Tumgik
#Nag Panchmi నాగ పంచమి
chaitanyavijnanam · 1 month
Text
శుభ శ్రావణ తోలి శుక్రవారం గరుడ పంచమి మరియు నాగ పంచమి శుభాకాంక్షలు Shubha Sravana Toli Friday Garuda Panchami and Naga Panchami
Tumblr media
శుభ శ్రావణ తోలి శుక్రవారం గరుడ పంచమి మరియు నాగ పంచమి శుభాకాంక్షలు . ఆ నాగ దేవత మనందరి పట్ల ప్రసన్నముగా ఉండాలని అందరి మనోవాంఛలను నెరవేర్చాలని కోరుకుంటూ ..........
ప్రసాద్ భరద్వాజ
Shubha Sravana Toli Friday Garuda Panchami and Naga Panchami. 
Wishing that Naga Goddess to be pleased with all of us and fulfill everyone's wishes ..........
Prasad Bhardwaj
0 notes
chaitanyavijnanam · 1 year
Text
నాగ పంచమి - Naga Panchami (Nag Panchami)
Tumblr media
🌹. నాగ పంచమి 🌹 🌹. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి.🌹 🌸. ఏటా శ్రావణ మాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట. "నాగులచవితి" మాదిరిగానే "నాగ పంచమి" నాడు నాగ దేవతనుపూజించి, పుట్టలో పాలు పోస్తారు.
🌸. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా,అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.
🌸. చలి చీమ నుండి... చతుర్ముఖ బ్రహ్మ వరకు, రాయి - రప్ప, చెట్టు -చేమ, వాగు-వరద, నీరు -నిప్పు,అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కుతి హిందువులది.
🌸. హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే. వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తి కి పాన్పు. వాసుకి పమేస్వరుడి కష్టాభరణమ్. వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.
🌸. నాగ జాతి జనము : కశ్యప ప్రజాపతికి, కద్రువ దంపతులకు.. అనంతుడు, తక్షకుడు, వాసుకి, ననినాగుడు, శంఖుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు పిందారకుడు, హహుషుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు.
🌸. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృస్తించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు. "విషయుక్తం గా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా' నిష్కారణం గా ఏ ప్రాణినీ హింసించరాడు.
🌸. గరుడ మంత్రం చదివే వారిని, ఔషధ మని సమేతులను తప్పించుకు తిరగండి. దేవతా విహంగ గణాలకు, జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి. వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి. మీ నాగులంతా ఆటలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు.
🌸. దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు. భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు. దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట��టారు. వైదిక కాలం నుండి కార్తీక మాసం ఐదవ రోజు పంచమి ఉత్సవాలు జరుపుకునే సంప్రదాయం దేశమంతా ఉంది.
🌸. పుట్టలో ఆవుపాలు, వడపప్పు, చలిమిడి, అరటిపండ్లు, కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు. పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది. ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది.
🌸. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.
🌸. శ్రావణ మాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం. ఇదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే శుక్లపంచమినాడు జరుపుకునే నాగ పంచమి కూడా ఈ సంప్రదాయానికి చెందినదేనని పండితులు అంటున్నారు.
🌸. అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి.
🌸. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి.
🌸. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి.
🌸. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.
🌹🌹🌹🌹🌹
0 notes