#vmhome
Explore tagged Tumblr posts
telanganajournalist · 2 years ago
Text
అనాథ విద్యార్థుల సంస్థ #వీఎంహోం సరూర్ నగర్ జోలికి వస్తే ఎవరైనా సరే ఖబర్ధార్!
"A sweet warning to Who wants to touch the VMHOME Orphan's institution's Lands and Properties!" below, and join me in supporting this campaign by signing the petition!
0 notes
violamilano · 8 years ago
Photo
Tumblr media
Viola Milano Home - Luxury cushions made by hand with exclusive flannel fabrics from @foxbrothers1772 Shop your favorite cushions online at www.violamilano.com #violamilano #handmade #luxury #sartorial #foxflannel #style #interior #pillows #cushions #vmhome
11 notes · View notes
telanganajournalist · 2 years ago
Text
It's a great day for V M Home Old Students in history!
వీరి ఆనందానికి అవధులు లేవు!!
Tumblr media
25 ఏళ్ల క్రితం మేము చదివిన స్కూల్లో.. మా పిల్లలు
వీఎంహోంలో గురువులు, విద్యార్థులు, పూర్వ విద్యార్థుల కుటుంబ సభ్యుల సంబరం అంబరాన్ని అంటింది
Tumblr media
వీఎంహోం(విక్టోరియా మెమోరియల్ హోం) పాఠశాలలో గత నాలుగు దశాబ్దాలుగా ఏ SSC బ్యాచ్ జరుపుకోని విధంగా 1996-97 బ్యాచ్ కుటుంబ సభ్యులతో సహా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం. ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మాకు చదువు చెప్పిన గురువులను, మా హాస్టల్ వార్డెన్నీ.. వారి వయసు 90 దాటింది పూల మాలలు, శాలువలతో గౌరవించుకోవడం జరిగింది. 25 ఏళ్ల తర్వాత వారిని పిలిచి గౌరవించినందుకు వారి ఆనందానికి అవధులు లేవు. ఇదొక అపూర్వమైన, చారిత్రక ఘట్టంలా ఉందన్నారు గురువులు.
Tumblr media
ఇక మా విషయానికి వస్తే ఒక్కొరిది ఒక్కో స్టోరీ అవుతుంది. వివిధ జిల్లాల నుంచి 90's లో వచ్చి .. మా పదవతరగతి జట్టులో ఒక CRPF జవాన్, ఒక ఆర్మీ, మరొకరు పోలీస్, ఇంకొకరు జూనియర్ అసిస్టెంట్, ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాద్యాయులు, ఒక అకౌంన్టెంట్, ఇద్దరు జర్నలిస్టులు, ముగ్గురు కంప్యూటర్ ఇంజనీర్లు ఇలా ఎవరికి తోచిన జాబ్స్ వారు బిజీబిజీగా చేసుకుంటూ ఉండగా...అందరం అనుకొని రెండ్రోజలు ముందు నుంచే ప్రిపేర్ అయి మేము చదివిన పాఠశాలలో ఇప్పడు చదువుతున్న వీఎంహోం విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అరెంజ్ చేయడం జరిగింది. వారితో కలిసి భోజనం చేయడం జరిగింది.
Tumblr media Tumblr media Tumblr media
సాయంత్రం సహారా హౌసింగ్ సొసైటీ గార్డెన్ లో కుటుంబ సభ్యులు, పిల్లలు, వీల్ చైర్, బంతి ఆట మున్నగు ఆటలు, పాటలు, నృత్యాలు చేశారు.
Tumblr media
0 notes
telanganajournalist · 2 years ago
Text
V.M. Home 1996-97 SSC Batch Get Together!
వీఎంహోంలో 1996-97 విద్యార్థుల‌ తీపి జ్జ్ఞాప‌కాలు..!
Tumblr media Tumblr media
అదొక న‌వాబు రాజుల కాలం నాటి కోట భ‌వంతి అందులో మా హైస్కూల్ విద్య విక్టోరియా మెమోరియ‌ల్ రెసిడెన్షియ‌ల్ స్కూల్ స‌రూర్ న‌గ‌ర్ లో ఉంది. ఎక్క‌డో పాల‌మూరు జిల్లా(నేటి ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా) నుంచి వ‌చ్చి ఇందులో ప‌డేశారు సోష‌ల్ వెల్ఫేర్ అధికారులు. అంద‌రూ త‌ల్లిదండ్రులు లేని, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు, ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన పేద‌లు, అనాథ విద్యార్థులే. 1990 అంత‌కు ముందు నుంచి కూడా ఈ పాఠ‌శాల ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో న‌డుస్తుండేది. నేను అన‌గా వెంక‌టేశ్వ‌ర్లు బోయ జోగుళాంబ జిల్లా నుంచి వ‌చ్చి 1994లో విఎంహోంలో 8వ త‌ర‌గ‌తిలో జాయిన్ అయ్యాను. అప్ప‌టి మా హౌస్ మాస్ట‌ర్ మాజీ సైనికాధికారిని చూస్తే మాకు లాగు త‌డిసేది. అంత స్ట్రిట్ గా ఉండేవారు. పెద్ద ప‌ద్ద రూమ్ లు క‌లిగిన విక్టోరియా భ‌వనంలో ఉండాలంటే తొలి రోజుల్లో భ‌య‌ప‌డి పారిపోయిన రోజులు కూడా ఉన్నాయి. సుమారు 1500 మంది బాల బాలిక‌లు 1వ త‌ర‌గ‌తి నుంచి 10వ త‌ర‌గ‌తి దాకా ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని అన్ని జిల్లాల‌కు చెందిన అనాథ విద్యార్థులు ఇందులో చ‌దువుకుంటున్నారు.
హైస్కూల్ ద‌శ అప్పుడ‌ప్పుడే మాకు స‌మాజం గురించి అవ‌గాహ‌న లేని రోజుల‌వి. అందులో కో ఎడ్యుకేష‌న్, విద్యార్థినీ విద్యార్థులు ఒక‌రి చూసి మ‌రొక‌రు పోటీ ప‌డుతూ చ‌దువుకునే వాళ్లం. హై స్క‌ల్ విద్యార్థినీ విద్యార్థుల మ‌ధ్య తెలియ‌ని ఆ వ‌య‌సులో ఆక‌ర్ష‌ణ‌లు మెండుగా ఉండేవి. బాయిస్ ని చూసి గ‌ర్ల్స్ ... గ‌ర్ల్స్ ని చూసి బాయిస్ స్కూల్ స‌మ‌యంలోనే క‌లుసుకునే వాళ్లు మిగ‌తా స‌మ‌యంలో బాలిక‌లు భ‌వంతి వెన‌క భ‌వంతిలో గ‌ర్ల్స్ హాస్ట‌ల్, ముందు వైపు బాయిస్ హాస్ట‌ల్  మ‌ధ్య‌లో పెద్ద స‌మావేశ స్థ‌లం. సీనియ‌ర్లు జూనియ‌ర్ ల‌ను ఏడిపించ‌డం ఉండేది. ఏదైనా సెమీ అనాథ‌ విద్యార్థి బంధువులు వ‌చ్చి తినుబండారాలు వ‌స్తే సీనియ‌ర్లు వ‌చ్చి లాక్కునే వాళ్లు. సాయంత్రం స‌మ‌యంలో స్క‌ల్ ముంద‌ర ఉన్న పెద్ద ప్లే గ్రౌండ్ లో రోజూ స్నేహితులం అంద‌రం మాట్లాడుకుంటూ, కొంద‌రు ఆడుకుంటూ కాలం గడిపే వాళ్లం. వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన విద్యార్థులు కావ‌డంతో వారి భాష, యాస వేరు వేరుగా ఉండేది. అవి చూసి ఒక‌రి మాట‌లు ఒక‌రు విచిత్రంగా అనిపించేవి. మొత్తానికి కొన్ని రోజుల త‌ర్వాత అంద‌రం క‌లిసిపోయి గ్రూపులుగా ఏర్ప‌డి చ‌దువుకునే వాళ్లం.
మా త‌ర‌గ‌తిలో ఉండే అమ్మాయిల‌ను మా బాయిస్ ఎవ‌రికి వారు త‌న ల‌వ‌ర్ గా చెప్పుకొని మురిసిపోయే వాళ్లం. కానీ గ‌ర్ల్స్ తో ఈ విష‌యం మాట్లాడే వాళ్లం కాదు. అందుకు భ‌య‌ప‌డే వాళ్లం. ఉద‌యం బ్రేక్ ఫాస్ట్ అవ‌గానే హాస్ట‌ల్ గ‌ది నుంచి పుస్త‌కాలు తీసుకొని త‌ర‌గ‌తి గ‌దికి ప‌రిగెత్తే వాళ్లం ఎందుకంటే అమ్మాయిలతో క‌లిసేది అక్క‌డే క‌దా. ఇలా రోజు కాలం గ‌డిసేది. ఇక చ‌ద‌వు విష‌యానికి వ‌స్తే లెక్క‌లు మాష్టారు బుగ్గారావు, సోష‌ల్ టీచ‌ర్ రాజ్య‌ల‌క్ష్మ‌ని చూస్తే మాకందరికీ భ‌య‌మే. ఇక తెలుగు, హిందీ మాష్టార్లు వ‌చ్చారంటే ఆసక్తిగా క్లాసు వినే వాళ్లం. సోష‌ల్, సైన్స్ క్లాసులు కూడా అంతే శ్ర‌ద్ద‌గా వినే వాళ్లం. అప్పుడ‌ప్పుడు భ‌యటి నుంచి బాయిస్ అండ్ గ‌ర్ల్స్ కి పండ్లు, ఫ‌ల‌హారాలు ��ానం చేయ‌డానికి వ‌చ్చే వాళ్లు. ఇలా మూడేళ్లు గ‌డిచాయి. ఆ తర్వాత పదవతరగతి అయిపోయాక ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మా క్లాస్ మేట్స్ అందరం కలిసి అప్పటి ఐఏఎస్ గార్గ్ ని కలిసి సోషల్ వెల్ఫేర్ కాలేజి ల్లో ఉచితంగా సీట్లు పొందేలా మా బ్యాచ్ నుంచి సాధించగలిగాము అలా ఎవరి జిల్లాలకు వారు వెళ్లి చదువుకోవడం జరిగింది. ఆ తర్వాత అందరం మళ్ళీ కలిసింది లేదు. 25 ఏళ్ల తర్వాత సిల్వర్ జూబ్లీలో కలుసుకుంటున్నాము.
ఇవాళ మా ప‌ద‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌మంతా క‌లిసి విఎంహోంలో విద్య‌ను, మా స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ సిల్వ‌ర్ జూబ్లీ సెల‌బ్రేష‌న్ చేసుకుంటున్నాము. ఆ రోజుల‌ను గుర్తు చేసుకుంటూ 1996-97 బ్యాచ్ విద్యార్థులం అంద‌రం రేపు అన‌గా శ‌నివారం(04-06-2022)న క‌ల‌వబోతున్నాము. ఇన్నేళ్ల తర్వాత క‌లుసుకోబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.  
0 notes
telanganajournalist · 3 years ago
Text
థియేటర్ లో "శివ గంగ(మ్మ)" ఉగ్ర రూపం!!
-ప్రహరీ గోడ కూలి సినీ ప్రేక్షకుల బైకులు ధ్వంసం
-థియేటర్ నిండా వరద నీళ్లే
-కోట్లలో ఆస్తినష్టం
-నిన్న రాత్రి కురిసిన భారీ వర్ష తీవ్రత ఇది
Tumblr media
శివ గంగ చాలా మంచి థియేటర్. ఇప్పుడు అది ఏషియన్ శివగంగగా మారింది. గత కొన్ని దశాబ్దాలుగా నడుస్తున్న థియేటర్. సరూర్ నగర్ చెరువు ముంచెత్తినప్పుడు ఆ ప్రాంతం వరద ముంపుకు గురవుతోంది. చెరువు కింద ఉండే కాలనీ కాబట్టి తప్పడం లేదు. అక్కడి వాళ్ళను ఆ దేవుడే కాపాడుగాక.
Tumblr media
అది 1994-96 మధ్య నేను(వేంకటేశ్వర్లు) పాలమూరు నుంచి చదువు కోసం వెళ్లి.. 8వ తరగతి నుంచి 10వ తరగతి చదువుతున్న కాలంలో అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం సరూర్ నగర్ చెరువు(కింద) దగ్గరలోని "శివగంగ 70MM" కు కొత్తపేటలోని వీఎంహోమ్ రెసిడెన్షియల్ కమ్ హాస్టల్ నుంచి మా స్కూల్ వార్డెన్ (రిటైర్డ్ ఆర్మీ), నాలుగు కళ్ళ వాచ్ మెన్ కంట పడకుండా ఫస్ట్ షో లేదా సెకండ్ షో సినిమాకు పోయి మళ్లీ ఎవరు హాస్టల్ రూమ్ కి వాళ్ళు గప్ చుప్ గా వెళ్లి వచ్చిన రోజులవి. అప్పుడు సినిమా టికెట్ ధర రూ. 1.50 పైసలు. ఫ్రెండ్స్ కొంతమంది కలిసి వెళ్ళేవాళ్ళం. మా హాస్టల్ పెద్ద బూత్ బంగ్లా(నిజాం కట్టిన చారిత్రక కట్టడం విక్టోరియా మెమోరియల్ హోమ్)లా ఉండేది. ఇప్పటికీ అలాగే ఉంది.
Tumblr media
మా స్కూల్ క్లాస్ మేట్స్, మా సీనియర్లు ఆ చుట్టు పక్కలనే ఉంటున్నారు. వారు వారి కుటుంబ సభ్యులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం శివగంగ థియేటర్ ప్రహరీ గోడ కూలి వందల బైకులు నాశనం అయ్యాయి.
Tumblr media
Tumblr media
ఈ ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చు అని అంచనా..థియేటర్ కు నష్టం జరిగింది. మరి సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకుల బైకుల నష్టం థియేటర్ యజమాని భరిస్తాడా? లేక ప్రకృతి వైపరీత్యాల నష్ట నివారణ నిధి(Natural Disaster Management Fund) నుంచి ఇస్తారా? తెలియాల్సి ఉంది.
Tumblr media
0 notes
telanganajournalist · 3 years ago
Text
Save VMHome ?
కరుగుతున్న వీఎంహోమ్ ఆస్తులు.. తగ్గుతున్న విద్యార్థినీ, విద్యార్థులు! ఇది దేనికి సంకేతం!
Tumblr media
స్వతంత్ర ప్రతిప్తతి గల విద్యా సంస్థ, విక్టోరియా మెమోరియల్ హోమ్ రెసిడెన్షియల్ స్కూల్ ఆస్తులు నెమ్మది నెమ్మదిగా కరిగిపోతున్నాయని తెలుస్తోంది. ఒకప్పుడు సుమారు 1500ల నుంచి 2000 వరకు ఉన్న విద్యార్థులు నేడు 600 మంది మాత్రమే ఉండడం దారుణం.  రాష్ట్రంలోని అనాథ పిల్లలకు ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక ఉంటుందని.. వారిని ప్రభుత్వమే దత్తపుత్రులుగా చేసుకొని వారిని కన్నబిడ్డల కంటే ఎక్కువ చూస్తామని కేసీఆర్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఇంతవరకు అలాంటి చర్యలు తీసుకున్నట్టు దాఖలాలు కనిపించడం లేదు. ప్రతి జిల్లాలోని అనాధ పిల్లల వివరాలు సేకరించారు. కానీ వీఎమ్ హోమ్ లో వారి సంఖ్య పెరగక పోవడం గమనార్హం. 
Tumblr media
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కొత్తపేటలోని పండ్ల మార్కెట్ ను కూల్చేసి సిటీకి దూరంగా తరలించారు. అక్కడ కార్పొరేట్ లెవల్లో వైద్య సంస్థ నిర్మాణం చేపడతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మార్కెట్ ను కనుమరుగు చేసినట్టే రాను రాను వీఎంహోమ్ భూములను ప్రభుత్వం కబ్జా చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే చుట్టుపక్కల భూములను రైతు బజార్, పెట్రోల్ బంకులకు, కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తోందన్న అనుమానం కలుగుతోంది. ఇందులో చేరే తల్లి దండ్రులు లేని విద్యార్థుల సంఖ్య తగ్గడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే ఈ సంస్థను పలు సినిమా షూటింగ్ లకు ఇవ్వడం తెలిసిందే. ఎందుకు విద్యార్థుల సంఖ్య తగ్గింది అని సంస్థ సూపురిండెంట్ , ఇంచార్జ్ అధికారిని శ్రీమతి పార్వతి గారిని అడుగగా కోవిడ్ కారణంగా పిల్లలు ఇళ్లకు వెళ్లారని, వారు తిరిగి రాలేదని చెప్పారు. 
Tumblr media
నిన్న సాయంత్రం వీఎంహోమ్ సంస్థను జర్నలిస్ట్ వేంకటేశ్వర్లు బోయ సందర్శించడం జరిగింది. అక్కడి విద్యార్థులను పలకరించే ప్రయత్నం చేయగా వారు పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. నాణ్యమైన ఆహారం పెట్టడం లేదని..అన్నం ముద్ద ముద్ద గా చేస్తున్నారని..తిండి సరిగా లేక చాలా మంది విద్యార్థులు వెళ్లిపోవడం జరుగుతోందని వారు వివరించారు. తాజాగా సాంఘీక సంక్షేమ ఉన్నతాధికారి శ్రీమతి యోగితా రాణి సందర్శించడం జరిగిందని అధికారులు వచ్చినప్పుడే మంచి ఆహారం పెడుతున్నారని వారు వెల్లడించారు. సంస్థ భూముల లీజుల ద్వారా, సినిమా షూటింగ్ ల ద్వారా వస్తున్న నిధులు ఎక్కడ పోతున్నాయో తెలియడం లేదు. వీఎంహోమ్ మరమ్మతులకు తాజాగా నిధులు మంజూరు అయ్యాయని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న పాఠశాలలకు మన ఊరు మన బడి పథకం చేపట్టి స్కూల్లకు కలర్ లు, మరమ్మతులు చేపడుతున్న విషయం తెల్సిందే. 
Tumblr media
వీఎంహోమ్ ముందు ఉన్న భూమిని వేరే శాఖకు అప్పగించాలని చూడగా పూర్వ విద్యార్థులు అడ్డుకొని నిరసన తెలియజేశారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. ఎప్పటికైనా వీఎంహోమ్ భూములను అక్రమించుకోవాలని పలు ప్రయత్నాలు చేస్తోందని, క్రమంగా దృష్టి మళ్లించి, విద్యార్థుల సంఖ్య తగ్గించి, తక్కువగా ఉన్నారని చూపి వీరిని వేరే చోటుకు తరలించే కార్యక్రమం జరుగుతోందని పలువురు ప్రముఖులు భావిస్తున్నారు. ఇక్కడి విద్యార్థులను ఎవరితోనూ మాట్లాడనివ్వకుండా, లోపలి సమాచారం బయటికి రాకుండా చూస్తున్నారని అర్థమవుతోంది. వీఎంహోమ్ మైదానంలో ఉదయం, సాయంత్రం వస్తున్న వాకర్ల ను సాయంత్రం వేళల్లో రాకుండా అక్కడి సెక్యూరిటీ అడ్డుకుంటున్నారు. అనుమతులు ఉన్నవారినే లోపలికి పంపిస్తామని సెక్యురిటి తెలియజేశాడు. తనకు పై నుంచి ఆదేశాలు ఉన్నాయని చెప్పాడు. 
Tumblr media
ఎవరికి అనుమతి ఇస్తున్నారు? ఎవరికి ఇవ్వడం లేదనేది తెలియాల్సి ఉంది. ఇటు చుట్టుపక్కల ఉన్న వాకర్స్, వీఎంహోమ్ విద్యార్థులు క్రమ క్రమంగా తగ్గుతుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. చుట్టు పక్కల ప్రజలు, మేధావులు, పూర్వ విద్యార్థులు వీఎంహోమ్ భూములు, సంస్థను కాపాడుకోవడానికి అమ్ముడుపోని సమగ్ర మైన పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ��ంది. 
-వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్
0 notes
telanganajournalist · 7 years ago
Photo
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
“వి.ఎం.హోమ్ ...
ఇది ప్రభుత్వ భూమి కాదు,
ఇది పోలీసుల భూమి కాదు.
ఇది ప్రజల భూమి. ఇది పిల్లల భూమి.
దీనిని పిల్లల భూమిగానే వుండనివ్వండి.
గడచిన చరిత్రలో తప్పిదాలను పునరావృతం
చేయకండి”.
- Vasireddy Venugopal (Senior Journalist)
Tumblr media
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయాన్ని కొత్తపేటలో వుండే విక్టోరియా మెమోరియల్ హోం   (వి.ఎం.హోమ్) ఆవరణలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. .... వి.ఎం.హోమ్ నేపధ్యం: నిజాం నవాబు తన వేసవి విడిదికోసం ఈ భవనాన్ని కట్టించుకున్నారు. వనస్థలిపురంలోని జిం��లపార్కులో వేటకు వచ్చే నవాబు.. విడిది వసతిగా నిర్మించుకున్నారు. అయితే మతపరమైన ఆచారాల రీత్యా ఒక అపశకునం ఎదురుకావడం వల్ల.. ఆ భవంతిలోకి తాను ప్రవేశించలేదు. అనాధ బాలలకు విద్య, వసతి సదుపాయాలు కల్పించడానికి దానికి కేటాయించారు. అదే వి.ఎం.హోమ్. విశాల ప్రాంగణంలో వుండే ఈ భవంతితో పాటు సువిశాల క్రీడా ప్రాంగణం, ఏపుగా పెరిగిన చెట్లు ఇందులో వుంటాయి. పరిసర ప్రాంత కాలనీల వారికి వాకింగ్, జాగింగ్ సదుపాయాన్ని, ఆక్సిజన్ బ్రీతింగ్ సదుపాయాన్ని ఈ ప్రాంగణం కల్పిస్తోంది. ఈ ప్రాంగణం చారిత్రక ప్రాధాన్యత కలిగినది. చారిత్రక భవనం. చారిత్రక, సాంస్కృతిక వారసత్వ భవనం, ప్రాంగణం. భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సందర్శించిన ప్రాంగణం. తన స్వహస్తాలతో ఈ ప్రాంగణాన్ని అభినందిస్తూ ఒక లేఖ రాసిన ప్రాంగణం. ... 1999నుంచి డేగల కన్ను: వీఎం హోమ్ భూములపై ప్రభుత్వాలకు, ప్రభుత్వ పెద్దలకు 1999నుంచి కన్నుపడింది. జాతీయ రహదారిపై ప్రధాన ప్రాంగణానికి ఎదురుగా కూడా హోమ్ భూమి వుంది. చంద్రబాబు హయాంలో ఆ భూమిపై జెండా పాతారు. ఇప్పుడు వున్న కొత్తపేట రైతు బజారు (సరూర్ నగర్ రైతు బజార్ అంటారు), దానికి కుడివైపున వుండే రిలయన్స్ పెట్రోలు బంకు, దాని పక్కన వుండే రిలయన్స్ టవర్.. వి.ఎం.హోమ్ వాళ్ల భూముల్లో లీజుకిచ్చినవే. ఒక ప్రెవేటు సంస్థకు హోం భూములు లీజుకు ఇవ్వడంపై రగడ కావడంతో రైతు బజారుకు ఎడమవైపున.. అదే హోం భూమిలో బీజేఆర్(బాబూ జగజీవన్ రాం) భవన్ ను ప్రభుత్వం నిర్మించింది. బీజేఆర్ భవన్ తర్వాత.. టెలిఫోన్ కాలనీకి వెళ్లే రోడ్డు వుంటుంది. ఆ రోడ్డుకి ఆనుకుని వుండే భూమి కూడా వీఎం హోం వారిదే. ల్యాండ్ మార్క్ గా చెప్పాలంటే.. స్పైసీ హబ్ అని వుంటుంది. ఆ భూమి వీఎం హోమ్ ది. సుమారు కోటి రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు. అక్రమ లావాదేవీ. విక్రయదారులకు, కొనుగోలుదారులకు యాజమాన్య హక్కులు లేని అక్రమ లావాదేవీ. రిలయన్స్ బంక్, రైతు బజార్, బీజేఆర్ భవనానికి వెలుపల.. ఇంకా అంత స్థలం ఇప్పటికీ ఖాళీగా వుంది. అది కూడా వీఎం హోం భూమినే. ఇది కాకుండా సమీపంలోని ఎన్టీఆర్ నగర్ లో కొంచెం లోపలికి ఏడెకరాల భూమి వుంది. అందులో కూరగాయలు పండించి, వాటితో.. హోంలోని పిల్లలకు వంటలు వండుతుంటారు. ... ఈ భూమి ఎవరిది? ప్రభుత్వాలు.. ఈ భూమిని ప్రభుత్వ భూమికింద జమకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఇది ప్రభుత్వ భూమి కాదు. వీఎం హోమ్ కి మాత్ర��ే చెందుతుంది. వీఎం హోం���ి చెందకపోతే.. నిజాం ట్రస్ట్ కి చెందుతుంది. .... 2004 తర్వాత వైఎస్సార్ కన్నుపడింది... వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక వీఎం హోమ్ భూమిని, ప్రధాన ప్రాంగణాన్ని ప్రెవేటు సంస్థలకు లీజుకి ఇచ్చి కమర్షియల్ గా మార్చడానికి పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ వీఎం హోం గట్టిగా ప్రతిఘటించింది. ఆ తర్వాత... ఇటీవలి కాలంలో ఎల్ అండ్ టీ మెట్రో రైల్ వాళ్లు కూడా అక్కడో మాల్ ఏర్పాటు చేసుకోవడంకోసం ఆ భూమికోసం వచ్చారు. ప్రతిఘటన కొనసాగింది. ...... లీజు రేట్లలో ఇంత వ్యత్యాసమా? రాచకొండ పోలీసు కమిషనరేట్ కి.. ఇప్పుడున్న రైతుబజార్ వెనుక ప్రాంగణాన్ని మొదట పరిశీలించారు. అయితే మెయిన్ రోడ్డుపై కావాలని.. ప్రధాన ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. అంటే.. అక్కడున్న చెట్లన్నీ నరికి పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేస్తారు. తొలుత ప్రభుత్వ జీవీలో మార్కెట్ ధర ప్రకారం ఏడాదికి సుమారు కోటి రూపాయలు లీజ్ రుసుము చెల్లించాలని పేర్కొన్నారు. తాజాగా ఇచ్చిన జీవోలో లీజుని ఐదున్నర లక్షలకు తగ్గించారు. దాదాపు 95శాతం తగ్గించారు. ..... ఈ సందర్భంగా కొన్ని విషయాలు, కొన్ని వాస్తవాలు మాట్లాడుకోవాలి.
మొదటిది: 1999లో రైతు బజారు ఏర్పాటు చేసినప్పుడు ఖరారు చేసిన లీజు విలువను.. ఇప్పుడు రాచకొండ కమిషనరేట్ ఏర్పాటుకు ప్రామాణికంగా పరిగణించడం న్యాయమా? అదే ప్రామాణికంగా తీసుకోదలచుకుంటే.. రైతు బజారు వెనక వున్న ఖాళీ స్థలాన్నో, ఎన్టీయార్ నగర్ లో వున్న ఖాళీ స్థలాన్నో కేటాయించండి. ప్రధాన ప్రాంగణంలో వద్దు.
రెండవది: రైతు బజారు ఏర్పాటైన తర్వాత.. అప్పుడు ఖరారు చేసిన అతి తక్కువ లీజు ధరను కూడా ఇప్పటివరకూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ.. వీఎం హోమ్ చిన్నారులకు ఒక్క నయాపైసా కూడా చెల్లించలేదు. ఆ బకాయిల మొత్తం ఇప్పుడు 2కోట్లు దాటిపోయింది. రైతు బజారులో బోర్డుమీద 21రూపాయలు వున్న బెండకాయలను 22 రూపాయలకు అమ్ముతున్నందుకు గాను మనం బాధ్యతాయుత పౌరులుగా చాలా గోలచేస్తాం. అధికారులకు కంప్లెయింట్ చేస్తాం. కానీ.. చిన్నారులకు అన్నం పెట్టాల్సిన ఈ రెండు కోట్ల రూపాయల బకాయి గురించి మనకు అస్సలు తెలియదు. అది మన ప్రపంచం కాదు.
మూడవది: ఇప్పటికీ వీఎం హోమ్ కి రెగ్యులర్ గా లీజు డబ్బులు అందుతున్నది.. ప్రెవేటు సంస్థ రిలయన్స్ నుంచే. పెట్రోలు బంకు ద్వారా నెలకు లక్షా 22వేల రూపాయలు, సెల్ ఫోన్ టవర్ ద్వారా సుమారు 7వేల రూపాయలు అందుతున్నాయి.
నాలుగవది: అది ప్రభుత్వ భూమే అనుకుంటే అనుకోండి. ఎలాగూ భూముల రీసర్వే చేపట్టారు. అది ప్రభుత్వ భూమే అని తేలినట్టయితే ఒక పని చేయండి. ఎన్నేళ్లకు లీజుకు ఇస్తున్నా��ో, ఏ రేటుకి లీజుకి ఇస్తున్నారో.. ఆ మొత్తాన్ని ముందుగా ఆ పిలకాయల సంక్షేమంకోసం నగదు బదిలీ చేయండి. తర్వాత.. ఆ లీజు హక్కుల్ని అనుభవించండి. వందేళ్లుగా ఆ భూమిని కాపాడుకున్నది ప్రజలు. వందేళ్లుగా ఆ భూమిపై సమిష్టి హక్కులను అనుభవిస్తున్నది ప్రజలు. ఇది ప్రభుత్వ భూమి కాదు, ఇది పోలీసుల భూమి కాదు. ఇది ప్రజల భూమి. ఇది పిల్లల భూమి. దీనిని పిల్లల భూమిగానే వుండనివ్వండి. గడచిన చరిత్రలో తప్పిదాలను పునరావృతం చేయకండి.
(Note: కేసీఆర్ ఖ‌బ‌ర్ధార్!విక్టోరియా మెమోరియ‌ల్ హోంలో నేను(వెంక‌టేశ్వ‌ర్లు బోయ‌) కూడా 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు(1994-97) చ‌దువుకున్నాను. ఎంతో మంది అనాధ పిల్ల‌లను అక్కున చేర్చుకుంది. వ‌ల‌స వ‌చ్చిన మాబోటి వాళ్ల‌కు ఆశ్ర‌యిమిచ్చి ఆదుకుంది. ఇప్ప‌టికీ అదొక మ‌హా విద్యా సంస్థ‌, స్వ‌తంత్ర‌ప్ర‌తిప‌త్తి గల వీఎంహోం భూముల‌ను క‌బ్జా చేయాల‌ని గ‌త కొన్నేళ్లుగా ప్ర‌భుత్వాలు కుట్ర‌ల మీద కుట్ర‌లు చేస్తున్నాయి. ఇదివ‌ర‌కు చాలా మంది ట్రై చేశారు.. ఇప్పుడు సీఎం కేసీఆర్ కన్నుప‌డింది.  కానీ వాళ్ల ఆట‌లు మా పూర్వ విద్యార్థులం సాగ‌నివ్వం. ఇప్ప‌టికే అంద‌రం స‌పోర్ట్ గా నిలుద్దామ‌ని కార్య‌చ‌ర‌ణ మొద‌లు పెట్టాం.. తీవ్ర ఉద్య‌మం మొద‌ల‌వుతుంది.. అనాధ పిల్ల‌ల జోలికి వ‌స్తే.. కేసీఆర్ ఖ‌బ‌ర్ధార్.. అటు వైపు క‌న్నేస్తే.. విద్యార్థుల ఉప్పెన‌కు బ‌లైపోతావ్ జాగ్ర‌త్త‌..! వీఎం హోం చ‌రిత్ర‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసి వాళ్ల‌ను చైతన్య ప‌రిచిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు వాసిరెడ్డి వేణుగోపాల్  అన్న‌కు ధ‌న్య‌వాదాలు. -Venkateshwarlu Boya (www.telanganajournalists.com)
0 notes
violamilano · 8 years ago
Photo
Tumblr media
Lovely to see that our first line of handmade cushions & plaids came out so well... Exclusive fabrics from @foxbrothers1772 & handprinted silk from UK. First collection of Viola Milano home will be online next week at www.violamilano.com #violamilano #handmade #madeinitaly #luxury #sartorial #timeless #elegance #detailsoftheday #interior #design #homeline #vmhome #foxflannel #foxbrothers
29 notes · View notes