#vaaliyar
Explore tagged Tumblr posts
Video
youtube
#India కుల్లర్ కేవ్స్ అనబడే మరుగుజ్జుల రాజ్యం! ఈ గుహలలో ఉండడానికి కారణం ఏంటి?
Hey guys, ఈ రోజు మనం ఒక చారిత్రాత్మక ప్రదేశాన్ని అంటే historic site ని చూడట్లేదు, దానికి బదులుగా చరిత్రకు ముందున్న కాలంని అంటే ఒక Pre-historic siteని మనం చూడబోతున్నాం. ఈ రెండిటికి difference ఏంటి? Pre-historic site అంటే, ఎక్కడా రాయడం గాని లేదా historical recordsలో గాని, ఏ formలో గాని లేని కాలం అని చెప్పవచ్చు. అంటే, కనీసం 5000 సంవత్సరాల పాతబడిన ఒక placeకి మనం వెళ్తున్నాం. Actualగ Pre-historic sites అన్ని చాలా చాలా పాతబడిన ప్రదేశాలు, అది మాత్రమే కాకుండా వాటిని వెతికి, కనుగొనడం చాలా కష్టం. South Indiaలో ఉండే తిరువణ్ణామలై districtలో జవ్వాధు కొండలు అని పిలువబడే ఈ దట్టమైన అడవికి ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఈ అడవిని Government ఎహ్ protect చేస్తున్నారు.
ఈ జవ్వడు కొండలలో పెద్దగా చెప్పుకునేంతగా ఏ ఒక facilities లేవు. నేను నా journeyని start చెయ్యక ముందే , ఇక్కడ చుట్టుపక్కల hotels గాని , restaurants గాని ఒక్కటి కూడా లేవు. కానీ ఇక్కడ ఉండే గ్రామానికి చెందిన ఆడవాళ్లు, బాగా tasty గ ఉండే foodని చేసి roadu పక్కనే అంగళ్ళు పెట్టి అమ్ముతున్నారు, ఇక్కడ ఉండే జనాలు చాలా friendly గ helping mindsetతో ఉన్నారు. అంతే కాదు గ్రామస్థులు చెప్పే కథలు వినడానికి చాలా interesting గ ఉంటాయి. జవ్వాధు కొండల్లోకి enter అయియేటప్పుడే, మనకు difference తెలుస్తుంది, బయట ఉండే గ్రామాలలో చాలా మంది అక్కడక్కడ గుంపులు గుంపులు గ ఉండడం చూసాం. కానీ ఈ అడవిలో పెద్దగా జనాలు ఎవ్వరు జీవిస్తున్నట్టు లేదు. Reserve forest కి బైట ఎలా ఉందని, ఇంకా లోపల ఎలా ఉందని మనం బాగా చూడొచ్చు. ఇంత పెద్ద area ని ఎందుకు Government protect చేస్తుంది?
అయితే మన దగ్గర నుండి ఏదో ఒక రహస్యాన్ని దాస్తున్నారా? అలా కొంచెం దూరం వెళ్తూవుంటే, థార్ road ఎహ్ కనిపించలేదు ఈ మట్టి road లే కనిపిస్తున్నాయి, ఈ roadలో carలో పోవడం కుదరదు, ఎందుకంటే road చాలా చిన్నగా ఉంది. So, నేను ఒక గ్రామస్థుడి దగ్గర bikeని బదులుగా తీస్కొని వెళ్తున్నాను. చాలా miles దూరంగా ఈ road లో వెళ్తేనే, నేను ఆ కొండకి వెళ్ళగలను. ఈ అడవి ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉండడానికి ఎవరికీ అనుమతి లేదు, ఇక్కడ ఈ అడవిలో కొన్ని వందల మంది గిరిజనులు మాత్రమే జీవిస్తున్నారు. సాధారణంగా ఇక్కడికి వచ్చే visitorsకి ఇవి just చెట్లు, కొండలు ఉన్నయి అనే అనుకుంటారు తప్ప, పెద్దగా ఏమి తెలీదు. అంతేగా? Bikeలో కూడా మనం ఇంత దూరం మాత్రమే వెళ్ళగలం, ఇంకా వెళ్లాలంటే మీరు అడవి లోపలి నుండి, చాల మైళ్ల దూరం నడవడానికి సిద్ధంగా ఉండాలి.
జవ్వాధు కొండలు, అద్భుతమైన మూలికలకు ప్రసిద్ధి చెందినవి, lung diseases అంటే ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న ప్రజలు ,ఈ మూలికలతో నిండిన గాలిని పీల్చుకోవడానికి ఇక్కడికి వస్తారు. నేను ఇక్కడ నడవడం start చేసి 2 గంటలకు పైగా నడుస్తున్నాను, ఇంకా మన prehistoric place, కొండ పైన ఉంది. నేను ఇక్కడ జారుతున్న రాయి పైన నడుస్తున్నాను, ఒకవేళ carelessగ ఒక్క అడుగు వేసిన కూడా, ఇక్కడ నుంచి కింద పడితే నేను భ్రతకడం కూడా కష్టమే. అలా ఉంది ఈ place. చివరగా, కొండపైకి చేరుకోవడానికి ఇంకా ఒక నిటారుగా ఉండే ఈ బండ రాయిపై ఎక్కాలి. నేను ఇప్పుడు మధ్యలో ఉన్నాను, నా చుట్టూ నాలుగు వైపులా అడవి మాత్రమే ఉంది. ఈ కొండపైన జారుతూ ఉండడం వల్ల , నేను ���క్కడానికి చాలా కష్టంగా ఉంది. తేనె కోసం ఇక్కడికి వచ్చే గిరిజనులు తప్ప, గత 6 నెలల్లో ఈ placeకు అస్సలు ఎవ్వరు రాలేదు. కానీ పైనుండి ఈ మొత్తం view ని చూస్తుంటే, mind-blowingగ ఉంది.
ఈ కొండపైన చుట్టూ వందల రాళ్లతో చేసిన విచిత్రమైన structures ఇక్కడ ఉన్నయి. ఈ రాళ్లు అన్ని చాలా brightగ, తెల్లగా ఉన్నయి. నేను 1st చూసింది , చాలా చిన్న చిన్న రాళ్లతో కట్టనవి , ఈ గుహ లాంటి structureని కట్టడానికి చాలా రాళ్లను ఉపయోగించారు. ఇది చూడడానికి అడవిమనుషులు లేదా పొట్టి మనుషుల కోసం ఒక గుహ ఉంటె ఎలా ఉంటుందో, అలా ఉంది. అందుకే ఈ placeని Kullar Caves అంటే కుల్లర్ గుహలు అని పిలుస్తారు. ఈ గుహ లోపల ఎం లేదు, ఇంకా ఏ ఒక్క జాడలు గాని లేదా గుర్తులు గాని ఏవి లేవు. నేను కొండ శిఖరాన్ని explore చేసేటప్పుడు, నేను ఇంకొక విధమైన structureని చూసాను. మనం already చుసిన చిన్న రాళ్లతో కట్టినట్టుగా కాకుండా , పెద్ద రాలను use చేసి కట్టారు, ఇది చూడడానికి చిన్న చిన్న రాతీ గుడిస లాగ ఉంది. కానీ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాతి గుడిసెలన్నీ కేవలం 2 అడుగుల ఎత్తు మాత్రమే ఉన్నాయి.
ఈ రాతి గుడిసెలలోకి మనుషులు అనడం అసాధ్యం అనడమే. Archeologists ఈ structuresనీ "Dolmens" అని పిలుస్తారు. Dolmen అంటే ఏంటి ? ఒక Dolmen లో సాధారణంగా నాలుగు రాతి పలకలు అంటే నాలుగు stone slabs ఉంటాయి, మూడు పలకలు వేరే వేరే sidesలో, ఒక పాలక మాత్రం ఆ మూడిటికి పైన ఒక ceiling లాగ ఉంటుంది. ఎవరు ఈ structures అన్ని కట్టారు? ఎందుకోసంకట్టారు? ఒక వేళా మీరు aerial veiw అంటే పై నుంచి ఈ structuresని చూస్తే , చాలా amazing ఐన విషయాన్ని మీరు చూడొచ్చు, వాటికి outer లో circleగ చిన్న చిన్న రాళ్లు పెట్టి చేసిన ఒక base కూడా ఉంది. ఈ dolmensకు బయటకు వెళ్ళడానికి ద్వారం కూడా ఉంది. రాళ్లను అందంగా roundగ పెట్టి ఒక base ని form చేసి, దానితోపాటు ఒక రాతి కంచెను కూడా పెట్టారు.
- Praveen Mohan Telugu
#India#AncientSite#kullercaves#javvadhuhills#Prehistoricsite#tribalpeople#dwarfspeolple#dwarfcaves#dolmens#stonehut#vaaliyar#మననిజమైనచరిత్ర#praveenmohantelugu#Tumblr tweet#tumblr feed
1 note
·
View note