#Telangana Journalist Ghosha
Explore tagged Tumblr posts
Text
A Reporter's Life struggle...!
బతుకు పోరాటం: 100 రోజుల పనికి దిగిన తొలి జర్నలిస్ట్ (Post Graduation in Journalism) నేనే అనుకుంటా...!
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2005 చట్టం ప్రకారం ప్రతి పల్లె వ్యక్తికి ఏడాదిలో కనీసం 100 రోజుల పని కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కరోనా సమయంలో 150 రోజులకు పెంచినట్టు గుర్తు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, వ్యవసాయ సంబంధ రంగాలు, పంచాయతీ, పాఠశాలల అభివృద్ధి, ప్రకృతి వనాలు, నర్సరీ, కాలువలు, వైకుంఠదామాల్లో ముళ్ళ కంపల తొలగింపు మున్నగు పనులను ఉపాధి హామీ కూలీల ద్వారా పంచాయతీ అధికారులు పని చేయిస్తారు.
ఈ పనుల వల్ల ఊరు బాగుపడటమే కాక గ్రామీణ ప్రాంతాల్లో నివసించే నాబోటి పేద ప్రజలకు ఉపాధి కూడా లభిస్తుందనడంలో సందేహం లేదు. పని కావాలి అనుకున్న 20 నుంచి 30 మంది వరకు శ్రమైఖ్య (శ్రమ శక్తి) గ్రూపులుగా ఏర్పడి డిమాండ్ నోటీస్ మేటి ద్వారా ఫీల్డ్ అసిస్టెంట్లకు(వీరిని కేసీఆర్ వచ్చాక తీసేసి, మల్లీ విధుల్లోకి తీసుకుంటామని చెప్పి నెలకు పైనే అయిందనుకుంట ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు) లేదా పంచాయతీ కార్యదర్శులకు ఇచ్చి ఉపాధి హామీ పని పొందవచ్చు. నేను సుమారు జాబ్ కార్డు వచ్చిన 9నెలలకు కానీ పని దొరకలేదు. ఎందుకంటే అప్పుడు చాలా మంది రైతులు, కూలీలు వ్యవసాయం పనులకు వెళ్తారు. ఆ సమయంలో ఒక 50 మందికి తప్ప ఎక్కువ మందికి ఉపాధి కూలీ కూడా దొరకదు.
ఇందులో జాతి, మతం, కులం అని చూడకుండా ప్రతి ఒక్కరూ పని చేసుకోవచ్చు. అయితే ��ందులో ఒక్క జోగులాంబ జిల్లాలోనే నిన్నటికి 1 లక్ష 58 వేల 771 జాబ్ కార్డులు ఉండగా.. అందులో మొత్తం ఉపాధి హామీ కూలీలు 3 లక్షల 52 వేల 486 మంది ఉన్నారు. వీరిలో యాక్టివ్ జాబ్ కార్డులు 83 వేల 791 ఉండగా..1 లక్ష 59 వేల 58 మంది వేతనాలు పొందుతున్నారు. ఇక రాజోలి మండలానికి వస్తే...10వేల 776 జాబ్ కార్డులు ఉండగా..అందులో 23వేల 744 మంది ఉపాధి కూలీలు ఉన్నారు. వీటిలో 5 వేల 162 యాక్టివ్ జాబ్ కార్డులు ఉండగా అందులో 9వేల 709 మంది వేతనాలు పొందుతున్నారు.
2011 సెన్సస్ ప్రకారం 3199 జనాభా గల పచ్చర్ల గ్రామ పంచాయితీ పరిధిలో 1641 ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఇందులో 20 గుంటలు , ఒక ఎకరం నుంచి 5 నుంచి 10 ఎకరాలు, 15 ఎకరాల ఆ పైన ఉన్న భూస్వాములు కూడా ఉపాధి హామీ కూలీలుగా నమోదు చేసుకోవడం గమనార్హం. కొందరు వ్యాపారస్తులు ఉపాధి కూలీ మెటీలుగా ఉండటం విశేషం.
RDS క్రింద సాగయ్యే వ్యవసాయం తక్కువే కనుక మా ఊళ్లో చాలా వరకు పొలాలన్నీ బీడు పడి ఉన్నాయి. కొందరు వేరే రాష్ట్రాలకు, హైదరాబాద్ కు వలసలు పోగా.. ఉన్నవారు ప��్చర్ల గ్రామంలో ఇలా ఉపాధి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
ఇక నా విషయానికి వస్తే, నేను హైదరాబాద్ నుంచి వచ్చి గుర్తింపు ఉన్న ఛానల్లో రిపోర్టర్ గా చేయాల్సిన నేను మీసేవలో అప్లై చేసిన పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఆన్ లైన్( ఈ ఒక్క సర్టిఫికెట్ ఆన్ లైన్ ఇవ్వకపోవడం వల్ల నా జాబ్ ఆగిపోయిందని ఆఫీస్ వారు చెబుతున్నారు, ఇందులో సత్యం ఎంతో నాకు తెలియదు) ఇవ్వడానికి(ఆఫ్ లైన్ ఇచ్చారు అది నడవదని చెప్పారు) ఒక ఎస్సై పీఎస్ కు వచ్చి మూడు నెలలైనా.. తన డిజిటల్ సైన్ ఉండే యూఎస్బీ(USB Dongle)ని పోలీస్ టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి సార్ కు తెచ్చుకునే ఓపిక లేక.. నాకు ఆ మీసేవ సర్టిఫికెట్ ఇవ్వకుండా నన్ను ఉపాధి హామీ కూలీని చేసిన మా ఎస్సైకు ధన్యవాదాలు. అలాగే మా పీఎస్ సిబ్బందికి కూడా దాని అవసరం ఇతరులకు ఎంత ఉన్నా వారికి అక్కర్లేదు, వారికి పట్టదు ఎంత బతిమాలినా అదే నిర్లక్ష్యం, ఉండి ఇవ్వటం లేదా అనేది వారికే వదిలేస్తున్నా ..ఇది గతం నా స్టోరీకి కొనసాంగిపు..
-వేంకటేశ్వర్లు బోయ, సీనియర్ జర్నలిస్ట్, గద్వాల్
#A reporter life struggle#Telangana Journalist Ghosha#Upadhi#మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం#telangana#రాజోలి#శ్రమ శక్��ి గ్రూపులు#ఫీల్డ్ అసిస్టెంట్లయూ#పంచాయతీ కార్యదర్శులకు#జాబ్ కార్డు
0 notes