#నరేష్చల్లకోటి
Explore tagged Tumblr posts
batukamma · 4 years ago
Text
"పవర్ స్టార్" మూవీలో హీరో క్యారెక్టర్ చేసింది ఇతనే..!
Tumblr media
పవర్ స్టార్ పేరుతో రాంగోపాల్ వర్మ ఓ సినిమా తీశాడు. రాజకీయ నాయకుడిగా మారిన ఓ సినీనటుడి స్టోరీ అంటూ..  వరుసగా ఫొటోలు ట్వీట్ చేస్తున్నాడు వర్మ. సినిమాలోని “గడ్డి తింటావా... తౌడు తింటావా..” అనే పాటను కూడా రిలీజ్ చేశారు. పవర్ స్టార్ తో పాటు.. నాగార్జునకు వేశాడు వర్మ..! అయోధ్యలో భవ్య రామమందిర ఎత్తు ఎంతో తెలుసా..? స్కూళ్ల రీ ఓపెనింగ్ పై కేంద్రం కీలక ఆదేశాలు అయితే.. ఈ సినిమాలో పవర్ స్టార్ క్యారెక్టర్ చేసింది ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అచ్చుగుద్దిగా పవన్ కల్యాణ్ లాగే ఉన్న ఈ వ్యక్తి రాంగోపాల్ వర్మ ఎక్కడ పట్టుకొచ్చాడనే చర్చ జరుగుతోంది. రూపం, హైట్ మాత్రమే కాదు.. బాడీ లాంగ్వేజ్ కూడా ఏ మాత్రం పవర్ స్టార్ కు తీసిపోని విధంగా ఉంది. ఈ పవర్ స్టార్ హీరో కోసం రాంగోపాల్ వర్మ ఎక్కడెక్కడో తిరగలేదు. తెలంగాణలోనే ఈ పవర్ స్టార్ దొరికాడు. ఇతని ఒరిజినల్ నేమ్ నరేష్ చల్లకోటి. టిక్ టాక్ స్టార్. పుట్టింది భద్రాచలం. పవన్ కల్యాణ్ ఫ్యాన్ గా చెప్పుకునే ఇతడు టిక్ టాక్ లో ఆయన పాటలు, డైలాగులకు యాక్టింగ్ చేస్తూ వీడియోలు పెట్టేవాడు. అవి చూసిన వర్మ.. ఇతన్నే తన మూవీలో హీరోగా పెట్టుకున్నాడు. యాక్టింగ్ కూడా పర్ ఫెక్ట్ గా సెట్ అవడంతో నరేష్ చల్లకోటి.. ఇప్పుడు పవర్ స్టార్ అయ్యాడు. అయితే.. పవర్ స్టార్ అభిమానిగా చెప్పుకునే నరేషన్ చల్లకోటి.. ఇలాంటి కాంట్రవర్సియల్ మూవీలో ఎందుకు యాక్ట్ చేస్తున్నానేది ఆసక్తి కలిగిస్తోంది. Read the full article
0 notes