#Agni Mahapuran
Explore tagged Tumblr posts
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 265 / Agni Maha Purana - 265
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 265 / Agni Maha Purana - 265 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 10 🌻
ప్రథమమండలమునందు, పూర్వదిక్కున, "ఓం హాం రుద్రే��్యః స్వాహా" అను మంత్రముతో రుద్రలకు బలి ఈయవలెను. రక్షిణమున "ఓం హాం మాతృభ్యః స్వాహా" అను మంత్రముతో మాతృకలకును, పశ్చిమమున ఓం హాం గణేభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అను మంత్రముతో గణములకును, ఉత్తరమున ఒం హాం యక్షేభ్యః స్వాహా, తేభ్యో7యం బలిరస్తు అను మంత్రముతో యక్షులకును, ఈశాన్యమునందు ఓం హాం గ్రహేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు" అని చెప్పి గ్రహములకును, అగ్నేయమున ఓం హాం అసురేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి అసురులకును, నైరృతియందు ఓం హాం రక్షోభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అని చెప్పి రాక్షసులకును, వాయవ్యమునందు ఓం హాం నాగేభ్యః స్వాహా, తేభ్యోయం బలిరస్తు అని నాగలకును, మండల మధ్య భాగమున ఓం హాం నక్షత్రేభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి నక్షత్రములకును బలి ఇవ్వవలెను.
ఓం హాం రాశిభ్యః స్వాహా తేభ్యోయం బలిరస్తు అని చెప్పి అగ్నేయమునందు రాశులకును, ఓం హాం విశ్వేభ్యో దేవేభ్యఃస్వాహా తేభ్యోయం బలిరస్తు అనిచెప్పి నైరృతి యందు విశ్వేదేవతలకును, ఓం హాం క్షేత్రపాలాయ స్వాహా, తస్మా ఆయం బలిరస్తు అని చెప్పి పశ్చిమమునందు క్షత్రపాలునకును బలి ఈయవలెను. పిమ్మట రెండవ బాహ్యమండలము నందు, పూర్వాది దిక్కులందు వరుసగ ఇంద్ర - అగ్ని - యమ - నిరృతి - వరుణ - వాయుక - కుబేర - ఈశానులకు బలి సమర్పించవలెను. పిదప ఈశాన్యమునందు ఓం బ్రహ్మణే నమః స్వాహా అని చెప్పి బ్రహ్మకును, నైరృతి యందు ఓం విష్ణవే నమః స్వాహా అని చెప్పి విష్ణువునకు, బలి ఇవ్వవలెను. మండలము వెలుపల కాకాదులకు గూడ బలి ఆంతర - బాహ్యబలుల నిచ్చునపుడు ఉపయోగించిన మంత్రములను సంహారముద్రచే తనలో లీనము చేసికొనవలెను.
అగ్ని మహాపురాణమునందు శివపూజాంగ హోమ విధి నిరూపణ మగు డెబ్బదియైదవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 265 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 10 🌻
60. All the edibles (got ready for the worship) should be taken and kept in two circular diagrams. Offerings should be -done both inside and outside in the vicinity of sacrificial pit in the south-east.
61. Oṃ hāṃ oblations to Rudras in the east and in the same way to the mothers in the south. Hāṃ, oblations to the gaṇas on the west. This offering is for them.
62. And hāṃ to the yakṣas on the north, hāṃ to the planets on the north-east, hāṃ to the asuras on the south-east, hāṃ oblations to the rākṣasas in the south-west.
63. And hāṃ to the nāgas on the north-west, and to the stars at the centre. Hāṃ oblations to the constellations in the south-east, and then to the Viśve (Viśvedevas) in the south-west.
64-65. It is said that the offering for the guardian of the ground is inside and outside in the west. (Oblations should be made) to Indra, Agni, Yama, Nirṛti, Varuṇa, Vāyu, Kubera and Īśāna in the east etc. outside in the second maṇḍala. Salutations to Brahmā on the north-east.
66. Oblations to Viṣṇu in the south-west. The offerings for the crows etc. (should be) outside. The mantras for the two offerings in one’s soul should be by the saṃhāramudrā (posture with fingers indicating destruction).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 79 / Agni Maha Purana - 79
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 79 / Agni Maha Purana - 79 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు ప్రథమ సంపుటము, అధ్యాయము - 27 సేకరణ : ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. 🌻. దీక్షా విధి - 5 🌻
గర్భాధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్నియందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధహోమము చేవలెను.
పండితుడు, జ్ఞానయోగముచేత ఆ పరమున పరమాత్మయందు విలీనముచేసి, బంధ విముక్తడై జీవుడు సుద్ధము, జ్ఞానస్వరూపము, నిర్వికారము, పరమానందరూపము అగు పరమాత్మయందు ఆనందము పొందు చున్నట్లు భావింపవలెను.
పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగా దీక్ష పూర్తియగును.
దీక్షా-హోమ-విలయముల కుపయుక్తములగు ప్రయోగమంత్రములను చెప్పెదను. ''ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్'' అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయవలెను.
''ఓం యం భూతాన్యాపాతయే7హమ్'' అను మంత్రముచే ఆదానము చేయవలెను. ప్రకృతితో యోజనము చేయు మంత్రమును వినుము, 'ఓం యం భూతాని పుంశ్చాహో'' అనునది ప్రయోజన మంత్రము.
హోమ మంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమును చెప్పెను- ''ఓం భూతాని సంహర స్వాహా'' అనునది హోమమంత్రము ''ఓం శ్రీం ఓం నమోభగవతే వాసుదేవాయ వౌషట్'' అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్యనంతరము తత్త్వమునందు శిష్యుని సాధించవలెను. ఈ విధముగా బుధుడు క్రమముగ సర్వతత్త్వ సంశోధనము చేయవలెను.
నమః అనునది అంతమునందుగల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్త్వసంశోధనము చేయవలెను. 'ఓం వాం కర్మేన్ద్రియాణి నమః' 'ఓం దేం బుద్ధీన్ద్రియాణి నమః' ఇత్యాది విధమున చేయవలెను. తాడనాది ప్రయోగము 'యం' బీజముతో చేసినట్లె చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 79 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 27 🌻 Mode of performing the initiation rite - 5 🌻
44. After offering eight oblations each (in favour) of (Garbādhāna[7], Jātakarma[8], enjoyment and dissolution, he should offer them for purification.
45. The preceptor should take up pure materials and bring together the two excellent principles in order in such a way they are not broken.
46. Then the soul, freed from fetters is immersed in the supreme soul in the supreme undecaying position.
47. A learned person has to think of the peaceful, supreme, blissful, pure intellect and offer the completing oblation. Thus ends the (rite of) initiation.
48. I shall describe the mystic syllables for the application with which the oblation (relating to) the initiation is closely associated:
Oṃ, Yaṃ, the goblins, the pure huṃ, phaṭ. By this one should strike and separate the two.
49. Oṃ, Yaṃ, I destroy the goblins. After having seized this (syllable) (you) hear (the mode of) yoking it with the nature. Oṃ, aṃ, the goblins and the males. I shall describe the mystic syllable for the oblation as well as the final oblation.
50. Oṃ, destroy the goblins; oblations. Oṃ, aṃ, Oṃ, salutations to the Lord Vāsudeva, vauṣaṭ. After the final oblation the disciple has to be accomplished. In this way the wise man has to purify the principles.
51. Ending with (the word) salutation and with the basic syllable sva and preceded by beating (one has to say) Oṃ, vāṃ, the organs of action, Oṃ, deṃ, the organs of intellect (sense). With the syllable yam similar beating etc. are done.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
Lord Vishnu Avtars: Mythology and Opinions according to different Purans and Epic:
🚩🚩🚩जय श्री राम🚩🚩🚩
#भगवान्_विष्णु_के_अवतार
Despite counting 22 and 24 avatars in the #BhagavataMahapuran, the majority is with the 10 avatars which have been Described in Mahabharata.
Many Puranas like #Padmapuran (Uttarakhand-257.40,41), #Lingapurana (2.48.31,32), #Varahapuran (4.2), #Matsyapuran (2.85.6,7) have been mentioned the Same 10 Avtars of Lord Vishnu as it is been told in #Mahabharata.
The description of #Agnipuran (chapters-2 to 16) is also exactly the same sequence.
The following verses of this context (with nominal textual distinctions) are often universal: -
मत्स्यः कूर्मो वराहश्च नरसिंहोऽथ वामनः।
रामो रामश्च कृष्णश्च बुद्धः कल्किश्च ते दश॥
Thus, Almost in Every Epic And Mythology, 10 Avatars of Lord #Vishnu is Recognised.
#Ram #Ramayana #RamMandir #Ayodhya #SriRamJanmBhumi #MythologyofLordVishnuAvtars
#10 Avtars of Lord Vishnu#Dasavtar#भगवान् विष्णु के अवतार#भगवान् विष्णु के 10 अवतार#Lord Vishnu Avtars Mythology and Opinions according to the Different Epics and Purans#Mahabharata#Bhagwat Mahapuran#Lingapuran#Varah Puran#Padm Puran#Matsya Puran#Agni Puran#Lord Vishnu#Shloka Written in Mahabharata#Shloka#Hinduism#Hindu mythology#Hindu Gods#Ram#Ramayana#Ram Mandir#Ram Mandir Trust#Ayodhya#Shri Ram Janmbhoomi Teerth Kshetra#Jai Shri Ram#Ram JanmBhoomi nyas
1 note
·
View note
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 264 / Agni Maha Purana - 264
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 264 / Agni Maha Purana - 264 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 9 🌻
పిమ్మట ఘృతముతో నింపిన స్రుక్కు పైన అధోముఖ మగు స్రువము ఉంచి, స్రుక్కునకు చివర పుష్పములుంచవలెను. రెండు చేతులతోడను ఆ రెండింటిని, శంఖముద్రతో పట్టుకొనవలెను. శరీరము పై భాగము ఉన్నతమగునట్లుచేసి లేచి పాదములు సమముగా ఉంచి నిలచి, స్రుక్స్రువముల మూలభాగములను నాభికి అన్చి, దృష్టికి స్థిరముగ నిలిపి, భావనచే బ్రహ్మాదికారణములను విడచుచు, సుషుమ్నా నాడీ మార్గమున బైటకు వచ్చి పైన నిలబడవలెను. స్రుక్స్రువముల మూలభాగములను నాభినుండి పైకి లేపి ఎడమ స్తనమువైపు తీసికొని రావలెను. శరీరము చేతను, మనస్సు చేతను ఆలస్యమును రూపము చేసి, ల్‌షట్, వరకును మూలమంత్రములు (ఓం లమః శివాయ వోషట్) మెల్లగ చదువుచు ఆ ఘృతమును యవ వలె సన్ననైన ధారతో హోమము చేయవలెను.
పిదప, అచమన - చందన - తాంబూలాదులా సమర్పించి భక్తి భావముతో శివుని ఐశ్వర్యమునకు సాష్టాంగవందనము చేసి మరల అగ్నిపూజ చేపి, 'ఓం హః అస్త్రాయ ఫట్" అని ఉచ్చరించుచు సంహారముద్రచే శంబరాహరణము చేసి, భగవంతుడా? నా అపరాధములను క్షమింపుము. అని ఇష్టదేవతను ప్రార్థించి హృదయ మంత్ర ముచ్చరించుచు పూరక ప్రాణాయామముచే, శ్రద్ధతో, తేజఃశాలు లగు ఆ సంధులను తన హృదయ కమలమునందు నిలుపవలెను. వండిన పదార్థములలోని అగ్రభాగము తీసి, కుండసమీపమున అగ్ని కోణమునందు, రెండు మండలములు చేసి ఒక దానిలో అంతర్బలి ఈయవలెను. రెండవదానియందు బాహ్యాబలి ఈయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 264 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 9 🌻
52. The oblation should thus be completed with the (principal mantra) brahmabīja (oṃ) with sacrificial ladles filled with clarified butter holding the ladle in such a way as to have its cup part downwards.
53-56. Having placed a flower at the head of the spoon and then holding it first with the left hand and then with the right band and (showing) the mudrā denoting the conch he should stand up half erect with feet evenly placed and eyes fixed upon the end of the ladle and holding the base of ladle pressed against his navel. Then one should rouse up the stream of his pure consciousness through the suṣumnā (nerve centre below the spiral chord) and carry it to the base of his left breast vigilantly and tell the principal mantra ending with the vauṣaṭ in a low tone. The -clarified butter should be offered having a flow of the measure of the barley.
57. Water for rinsing the mouth, sandal, betals etc. should be offered. (The worshipper) should meditate in his greatness with devotion and then offer salutation.
58-59. After having worshipped the fire well with (the mantra of) the weapon ending with phaṭ and showing the saṃhāra mudrā (the posture of the fingers conveying destruction) and uttering "Pardon me", the gods who reside in the periphery (of the mystic circle) should be placed in the lotus of the heart with extreme devotion with the hṛd mantra after taking a breath.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 263 / Agni Maha Purana - 263
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 263 / Agni Maha Purana - 263 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 8 🌻
యజ్ఞాగ్నికిని,శివునకును తనతో నాడీసంధానము చేసి శక్త్యను సారముగ మూలమంత్రముతో అంగసహితముగ దశాంశహోమము చేయవలెను. ఒక్కొక్క కర్షప్రమాణము గల ఘృత-క్షీర-మధులను,శుక్తిప్రమాణము గల పెరుగును. చారెడు పాయసమును హోమము చేయవలెను. లాజలు, సర్వభక్ష్యములు పిడికిలి ప్రమాణమున గ్��హించి హోమము చేయవలెను. మూలములు మూడు ముక్కలు ఒక ఆహుతిగా ఈయవలెను-ఫలములో వాటిప్రమాణ మెంత ఉండునో అంతే చేయవలెను. అన్నము ప్రమాణము గ్రాసములో సగము. చిన్న (కిన్‌మిస్ వంటి) వాటిని పర్యాయమునకు ఐదేసి గ్రహించి హోమము చేయవలెను. చెరకు ఒక కణుపు గ్రహించవలెను. లతలు రెండేసి అంగుళము లుండవలెను. పుష్పపత్రముల ప్రమాణము వాటి ప్రమాణము ననుసరించి ఉండవలెను. సమిధలు పది అంగుళములు పొడవుండవలెను.
కర్పూర-చందన-కేసర-కస్తూరీ-యక్షకర్దమములు కలాయ ప్రమాణమున (శనగగింజంత) ఉండవలెను. గుగ్గులు రేగి గింజంత ఉంచడవలెను. కందముల ఎనిమిదవ వంతుతో ఒక ఆహుతి చేయవలెను. ఈ విధముగ ఆలోచించి, యథావిధిగ ఆహుతుల నీయవలెను. ఈ విధముగ ప్రణవముతోను, బీజాక్షరములతోను హోమము సుసంపన్న మగు నటుల చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 263 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 8 🌻
46. Having established a union among the god of the sacrificial fire, god Śiva and his soul situated in his arteries, (the worshipper) should offer oblations with the principal mantra befitting one’s capacity and using one-tenth of mantras as a. supplement.
47. A kārṣika (a particular weight) of the clarified butter, milk and honey and a śukti (twice that of kārṣika) of the curd and a handful of sweet porridge (should be) offered.
48-49. The worshipper should offer as deemed fit the oblation with all the eatables, a handful of fried grains, three pieces of roots and an equal number of fruits. Five halfmouthfuls of cooked rice, bits of sugarcane of the length of a span and stems of sacrificial creepers measuring two fingers in length should be offered into the fire.
50. The oblations of flowers and leaves should be according to their own measure. The sacrificial twigs should measure ten fingers in length. The camphor, sandal, saffron, musk and an ointment made of camphor, aggallochum and kakkola in equal parts (should also be offered).
51. (The worshipper) should make an oblation of the kalāya (a leguminous seed) and guggulu (a fragrant (gum-resin) of the size of the kernel of the jujube fruit and eight parts of the roots as laid down.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 262 / Agni Maha Purana - 262
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 262 / Agni Maha Purana - 262 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 7 🌻
పిమ్మట కుండమునందు అగ్నేయము నుండి వాయవ్యమువరకును నైరృతి నుండి ఈశాన్యమువరకును. "ఓం హాం సద్యోజాత, వాసుదేవా ఘోర తత్పురుషేశానేభ్యః స్వాహా" అను మంత్రముతో అవిఛ్ఛిన్నాజ్యధారాహోమము చేసి పంచముఖముల ఏకీకరణము చేయవలెనను. ఈ విధముగ ఇష్టముకమునందు అన్ని ముకములును అంతర్భూతములగును. అందుచే ఒకే ముఖము అన్ని ముఖముల ఆకారమును ధరించును.కుండమునందు ఈశాన్యమున అగ్నిని పూజించి, అస్త్రమంత్రముతో మూడు ఆహుతుల నిచ్చి, అగ్నికి నామకరణము చేయవలెను. 'ఓ అగ్ని దేవా! నీవు అన్ని విధముల శివుడవు-మంగళప్రదుడవు. అందుచే నీ పేరు శివుడు" అని నామకరణము చేసి, పూజింపబడిన మాతాపితరులగు వాగీశ్వరీ వాగీశ్వరులను, నమస్��ార పూర్వకముగ అగ్నియందు విసర్జించి, వారికొరకై విధిపూర్వకముగ పూర్ణాహుతి ఈయవలెను. మూలమంత్రము చివర 'వౌషట్' చేర్చి శివశక్తులకు యథావిధిగ పూర్ణాహుతి ఈయవలెను. పిమ్మట అంగ-సేనాసమేతుడగు, పరమతేజఃశాలియైన శివుని హృదయకమలమునందు ఆవాహనచేసి, వెనుకటివలెనే పూజించి ఆశివుని ఆజ్ఞగైకొని ఆయనునుపూర్తిగ తృప్తుని చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 262 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 7 🌻
41-42. Oṃ hāṃ oblations to Sadyojāta and Vāmadeva. Oṃ hāṃ oblations to Vāmadeva and Aghora. Oṃ hāṃ oblations to Aghora and Tatpuruṣa. Oṃ hāṃ oblations to Tatpuruṣa and Īśāna. Thus the union is done in order with the recitation of these mantras. With the flow of ghee from the sacrificial ladle taking it from the fire through the angular points such as northwest, south-west, and ending with north-east, one should unite the faces. Oṃ hāṃ oblations to Sadyojāta, Vāmadeva, Aghora, Tatpuruṣa and Īśāna. Thus its form and other faces should be contemplated in the face of one’s liking.
43. Having worshipped the fire in the north-east and offering three oblations with the mantra of the weapon, (the worshipper) with his entire soul should contemplate—“O Fire-God! you are the divine essence of Śiva.”
44. Having worshipped the parents with the hṛd (mantra) and left them aside, the final oblation which concludes the rite should be offered as laid down with the principal mantra ending with vauṣaṭ.
45. Then one should worship the resplendent, Supreme God attended upon by the attendants and retinue, after having invoked him in the lotus of his heart as before. He should offer waters of oblation to Śiva after having requested his permission.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 261 / Agni Maha Purana - 261
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 261 / Agni Maha Purana - 261 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 6 🌻
పిమ్మట బాలకుడైన అగ్ని యొక్క ముఖమునందున్న నేత్రత్రయస్థానమున మూడు నేత్రముల ఉద్ఘాటనము చేయుటకై, ఘృతపూర్ణ మగు స్రువముతో "ఓం హామగ్నయే స్విష్టకృతే స్వాహా" అను మంత్రమునుచ్చరించుచు నాల్గవ ఆహుతి ఇవ్వవలెను., "ఓం హాం హృదయాయ నమః" ఇత్యాద్యంగ మంత్రములు ఆరును ఉచ్చరించుచు ఆజ్యమును అభిమంత్రించి, ధేనుముద్రతో మేల్కొల్పవలెను. కవచమంత్రముచే (హుం) ఆచ్ఛాదించి, శరమంత్రముచే ఘృతబిందూత్‌క్షేపణము చేసి, అభ్యుక్షణశోధనములు చేయవలెను. శివస్యరూప డగు అగ్ని యొక్క ఐదు ముఖములకు ��భిఘూరహోమము, అనుసంధానహోమము, ముఖముల ఏకీకరణమునకై చేయు హోమమును చేయవలెను.
"ఓం హాం సద్యోజాతాయ స్వాహా, ఓం హాం వామదేవాయ స్వాహా, ఓం హాం అఘోరాయ స్వాహా, ఓం హాం తత్పురుషాయ స్వాహా, ఓం హాం ఈశానాయ స్వాహా" అను ఐదు మంత్రములచే, ఐదు ముఖములకొరకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క అజ్యాహుతిచేసి, ఆ ముఖములను అభిఘారము చేసిన ఆజ్యముతో అప్లావితము చేయవలెను. ఇది ముఖాభి ఘార హోమము. పిమ్మట రెండేసి ముఖములకు ఒక ఆహుతి ఇవ్వవలెను. ఇది ముఖానుసంధానమహోమము. దానిని_"ఓం హాం సద్యోజాత వామదేవాభ్యాం స్వాహా, ఓం హాం వామదేవా ఘోరాభ్యాం స్వాహా, ఓం హాం అఘోరతత్పురుషాభ్యాం స్వాహా, ఓం హాం తత్పురుషేశానాభ్యాం స్వాహా" అను మంత్రములతో చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 261 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 6 🌻
38. The fourth oblation should be offered with the sacrificial ladle filled with clarified butter. Oṃ hāṃ oblation to firegod for the offering of a right sacrifice. After having consecrated in the six parts of one’s body, (the fire god) should be invoked with the dhenumudrā (posture with the fingers representing a cow).
39. Having covered it with the armour, the clarified butter should be protected by the mantra of the shaft. The clarified butter should be purified by sprinkling water and offering a drop of it into the fire along with the hṛd (mantra).
40. The rites of uniting the mouths of the fire should be performed as follows. Oṃ hāṃ oblations to Sadyojāta. Oṃ hāṃ oblations to Vāmadeva. Oṃ hāṃ oblations to Aghora. Oṃ haṃ oblations to Tatpuruṣa. Oṃ hāṃ oblations to Īśāna. Thus with oblations to one by one, one should do the union of the (different) faces.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 260 / Agni Maha Purana - 260
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 260 / Agni Maha Purana - 260 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 5 🌻
ప్రాదేశ (చాపిన బొటనవ్రేలు చివని నుంచి చూపుడు వ్రేలు చివరవరకుఉన్న పొడవు ప్రాదేశము) ప్రమాణము గల రెండు కుశలను అంగుష్ఠ-అనామికతాంగుళులతో పట్టుకొని, వాటితో, అస్త్రమంత్రో (ఫట్) చ్ఛారణము చేయుచు, నేతిని, అగ్నివైపు కదపవలెను. హృదయమంత్రము (నమః) ఉచ్చరించుచు, చేతిలోని దర్భను కాల్చి, దానిని 'ఫట్' తో అగ్నిచే పవిత్రము చేయవలెను. మండుతున్న కుశతో దానికి హారతి ఇచ్చి, మరొక కుశతో దానిని కాల్చవలెను. మండిన కుశమ అస్త్రమంత్రముతో అగ్నిలో పడవేయవలెను. పిమ్మట, ముడి వేసిన, ప్రాదేశప్రమాణము గల కుశను చేతిలో ఉంచవలెను. ఘృతములో రెండు పక్షములు, ఇడాది నాడీత్రయము ఉన్నట్లు భావన చేయవలెను. ఇడ మొదలగు ముడు భాగముల నుండి క్రమముగ స్రువముతో ఘృతము గ్రహించి హోమము చేయవలెను.
'స్వా' అని ఉచ్చరించి స్రువములోని ఆజ్యము అగ్నిలో వేయవలెను. 'హా' ఉచ్ఛరించుచు, హోమము చేయగా మిగిలిన ఘృతమును, వేరుగా ఉంచిన పాత్రలో ఉంచవలెను. ఇడాభాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం అగ్నేయే స్వాహా" అను మంత్రము నుచ్చరించుచు హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచవలెను. పింగలా భాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం సోమాయ స్వాహా" అని ఉచ్చరించుచు హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచవలెను. సుషువ్ణూనాడీ భాగము నుండి ఆజ్యము గ్రహించి "ఓం హాం అగ్నీ షోమాభ్యాం స్వాహా" అని ఉచ్చరించుచు స్రువముతో హోమము చేసి, హుతశేషమును ఒక పాత్రలో ఉంచుకొనవలెచు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 260 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 5 🌻
33. Water should be sprinkled over the fire in front (of the worshipper) (with the two kuśas) held (as above) accompanied by the mantra of the weapon. Similarly, the worshipper should again sprinkle water (over the fire) in front of him with the hṛd (mantra).
34. The burnt ashes of darbha collected with the hṛd (mantra) should be purified by striking with the implements and with the other lighted darbha it should be taken out and lighted.
35-36. The darbha burnt by the mantra of the weapon should again be thrown into the fire. Having put the knotted darbha of the length of a span in the clarified butter, one should contemplate the two for nights, the three arteries iḍā etc. in the clarified butter and offer the clarified butter divided into three parts as oblation unto fire with the sacrificial ladle in order with (the syllable) sva and hā. The remaining part of the clarified butter should also be offered to the fire successively.
37. Oṃ hāṃ oblation to god Agni. Oṃ hāṃ oblation to god Soma. Oṃ hāṃ oblation to the gods Agni and Soma. (The above oblations should be offered into the fire) for the purpose of opening (as it were) the three eyes of the fire god in his face.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 259 / Agni Maha Purana - 259
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 259 / Agni Maha Purana - 259 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 4 🌻 "ఓ దేవతలారా! మీరందరును విఘ్నములను తొలగించి ఈ బాలకుని (అగ్నిని) సంరక్షించుడు" అను శివాజ్ఞను ఆ దేవతలకు వినిపించి, స్రుక్-స్రువములను ఊర్ధ్వముఖములుగ గ్రహించి వాటిని మూడేసి సార్లు అగ్నిపై వెచ్చచేయవలెను. కుశమూల-మధ్య-అగ్రభాగముతో వాటిని స్పృశించుచు ఆ స్థానములందు క్రమముగ ఆత్మతత్త్వ-విద్యాతత్త- శివతత్త్వముల న్యాసము చేయవలెను. "ఓం హాం ఆత్మతత్త్వయ నమః" "ఓం హీం విద్యాతత్త్వాయ నమః" "ఓం హ��ం శివతత్త్వాయ నమః" అమనని న్యాసమంత్రములు పిమ్మట 'శక్త్యైనమః' "శివాయ నమః" అను మంత్రముతో స్రుక్ స్రువములపై శివశక్తిన్యాసము చేయవలెను.
మూడు పేటల రక్షాసూత్రమును స్రుక్ స్రువముల కంఠభాగమునందు చుట్టబెట్టవలెను. పుష్పాదులతో వాటిని పూజించి కుడి ప్రక్కన ఉన్న కుశలముపై ఉంచవలెను. గోఘృతము గ్రహించి దర్శనాదులచే దానిని పరిశుద్ధము చేసి. తాను బ్రహ్మమయుడని భావన చేయుచు ఆ ఘృతపాత్రమును హృదయమంత్రముతో అగ్నికుండముపై అగ్నేయమున త్రప్పి. మరల నేను విష్ణుస్వరూపుడనని భావన చేయుచు, ఘృతమును ఈశాన్యమునం దుంచి, కుశాగ్రభాగముచే ఘృతము తీసి "శిరసే స్వాహా" "విష్ణువే స్వాహా" అను మంత్రములతో విష్ణువునకు ఆ ఘృతబిందువులను హోమము చేయవలెను. నేను రద్రమయుడ నని భావన చేయుచు, ఘృతమును కుండనాభిస్థామందుంచి, దాని అప్లావనము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 259 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 4 🌻
24-28. One should then make them hear this command of Śiva. He should then take the sacrificial spoon and the ladle, heat them on the fire and touch them with the base, middle and tips of the darbha with face downwards. In the place touched by the kuśa the three principles relating to the soul, knowledge and Śiva should be located duly with the sounds hāṃ, hrīṃ, hūṃ and saṃ. Having located the goddess in the sacrificial spoon and Śambhu (Śiva) in the sacrificial ladle with the hṛdaya mantra, their necks being girdled with three strings (of thread) and worshipped with flowers etc., kuśas should be placed on them and they should be placed on the right side.
29-32. Having gathered the clarified butter of the cow that has been purified by looking at it and after having contemplated one’s own Brahma form and carrying that clarified butter, one should wave it over the pit and move it round and round in the south-east. Again having contemplated the Viṣṇu form, one should hold the clarified butter and carry it towards the northeast, it should be offered to Viṣṇu (into the fire) with the tips of the kuśa and with the mantra of the head ending with svāhā. Similarly, one should conceive the form of Rudra (Śiva) as a point in one’s own navel and meditate. One should sprinkle water over that with two kuśas of the length of a span and held with the ring finger and thumb.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 258 / Agni Maha Purana - 258
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 258 / Agni Maha Purana - 258 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 3 🌻
పిమ్మట ఆరవ మాసమున జరుగు సీమంతోన్నయమును భావనచేసి అఘోర మంత్రముతో అగ్ని పూజించి, "శిఖాయై వషట్" అని ఉచ్చరించుచు మూడు హోమములు చేసి, ఆ మంత్రముతోడనే ముఖాద్యంగ కల్పన చేయవలెను. ముఖోద్ఘాటనము ప్రకటీకరణమును చేయవలెను. పిమ్మట వెనుకటి వలెనే పదవ మాసమున జయగు జాతకర్మ-నరకర్మలను భావించుచు తత్పురుషమంత్రముతో దర్భాదులతో అగ్నిని పూజించి, జ్వలింపచేసి, గర్భమలమును తొలగించుటకై స్నానము చేయించి, దేవి హస్తమునందు సువర్ణ బంధనముచేసి నట్లు భావన చేసి, హృదయ మంత్రముతో పూజించవలెను. సూతకము వెంటనే నివర్తించుటకై అస్త్రమంత్రముతో అభిమంత్రించిన జలముతో అభిషేకము చేయవలెను.
కుండమును, బైటనుండి, అస్త్రమంత్రము చదువుచు కుశలతో మార్జనము చేయవలెను. 'హుం' అని ఉచ్చరించుచు ఉదకముతో తడపవలెను. కుండము వెలుపల నున్న మేఖలలపై, అస్త్రమంత్రముతో, ఉత్తర-దక్షిణదిక్కులందు పూర్వా గ్రముగాను, పూర్వపశ్చిమములందు ఉత్తరాగ్రముగాను కుశలు పరవవలెను వాటిపై హృదయమంత్రముతో పరిధివిష్టరము స్థాపింపవలెను. పిమ్మట సద్యోజాతాది ముఖపంచకమునకు సంబంధించిన మంత్రములు చదువుచు, అస్త్రమంత్ర ముచ్చరించుచు, నాలచ్ఛేదనము కొరకై, ఐదు సమిధుల మూలములను అజ్యమునందు ముంచి హోమము చేయవలెను. పిమ్మట నూర్వాక్ష తాదులతో బ్రహ్మ-శివ-విష్ణు-అనంతులను వారి నామములకు "నమః" చేర్చుచు పూజించవలెను. కుండమునకు నాల్గు వైపులందును పరచిన ఎనిమిది అసనములపై పూర్వాదిదిక్కులందు వరుసగ ఇంద్రాది దిక్పాలకులను అవాహన చేసి, స్థాపన చేసి వారందరును అగ్నివైపు ముఖములతో కూర్చున్నట్లు భావన చేయుచు, వారి నామములకు 'నమః' చేర్చుచు పూజచేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 258 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 3 🌻
17. Three oblations should be offered into the fire, after having determined the formation of its face and body by one who wants to restore or open up the face.
18. As before the jātakarma (the purificatory rite on the birth of a child) and ṛtukarma (the rite after the first menses) (usually performed) in the tenth month should be performed by kindling the fire with darbha etc. (Mental) bathing (should be done) to remove tḥe impurities of the pregnancy.
19. After having mentally contemplated the golden bracelet of the goddess one should worship with the hṛd (mantra). He should sprinkle with water consecrated by the mantra of the weapon for the immediate removal of impurities after the birth of a child.
20. The pitcher outside the receptacle for the sacred fire should be touched with the weapon (mantra) and (water) should be sprinkled over with the (mantra) of the armour. The ends of the kuśa which form the boundary (of the sacrificial pit) and placed on the north and east (should be washed with water) with (the mantra of) the weapon.
21. The periphery of a circle around (the fire) should be determined with the kuśa, previously consecrated with the weapon and hṛd mantra and then the cushions inscribed within it should be spread out by (reciting) the weapon mantra.
22. Five sacrificial sticks dipped in clarified butter should be offered into the fire with the repetition of the principal mantra. Brahmā, Śaṅkara, Viṣṇu and Ananta should be worshipped with the hṛd (mantra).
23. The gods located in the periphery (of that circle) should be worshipped in turn with unbroken rice. The gods Indra to Īśāna who are directly facing the fire and are having their places inside the circle should be worshipped in their own regions with the hṛd (mantra) “Protect this child (fire) by removing all obstacles, that might befall it.”
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 257 / Agni Maha Purana - 257
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 257 / Agni Maha Purana - 257 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 2 / Mode of installation of the fire (agni-sthāpana) - 2 🌻
సంహితామంత్రముచే అభిమంత్రతమై, ధేనుముద్రాప్రదర్శన పూర్వకముగ అమృతీకరణ క్రియచే సంస్కృతమై అస్త్రమంత్రముచే సురక్షితమై, కవచ మంత్రముచే అవగుంఠితమై, పూజింపబడిన అగ్నిని, అగ్నికుండముపై మూడు పర్యాయములు ప్రదక్షిణముగా త్రిప్పి, ''ఇది శివుని బీజము'' అని భావన చేసి, ''వాగీశ్వరదేవునిచే ఈ బీజమును వాగీశ్వరీ గర్భమునందు స్థాపింపడెను'' అని ధ్యానము చేసి, మంత్రసాధకుడు మోకాళ్లు భూమిపై ఆన్చి నమస్కారపూర్వకముగ ఆ అగ్నిని తన ఎదుట కుండమునందు స్థాపించవలెను.
పిమ్మట ఏ కుండమునందు బీజరూపాగ్ని ధ్యానము చేయబడినదో దాని వాభిదేశమునందు కుశలచే పరిసంవహానము చేయవలెను. పరిధాన- సంభారము, శుద్ధి, అచమనము. నమస్కారము చేసి గర్భాగ్నిని పూజించి, ఆగర్భజాగ్నిరక్షణముకొరకై అస్త్రమంత్రముచే, వాగీశ్వరీదేవి పాణిపల్లవమునందు కంకణము (రక్షౌసూత్రము) కట్టి నట్లు భావన చేయవలెను. సద్యోజాతమంత్రముతో, గర్భాదానముకొరకై, అగ్నిపూజనము చేసి, హృదయ మంత్రముతో మూడు ఆహుతులివ్వవలెను. మూడవమాసమున జరుగు పుంసవనసంస్కారమును భావన చేసి, అది సిద్ధించుటకై వామదేవమంత్రముతో అగ్నిని పూజించి "శిరసే స్వాహా" అని పలుకుచు, మూడు హోమములుచేయవలెను. పిమ్మట ఆ అగ్నిపై జలబిందువును చల్లవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 257 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 2 🌻
9-10. Oṃ hūṃ (salutations) to god of fire. (The deity) should be established with the principal mantra of the fire. The fire which has been invoked with the vedic hymns and made immortal by showing the dhenumudrā (formation with the fingers representing a cow), and protected by mantras of weapons should be covered by the armour. It should be worshipped by waving over the pit thrice and circumambulation.
11. Having meditated upon (the fire) as an element of Lord Śiva, (the worshipper) should contemplate it as lying dormant in the womb of Goddess of speech and cast by the Lord of speech.
12. The worshipper should have his knees resting on the ground and put the fire in his front with the hṛd mantra. Then the seeds of fire in the vicinity should be gathered at the centre.
13. The collection of clothes, purification and offering of water for rinsing the mouth (should be done) with the hṛd (mantra). Having worshipped the dormant fire [i.e., garbha-agni], it should be protected by (the recitation of) the mantra of the shaft.
14. The embryo fire should be contemplated as tied around the wrist of the goddess as a bracelet. The fire should be worshipped with the sadyojāta (mantra) for the impregnation.
15. Three oblations to the fire should then be offered with (hṛdayamantra. For the puṃsavana (rite) (for the determination of the sex of the foetus) (generally performed) in the third month it should be worshipped on the left side.
16. Three oblations containing drops of water should be offered with the head. The sīmantonnayana (rite) (parting of the hair on the head) (performed) in the sixth month should be done after having worshipped the fire.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 256 / Agni Maha Purana - 256
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 256 / Agni Maha Purana - 256 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 75 🌻. శివ పూజాంగ హోమ విధి - 1 / Mode of installation of the fire (agni-sthāpana) - 1 🌻
మహేశ్వరుడు పలికెను : పూజానంతరము, ఉపాసకుడు శరీరమును వస్త్రాదులతో ఆచ్ఛాదించుకొని, అర్ఘ్య పాత్రను చేత ధరించి, అగ్నిశాలలోనికి వెళ్ళి ది��్యదృష్టిచే యజ్ఞమున కావశ్యకములగు సమస్త ఉపకరణములను సమకూర్చు కొనవలెను. ఉత్తరాభి ముఖుడై అగ్ని కుండమును చూచి కుశలతో దానిని ప్రోక్షించి మార్జనము చేయవలెను. తాడనము (మార్జనము) అస్త్రమంత్రముతో (ఫట్) చేయవలెను. అభ్యుక్షణము కవచ మంత్రముతో (హుం) చేయవలెను. కవచమంత్రముచే (హుం) దానికి అభిషేకము, శరమంత్రముచే (ఫట్) భూకుట్టనము చేయవలెను. సంమార్జనము, ఉప లేపనము, కలాత్మ కరూపకల్పన త్రిసూత్రీపరిధానము, అర్చనము ఇవన్నియు కవచమంత్రముతోడనే చేయవలెను. కుండమునకు ఉత్తరమున మూడు రేఖలు గీయవలెను. ఒక రేఖ పూర్వాభిముఖమై క్రిందికి వచ్చు నట్లు గీయవలెను. రేఖలు కుశతో గాని, త్రిశూలముతో గాని గాయవలెను. లేదా ఆ రేఖ లన్నింటిని క్రిందుమీదుగా నున్నట్లు కూడ చేయవచ్చును.
అస్త్ర మంత్రము (ఫట్) నుచ్చరించి వజ్రీకరణము చేసి, 'నమః' ఉచ్చరించి కుశలచే చతుష్పథన్యాసము చేయవలెను. కవచమంత్రము (హుమ్)తో అక్షపాత్రను, హృదయమంత్ర (నమః) విష్టరమును స్థాపించవలెను. ''వాగీశ్వర్యైనమః'' ''ఈశాయ నమః'' అను మంత్రము లుచ్చరించి వాగీశ్వరిని, ఈశుని ఆవాహన చేసి పూజించవలెను. పిమ్మట మంచి స్థానమునుండి అగ్నిని, శుద్ధమైన పాత్రలో నుంచి తీసికొని వచ్చి, దాని నుండి, ''క్రవ్యాదమగ్నిం ప్రహిణోమి దూరమ్'' ఇత్యాది మంత్రము పఠించుచు క్రవ్యాదాంశమైన అగ్నికణమును తొలగించవలెను. పిమ్మట నిరీక్షణాదులచే శోధిత మగుఔదర్య-ఐన్దవ-భౌత-అగ్నిత్రయమును ఏకము చేసి ''ఓం హూం వహ్నిచైతన్యాయ నమః'' అను మంత్ర ముచ్చరించి అగ్ని బీజముతో (రం) స్థాపించవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 256 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 75 🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 1 🌻
The God said:
1. (The worshipper) should enter another room unseen with the vessel containing water for offering in his hand and should look to the arrangements of the materials essential in the performance of a sacrifice, as it were, with a divine eyesight.
2. He should look at the sacrificial pit with his face turned. towards the north. The sprinkling and beating the water with the kuśa should be done by (repeating) the mantra of the weapon and the consecration should be done with the mantra of the armour.
3. The digging out (a piece of earth), filling and levelling with the sword should be done with (the mantra of) the armour and bathing and division into parts (should be done) with the mantra of the arrow.
4. The (rites of) cleansing, anointing, fixing the crescent. form, investiture of the sacred thread and worship (should be done) always by the mantra of the armour.
5. Three lines should be drawn in the north and one below them (should be drawn) so as to face the east. Whatever defects, in them may be made good by touching them with the kuśa and the astramantra of Śiva.
6. A quadrilateral figure should be. drawn with the kuśa by the mantras of vajrīkaraṇa (establishing.firmly) and hṛd. The vessel for the rosaries should be laid with (the mantra of) the armour. The seat should be laid with the hṛd mantra.
7-8. The Goddess of speech along with the God should be invoked therein and worshipped. The consecrated fire brought from a holy place and placed in a pure receptacle, after leaving aside its parts presided over by the demons and purified by the divine look etc., the three fires audārya, aindava and bhauta should be made into one.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 255 / Agni Maha Purana - 255
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 255 / Agni Maha Purana - 255 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 74 🌻. శివ పూజా విధి వర్ణనము - 11 🌻
పిమ్మట ఆ దేవాధి దేవుని శిరస్సుపై అక్షతలను, పవిత్రకమును ఉంచి, హృదయముచే (నమః) అభి మంత్రిత మగు మూలమంత్రమును నూట ఎనిమిది సార్లు జపించవలెను. పిమ్మట కవచము చుట్టినదియు, అస్త్రముచే రక్షితమును అగు అక్షత - కుశలను, పుష్పములను, సమర్పించి ఉద్భవమగు ముద్రతో శివుని - ''ఓ ప్రభూ! గుహ్యాతి గుహ్యమును రక్షించుటకై, నేను చేసిన జపమును గ్రహింపుము దానిచే నీవుండగా, కృపచే నాకు సిద్ధి లభించు గాక'' అని ప్రార్థించవలెను.
భోగేచ్ఛ గల సాధకుడు పై శ్లోకము పఠించుచు, మూలమంత్ర ముచ్చరించుచు కుడి చేతిలో ఆర్ఘ్యోదకము గ్రహించి, దానిని భగవంతుని వరముద్రతో కూడిన హస్తములో విడువవలెను. మరల ఈ విధముగ ప్రార్థించవలెను. ''మహాదేవా! కల్యాణ స్వరూపుడవగు నీ పాదములను శరణు జొచ్చినాను. నేను చేసిన శుభాశుభ కర్మల నన్నింటిని తొలగింపుము. ''హూ క్షః శివుడే దాత. శివుడే భోక్త శివుడే ఈ సకల ప్రపంచము, సర్వత్ర శివునకు జయ మగు గాక. శివుడే నేను'' ఈ రెండు శ్లోకములు చదువుచు చేసిన జపమును శివునకు సమర్పింపవలెను. పిమ్మట పూర్వము చేసిన శివ మంత్రజపములో దశాంశము మరల జపించవలెను. (హోమపూర్తికి ఇది అవసరము) మరల అర్ఘ్యమిచ్చి భగవంతుని స్తుతించవలెను. పిమ్మట అష్టమూర్తి యగు శివునకు ప్రదక్షిణము చేసి సాష్టాంగ ప్రణామము చేయవలెను. నమస్కరించి శివద్యానము చేసి, చేత్రమునందు గాని, అగ్న్యాదులందు గాని శివుని ఉద్దేశించి హోమ - పూజాదులు చేయవలెను.
అగ్ని మహాపురాణమునందు శివపూజావిధి వర్ణన మను డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 255 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 74 🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 11 🌻
79-81. “May there be success for me by this by your presence here”. Having recited this verse at first, the worshipper should offer to Śambhu (Śiva) the waters of respect with the right hand with (the repetition of) the principal mantra. Whatever good or bad that I may do O lord! let it be cast off from me who am in the region of Śiva. Hūṃ kṣaḥ O Śaṅkara, Śiva is the giver, Śiva is the enjoyer, Śiva is all this universe.
82. Śiva is victorious everywhere. I am identical with Śiva. After having repeated these two verses, the japa should be dedicated to the lord.
83. One-tenth (should be dedicated) to the limbs of Śiva. Having offered the waters of respect, one should adore (the deity). After circumambulating (the deity), one should bow to the eight-formed (representing the five elements, sun, moon and yajamāna) deity by prostrating (the eight limbs touching the ground). After salutation (the deity) should be worshipped in a picture or in the fire by meditation etc.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 254 / Agni Maha Purana - 254
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 254 / Agni Maha Purana - 254 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 74 🌻. శివ పూజా విధి వర్ణనము - 10 🌻
ఆగ్నేయమునందు చంద్రుడు ఉజ్జ్వలమైన హృదయమును, ఈశాన్యమునందు సువర్ణసమాన కాంతి గల శిరస్సును నైరృతియందు ఎఱ్ఱని రంగు గల శి��ను, వాయవ్యమునందు నల్లని రంగు గల కవచమును పూజింపవలెను. అగ్ని వర్ణ మగు నేత్రమును, కృష్ణ పింగల వర్ణమగు అస్త్రమును పూజించి, కమలముపై చతుర్ముఖు డగు బ్రహ్మయు, చతుర్భుజుడగు విష్ణువు, ఇతర దేవతలును ఉన్నట్లు భావన చేసి వారి పూజ చేయవలెను. పూర్వాదిదిక్కులందు కోరలతో భయంకరము లగు వజ్రతుల్యాస్త్రములు పూజించవలెను. ''ఓం హాం హూం శివాయ నమః'' అను మంత్రముతో మూల స్థానమునందు పూజ చేయవలెను. ''ఓం హాం హృదయాయ నమః'' ''హీం శిరసే హ్వహా'' అను మంత్రముతో హృదయ శిరస్సులను ''హూం శిఖాయై వషట్'' అను మంత్రముతో శిఖను ''హై కవచాయ హుం' అను మంత్రముతో కవచమును ''హః అస్త్రా య ఫట్'' అని అస్త్రమును పూజించవలెను. పిమ్మట పరివారసమేతు డగు ఈశ్వరునకు క్రమముగ పాద్య - ఆచమన - ఆర్ఘ్య - గంధ - పుష్ప - ధూప - దీప - నైవేద్య - ఆచమనీయ - కరోద్వర్తన - తాంబూల - ముఖవాస - దర్పణము లను మసర్పించవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 254 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 74 🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 10 🌻 72. The heart should be worshipped in the south-east, the moon on the north-east, the golden-coloured Śiva together with the tuft and blood on the south-west, Kṛṣṇa and armour on the north-west.
73. These gods having four faces and four arms should be worshipped in the petals in the east etc. along with the divine weapon similar to thunder and fierce teeth.
74. Hauṃ salutations to Śiva at the base, Oṃ hāṃ hūṃ hīṃ hoṃ in the head, hṛṃ to the tuft, haiṃ to the armour, haḥ to the weapons and to one with the attendants.
75-76. Waters for washing the feet, for rinsing the mouth and respectful offering, perfumes, flowers, incense, lamp, food offerings and water for rinsing again, should be given to lord Śiva. Intertwined blades of kuśa and unbroken rice should be placed on the head (of the image) of the lord. Perfumes, betel, piece of cloth for wiping the face and a mirror (should also be -offered to the deity).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 253 / Agni Maha Purana - 253
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 253 / Agni Maha Purana - 253 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 74 🌻. శివ పూజా విధి వర్ణనము - 9 / Mode of worshipping Śiva (śivapūjā) - 9 🌻
ఆరాధ్యదేవత యొక్క చరణారవిందములపై పాద్యమును, ముఖారవిందమున ఆచమనమును, అర్ఘ్య - దూర్వా - పుష్ప - అక్షతాదులను శిరస్సునను ఉంచవలెను. ఈ విధముగ పది సంస్కారములచే పరమేశ్వరుని సంస్కారము చేసి, గంధ పుష్పాది పంచోపచారములతో యథా విధిగ పూజింపవలెను. మొదట దేవతా విగ్రహమునకు ఉదకముచే అభిషేకము చేసి, రాజికాలవణాదులతో ఉద్వర్తన మార్జనములు చేయవలెను. పిమ్మట అర్ఘ్య జలబిందువులు, పుష్పములు మొదలగు వాటితో అభిషేకము చేసి ఘటములో నున్న ఉదకముతో మెల్లమెల్లగ స్నానము చేయించవలెను.
పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార - వీటిని వరుసగ ఈశానతత్పురుష - అఘోర - వాసుదేవ - సద్యోజాత మంత్రములతో అభిమంత్రించి, వాటితో మాటిమాటికి స్నానము చేయించవలెను. వాటిని కలిపి పంచామృతము చేసి, దానితో భగవంతునకు స్నానము చేయించవలెను. దీనివలన భోగమోక్షములు, లభించును. పైన చెప్పిన క్షీరము మొదలైనవాటిలో జలధూపములు కలిపి, మూలమంత్రముతో శివునకు అభిషేకము చేయవలెను. పిదప యవపిష్టముతో జిడ్డుపోవు నట్లు చేసి శీత���జలముతో స్నానము చేయించవలను. యథాశక్తిగ చందన - కేసరాదయుక్త మగు ఉదకముతో స్నానము చేయించి వస్త్రముతో విగ్రహమును బాగుగా తుడవవలెను. పిదప అర్ఘ్యము సమర్పింపవలెను. దేవత మీద హస్తము త్రిప్పగూడదు. శివలింగము తలపై ఎన్నడును పుష్పము లేకుండ ఉంచగూడదు. పిదప ఇతరోపచారములు సమర్పించి చందనాద్యను లేపనము చేయవలెను. శివమంత్రము జపించుచు పుష్పార్పణ చేసి పూజించవలెను. అస్త్రమంత్రము (ఫట్)తో ధూపపాత్రను ప్రోక్షించి, శివమంత్రముతో ధూపముచే పూజించవలెను. అస్త్రమంత్రముచే పూజింపబడిన ఘంట మ్రోగించుచు గుగ్గులు ధూపము వేయవలెను. ''శివాయ నమః'' అను మంత్రము నుచ్చరించుచు అమృతమధుర మగు జలముతో ఆచమనము సమర్పించవలెను. పిమ్మట ఆరతి ఇచ్చి ఆచమనము చేయించవలెను. నమస్కరించి, దేవత అనుమతి గైకొని భోగాంగముల పూజ చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 253 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 74 🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 9 🌻
62-65. The water for washing the feet should be offered preceded by the recitation of the hṛd (mantra). The water (should be offered) at the lotus feet and the water for the rinsing of the mouth at the face of the image, the respectful offering at the head of the lord along with the dūrvā (grass), flowers and unbroken rice. Having purified the supreme lord with the ten purifications thus, one should worship with the five kinds of services such as the flowers etc. as laid down (in the code books). Having sprinkled and rubbed (the image) with salt, mustard seed etc., it should be slowly bathed with drops of water, flowers, perfumes, milk, curd, ghee, honey and sugar successively.
66. The defects in the above materials should be rectified by worshipping with materials along with the recitation of Īśa mantras. Lord Śiva should be bathed with water and fragrance with the principal mantra.
67-68. Having applied the paste of barley, it should be bathed copiously with cold water and also with fragrant water according to one’s ability. Having wiped it dry with a clean cloth, the preliminary offering of water should be given. The hand should not be moved over the head (of the image). The liṅga should never be left without any flower on its head.
69. Having smeared it with sandal etc. and worshipped with flowers with the mantras of Śiva, the vessel for holding the perfumes should be consecrated with the weapons (mantra) and worshipped with the mantras of Śiva.
70. The bell consecrated by the weapon (mantra) should be taken and the incense should be offered. The water for rinsing should be given then (with the repetition of) svadhā at the end and with the hṛd mantra.
71. Having shown light for the idol in the night, then water for rinsing should be offered. After having made obeisance to god and taking his permission, eatables and other articles of enjoyment should be offered.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
Text
శ్రీ మదగ్ని మహాపురాణము - 252 / Agni Maha Purana - 252
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 252 / Agni Maha Purana - 252 🌹 ✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రథమ సంపుటము, అధ్యాయము - 74 🌻. శివ పూజా విధి వర్ణనము - 8 / Mode of worshipping Śiva (śivapūjā) - 8 🌻
ఆసనముపై ఆసీనుడై యున్న శివుని దివ్యమూర్తి ముప్పదిరెండు లక్షణములతో ప్రకాశించుచున్నదని చింతనము చేయుచు, శివస్మరణము చేయుచు, ''ఓం హాం హాం హాం శిమూర్తయే నమః'' అను మంత్ర ముచ్చరించుచు నమస్కారము చేయవలెను, బ్రహ్మాది కారణ త్యాగ పూర్వకముగు మంత్రమును శివుని యందు ప్రతిష్ఠితము చేయవలెను. లలాట మధ్య భాగమున చంద్రుడు వలె ప్రకాశించుచున్న బిందు రూప పరమ శివుడు హృదయాదు లగు ఆరు అంగములతో సంయుక్తుడై పుష్పాంజలిలోనికి దిగి వచ్చి నట్లు భావన చేసి ఆయనను పూజింపనున్న మూర్తియందు స్థాపించవలెను. పిమ్మట ఆవాహనీముద్రతో ''ఓం హాం హౌం శివాయ నమః'' అను మంత్ర ముచ్చరించుచు, మూర్తిపై శివుని ఆవాహనము చేయవలెను. స్థాపనీముద్రచే స్థాపనము చేసి, సంనిధాపనీముద్రతో సన్నిహితుని ��ేసి, సంనిరోధనీముద్రతో ఆ మూర్తి పై కదల కుండు నట్లు చేయవలెను. పిమ్మట ''నిష్ఠురాయై కాలకల్యాయై ఫట్'' అను మంత్రము ఉచ్చరించుచు ఖడ్గముద్రతో భయమును చూపుచు విఘ్నములను పారద్రోలవలెను.
పిమ్మట లింగముద్రను చూపి నమస్కారము చేయవలెను. 'నమః' అని అవగుంఠనము చేయవలెను. ఇష్టదేవతను తన వైపునకు అభిముఖముగ నున్నట్లు చేయుటయే ఆవాహనము. దేవతను అర్చా విగ్రహముపై కూర్చుండబెట్టుట స్థాపనము, ''ప్రభూ! నేను నీవాడను'' అని పలుకుచు భగవంతునితో అతి సన్నిహిత సంబంధము నేర్పరచుకొనుటయే సంనిధానము''. శివపూజకు సంబంధించిన కర్మకాండ అంతయు పూర్తి అగువరకు భగవత్సంనిధాన ముండునట్లు చేయుట ''నిరోధము'' భక్తులు కాని వారికి శివతత్త్వము తెలియకుండు నట్లు చేయుట అవగుంఠనము. పిమ్మట సకలీకరణము చేసి 'హృదయాయ నమః' ఇత్యాదిమంత్రములతో హృదయాద్యంగములకు అంగులతో ఏకత్వమును స్థాపించుటయే 'అమృతీకరణము' చైతన్య శక్తి శంకరుని హృదయము, ఎనిమిది విధములైన ఐశ్వర్యము శిరస్సు, వశిత్వము శిఖ, అభేద్యమగు తేజస్సు కవచము, దుస్సహమైన ప్రతాపమే సమస్త విఘ్నములను నివారించు అస్త్రము హృదయముతో ప్రారంభించి ''నమః, స్వధా, స్వాహా, వౌషట్ అనునవి ఉచ్చరించుచు పాద్యాదులను నివేదించవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 252 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 74 🌻 Mode of worshipping Śiva (śivapūjā) - 8 🌻
52-54. The image of Śiva possessing thirty-two characteristics (should be installed) at the centre. Hāṃ, haṃ, hāṃ (salutations) to the image of Śiva. After having meditated upon the self-luminant Śiva, the mantra should be led to the spot sacred to Śiva after leaving below the place sacred to Brahmā. Then (the worshipper) having meditated upon that Supreme form of Śiva, effulgent with the splendour of the moon, as a luminous point at the middle of the forehead and being invested with the six constituents, with flowers in folded palms, should deposit (those flowers) on the form of (Goddess) Lakṣmī.
55-57. Oṃ, hāṃ, hauṃ salutations to Śiva. (The deity) should be invoked with the invoking hṛd (mantra). Having established Śiva with the sthāpanī (mudrā)[3], and placed near (that) should be checked with Niṣṭhurā and Kālakāntī concluding with phaṭ. After having removed obstructions by sending them away and making obeisance by (showing) the liṅgamudrā, it should be covered with the hṛd (mantra). The invocation should follow it. Then standing in front of the image he-should repeat. “Let you be located and firmly established. O lord! I am in your presence.”
58. The (rite of) avaguṇṭhana signifies the presence and supervision of the God and the exhibition of one’s devotion (to the God) from the commencement to the end of the act.
59. After having done the accomplishing act with the six mantras, the (rite of) amṛtīkaraṇa should be performed by mentioning different parts of the body along with the body.
60-61. The worshipper should permeate his heart with the energy of consciousness of Śambhu (Śiva). Similarly, (he should. contemplate) the tuft of hair of Śiva as formed of the eightfold glories. The worshipper should contemplate the invincible energy of God as forming his armour, the unbearable prowess of God which removes all impediments (and the words) salutations, svadhā, svāhā and vauṣaṭ (should be appended) in. order.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
0 notes