతం spiritual  అంటే  ఆధ్యాత్మిక జ్��ానోదయం సాధించడాన్ని నమ్ముతుంది, మీరు ఇక్కడ చూసే ఈ సాధువులందరూ జ్ఞానోదయం పొందిన వారు. ఇంకా ఇది relief  type అనే ఒక విధమైన architecture. ఈ techniquesతో చూస్తే ,  శిల్పాలు దాని background తో attach ఐ ఉంటుంది. మీరు చూస్తున్నదంతా granite ఎహ్, ఇది చాలా hardఐన material అందుకనే ఇవన్నీ నాశనం అవ్వకుండా ధ్వంసం కాకుండా ఉంది. కానీ ఈ చిత్రాలు బాగా చెక్కుచెదరకుండా ఉండడానికి  ఇంకొక reason ఉంది - అది ఏంటంటే  ఈ శిల్పాలకు పైన ఉన్న rectangular slotని చూసారా? ఆ కాలంలో  ఈ శిల్పాలను cover  చేసే ఈ slotsలో చెక్క తలుపులను use  చేసిఉంటారు.
ఈ శిల్పాలను వర్షం ఇంకా ఎండ  నుండి కాపాడడానికి ఇది ఒక మంచి  మార్గం. ఇక్కడ మీరు చాలా అద్భుతమైన శిల్పాలను చూడొచ్చు, ఇక్కడ మీరు పూర్తిగా straightగ నిలబడిన  పార్శ్వనాధుడు (paarshvanadhudu) అనే ఈ జైన దేవుడిని చూడవచ్చు. ఆయన వెనుక నిలబడి ఆయన్ని కాపాడే నాగ దేవుడుని మీరు చూడండి. ఇది అంబికా  అని  పిలువబడే  దేవత. నాగ దేవుడు ఇంకా  ఈ  దేవత హిందూ మతంలో కూడా ఉన్నారు , so  ఈ రెండు మతాలు ఒక common విషయాన్ని share  చేస్తున్నాయి. నిజానికి, Vettuvan Koil అని పిలువబడే ఈ అద్భుతమైన హిందూ గుడిని చూడండి,  ఇది అదే కొండలో ఉంది,   ఇంకా ఇది ఈ Jain గుడికి చాలా దగ్గరగా ఉంది. ఈ గుడిని చెక్కడానికి  కొండలో ఉన్న రాళ్ళను పై నుంచి కింది  వరకు చెక్కి దీన్ని తాయారు చేసారు. ఇదే technologyని use  చేసే  Ellora గుహలలో ఉండే కైలాస గుడిని కట్టారు. 
 ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ చూస్తున్న విదంగానే కైలాస గుడికి దగ్గరగా ఉన్న Ellora గుహలలో కూడా, Jain గుళ్ళు ఉన్నాయి. ఇది coincidence ఆహ్ లేదా Jains కి  ఇలాంటి architectureకి ఏమైనా సంభంధం ఉందా? జైన మత historyని research చేసి చూస్తే ఈ structures  గురించి మనం  ఇంకా clearగ అర్ధం చేస్కోవచ్చు. కలుగుమలై లోని జైన శిల్పాలకు ఒక  specialty ఉంది. చాలా శిల్పాల కింది, మనం కొన్ని రాతలను చూడవచ్చు. ఇది చాలా గొప్ప  విషయం, ఎందుకంటే మనం ఇప్పుడు ఇది ఏంటని guess  చెయ్యాల్సిన అవసరం లేదు ఈ రాతలే  శిల్పాల గురించిన information ఇస్తుంది, ఇంకా ఇక్కడ జీవించిన ప్రజల  lifestyle ని కూడా చూపిస్తుంది. ఇది పాత తమిళ భాషలో వ్రాయబడింది, ఇది ఇప్పటికీ ఈ placeలో   మాట్లాడే భాషే. 
ఈ placeలో  సుమారు 8000 మంది జైనులు  భ్రతికారని, స్త్రీలు  పురుషుల కంటే ఎక్కువ కాకపోయినా సమానమైన హక్కులు  పొందారని  శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ ఇంకొక  popular ఐన జైన మతానికి చెందిన ఒక   వ్యక్తి ఉన్నాడు, ఈయన పేరు బాహుబలి , ఈయన చాలా రోజులుగా చాల నెలలుగా ��క long  meditationలోఉన్నారు, చెట్లు, తీగలు అన్ని ఆయన శరీరా��ికి fullగ పెరిగాయి.  జైన మతం జ్ఞానోదయం పొందడానికి లోతైన ధ్యానాన్ని చెయ్యాలని చెప్తుంది. కొండ పైన నడుస్తున్నప్పుడు, నేను ఇంకా చాలా areasని చూసాను , అక్కడ ఇంకా చాలా జైన దేవతల శిల్పాలు ఉన్నాయి, ఈ place మొత్తం ఒంటరిగా చాలా ప్రశాంతంగా ఉంది.   దీనిని జైన సన్యాసులు ధ్యానం కోసం ఈ placeని  correctగ choose  చేసి ఉండొచ్చు. So సన్యాసులు ఎక్కడ నిద్ర పోతారు? జైనులు పడుకునే  beds అంటే  jain beds అని  పిలువబడే స్థలానికి వెళ్దాం. జైన సన్యాసులు  సాధారణమైన  రాళ్లతో చేసిన beds పైన పడుకుంటారు.  
startingలో ఈ beds చుట్టూ  పైకప్పు  గాని  గోడలు  గాని లేవు, కానీ ప్రజలు ఈ placeనిఅంత నాశనం చేస్తున్నారని అందుకే  దీని చుట్టూ  గోడలను కట్టారు  ఇంకా దానిని fullగ lock  చేసే ఉంచారు. ఈ గోడలన్నీ మనుషులను  రాకుండా చేసిన కూడా గబ్బిలాలకు చాలా safe ఐన placeగ మారింది. So ఇప్పుడు మనం సన్యాసుల యొక్క bed  ఇంకా వాళ గుడి గురించి  అన్ని చూసాం,  కాని ఈ రెండిటి కంటే చాలా అద్భుతమైన విషయం ఇంకొకటి ఉంది. అది ఏంటంటే ఇక్కడ  ఉండే ఈ గుహ జైనమతం యొక్క గురువు ఐన మహావీరుడు, ఆయన ధ్యానం చెయ్యడానికి ఈ గుహని use  చేసారంట, మహావీరుడే జైనమతంలో చివరిగా జ్ఞానాన్ని పొందిన గురువు. ఈ గుహలో మహావీరుడు ధ్యానం చేశాడని   కొంత మంది జైనులు నమ్ముతున్నారు,  అందుకే  ఈ కొండ పైన జైన గుడిని కట్టారని  చెప్తున్నారు. కానీ ఈ రోజు ఈ మొత్తం గుహని ఎవ్వరు వచ్చి చూడట్లేదు , ఇప్పుడు ఇక్కడ నేను ఈ కోతి మాత్రమే ఈ పుణ్యమైన place  యొక్క vibrationsని feel అవుతున్నాము.
- Praveen Mohan Telugu
1 note · View note