#painecones
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 2 years ago
Video
youtube
భారతీయ దేవాలయంలో దాగి ఉన్న పురాతన ఈజిప్షియన్ చిహ్నాలు? నాగుల మధ్య ఉన్న జ్వాలాముఖి!
Hey guys, ఈ రోజు, 1300 సంవత్సరాల పురాతనమైన ఈ గుడిలో నిషేధించబడిన ఈ ప్రాంతంలోకి వెళ్దాం, ఇప్పటివరకు ఈ ప్రాంతాన్ని ఎవరూ video తీసిందిలేదు, కానీ ఇక్కడ కొన్ని వింత రహస్యాలు దాగి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూశారంటే, ఒక నాగుపాము తన పడగ విప్పి ఉంది చూడండి,  కానీ దీని తల పైన చూడండి, ఏదో ఒక విచిత్రమైనది ఉంది. ఇది చూడడానికి ఒక కిరీటం లేదా తల పాగా లాగ  ఉన్నట్టు ఉంది కదా. కానీ ఇలాంటి ఒక విషయాన్నీ భారతీయ గుడులలో ఎక్కడా కూడా మీరు చూడలేరు, ఎందుకంటే హిందూ ఐకానోగ్రఫీలో, ఈ భాగం రానే రాదు. 
అయితే, ఇలాంటి ఒక పామును ఈ గుడిలో ఎందుకు చెక్కాలి, సాధారణంగా ఈ గుడికి వచ్చే సందర్శకులకు కనిపించకుండా దీన్ని చీకటి మూలలో ఎందుకు చెక్కాలి? ఇక్కడ మీరు చూస్��ున్నది, 2000 సంవత్సరాల పురాతనమైన ఒక కళాఖండం, ఇది కూడా దాదాపు ఆ  చెక్కడం ల���గానే ఉంది కదా? ఇది కూడా పడగ విప్పిన నాగుపాము, దీనికి కూడా అదే కిరీటం లేదా తల పాగా లాగ ఉంది చూడండి. కానీ ఇది భారతదేశంలో ఉన్న ఒక శిల్పం కాదండి, ఇది పురాతనమైన Egypt కు చెందిన ఒక కళాఖండం. ఇదంతా ఒక coincidence ఆహ్? ఇది ఏంటీ అసలు? Egyptలో ఉన్న మరొక నాగుపామును చూడండి, దాని తల పైన కూడా కిరీటం లాంటిది ఒకటుంది. 
పురాతన ఈజిప్టులో, కిరీటాలతో ఉన్న పాములను మనం మళ్లీ మళ్లీ చూడవచ్చు. అయితే, Egypt లో ఉన్న చెక్కడాన్ని, మన భారతదేశంలో ఎలా చెక్కారు? కానీ ఒకటి రెండు శిల్పాలను కనిపెట్టి మనం ఒక నిర్ధారణకు రాకూడదు, కాబట్టి ఇక్కడ మరేదైనా కనిపిస్తుందేమో అని చూద్దాం. ఈ చెక్కడానికి కొన్ని స్తంభాల దూరంలో ఉన్న, ఇంకొక చెక్కడాన్ని మనం చూద్దాం. భారతదేశపు, హిందూ గుడులలో ఈ విధంగా అల్లుకున్న నాగు పాముల శిల్పాలు ఉండడం చాలా సాధారణం, అని మనకు తెలుసు,  కానీ ఇక్కడ ఒక తేడా ఉంది, ఈ రెండు పాములకు మధ్య ఏదో చెక్కారు చూడండి. ఇది కొంచెం క్షీణించింది, కానీ ఈ రెండు తలల మధ్య ఖచ్చితంగా ఏదో ఒకదాన్ని చెక్కారు. 
నేను నా ఫోన్ ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగిస్తున్నాను, కానీ ఈ ప్రాంతం చాలా చీకటిగా ఉన్నందున ఇది ఏంటని మనం exactగా అర్ధం చేసుకోలేకపోతున్నాము. ఇది ఏంటని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదేంటంటే, ఇదేలాంటి శిల్పాన్ని ఈ గుడిలో, ఇంకా ఎక్కడైనా వేరుతురు ఉన్న ప్రదేశంలో చెక్కారో లేదా అని చూడాలి. ఇదిగో, ఇక్కడ ఈ చెక్కడాన్ని చూడండి. ఇందులో కూడా, రెండు పాములు పెనవేసుకుని ఉన్నాయి, కానీ వీటి మధ్యలో ఒక pinecone లాంటి వస్తువు ఉంది చూడండి, ఇది చూడడానికి ఒక కాండం మీద ఉన్న ఒక pinecone లాగా ఉంది కదా. ఈ శిల్పాన్ని చూసిన వెంటనే, ఇటలీలోని ట్యూరిన్ మ్యూజియంలో పెట్టిన ఒక ఈజిప్షియన్ కళాఖండమే నాకు గుర్తుకు వస్తుంది. 
ఈ కళాఖండాన్ని సుమారు 1200 BCలో తయారు చేశారు, అంటే ఇది 3200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ చూడండి, మనకు దీన్నే అక్కడ కూడా చూపిస్తున్నారు, రెండు పెనవేసుకున్న పాములు ఉన్నాయి మరియు వాటి మధ్య ఒక కాండంతో ఒక pinecone వంటి ఒక వస్తువు ఉంది. ఇప్పుడు, ఇందులో చాలా interesting అయినా ఒక విషయం ఉంది, ఏంటంటే, ఈ రెండు పాములకు ఇంకొక similarity ఉంది, అది ఈ రెండు పాములకు ఉన్న కిరీటాలు. ఇదే నిజంగా అసలైన విషయం. ఈ symbol భారతదేశంలో ఉన్న శిల్పాలలో ఉంది అలానే పురాతన egyptలో ఉన్న శిల్పాలలో కూడా ఉంది. భారతదేశంలో ఉన్న ఈ హిందూ గుడులలో Egyptకు చెందిన ఈ పురాతన శిల్పాలు ఎలా ఉన్నాయి? ఈ గుడి, ఈజిప్ట్ నుండి సుమారు 3,000 మైళ్ల దూరంలో ఉంది. 
ఈ రెండు ఇంత దూరంలో ఉన్నప్పటికీ, పురాతన కాలంలో అలాంటి కనెక్షన్ ఎలా సాధ్యమైంది? ఈ రెండు పాములకు మధ్య ఉన్న ఈ వస్తువు ఏంటీ? ఇది నిజంగా pineconeనేనా? లేకపోతే మరేదైనా అయ్యుంటుందా? కానీ ఇది ఏంటని, ఎవరికీ తెలియదు, కొందరు ఇది ��సలు నిజం కాదని, ఈ మొత్తం ఒక ఆధ్యాత్మిక చిహ్నం అని కూడా చెప్తున్నారు. సరే ఇప్పుడు, ఈ చీకటి ప్రాంతాలలో కొన్ని ఇతర శిల్పాలను అన్వేషిద్దాం రండి, బహుశా మనం ఇక్కడ మరిన్ని శిల్పాలను కనిపెట్టి, వాటిని బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైన, వివరించలేని చెక్కడాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ, ఒకదానికొకటి, పెనవేసుకున్న మరొక పాములను మనం చూడవచ్చు, ఇందులో కూడా, పైన్‌కోన్‌ ఉండడం మనం చూడగలుగుతున్నాము. 
కానీ ఈ శిల్పంలో ఒక చిన్న difference ఉంది, ఏంటంటే, మనం ఇప్పటివరకు చూసిన, పాములకు లోపల మాత్రమే pinecone ఉంది, కానీ ఈ చెక్కడంలో ఈ రెండు పాముల తల పైన ఉంది, కానీ దీనికి పొడవైన కాండం లేదు. So, ఇది కేవలం చిహ్నంగా అయితే ఉండదు, ఎందుకంటే దీనికి, మనము ముందు చూసిన చెక్కడంకి difference ఉంది కదా. So, ఇది ఏంటీ? అక్కడ చూడండి, ఇంకొంత దూరంలో, మరొక చెక్కడం మనకు కనిపిస్తుంది. 
ఇది కూడా బాగానే కనిపిస్తుంది, కానీ మనం దగ్గరగా వెళ్లి చూద్దాం రండి, ఇందులో ఉన్న pinecone చాలా విచిత్రంగా ఉంది చూడండి, ఈ pinecone straightగా లేదు, తలక్రిందులుగా ఉంది, ఇది పాముల తల పైనుండి కిందికి పోతున్నట్టు ఉంది చూడండి. దీని అర్థం ఏంటీ? పెనవేసుకున్న పాముల యొక్క రెండవ లూప్‌ను చూశామంటే, ఈ pinecone తలక్రిందులుగా కనిపిస్తుంది. ఈ వస్తువు ఏమై ఉంటుంది? ఇక్కడున్న వేర్వేరు శిల్పాలలో, వేర్వేరు స్థానాల్లో ఈ pinecone ఉన్నట్టు ఎందుకు చూపించారు? ఇవి, పాములకు ఎలా కనెక్ట్ అయ్యాయి?
- Praveen Mohan Telugu
1 note · View note