#EgyptianShiva
Explore tagged Tumblr posts
praveenmohantelugu · 20 days ago
Text
youtube
భారతదేశంలో ఈజిప్టియన్ శివలింగం? నిజమేనా?
Hey guys, నేను భారతదేశంలో ఉన్న ఉదయగిరి గుహల దగ్గర ఉన్నాను. ఇవి చాలా పాత గుహాల ఆలయాలు, 3వ శతాబ్దం నుంచి 5వ శతాబ్దం వరకు నిర్మించబడ్డాయి. అంటే, వాటిలో కొన్ని 1800 సంవత్సరాల పురాతనమైనవే! మీరు చూస్తున్నట్లుగా, చాలా గుహలు మూసి ఉన్నాయి, కానీ ఇది గుహ సంఖ్య 4. ఇందులో ఒక అధ్భుతమైన లింగం ఉంది: నేను దీనిని ఈజిప్టియన్ శివుడు అని పిలుస్తాను. అవును, ఈజిప్టియన్ శివుడు! నేను ఈ తాళం వేసిన తలుపు ద్వారా మీకు చూపిస్తాను: "లింగంలో ఒక ముఖం ఉంది, దీన్ని ముఖలింగం అని అంటారు." నా ఛానల్‌లో నేను మీకు వందల లింగాలను చూపించాను, కానీ ముఖం ఉన్న లింగం చాలా అరుదు. అంతే కాకుండా, పురాతన ముఖలింగాన్ని చూడటం ఇంకా అరుదుగా ఉంటుంది. జాగ్రత్తగా చూడండి, నేను అతన్ని ఎందుకు ఈజిప్షియన్ శివుడు అని పిలుస్తానో అర్థమయ్యిందా? దాన్ని దగ్గరగా చూడకూడదనుకుంటున్నారా? కానీ దురదృష్టవశాత్తు, ఈ తలుపు lock చేసి ఉంది, దాన్ని మనం తెరవలేము.
So, ఇప్పుడేమి చేద్దాం? By god grace, నాకు ఈ గుహా దేవాలయాన్ని తెరవడానికి అనుమతి లభించింది and అధికారులు నా కోసం, ఈ ఆలయాన్ని తెరుస్తున్నట్లు మీరు చూడవచ్చు. So, అలాగే లోపలికి వెళ్ళి, మనకు ఏమి కనిపిస్తుందో చూద్దాం. మీకు ఈ శివుడిలో ఏదైనా విచిత్రంగా అనిపిస్తుందా? ధ్వంసమైనా కూడా, ఈ శివుడికి గడ్డం ఉంది, అదీ సాధారణమైన గడ్డం కాదు! సాధారణంగా గడ్డం అంటే మీసం మరియు ముఖం మొత్తం పెరిగే గడ్డం అని అర్థం. కానీ ఈ శివుడిని గమనించండి, ముఖంపై రోమాలు లేవు, గడ్డం లేదా మీసం కూడా లేదు. అయితే, నిపుణులు మరియు స్థానికులు ఇద్దరూ అతనికి గడ్డం ఉందని, చాలా పొడవైన గడ్డం ఉందని, అది కేవలం ఆయన మొండెం భాగానికి మాత్రమే అంటుకుని ఉండేదని confirm చేస్తున్నారు. మనము ఈ గడ్డాన్ని recreat చేస్తే, అతను ఇలా కనిపిస్తాడు. ఇదే ఈజిప్షియన్ దేవుళ్లు మరియు రాజులు ధరించినదీ. పురాతన ఈజిప్షియన్‌లు, క్లీన్ షేవ్‌గా ఉండేవారు. వారికి మీసం లేదు, గడ్డం లేదు, కానీ కేవలం కనబడేలా కింది భాగానికి ఎలా ఒక పొడవైన గడ్డం అటాచ్ చేసేవారని గమనించండి. ఇది నిజమైన గడ్డం కాదు, ఇది నకిలీ గడ్డం. ఈజిప్ట్ రాజులు మరియు దేవుళ్లు, దీన్ని తమ దివ్యత్వాన్ని సూచించేందుకు ధరించేవారు. ఈ 1800 ఏళ్ల పురాతన శివుడిని, భారతదేశంలో ఇదే విధమైన గడ్డంతో, కేవలం chin కింది భాగంలో మాత్రమే ఉండడం చూసి ఆశ్చర్యంగా ఉంది!
దురదృష్టవశాత్తూ, దుష్టులు ఈ సాక్ష్యాన్ని నాశనం చేశారు. కానీ స్థానికులు మరియు నిపుణులు కూడా, ఈ శివుడు అసలు తన chinపై పొడవైన గడ్డం కలిగి ఉన్నారని నిర్ధారించారు. ఈ గుహా దేవాలయం భారతదేశంలో ఉంది, కానీ 2500 మైళ్ళ దూరంలో ఉన్న ఈజిప్టుతో ఏదైనా సంబంధం ఉందా? లేదంటే, ఈ similarity మనకు ఎలా కనిపిస్తోంది? కానీ ఈ సంబంధాన్ని నిర్ధారించే ఇంకొక ఆధారం ఉంది: శివుని యొక్క గొలుసు. ఇది చాలా విచిత్రంగా ఉంది. సాధారణంగా శివుడు రుద్రాక్షలు లేదా పల్చటి గొలుసులు ధరించినట్లు చూపిస్తారు. కానీ ఇక్కడ, ఆయన మెడకు అంచునే వెడల్పుగా ఉన్న హారంతో చూపించారు.
Praveenmohantelugu
0 notes