Tumgik
#medaram hundi
telanganajournalist · 3 years
Text
If you say "The God is nomore"?
అస‌లు దేవుడే లేడంటా? మ‌న‌కోసం రాడంటా? దేవుడు ఉన్నాడు అనడం అబ‌ద్ధం అట‌!
Tumblr media
అయ్యో.. అయ్యో ఘోరం జ‌రిగిపోయిందే.. ఇన్ని రోజులు గుడికెల్లి ప్ర‌తి పండుగ‌కు కొబ్బ‌రికాయ‌, అగ‌ర్ వ‌త్తి, పూలు, పండ్లు దూప‌, దీప‌, నైవేద్యాలు స‌మ‌ర్పించేవాడిని. ఇప్పుడు దేవుడు లేడు రాడు అంటే ఎలా మేమేలా బ‌త‌కాలి. మాకు క‌ష్టాలు వస్తే ఆ దేవుడి రూపంలో ఉన్న రాతి విగ్ర‌హానికి, గుడిలో పూజారికి చెప్పుకునే వాళ్లం. ఇప్పుడు దేవుడు లేడంటే పూజారి కూడా ఉండ‌డే ఎలా ఏమ‌య్యావు దేవుడా? ఆ దేవుడు ఉన్నాడు అని టీవీల్లో రోజూ స్వామి చేప్పేవారు, గ్ర‌హాలు, జాత‌కాలు చెప్పే వాళ్లు ఏమైపోతారు? పూజారులు ఎలా బ‌తుకుతారు? నేనెలా బ‌త‌కాలి..దేశంలో గుడిల పేరుతో ఉన్న ఆస్తులు ఏమ‌వుతాయి? దేవుడు లేడంటే మ‌రి ఎవ‌రికి మా క‌ష్టాలు చెప్పుకోవాల‌ని అని ఒక భ‌క్తుడు చాలా బాధ‌ప‌డ్డాడు. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు కొంద‌రు బుద్ధిస్టులు వ‌చ్చి ఈ విష‌యం చెప్ప‌గా ఇలా స్పందించాడు ఆ ప‌ర‌మ‌భక్తుడు. నిజ‌మే క‌దా!
ఆలయల్లో హుండీల ఆదాయం పెరిగినట్టు..
మ‌రి ఎందుకు ఇన్ని గుళ్లు, పూజారులు, య‌జ్ఙాలు, హోమాలు వాటిని చూసుకోవ‌డానికి ఒక మంత్రిత్వ‌శాఖ‌. కోట్ల‌ల్లో డ‌బ్బు, ట‌న్నుల్లో బంగారం దేవుడి పేరు మీద చ‌లామ‌ణి అవుతోంది. అదంతా ఎక్క‌డికి పోతోంది. ఎవ‌రి జేబుల్లోకి వెలుతుంది? అస‌లు రాముడే లేన‌ప్పుడు ఈ అయోధ్య‌లో అంత‌ఖ‌ర్చుపెట్టి గుడేందుకు క‌ట్టాలి? ఏడుకొండ‌ల వాడే లేడ‌న్న‌ప్పుడు ఆయ‌న చుట్టూ ఎందుకంత హంగామా న‌డుస్తోంది? జ‌గ‌న్నాథుడే లేన‌ప్పుడు పూరి లో ఆయ‌న‌కు ఆ ర‌థం ఎందుకు? అక్క‌డ అంత జ‌నం ఎందుకు వ‌స్తున్నారు? శ్రీశైలంలో మ‌ల్ల‌న్నే లేడ‌నుకుంటే ఆ ఉత్స‌వాలెందుకు? మ‌ధుర‌లో మీనాక్షే లేద‌న‌ప్పుడు మ‌దుర మీనాక్షి చుట్టూ అంత హంగు ఆర్భాటాలు, పూజ‌లు, పునస్కారాలు ఎందుకు? ఈ పుష్కారాలు ఎందుకు?
అలాగే అల్లాయే లేడ‌నుకుంటే మ‌క్కా ఎందుకు? ఈ మ‌జీదులు ఎందుకు? యేసు క్రీస్తు పుట్ట‌లేద‌నుకుంటే.. ఈ చ‌ర్చీలు ఎందుకు? ఆ వాటిక‌న్ సిటీలో ఆ పోప్ లు ఎందుకు?
ఇలా ఇన్ని మతాలెందుకు వ‌చ్చాయి? ఒక్కొక్కరికి ఒక్కో దేవుడి పేరుమీద ఈ క‌ల్లోలం ఎందుకు? ఇదంతా ఎవ‌రు చేస్తున్నారు? ఎవ‌రు స్రుష్టిస్తున్నారు ఈ న‌మ్మ‌కాల‌ను? ఎప్ప‌టి నుంచి జ‌రుగుతోంది ఈ త‌తంగం? దీనివ‌ల్ల ఎవ‌రు లాభ ప‌డుతున్నారు?
పేదల దేవుడు ఎవరు?
ఈ దేవుళ్ల చుట్టూ పెద్ద వ్యాపార‌మే న‌డుస్తోంది... కొన్ని ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల్లో ఇచ్చిపుచ్చుకోవ‌టాలు జ‌రుగుతున్నాయి. కానీ పేద‌లు మాత్రం అలాగే ఉన్నారు. వారికి ఏ దేవుడు స‌హ‌క‌రిస్త‌లేడే? నిజంగా దేవుడే ఉంటే... అంద‌రినీ స‌మానంగా చూసేవాడే ఐతే.. న్యాయా అన్యాయాలు తెలిసినవాడే అయితే..ఈ అరాచ‌కాలు, ఆడ‌పిల్ల‌ల‌పై అత్యాచారాలు, చిన్న‌పిల్ల కిడ్నాప్ లు, మ‌నుషుల‌ను చంపి అవ‌య‌వాల దందాలు, మాఫియాలు, దారి దోపీడిలు, ఐశ్వ‌ర్యం అంతా కొంద‌రి చుట్టే ఎందుకు తిరుగుతుంది. పేద‌వాళ్ల‌కు ఎందుకు చేర‌టం లేదు. ప్ర‌జాస్వామ్మం, సోష‌లిస్ట్, రిప‌బ్లిక్ కంట్రీ అయితే మ‌న అంబేడ్క‌ర్ చెప్పిన‌ట్టు ఈ ఫ‌లాలు వీళ్ల‌కు గ‌త 50 ఏళ్ల క్రిత‌మే అందాలి. మ‌రి అంద‌లేదు. ఎక్క‌డ లోపం ఉంది. దేవుల్లలోనా లేక దేవున్ని పూజించే పూజారుల్లోనా లేక దేవుడి పేరుతో చ‌లామ‌ణి అవుతున్న స్వామీజీల్లోనా లేక దేవుడి పేరు మీద వ్యాపారం చేస్తున్న పెత్తందారుల్లోనా లేక దేవున్నే న‌మ్ముకున్న బ‌డుగు బ‌ల‌హీల‌న వ‌ర్గాల్లోనా? ఎవ‌రిదిలోపం? ఎక్క‌డుంది లోపం? ఎన్న‌టికి తీరేను ఈ శాపం.
ఏది నిజం? ఏది అబద్దం?
అస‌లు రాజ్యాంగాన్నే మార్చాల‌న్న పాల‌కులు దీనికి స‌మాధానం చెప్పాలి?. మాది హిందూ రాజ్యాం హిందూ ధ‌ర్మం అంద‌రినీ ర‌క్షిస్తుంద‌ని అయోద్య‌లో గుడి నిర్మించి రామ‌రాజ్యం తెస్తామ‌న్న ఆర్ఎస్ఎస్ నాయ‌కులు దీనికి సమాధానం చెప్పాలి?. అల్లా దేవుడు ఒక్క‌డే అల్లాను న‌మ్ముకుంటే బాగుప‌డ‌తారు కోటీశ్వ‌రులు అవుతారు, అమ‌రుల‌వుతారు అన్న మ‌త పెద్ద‌లు చెప్పాలి? ఈ ప్ర‌పంచానికి ఏసుక్రీస్తు ఒక్క‌డే దేవుడు అంతా క్రిష్టియ‌న్ మ‌తాన్ని న‌మ్ముకుంటే ఆ ప్ర‌భువు నిన్ను ఎల్లవేళ‌ల ర‌క్షిస్తాడ‌ని చెబుతున్న‌ పాస్ట‌ర్ లు దీనికి స‌మాధానం చెప్పాలి? ఏది నిజం ఏది అబ‌ద్ధం?
శాస్త్ర‌విజ్ఙానానికి, మాన‌వ న‌మ్మ‌కానికి మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు ముగిసేదెన్న‌డు?
ఈ 21వ శ‌తాబ్ధంలో కూడా మ‌త‌విశ్వాసాలు మాన‌వ జీవితాల‌తో చెల‌గాట‌మాడుతున్నాయి. దేవుడు పేరు మీద కొంద‌రు సృష్టిస్తున్న క‌ల్లోలం మ‌న క‌ళ్లెదుటే క‌న‌బ‌డుతోంది. ఒక‌వైపు బుద్ధుడు బోద‌న‌లు, మ‌రొక‌వైపు మ‌నువాదులు, ఇంకొక‌వైపు టెక్నాల‌జీ మ‌న‌కు ఏం నేర్పుతున్నాయి. ఒక‌సారి ఆలోచ‌న చేసుకోవల‌సిన అవ‌స‌రం ఉంది. ఐన్ స్టీన్, కారల్ మాక్స్, స్టీఫెన్ హాకింగ్ లు చెప్పిన సిద్ధాంతాలు ఈ ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లోకి ఎక్కేదెలా? కెఎస్ వై ప‌తంజ‌లి గారు గెలుపు స‌రే బ‌త‌క‌డం ఎలా ? అనే ఒక పుస్త‌కంలో ఆయ‌న ఏమీ రాశారంటే..
అబ‌ద్ధం...నిజం!! ల మ‌ధ్య ఎంత అంత‌రం ఉందో విపులంగా చెప్పారు
దేవుడు అబ‌ద్ధం- పూజారి నిజం
పూజ‌లు అబ‌ద్ధం- గుళ్లు, హుండీలు నిజం
చ‌ట్టం అబ‌ద్ధం- పోలీసులు నిజం
న్యాయం అబ‌ద్ధం- లాయ‌ర్ ఫీజు నిజం
న్యాయ‌స్థానం అబ‌ద్ధం- క‌ట‌క‌టాలు నిజం
ప్ర‌జాస్వామ్యం అబద్ధం- చ‌ట్ట‌స‌భ‌లు నిజం
నీతులు అబ‌ద్ధం- లాభ‌న‌ష్టాలు నిజం
స‌త్య‌హ‌రిశ్ఛంద్రుడు అబ‌ద్ధం- ఇచ్చోట‌నే అనే ప‌ద్యం నిజం
ఆత్మ అబ‌ద్ధం- శ‌రీరం నిజం
అంత‌రాత్మ అబ‌ద్ధం- ఆత్మ‌వంచ‌న నిజం
దీనిలో ఎంత నిగూఢార్థం ఉందో ఇట్టే చెప్ప‌వ‌చ్చును.
ఇవాళ లోకంలో జ‌ర‌గుతున్న ఉక్రెయిన్- ర‌ష్యాల మ‌ధ్య ఒక వైపు భీక‌ర యుద్ధం జ‌రుగుతూ వేలు, ల‌క్ష‌ల మంది అమాయ‌కుల‌ ప్రాణాలు కోల్పోతున్నారు. ఆధిప‌త్య‌పోరు వ‌ల్ల మాన‌వ‌, ఆస్తిన‌ష్టం జ‌రుగుతోంది. మ‌త ఘ‌ర్ష‌ణ వ‌ల్ల వేల‌మంది చ‌నిపోతున్నారు. ఈ భౌతిక ప్ర‌పంచంలో ఏదీ నిజం, ఏదీ అబ‌ద్ధం అని తెలుసుకోలేక ఘ‌ర్ష‌ణ‌లు, మ‌త‌క‌ల్లోలాలు, మ‌త‌రాజ‌కీయాలు, మ‌తోన్మాద చ‌ర్య‌లు ప్ర‌తిరోజూ చూస్తూనే ఉన్నాం.. అయినా మ‌న‌కు అర్థం కాదు. గ‌త మూడేళ్లుగా ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడించిన క‌రోనా విల‌య‌తాండ‌వం ఇంకా మ‌రువ‌క ముందే మ‌నం దేవుడు, దెయ్యం, భూతం, నేనే గొప్ప అనే భావ‌న‌లో నుంచి బ‌యట‌ప‌డలేక‌పోతున్నాం.
క‌రోనా వ‌చ్చిన‌ప్పుడు...
దేవుళ్లు దాక్కున్నారు!
ప్ర‌వ‌క్త‌లు పారిపోయారు!
ప‌రిశుద్ధ ఆత్మ‌లు ముక్కుమూసుకున్నాయి!
సైన్స్ మాత్రం మందు క‌నిపెట్టింది!
ఇది నిజం కాదా?
ఈనాటి ప్ర‌పంచంలో గంట‌సేపు సెక్యూరిటీ లేకుండా త‌మ‌ని ర‌క్షించుకోలేని నేటి పాల‌కులు.. జీవిత‌కాలం ప్ర‌జ‌ల‌ను ర‌క్షిస్తామంటే ఎలా న‌మ్మ‌మంటారు?
ప్ర‌కృతిని ఆరాధించే ఆదిమ తెగ‌లకు చెట్లు, పుట్ట‌లే దేవుళ్లు అని భావించారంటే వారి అంతరార్థం అర్థం చేసుకోవ‌చ్చు. ఎందుకంటే వారు ప్ర‌కృతోనే జీవిస్తారు. అది అందించే ఫ‌లాలు, ఆకులు, చెట్ల‌బెర‌డులు, దుంప‌లతోనే ఆక‌లి తీర్చుకుంటారు. వాటి వేళ్ల‌తోనే వైద్యం చేసుకుంటారు. అది స‌హ‌జం. కానీ అన్నీ తెలిసిన త్రిదండి చిన్న జీయ‌ర్ స్వామి కూడా వారిని హేళ‌న చేస్తే ఎలా? వైష్ణ‌వుల ఆరాధ్యుడైన చిన‌జీయ‌ర్ స్వామికి క‌రోనా నుంచి కాపాడింది ఎవ‌రు? సైన్సు ప‌రిశోధ‌న‌లో త‌యారైన టీకానే క‌దా! మంత్ర‌గాళ్ల‌కు ఉన్న గౌర‌వం మిగిలిన మ‌నుషుల‌కు ఉండ‌దు ఈ మ‌తిలేని స‌మూహంలో అని ఒక సీనియ‌ర్ విద్యాగురువు ఒక‌రు అన్నారు. ఇలా చెప్పుకుంటే పోతే కోకొల్ల‌లు.. నిజాన్ని దాచిపెట్టి పైపై మెరుగుల‌కు, మ‌త‌విశ్వాసాల‌ను రుద్ధి వారి జీవితాల‌తో ఆడుకోవ‌డం ఆపండి.
-వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్
0 notes
rajakeeyamwats-blog · 6 years
Video
youtube
452 హుండీలలో డబ్బు లెక్కింపు || Medaram Hundi Amount Counting || Rajakeeyam
0 notes
Photo
Tumblr media
కొనసాగుతున్న మేడారం హుండీల లెక్కింపు.. ఇప్పటి వరకు ఎంత ఆదాయం వచ్చిందంటే.. #medaramhundiscounting #medaramjatara #medaramjatara2020 #onlinetelugu #onlinenewstelugu #bestnewswebsites #besttelugunewswebsites #toptelugunewswebsites https://telugu.newsmeter.in/medaram-hundis-counting/?feed_id=8451&_unique_id=5e49060e070fe
0 notes
ithihasatv · 5 years
Video
youtube
గత రికార్డ్ బ్రేక్ చేసిన మేడారం ఆదాయం ! MEDARAM HUNDI RECORD BREAK
0 notes