Tumgik
#egyptiangodkings
praveenmohantelugu · 9 months
Text
youtube
పొడుగు ఆకారపు పుర్రెలతో ఉన్న గ్రహాంతరవాసులు, మానవులను జన్యుపరంగా మార్పు చేశారా? - ఎపిసోడ్ 2
So, ఈ పురాతన Astronauts చూడడానికి ఎలా కనిపిస్తున్నారు? ఇక్కడ, మీరు వాటిని చూడవచ్చు, అవును అవి పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలను కలిగి ఉన్నాయి, ఇవి మనుషులుగా కనిపించడంలేదు. మనుషులకు ఇంత పెద్ద తలలు ఉండవు కదా? కానీ వారు ఏం చేస్తున్నారు? వారు చేతిలో పందిని పట్టుకున్నారా? పైన, మీరు మరింత crazyగా ఉన్నదాన్ని చూడవచ్చు, మనం పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెతో, మరొక జీవిని చూడవచ్చు, కానీ అది ఒక శిశువును పట్టుకొని ఉంది. ఇది ఒక crazy అయినా detail. ఇక్కడేమవుతోంది? గ్రహాంతర వాసులు, మనుషులను geneticalగా మార్పులు చేస్తున్నారా? ఈ జీవులు పిల్లలు మరియు జంతువులతో ప్రయోగాలు చేస్తున్నాయా? ఇందుకోసమే Placentaతో పాటు, శిశువు చెక్కడాన్ని మరియు బొడ్డు తాడుతో పాటు జీవితం ఎలా సృష్టించబడుతుందో వర్ణించారు? మరీ ముఖ్యంగా, పురాతన astronauts చూడడానికి ఇలానే ఉండేవారా? వారికి పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలు ఉన్నాయా? పైన, మరో 2 బొమ్మలు ఉన్నాయి, వాటి ముఖాలు భారీగా వికృతీకరించబడ్డాయి, మళ్లీ అవి పొడుగు ఆకారంలో, తలలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కానీ, పురాతన నిర్మాణదారులు, ఒకవేళ పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలతో, ఈ జీవులను ఊహించుకుంటే ఎలా ఉంటుంది?
అంతే కదా? కాదు Archeologistలు అనేక పురాతన ప్రదేశాలలో, ఖననం చేయబడిన, అసలైన పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలను కనుగొన్నారు. ఉదాహరణకు పెరూలో, వారు, ఒకటి రెండును కనుగొనలేదు, వారు చాలా కనుగొన్నారు. ఇది సాధారణ మానవ పుర్రె - మరియు ఇది పొడుగుచేసిన పుర్రె, ఇది వింతగా ఉందని నా ఉద్దేశ్యం. ఇతర పురాతన నాగరికతలు కూడా పొడుగుచేసిన పుర్రెల గురించి ప్రస్తావించాయి. ఇది, ఈజిప్ట్‌లో ఉన్న ఒక పురాతన విగ్రహం, ఇది దేవుని రాజు ఆఖెనాటెన్ మరియు అతని వారసులను చూపుతుంది - ఆ పుర్రె ఎంత పొడవుగా ఉందో చూడండి? కాబట్టి, ఈ ఇండోనేషియా ఆలయంలో ఉన్న, ఈ శిల్పాలు ఊహకు అందడం లేదు. దీన్ని చూడండి, ఈ పుర్రెలు చాలా పెద్దవి మరియు పొడుగుగా ఉన్నాయి. మధ్యలో ఉన్న ఈ వ్యక్తిని చూడండి, ఇది ఒక పెద్ద తల, మానవ తలలు ఇలా కనిపించడానికి అవకాశం లేదు. And ఇక్కడ చూడండి, అతనికి మరింత crazyగా ఉంది, అతని ముఖానికి నకిలీ గడ్డాన్ని attach చేశారు చూడండి. ఇది చూడడానికి అసలు గడ్డంలా లేదు, అతను నకిలీ గడ్డాన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఈజిప్షియన్ గాడ్ కింగ్స్ పొడుగుచేసిన పుర్రెలను మాత్రమే కాకుండా, నకిలీ గడ్డాలు కూడా ధరించేవారని మీకు తెలుసా?
ఇది, పురాతన ఈజిప్టులో, నకిలీ గడ్డాలను ధరించడం ఒక ఆచారం, అయితే ఇండోనేషియాలో వేల మైళ్ల దూరంలో ఉన్న ఈ చెక్కడంలో మనం ఎందుకు చూస్తాము? ఆలయం ఖచ్చితంగా పురాతన పిరమిడ్లతో connect అయ్యి ఉంటుంది. కుడి వైపున ఉన్న ఈ బొమ్మను చూడండి, ఇది అతని పొడుగు ఆకారంలో ఉన్న తల మాత్రమే కాదు, అతని ముఖం కూడా అలానే ఉంది, ఇది చూడడానికి మానవ ముఖంగా కనిపించడంలేదు, ఇది చాలా పదునుగా మరియు సూటిగా ఉంటుంది. అతను వేరే ఏదో అయ్యుంటాడని స్పష్టంగా తెలుస్తుంది. And ఈ బొమ్మని కూడా చూడండి, ఈ తల సాధారణమైనది కాదు, ఇది ఖచ్చితంగా పొడుగుగా ఉంటుంది. అవి హెల్మెట్‌లు అని మీరు అనుకోవద్దు, సమీపంలో ఉన్న శిల్పాలను చూడండి, ఇవి హెల్మెట్‌లు, కానీ ఇవి కాదు. ఇక్కడ చెక్కబడిన, ఈ బొమ్మల్లో చాలా వరకు పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలు ఉన్నాయి. వారి యొక్క పొడుగు ఆకారంలో ఉన్న పుర్రెలు, ఇవి గ్రహాంతరవాసులని నిర్ధారిస్తాయా? ఆఫ్రికాలోని మాంగ్‌బెటు తెగల మాదిరిగా, కపాల వైకల్యాన్ని పాటించే వారు కేవలం మానవులే అయితే? వారు మానవులకు భిన్నమైన, ఇతర భౌతిక లక్షణాలను కలిగి ఉన్నారా? ఎవరికీ తెలియని విషయాన్ని నేను కనుగొన్నాను.
ఇక్కడున్న, ఈ గ్రహాంతరవాసుల పుర్రెలలో రంధ్రాలు ఉన్నాయి. ఈ బొమ్మను చూడండి, మీకు ఈ రంధ్రం కనిపిస్తుందా? అతని ఇయర్‌లోబ్ ఇక్కడ ఉంది, మరియు అతని చెవిపోగు చెవిలోబ్ నుండి వేలాడుతోంది. కానీ మనం ఇక్కడ, ఇయర్‌లోబ్ పైన, పుర్రెపై ఒక రంద్రాన్ని చూడవచ్చు. ఇది కేవలం, చెక్కడం పొరపాటు అని మీరు అనుకోవచ్చు, కదా? కాదు, తరువాత ఉన్న బొమ్మను చూడండి. మీరు దీన్ని చూస్తున్నారా? అతని చెవి లోబ్ పైన ఒక రంధ్రం ఉంది, కానీ మానవులకు వారి చెవి లోబ్స్ పైన ఇలాంటి రంధ్రం ఉండదు. And ఈ జీవులు, ఈ భౌతిక లక్షణాన్ని కలిగి ఉన్నాయి, ఇవి సరీసృపాల గురించి మనకు గుర్తుచేస్తున్నాయి - సరీసృపాలకు సరిగ్గా, ఈ ప్రదేశంలోనే రంధ్రం ఉంటుంది. ఇక్కడ అతని పుర్రె చూడండి, అది ఖచ్చితంగా పొడుగుగా ఉంది, కదా? ఇప్పుడు, ఈ ఆలోచనకు support ఇవ్వడానికి నేను ఈ carvingsను ఎంచుకుంటున్నానని మీరు అనుకోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను మీకు చూపించిన మునుపటి శిల్పాలకు తిరిగి వెళ్దాం, పొడుగుచేసిన పుర్రెలతో ఉన్న, ఈ 3 బొమ్మలు గుర్తున్నాయా?
Praveen Mohan Telugu
1 note · View note