#సమ్మక్క
Explore tagged Tumblr posts
allindiagovtjobs · 2 years ago
Link
మేడారం సమ్మక్క సారక్క జాతర Medaram Sammakka Sarakka Jatara Telangana State Indian Kumbha Mela
మేడారం సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్ర భారత కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర భారతదేశంలోని ప్రముఖ గిరిజన పండుగలలో ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. అన్యాయం మరియు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన జంట దేవతలైన సమ్మక్క మరియు సారక్కలకు ఈ పండుగ అంకితం చేయబడింది. ఈ పండుగ వారి విజయానికి సంబంధించిన వేడుక మరియు భారతదేశంలోని గిరిజన వర్గాల యొక్క
0 notes
chaitanyavijnanam · 2 years ago
Text
గ్రామ దేవతలు - వారి చరిత్ర మరియు విశిష్టతలు Village Gods - Their History and Significance
Tumblr media
🌹. గ్రామ దేవతలు - వారి చరిత్ర మరియు విశిష్టతలు 🌹 🙏గ్రామదేవతలు 101 మంది అక్కాచెల్లెళ్ల పేర్లు :-🙏 #పార్వతి అమ్మోరు (అమ్మవారు )గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం .
#ఈ అమ్మోరు మొత్తం 101 మంది అక్కాచెల్లెళ్లు అని వీరందరికి ఒకేఒక్క తమ్ముడు పోతురాజు అని అంటారు .వారిలో కొందరు .
1.పాగేలమ్మ
2.ముత్యాలమ్మ
3 .గంగమ్మ
4.గంగానమ్మ
5.బంగారమ్మ
6.గొంతెమ్మ
7.సత్తెమ్మ
8.తాళమ్మ
9.చింతాలమ్మ
10.చిత్తారమ్మ
11.పోలేరమ్మ
12.మావుళ్లమ్మ
13.మారెమ్మ
14.బంగారు బాపనమ్మ
15.పుట్టానమ్మ
16.దాక్షాయణమ్మ
17.పేరంటాలమ్మ
18.రావులమ్మ
19.గండిపోచమ్మ
20.మేగదారమ్మ
21.ఈరినమ్మ
22.దుర్గమ్మ
23.మొదుగులమ్మ
24.నూకాలమ్మ (అనకాపల్లి ,విశాఖజిల్లా )
25.మరిడమ్మ
26.నేరెళ్లమ్మ
27.పుంతలో ముసలమ్మ (మెయ్యెరు ,అత్తిలిదగ్గర ,పశ్చిమగోదావరిజిల్లా )
28.మాచరమ్మోరు
29.మద్ది ఆనాపా అమ్మోరు
30.సొమాలమ్మ
31.పెద్దయింట్లమ్మ
32.గుర్రాలక్క (అంతర్వేది ,తూర్పుగోదావరిజిల్లా గుర్రాలమ్మ )
33 .అంబికాలమ్మ
34.ధనమ్మ
35.మాలక్షమ్మ
36.ఇటకాలమ్మ
37.దానాలమ్మ
38.రాట్నాలమ్మ
39.తలుపులమ్మ
40.పెన్నేరమ్మ
41.వెంకాయమ్మ
42.గుణాళమ్మ
43.ఎల్లమ్మ (విశాఖపట్నం )
44.పెద్దమ్మ
45.మాంటాలమ్మ
46.గంటాలమ్మ
47.సుంకులమ్మ
48.జంబులమ్మ
49.పెరంటాలమ్మ
50.కంటికలమ్మ
51.వణువులమ్మ
52.సుబ్బాలమ్మ
53.అక్కమ్మ
54.గనిగమ్మ
55.ధారాలమ్మ
56.మహాలక్షమ్మ
57.లంకాలమ్మ
58.దోసాలమ్మ
59.పళ్ళాలమ్మ (వానపల్లి ,తూర్పుగోదావరిజిల్లా )
60.అంకాళమ్మ .
61.జోగులమ్మ
62.పైడితల్లమ్మ
63.చెంగాళమ్మ
64.రావులమ్మ
65.బూరుగులమ్మ
66.కనకమహాలక్ష్మి (విశాఖపట్నం )
67.పోలమ్మ
68.కొండాలమ్మ
69.వెర్నిమ్మ
70.దే శిమ్మ
71.గరవాలమ్మా
72.గరగలమ్మ
73.దానెమ్మ
74.మహాంకాళమ్మ
75.వేరులమ్మ
76.మరిడమ్మ
77.ముళ్ళ మాంబిక
78.యలారమ్మ
79.వల్లూరమ్మ
80.నాగులమ్మ
81.వేగులమ్మ
82.ముడియలమ్మ
83.రేణుకమ్మ
84.నంగాలమ్మ
85.చాగాలమ్మ
86.నాంచారమ్మ
87.స��్మక్క
88.సారలమ్మ
89.మజ్జిగౌరమ్మ
90.కన్నమ్మ -పేరంటాలమ్మ
91.రంగమ్మ -పేరంటాలమ్మ
92.వెంగమ్మ -పేరంటాలమ్మ
93.తిరుపతమ్మ
94.రెడ్డమ్మ
95.పగడాలమ్మ
96.మురుగులమ్మ (బండారులంక ,తూర్పుగోదావరిజిల్లా )
97.కుంచమ్మ విశాఖపట్నంలో
98.ఎరకమ్మ
99.ఊర్లమ్మతల్లి
100.మరిడమ్మ
101.సుంకాల��్మవ్వ ఉన్నారు .
#నుసకపల్లి ,పామర్రమండలం తూర్పుదోదావరిజిల్లాలోని గ్రామదేవతలు .
1.నుసకపల్లమ్మ
2.వెలగలమ్మ
3 .ఊర్లమ్మతల్లి (గణపవరం ,కర్లపాలెం మండలం ,గుంటూరుజిల్లా )
4.పైళ్లమ్మతల్లి
5.బల్లమ్మతల్లి
6.లొల్లాలమ్మతల్లి
7.ఊడలమ్మ తల్లి
8.కట్వాలాంబిక
9.నాగాలమ్మ నాంచారమ్మతల్లి
10.సింగమ్మతల్లి
11.ఘట్టమ్మతల్లి
12.అంజారమ్మతల్లి .
13. మంత్రాలమ్మ తల్లి
14.పాతపాటేశ్వరి తల్లి
15.కుంకుళమ్మ ద్వారకా తిరుమల
16.చౌడమ్మ నందవరం కర్నూల్ జిల్లా
#అలాగే ఖమ్మం ,నల్గొండ జిల్లాలలో ముత్యాలమ్మ తల్లి ఆరాధన ఎక్కువగా కానవస్తుంది .
#అమ్మలగన్న అమ్మలు ఆదిపరాశక్తిలు గ్రామదేవతలకు వందనాలు,
#మన గ్రామదేవతలు ఎలా వెలిశారు
#మనం రకరకాల పేర్లతో పిలిచే గ్రామదేవతల నామ విశేషాలేమిటి?
#గ్రామదేవతా వ్యవస్థ:
#గ్రామాలలో వెలిసే దేవత...దేవుళ్ళను ముఖ్యముగా స్త్రీ దేవతా రూపాలను గ్రామదేవతలని అంటారు.
#సంప్రదాయాలను అనుసరించి గ్రామ రక్షణగా ఈ దేవతలను ఊరి పొలిమేరలలో ఏర్పాటు చేసేవారు.
#ప్రాచీన కాలములో మానవుడు ఎంతో తెలివైనవాడు,
ఇంట్లోవున్న చిన్నా, పెద్దా, ఆడా, మగా - అందరూ దేవీనవరాత్రుల కాలములో ఎక్కడోవున్న మధుర మీనాక్షమ్మ వద్దకో,కంచి కామాక్షమ్మ దగ్గరికో, బెజవాడ కనకదుర్గమ్మ చెంతకో వెళ్ళాలంటే కుదరకపోవచ్చు.
#ఒక్కోక్కప్పుడు సొమ్మున్నా వెళ్ళే వీలుండక పోవచ్చు. వీలుచిక్కినా అందరికీ ఒకేసారి వెళ్ళడము
సాద్యపడకపోవచ్చు. #ఇలాంటి సందర్భాలలో
అలాంటి వాళ్ళు అమ్మ దర్శనానికి వెళ్ళలేక పోయామే అని నిరాశ పొందకుండా వుండేందుకు
ఎక్కడో వున్న తల్లిని ఇక్కడే దర్శించు కొన్నామనే
తృప్తిని పొందేందుకు గ్రామదేవత వ్యవస్థని ఏర్పాటు చేసారు పెద్దలు.
#ఈ దేవతా ప్రతిష్ఠ గొప్ప విద్వాంసులైన వేద, స్మార్త,
ఆగమ శాస్త్ర పండితుల చేతనే జరుగుతుంది.
#ఎవరికి నిజమైన భక్తి ప్రపత్తులతో పాటు
అర్చకునిగా వుండే తీరిక, ఓపిక వుంటాయో
అలాంటి వారిని వారి కోరిక మేరకు అర్చకులుగా
నియమించారు పూర్వీకులు.
#అప్పటినుంచి ఆ అర్చకు��ి వంశము వాళ్ళే ఆ గుడి బాధ్యతలను నిర్వహిస్తూ వస్తున్నారు.
#దేవతా విగ్రహప్రతిష్ఠ శాస్త్రీయంగా నిర్వహించబడింది
కాబట్టి, ఆ దేవతల కింద బీజాక్షరాలున్న యంత్రము
సరైన మూహూర్తములోనే జ్ వేయబడింది కాబట్టి
గ్రామదేవతలంతా శక్తివున్న దేవతలే అవుతారు-
#భక్తుల కోర్కెలు తీర్చగలవారవుతారు.
అయితే ప్రతి సంవత్సరము ఆలయప్రతిష్ఠ జరిగిన
ఆ నెల, ఆ తిథినాడు ఖచ్చితముగా విద్వాంసులను పిలిచి పవిత్రోత్సవాన్ని చేయించాల్చిందే. #అలా చేయడమువలన అమ్మకి మన ద్వారాఏదైనా లోటు పాట్లు కలిగివుంటే తొలగుతుంది.
#గ్రామదేవతల ఆవిర్భావము:
#పంచభూతాలు అనగా గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశము కారణముగానే ఈ ప్రపంచము ఏర్పడినది.
#అందుకని ఈ పంచ భూతాలకి ప్రతీకలుగా ఐదుగురు
గ్రామదేవతలను ఏర్పాటు చేసారు
తొలి దశలో.
#పృధ్వీ దేవత:
మొదటిది పృధ్వీ అంటే నేల,ఇది పంటకి ఆధారము,
కుంకుల్లు బాగా పండే ప్రాంతములో ప్రతిష్టించిన
పృధ్వినీ దేవతను కుంకుళ్ళమ్మ అన్నారు.
#గోగులు బాగా పూచే ప్రాంతములో ఆ గోంగూర, గోగునార ఇవే వారి జీవన ఆధారము
కాబట్టి ఆపేరుతో గోగులమ్మని యేర్పాటు చేసారు.
#జొన్నలు పండేచోట జొన్నాళమ్మ అని, నూకలు అంటే వరి పండే ప్రాంతాలలో నూకాళమ్మ అని పిలుచుకున్నారు.
#మొదటిసారిగా పండిన పంటను ఆతల్లికే నివేదన చేయడము, అర్చకునిగా వున్నవానికి అందరూ ఆ పంటను యిస్తూ వుండడము, దాన్నే సొమ్ముగా
మార్చుకొని అతడు జీవించడము. ఇలా సాగుతూ వుండేదీ వ్యవస్థ.
#పంట వేసేటప్పుడుకూడా ఈ తల్లిని ఆరాదిస్తేగాని
చేనుకి వెల్తూండేవారు కాదు. అన్నాన్ని పెట్టే తల్లి
కాబట్టి అన్నమ్మ అని కూడా ఒక దేవత వుంది.
#ఇక పంటలన్నీ చేతికందాక సుఖసంతోషాలతో
జాతర చేస్తూండేవారు. అదే ఇప్పటికీ అనేక గ్రామాలలో కొనసాగూతూండడం జరుగుతూ ఉన్నది.
💐జల దేవత:💐
రెండవది జలానికి సంబంధించిన తల్లి గంగమ్మ–గంగానమ్మ. ఈ తల్లి భూమి మీద కాక భూమిలోపల ఎంతో లోతుగా వుంటుంది.గుడి ఎత్తుగా కట్టినా
తల్లిని చూడాలంటే మెట్లుదిగి కిందికి వెళ్ళ వలసి ఉంటుంది.
💐అగ్ని దేవత:💐
మూడవది తేజస్సు(అగ్ని). పగటిపూట తేజస్సునిచ్చే సూర్యునికి ప్రతీకగా సూరమ్మనూ,రాత్రిపూట తేజస్సు నిచ్చే చంద్రునికి ప్రతీకగా పున్నమ్మ నీ దేవతలుగా చేసారు. ( చిత్తూరు పున్నమ్మ గుడిలో హారతి సమయంలో పంబల్లు వాయిస్తారు అది ఉంటూ హారతి చూస్తే అమ్మవారు ఆనందంతో వెలిగిపోతు��్నట్టు కనిపిస్తోంది, ఎ��్పుడూ అదే కొనసాగుతోందా తెలియదు).
సూరమ్మను ప్రతి అమావాస్యనాడు, పున్నమ్మను ప్రతి పౌర్ణమినాడు పూజించే విధముగా ఏర్పాటు చేసుకొని తమ కులవృత్తిని ఆరోజు మానేయడం చేసేవారు.
ఇక అమ్మకి కుడి కన్ను సూర్యుడుగానూ ఎడమ కన్ను చంద్రుడిగాను ఆతల్లికి పెట్టిన పేరు ఇరుకళలమ్మ (సూర్య,చంద్రుల కళ వున్న అమ్మ).
#వాయు దేవత:
నాలుగవది వాయువు కరువలి అంటే పెద్ద గాలి.
కొండ ప్రాంతములో వుండేవారికి విపరీతమైన కొండగాలి వీచినప్పుడు ఏ ఉపద్రవము ఉండకుండా రక్షించేందుకు కరువలమ్మను యేర్పాటు చేసుకున్నారు.
#ఆకాశ దేవత:
ఐదవది ఆకాశము ఎత్తులో వున్నందున కొండమ్మ ను
ఆకాశ దైవానికి ప్రతీకగా తీసుకున్నారు. పిడుగులు, మెరుపులు,గాలివాన. ఇలాంటి వాటి నుండి
రక్షించేందుకు ఈ తల్లిని యేర్పాటు చేసుకున్నారు.
#గ్రామదేవతా నామ విశేషాలు:
మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామదేవత
పేరు వెనుక ఒక పరమార్ధం ఉంది
#సొంతవూరిని విడిచి పొరుగూరు వెళ్ళే వ్యక్తుల
రాకపోకల్ని గమనిస్తూ వూరి పొలిమేరలో
వుండేతల్లి పొలిమేరమ్మ క్రమముగా పోలేరమ్మ అయింది.
#ఎల్ల' అంటే సరిహద్దు అని అర్దము అందుకే 'ఎల్లమ్మ' కూడా ఈ పనిని చేసేదన్నమాట.
#ఒక వ్యక్తికి జీవన భృతి కలిగించి పోసించే తల్లి
'పోచ+అమ్మ=పోచమ్మ' అన్నమాట.
ఎల్లమ్మ తల్లి తన భక్తులకి ఎటువంటి వ్యాధులు
రాకుండా నివారించేదైతే, పోచమ్మ పోషణ కలిగిస్తుంది.
#ప్రతి వ్యక్తికీ ఇంతకాలము జీవించాలనే
ఓ కట్ట (అవధి) ఏదుందో ఆ కట్టని మేయగల
(ఆ అవధినించి రక్షించగల) అమ్మే 'కట్టమేసే+అమ్మ=
కట్టమేసెయమ్మ కాలక్రమములో కట్టమైసమ్మ అయింది.
#స్వచ్ఛమైన అమ్మ అనే అర్దములో (స్వచ్ఛమని)సు+అచ్చ= స్వచ్ఛ అనే రెండు పదాలు కలిపి అచ్చమ్మగా అయ్యింది.
#సాధారణముగా 15 వూళ్ళకో దేవత వుంటుంది.
'మా వూళ్ళన్నింటికీ అమ్మ' అనే అర్దములో
ఆమెను మావూళ్ళమ్మ అని పిలుస్తూంటే
క్రమముగా అది మావుళ్ళమ్మ' అయింది.
#ప్రజల మనసులో పుట్టే ఏ కోర్కెనైనా మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోర్కెని తీర్చే బాధ్యతని స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి తలుపులమ్మ. తలపు అంటే ఆలోచన. వా���ిని తీర్చే తల్లి తలపులమ్మ క్రమముగా 'తలుపులమ్మ'గా మారింది.#ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటపుడు తల్లికి
లేదా భార్యకి ఎలా చెప్తామో అలాగే ఆ తల్లిని ప్రార్థించి వెళ్ళడం చేస్తారు.
#శంకరునితో కలసి అర్దనారీశ్వర రూపముతో
అమ్మవారుండేది. ఆకారణముగా శంకరుని మెడమీద (గళము) మచ్చ (అంకం) క��రణముగా
అంకగళమ్మ, అంకాళమ్మ గా మారిపోయింది.
#పొలిమేరలో వుండే మరొక తల్లి శీతలాంబ.
ఈమె చేతుల్లో చీపురు, చేట ఉంటాయి.
తన గ్రామములోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూత ప్రేత
పిశాచ గణాలను గ్రామములోనికి రాకుండా
వూడ్చి చేటలోకి ఎత్తి పారబోసేది ఈ దేవతే.
#పాములు బాగా సంచరించే చోటులో వుండే దేవత తల్లి పుట్టమ్మ ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి.
అక్కడే సుబ్రహ్మణ్య షష్టికి అందరూ పుట్టలో
పాలు పోస్తారు. ఈ తల్లికే 'నాగేశ్వరమ్మ'
అని కూడా అంటారు. పాము+అమ్మ=పాపమ్మ అవుతుంది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని కూడా అంటారు.
#సుబ్రహ్మణ్యేశ్వరుడు పేరుమీదే 'సుబ్బ+అమ్మ=
సుబ్బమ్మ కూడా దైవముగా ఉంది. బతుకుకి కావలసిన వర్షాన్ని పంటనీ ఇచ్చే తల్లి బతుకమ్మ.
#గ్రామప్రజల మంచిని చూసే (కనే) అమ్మ కన్నమ్మగా
ఎప్పుడూ సత్యాన్ని (నిదర్శనాలని) చూస్తూవుండే తల్లి సత్య+అమ్మ= సత్తెమ్మ.
#అలాగే పుల్ల (వికసించిన కళ్ళున్న) అమ్మ పుల్లమ్మ.
ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది
కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది.
#ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకొనే
చోటవున్న తల్లి అర్పణ+అమ్మ =అర్పణలమ్మ క్రమముగా అప్పలమ్మ అయినది.
#బెల్లము బాగా వున్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు
బాగా ఇష్టమంటూ భావించే భక్తులు అప్పాల+అమ్మ=అప్పలమ్మ అన్నారు.
#అమ్మవార్ల వూరేగింపులో అన్నిటికన్న చిన్నది
బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమమైన వుజ్జీ
అయినది పెంటి (బాల)+అమ్మ=పెంటమ్మ.
#భోజనాన్ని అందించగల తల్లి అనే అర్దములో
బోనముల (భోజనమనే పదానికి వికృతి)+అమ్మ=
బోనాలమ్మ.
#అయ్య అయిన శంకరునికి అమ్మ (భార్య) కాబట్టి
ఈమెను 'అయ్యమ్మ' అని కూడా కొన్ని చోట్ల
పిలుస్తారు.
#లలితాంబ, భండాసురుణ్ణి చంపేందుకు గుర్రాలమీద కూర్చొన్న స్త్రీ సైనికుల సైన్యముతో వెళ్ళినది
కాబట్టి గుర్రాల+అమ్మ=గుర్రాలమ్మ అయినది.
#ఊరు పేరుని బట్టి పీల్చుకొనే దేవతలు కొందరున్నారు. సోమప్రోల+అంబ='సోమపోలమాంబ'
అన్నారు.సోమప్రోలు అనే గ్రామము ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట..!!
#పేర్లు ఏవైతేనేమి,
ఆ తల్లి ఎప్పుడూ
మనకు తోడుగా,
అండగా నిలిచి
మనందరినీ
కంటికి రెప్పలా
కాపాడుతుంది...
శుభం
శ్రీ మాత్రే నమః
#సర్వోజనా సుఖినోభావంత్ 🙏
0 notes
prasaratv · 4 years ago
Link
Watch on YouTube - https://youtu.be/3BMNmr0THgU
 #prasaratv #TelanganaNews #medaram #jathara #medaramjathra #NewsChannel  
1 note · View note
lodeabhi-blog · 7 years ago
Text
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి, శాశ్వత ఏర్పాట్లకు రూ.200 కోట్లు: కెసిఆర్
మేడారం: రానున్న రోజుల్లో మేడారం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తామని తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రకటించారు. ఈ జాతర కోసం శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు బడ్జెట్ లో రూ,200 కోట్లు కేటాయించనున్నట్టు సీఎం కెసిఆర్ ప్రకటించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కెసిఆర్ డిమాండ్ చేశారు.
మేడారం జాతరలో భాగంగా సమ్మక్క సారలమ్మలను ముఖ్యమంత్రి కెసిఆర్ ఫిబ్రవరి రెండో తేదిన కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకొన్నారు.అమ్మవార్లకు నిలువెత్తు బంగారం (63 కిలోల బెల్లం) సమర్పించారు. అనంతరం గద్దెలను దర్శించుకున్నారు. అనంతరం కెసిఆర్ మీడియాతో మాట్లాడారు.
సమైక్య రాష్ట్రంలో అనేక అంశాలతో పాటు మేడారం జాతర కూడా నిర్లక్ష్యానికి గురైందని కెసిఆర్ విమర్శించారు. కోట్లాది మంది భక్తులు వచ్చే మేడారంలో భక్తులకు కనీస సౌకర్యాలు లేవన్నారు. మేడారానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు రానున్న బడ్జెట్ లో రూ200 కోట్లను ��ేటాయించనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.
మేడారం జాతరకు కనీసం కనీసం మూడు వందల ఎకరాల భూమి అవసరమని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు స్థలాన్ని సేకరించాలని అధికారులను ఆదేశించనున్నట్టు చెప్పారు. జంపన్న వాగులో నీరు ఎప్పుడు శుభ్రంగా ఉండేలా డ్యామ్ నిర్��ించనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.
వీర వనితల పోరాటానికి ప్రతీక మేడారం జాతరని కొనియాడారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా సమ్మక్క సారలమ్మలు పోరాటం చేసిన విషయాన్ని కెసిఆర్ గుర్తు చేశారు. తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాల్లోని గిరిజనులు దేవతలుగా కొలుస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేసుకొన్నారు.
మేడారం జాతరకు జాతీయ హోదా వచ్చేలా కేంద్రంతో పోరాటం చేస్తానని కెసిఆర్ చెప్పారు. వచ్చే జాతర నాటికి సరైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకొంటానని కెసిఆర్ హమీ ఇచ్చారు. జాతర ముగిసిన పదిహేను రోజుల్లో వచ్చి అభివృద్ది కార్యక్రమాలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్టు కెసిఆర్ ప్రకటించారు.విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్పీకర్‌ మధుసూదనచారి, వరంగల్‌, మహబూబాబాద్‌ ఎంపీలు దయాకర్‌, సీతారాంనాయక్‌లు పాల్గొన్నారు.
మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలి, శాశ్వత ఏర్పాట్లకు రూ.200 కోట్లు: కెసిఆర్ was originally published on Telugunewsonline
0 notes
yuvataram · 3 years ago
Text
మహిమగల్ల తల్లులు మన సమ్మక్క సారలమ్మలు....
మహిమగల్ల తల్లులు మన సమ్మక్క సారలమ్మలు….
ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ లోని పండ్ల మార్కెట్ లో ఆర్టీసీ బస్ సెంటర్ ను ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. మహిమగల్ల తల్లులు సమ్మక్క సారలమ్మలు. ఆ తల్లుల ఆశీర్వాదంతో…
Tumblr media
View On WordPress
0 notes
tremendouslyyounglove · 3 years ago
Video
youtube
రారా నా చిన్న తండ్రి | Rara Na Chinna Thandri | సమ్మక్క సారక్క మహత్యం | ...
0 notes
allindiagovtjobs · 2 years ago
Link
మేడారం సమ్మక్క సారక్క జాతర Medaram Sammakka Sarakka Jatara Telangana State Indian Kumbha Mela
మేడారం సమ్మక్క సారక్క జాతర తెలంగాణ రాష్ట్ర భారత కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర భారతదేశంలోని ప్రముఖ గిరిజన పండుగలలో ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పండుగ దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఆకర్షిస్తుంది. అన్యాయం మరియు అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన జంట దేవతలైన సమ్మక్క మరియు సారక్కలకు ఈ పండుగ అంకితం చేయబడింది. ఈ పండుగ వారి విజయానికి సంబంధించిన వేడుక మరియు భారతదేశంలోని గిరిజన వర్గాల యొక్క …
0 notes
teluguvision · 4 years ago
Text
మేడారం కు ఎవరు రావద్దంటూ... భక్తులకు గుడి పూజారులు విన్నవించారు...ఇదేకారణం...!
మేడారం కు ఎవరు రావద్దంటూ… భక్తులకు గుడి పూజారులు విన్నవించారు…ఇదేకారణం…!
రేపటినుండి మేడారం జాతరకు భక్తులు రావద్దంటూ ఆలయ అధికారులు భక్తులకు విన్నవించారు… అసలువిషయానికి వస్తే…. ములుగు జిల్లా మేడారంలో జాతరలో  దేవాదాయ శాఖలో విధులు నిర్వహిస్తున్న  ముగ్గురు అధికారులకు కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఇప్పటినుండి  కరోనా ను అంతమొందించడానికి ,  మేడారం లోని సమ్మక్క సారలమ్మ గుడి  వేయాలని  నిర్ణయించారు. ఈ రోజు  మేడారంలో దేవాదాయ శాఖ అధికారులు, పూజారుల చర్చల  అనంతరం…
Tumblr media
View On WordPress
0 notes
manatemples · 4 years ago
Photo
Tumblr media
#మనదేవాలయాలు #మనదేవాలయాలు_మనసంపద సమ్మక్క -సారక్క దేవాలయం ,జాతర - మేడారం ------------------------------------------------------------- వరంగల్ జిల్లాలోని తాడ్వాయ మండల కేంద్రం లోని మేడారం గ్రామా మ లో జరిగే జాతరే సమ్మ -సారక్కల జాతరా జిల్లాకేంద్రము నుండి 110 కిలోమీటర్ల దూరములోతాడ్వాయి మండలములో ఉన్నమారుమూల అటవీ ప్రాంతమైన మేడారం లో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈచారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది . కాకతీయ సేనలతో వీరోచితంగా పోరాడి మన్యం వీరవనితలు సమ్మక్క -సారక్క ల రక్తం చిందిన చోటే ప్రతిష్టించి గద్దెఅలకు ఆ వనదేవతలు మాఘ శుద్ధ పౌర్ణమి నాడు తరలి రావడం ,మరుసటి రోజు కొలువు తీరడం ,ఆ తరువాత రోజు వనదేవతలు వనప్రవేశం తో మూడు రోజుల జాతర ముగుస్తుంది . గిరిజనులకు ఇష్టమైన కుల దైవాలు సమ్మక్క-సారక్క ల జాతర ,నాగరిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి అంద చందాలతో అలరారే అడవిలో జరగటం వారికి పరమనందదాయకం . సంవత్సరం సంవత్సరం ఇక్కడికి వచ్చే వారి సంక్య పెరుగుతుంది . కోరిన కోరికలు తీర్చే తల్లులు సమ్మక్క -సారక్క . జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణెరూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్టించే సమయములో భక్తులు పూనకంతో ఊగిపోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువుతీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యదాస్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము(బెల్లము)నైవేద్యము గా సమర్పించుకుంటారు. హేమాచల లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ----------------------------------------------------------------- ఉగ్రం వీరం మహా విష్ణుం జ్వలంతం సర్వతో ముఖం న్రిసింహం భీషణం భద్రం మ్రిత్యుర్ మ్రిత్యుం నమామ్యహం వరంగల్ జిల్లా మంగపేట మండల కేంద్రం లో గల మల్లూర్ ఘాట్ దగ్గర వెలసిన స్వయం భు లక్ష్మి నరసింహ క్షేత్రం ఇది . ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు మహిమన్మితమైనది . చుట్టూ అడవి మద్యలో మెట్లు ఎక్కుతూ పైకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవడం చాల రమణీయంగా ఉంటుంది . యోగానంద నరసింహ స్వామి మరియు లక్ష్మి దేవితో కొలువై ఉన్న ఈ క్షేత్రం లో హనుమ ద్వారా పాలకుడై ఉన్నాడు . చుట్టూ దట్టమైన కొండల పైన వెలసిన ఈ క్షేత్రం లో చింతమాని పుష్కరిణి ఉంది . కొండ పై నుండి చింతమాని ధర ప్రవహిస్తుంది .ఎల్లప్పుడు ఇక్కడ నీరు ఉంటుంది . భద్రాది నుండి గోదావరి ఎదురుగా సుమారు 90-100 కి మీ దూరం లో గల మల్లూరు నరసింహ క్షేత్రం https://www.instagram.com/p/CH4JMGUMWC-/?igshid=ic2kak1qb0il
0 notes
mirrortoday · 4 years ago
Photo
Tumblr media
మేడారం సమ్మక్క సారలమ్మ ప్రధాన పూజారి కాక లక్ష్మీబాయి మృతి ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సారలమ్మ ప్రధాన పూజారి కాక లక్ష్మీబాయి అనారోగ్యం తో కొద్దిసేపటి క్రితమే క‌న్నుమూశారు. వంశ‌పార‌ప‌ర్యంగా ఆల‌యంలో పూజారి విధులు నిర్వ‌హిస్తున్నారు.. పూజారి మృతి ప‌ట్ల ప‌లువ‌రు సంతాపం ప్ర‌క‌టించారు.
0 notes
yuvataram · 3 years ago
Text
జంపన్న వాగు స్నాన ఘట్టాలు, స్నానం చేసేందుకు కల్పించిన సదుపాయాలను పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్..
జంపన్న వాగు స్నాన ఘట్టాలు, స్నానం చేసేందుకు కల్పించిన సదుపాయాలను పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్..
మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులకు కల్పిస్తున్న వసతులు, జంపన్న వాగు దగ్గర స్నాన ఘట్టాలు, స్నానం చేసేందుకు కల్పించిన సదుపాయాలను జంపన్న వాగులో దిగి భక్తులను అడుగుతూ పనులను, పరిశీలిస్తున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అధికారులు మరియు…
Tumblr media
View On WordPress
0 notes
prime9users · 5 years ago
Link
#మేడారం మహాజాతర #సమ్మక్క సారలమ్మ జాతర Medaram Sammakka Saralamma Jatara#ప్లాస్టిక్ ఫ్రీ మేడారం జాతర #Live #Prime9News
0 notes
newsmetertelugu-blog · 5 years ago
Photo
Tumblr media
సమ్మక్క-సారలమ్మలకు అమరావతి రైతుల మొర.! #apfarmersvisitsmedaram #medaramjathara #medaram #onlinetelugu #onlinenewsontelugu #onlinenewstelugu #amaravathi #amaravathinews #andhrapradesh https://telugu.newsmeter.in/ap-farmers-visits-medaram/?feed_id=5897&_unique_id=5e3e624211c08
0 notes
allindiagovtjobs · 2 years ago
Link
సమ్మక్క సారలమ్మ మేడారం జాతర తెలంగాణ సమ్మక్క సారక్క జాతర (లేదా మేడారం జాతర), తెలంగాణలోని గిరిజన మూలానికి చెందిన ఒక చిన్న పండుగ, ఇది ఒక ప్రధాన పుణ్యక్షేత్రం. ములుగు జిల్లా దట్టమైన అడవుల్లోని తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో రెండేళ్లకోసారి సమ్మక్క పండుగ జరుగుతుంది. సాధారణంగా …
0 notes
teluguvision · 4 years ago
Text
medaram jatara 2021 dates : ఈ రోజునుండి ప్రారంభమైన చిన్న మేడారం జాతర..
medaram jatara 2021 dates : ఈ రోజునుండి ప్రారంభమైన చిన్న మేడారం జాతర..
Mini Medaram 2021 Dates: సమ్మక్క సారలమ్మ చిన్న మేడారం జాతర తేదీలను పూజారులు విడుదల చేసారు. ఈ రోజు  ఫిబ్రవరి 24 నుంచి 27 వ తేదీ వరకు   అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పూజారులు తెలిపారు. ఈ జాతర  పండుగ సందర్భంగా పూజారులు అమ్మవార్ల గద్దెల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక అసలైన సమ్మక్క సారలమ్మ జాతర 2 సంవత్సరాల ఒకసారి జరిగే విషయం మన అందరికి తెలిసిందే. సంప్రదాయం ప్రకారం ఈ సంవత్సరం …
Tumblr media
View On WordPress
0 notes
Video
tumblr
మేడారం సమ్మక్క-సారలమ్మలను దర్శించుకోడానికి విచ్చేస్తున్న అశేష భక్తజన కోటికి ఆ ఇద్దరమ్మల చల్లని దీవెనలు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. మీ, Raju Vamsharaj ( R V R ) King రాజు వంశరాజ్ ( ఆర్ వి ఆర్ ) TRS Youth Leader 892 555 5557 INDIA ( భారతదేశము )
0 notes