#Modi lokasabha speech
Explore tagged Tumblr posts
Photo
స్వాతంత్ర్యం కోసం గాంధీలే కాదు ఆజాద్, భగత్ సింగ్, వీరసావర్కర్ లు పోరాడారు
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం తెలుపుతూ ప్రధాని మోదీ ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. సోమవారం నాడు భూకంపం వచ్చిందని తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు ఆయన. నిన్ననే భూకంపం ఎందుకు వచ్చిందని ఆలోచిస్తున్నాని మోదీ అన్నారు. భూమిని ఇంత లూటీ చేశారా అని ప్రధాని గత పాలకులను విమర్శించారు. దీంతో విపక్షాలు ప్రధాని ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. నేను మాట్లాడితే భూకంపం వస్తుందని గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ప్రధాని చమత్కారంగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ప్రజాస్వామ్యం పునర్ స్థాపితమైందని, అందుకే ఓ గరీబీ బిడ్డ ప్రధాని అయ్యారని ఆయన గుర్తు చేశారు. చరిత్రను అర్థం చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ పుట్టకముందే, 1857లో స్వాతంత్ర్య ఉద్యమం మొదలైందన్నారు. ఆ ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొన్నారని మోదీ అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనే అవకాశం మనలో ఎవరికీ రాలేదని, కానీ దేశం కోసం జీవించే హక్కు ఉందన్నారు. దేశం కోసం గాంధీలు ప్రాణాలు ఇచ్చారని సోమవారం కాంగ్రెస్ ఎంపీ మల్లిఖార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై ప్రధాని దీటుగా సమాధానం ఇచ్చారు. దేశం గురించి తక్కువగా ఆలోచించేవాళ్లు తమ పార్టీలో ఎవరూ లేరని, స్వాతంత్ర్య సమరయోధుల్లో తమవాళ్లు అయిన సావార్‌కర్, చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాత్రం తమ కుటుంబసభ్యులే బలిదానంలో పాల్గొన్నారని భావిస్తుందని విమర్శించారు.
Source: NT
0 notes