Tumgik
#ప్రాచీనులు
mplanetleaf · 9 months
Video
youtube
ప్రాచీనులు - రుద్రుడు Episode 49 | Rudrudu Folklore Novel | SMBAB
0 notes
chaitanyavijnanam · 2 months
Text
సిద్దేశ్వరయానం - 121 Siddeshwarayanam - 121
Tumblr media
🌹 సిద్దేశ్వరయానం - 121 🌹 💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐 🏵 భైరవసాధన -3 🏵
ఆంధ్రదేశంలో చాలా చోట్ల భైరవాలయాలు ఉన్నాయి. ఉజ్జయినిలో, ఢిల్లీలో ఇంకా అనేక క్షేత్రాలలో ప్రసిద్ధమయిన భైరవాలయాలు ప్రకాశిస్తున్నాయి. దాదాపు ప్రతిచోట మద్యాన్ని నైవేద్యం పెట్టటం ఆచారంగా ఉంది. ఆంధ్రదేశంలో కడప జిల్లాలోని పులివెందుల దగ్గర మోపూరు గ్రామంలో కొండమీద బాలభైరవుని ఆలయమున్నది. ఆ దేవుని వర్ణన క్రీడాభిరామంలో వల్లభరాయడనే కవి ఇలా వర్ణించాడు.
సీ|| చంద్రఖండములతో సరివచ్చు ననవచ్చు విమల దంష్ట్రా ప్రరోహములవాని
పవడంపు కొనలతో ప్రతివచ్చు ననవచ్చు కుటిలకోమల జటాచ్ఛటల వాని
ఇంద్రనీలములతో నెనవచ్చు ననవచ్చు కమనీయతర దేహకాంతి వాని
ఉడురాజు రుచులతో నొరవచ్చు ననవచ్చు చంచన్మదాట్టహాసముల వాని
గీ॥ సిగ్గుమాలిన మొలవాని చిరుతవాని ఎల్లకాలంబు ములికినా డేలువాని
అర్థి మోపూర నవతారమైన వాని భైరవుని గొల్వవచ్చిరి భక్తవరులు.
అతడు భైరవుని ప్రత్యక్షం చేసుకొని సిద్ధసారస్వతశ్రీని పొందానని వ్రాసుకొన్నాడు. ఆ మోపూరి భైరవుని భక్తుడయిన ఒకరు ఇప్పుడు గోదావరి జిల్లాలో పుట్టి నా దగ్గరకువచ్చి కుర్తాళంలో భైరవసాధన మొదలు పెట్టాడు. అతడి జన్మరహస్యం కుర్తాళనాడీగణపతి సన్నిధిలో తెలియచేయబడింది. కుర్తాళంలో కుర్తాళ నాథేశ్వరుని ఆలయంలో సుందరమైన భైరవ విగ్రహం ఉన్నది. అక్కడే మౌనస్వామి చాలా కాలం తపస్సు చేశాడు. దక్షిణదేశంలో చాలా చోట్ల శివాలయాలలో, కుమారస్వామి ఆలయాలలో భైరవ విగ్రహాలున్నవి. ప్రాచీనులు ఎప్పుడో ఆ ఆలయాలను నిర్మించారు. కానీ భైరవునికి పూజలు జరగటం అంతగా కన్పించటం లేదు. కుర్తాళం సిద్ధేశ్వరీ పీఠంలోను, గుంటూరులో సిద్ధేశ్వరీ వీఠమందిరంలోను, విశాఖపట్టణంలోని లలితాపీఠంలోనూ కాలభైరవునకు ఆలయాలు కట్టించాను. అక్కడ నిత్యపూజలు జరుగుతున్నవి. మందార వారుణీ మద ఘూర్ణితాత్ముడు, డమరు, ఖట్వాంగ కపాలపాణి, కుర్కుర పరివార కోటిసేవితుడైన ఆ భైరవుని స్తుతిస్తూ నేను చెప్పిన పద్యాలను చూడండి.
శ్లో॥ నమో భూతనాధం నమః ప్రేతనాథం నమః కాలకాలం నమోరుండమాలం
నమః కాళికా ప్రేమలోలం కరాళం నమో భైరవం కాశికా క్షేత్రపాలం
సీ ॥ హాలామదాలోల లీలా విలాసాయ భవ నమస్తే కాలభైరవాయ
కాళికా సురత శృంగార సంప్రీతాయ వర నమస్తే కాలభైరవాయ
డమరు కృపాణ దండ కపాలహస్తాయ భర్గ నమః కాలభైరవాయ
అట్టహాస పలాయితాంతకాయ హరాయ వందనం తే కాలభైరవాయ
లోకములో కొందరు ప్రేమోన్మాదులు. కొందరు దివ్యోన్మాదులు. నేను మంత్రోన్మాదిని. వ్యాసుని రచనలు చూచి కాశీకి వెళ్ళాలి. గంగలో స్నానం చేయాలని చాలా సార్లు అనుకొనేవాడిని. నీ అనుమతి వస్తేనే గదా ఎవడైనా ఆ పంచక్రోశపరీత క్షేత్రంలో అడుగు పెట్టేది. ఎలానో వచ్చాను. నీ వెలుగు కోసం వెదుకుతున్నాను. అన్నట్లు మొన్న నీ ద్వీపానికి వెళ్ళి వచ్చాను. అక్కడ నీ దర్శనమైన తర్వాత అది నీ నివాసమైన భైరవ ద్వీపమని తెలుసుకొన్నాను. నా అనుచరుడు కూడా స్వామీజీ! ఇక్కడి కిదివర కెప్పుడ��� వచ్చినట్లు అనిపిస్తున్నది అన్నాడు. నిజమే ! ఇక్కడ నీవు కాళీదేవితో విహరించావు. ఎన్ని జన్మల నుంచో అప్పుడప్పుడు వచ్చి నిన్ను సేవిస్తూనే ఉన్నాము.
పూర్వం ఒక జన్మలో జాతకరీత్యా మారక సమయం వచ్చింది. గ్రహముల శక్తిని ఎదిరించే ఆశ పోయింది. అయినా నిన్ను నమ్మి భజించాను. మృత్యువు దూరంగా వెళ్ళిపోయింది. నా భక్తి భరిత సాధనకు సంతోషించి నన్ను మహాసిద్ధుని చేశావు. నాధ సంప్రదాయంలో తపస్సు చేసినందువల్ల అందరూ నన్ను భైరవనాధుడన్నారు. ఆనాడు నన్ను ఎలా ఉద్ధరించావో ఓ ప్రభూ ! ఈనాడు కూడా ఆవిధంగానే రక్షించు.
కాశీలో భూగుహలున్నవని చెప్పబడే ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆది యుగాలలో జైగీషవ్యుడనే మునిగా నే నక్కడ ఉన్నట్లు స్ఫురించింది. అలానే హిమాలయ పర్వత ప్రాంతంలో ఒక చోట నివసిస్తూ అనూరాధ అనే ఒక దేవకన్యను పెండ్లి చేసుకొని సంతానాన్ని కన్న తరువాత విశ్వామిత్రుని కథలో మేనకవలె ఆమె విడిచి వెళ్ళిపోయిందని తెలిసింది. క్షేత్రంలో రకరకాల అనుభూతులు. నావే కాక నాతో పాటున్న ఎందరివో జన్మ రహస్యాలు, దేవతలు, సిద్ధులు తెలియచేస్తున్నారు. ఏమైనా ఇప్పుడు బృందావనము, కాశీ, కుర్తాళము ఈ మూడూ ప్రధాన కేంద్రాలుగా నా తపస్సాధన సాగుతున్నది.
వేల సంవత్సరాలనుండి అనేక దివ్యక్షేత్రముల వలె కుర్తాళం కూడా ఒక అద్భుత సిద్ధక్షేత్రం. అగస్త్య మహర్షి దీనిని మహనీయ యోగకేంద్రంగా తీర్చిదిద్దాడు. ఎందరో మహాయోగులు తపస్సు చేసిన స్థలమిది. ఇప్పటికి గుర్తువచ్చినంత వరకు నాలుగు వేల ఏండ్ల క్రింద నేను ఇక్కడకు మొదటిసారి వచ్చాను. మహనీయుడైన మౌనస్వామి కూడా వచ్చారు. అప్పటినుండి ఈ స్థలంతో ఈ క్షేత్రంతో ఇక్కడ యోగులతో అనుబంధం. ఇక్కడి యోగులు మరెక్కడ పుట్టినా, మరెక్కడ నివసిస్తున్నా వారితో పరిచయం పునరావృతమౌతూనే ఉన్నది. అందుకే ఇది సిద్ధిస్థానం. ఇక్కడకు వచ్చి తపస్సు చేయండి. శీఘ్రంగా ఫలిస్తుంది అని యెలుగెత్తి ఉద్బోదిస్తున్నాను.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
0 notes
thaporushi · 4 years
Photo
Tumblr media
#ముక్కోటిఏకాదశి అనంతమైన పుణ్యఫలం అని చెప్పుకోవాలి. భారతీయులు కాంతిని ఆరాధించేటటువంటి వారు. ప్రాజ్ఞ్ముఖంగా ప్రయాణించేటటువంటి వారు. దేహంలో ఎప్పుడూ కూడా ఎడమ భాగాన్ని కుడి భాగం నియంత్రిస్తూ ఉంటుంది. వామ భాగం స్త్రీ సంబంధితమైనటువంటి భాగం. ప్రేమ, పారమార్థిక దృష్టి, లౌకిక సుఖములు, ఆనందములు ఇవన్నీ కూడా ఉత్తర దిక్భాగంలో ఉంటాయి. వీటన్నింటినీ నియంత్రించేది ఎడమ భాగం. అలాగే మన దృష్టి కూడా నిరంతరం ఎడమ వైపుకే ప్రసరిస్తూ ఉంటుంది. ఉత్తరం దిక్కుకు ధనము, సంపద వంటి వాటికి ప్రాముఖ్యత ఉంది. అన్నింటికంటే మించి ఈ విశాల విశ్వమంతా కూడా తన చుట్టూ తానూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అనుకుంటే ఈ విశ్వంలో ఉండే అంతర్భాగము axil అంటారు దానిని అది దీనికి వ్యతిరేకంగా తిరుగుతూ ఉంటుంది. ఈ విశ్వము దక్షిణం వైపునుంచి ఉత్తరం వైపుకు anti clockwise తిరుగుతూండగా అందులోని అంతర్భాగం ఉత్తరం వైపునుంచి దక్షిణానికి clockwise తిరుగుతుంది. "ప్రాగ్ ఆరభ్య దక్షిణేణ వర్తనం" మన హిందూ ధర్మంలో అందుకోసమే ఆలయానికి వెళ్తే ప్రదక్షిణ చేయాలి - ప్రాగ్ ఆరభ్య దక్షిణేన వర్తనం. ఉత్తరంగా, ఈశాన్యంగా, తూర్పుగా, ఆగ్నేయం, దక్షిణం ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. కనుక ఈ రెండింటి మధ్య ఉండే వైరుధ్యం వల్ల కలిగిన ఆకర్షణ శక్తి చేత మనం ఈ భూమిమీద అంటిపెట్టుకొని ఉన్నాం దానికే భూమ్యాకర్షణ శక్తి అని పేరు. ఈరోజున ఉత్తర దిగ్భాగ మార్గాన్ని అనుసరించి ఇంక రెండు మూడు రోజులలో సూర్యనారాయణ మూర్తి ఉత్తర దిగ్భాగంలో ప్రయాణం చేస్తూంటాడు. ఈరోజున మనం ఉత్తర దిగ్భాగంతో ప్రయాణం ప్రారంభం చేసినట్లయితే తప్పకుండా కైవల్యం లభిస్తుంది. ఈ భూమితో ఉండే ఆకర్షణ సంబంధిత సంబంధాలన్నీ కూడా తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణ మూర్తిని చేరుకుంటాము. భవ బంధనాలన్నీ కూడా తొలగిపోతాయి. అనేటటువంటి రహస్యాన్ని కనుగొన్న ప్రాచీనులు ఈ అంశాలన్నీ కూడా శాస్త్రోక్తంగా చెప్తే అందరికీ అర్థం అవుతాయో లేదో అనే ఉద్దేశ్యంతో కథలను జోడించి విభీషణ శరణాగతి కథ, వైకుంఠ ఏకాదశి కథ, ముప్పది మూడు కోట్ల దేవతలతో ఆ స్వామి ఈనాడు మనకు దర్శనమిస్తాడు. మూడు కోట్లతో రంగధాముని దర్శనమిస్తాడు. ఇలా చెప్పి ఆలయాలవైపు మనల్ని మరల్చారు. స్వామి దర్శనం చేసుకోండి అంటూ అనుజ్ఞనిచ్చారు. మన ప్రయత్నం కాకుండా గురువుతో ప్రయత్నం కావాలి. స్వప్రయత్నం కూడదు అంటుంది ధర్మము. కాబట్టి నారాయణుడే అటువంటి మనలో జ్ఞానమును ప్రేరేపించు వాడు. ఆయన ప్రపన్నుడు. అడిగిన వాళ్ళందరికీ కూడా ఆశ్రయం ఇచ్చే ప్రపన్నుడు. ఎవరిని రక్ష��ంచాలా? అని సంసిద్దుడై ఉంటాడుట. కాబట్టి ఉత్తర ద్వార దిశగా మనం ప్రయాణం చేస్తే తప్పకుండా కోరిన కోరికలు నేరవేరుతాయి. అన్నింటికంటే కోరవలసినది ఏమున్నది? https://www.instagram.com/p/CJIU2mCsvVM/?igshid=17js1cvmh1gq6
0 notes
chaitanyavijnanam · 4 months
Text
సిద్దేశ్వరయానం - 76 Siddeshwarayanam - 76
Tumblr media
🌹 సిద్దేశ్వరయానం - 76 🌹 💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐 🏵 రత్న ప్రభ - 3 🏵
రత్నప్రభ వాళ్ళమ్మతో కలిసి స్వామి వారివెంట తీర్ధయాత్రలకు వెళ్ళింది. ఆయా క్షేత్రాలలో తాము ఎన్నివందల సంవత్సరాల క్రింద ఉన్నది. పూర్వజన్మ విశేషాలు ఆ దేవతా మహిమవల్ల జరిగిన అద్భుతాలు స్వామివారు తెలియజేసేవారు. వారు మాటాడుతున్నప్పుడల్లా ఆ సమయాలలో తానుకూడా వారితో ఉన్నట్లు అనిపించేది. ఈ విధంగా దీర్ఘప్రయాణాలు చేసి చివరకు కామాఖ్య చేరుకొన్నారు. కామాఖ్య కాళి గురించి కాళీపురాణంలోని విశేషాలు స్వామివారు చెపుతుంటే దిగ్భ్రాంతి కలిగింది.
ఆ ఊరిలో ఉండగా సంవత్సరాని కొకసారి జరిగే మహోత్సవములు వచ్చినవి. నాగ భూమి నుండి దిగంబర సాధువులెందరో ఆ కార్యక్రమాలలో పాల్గొనటానికి వచ్చారు. ఒకపూట అద్భుతమైన ఖడ్గ చాలన ప్రదర్శన జరిగింది. నిప్పులలో దూకేవారు, నారసాలు గుచ్చుకొనేవారు, కొరడాలతో కొట్టుకొనేవారు చిత్ర విచిత్ర తీవ్ర సాధకులక్కడ కనిపించారు. దీర్ఘకాలం ఉపవాసాలుండి, ఎండలో పంచాగ్ని మధ్యంలో నిల్చుని, శీతకాలంలో గొంతు లోతు చన్నీళ్ళలో నిల్చొని కఠోర నియమాలతో ప్రాచీనులు తపస్సుచేస్తే – ఈ మార్గంలో శరీరాన్ని హింసిస్తూ సూదులతో పొడుచుకొంటూ కత్తులతో గుచ్చుకొంటూ, కర్రతో, కొరడాతో బాదుకొంటూ తామస మంత్రాలు చేస్తుంటే ఆ మంత్ర దేవతలు తొందరగా అనుగ్రహిస్తారని స్వామివారు తమ ప్రసంగాలలో తెలియజేశారు.
అక్కడి ఉత్సవాలలో ప్రధానమైనరోజు స్వామివారు ఒక ఎర్రని గుడ్డలో చిన్న యంత్రం పెట్టియిచ్చి దానిని రాత్రి తలక్రింద పెట్టుకొని నిద్రించమని చెప్పారు. కామాఖ్యలో పరమేశ్వరి యోనిపూజించబడుతుంది. ఆ శిలాఖండం నుండి - ఆ దేవి రజస్వలయైన దానికి గుర్తుగా రక్తం స్రవిస్తూ ఉంటుంది. ఆ వస్త్ర ఖండాలను మహాప్రసాదంగా తీసుకొని పూజలో పెట్టుకొంటారు. ఆ వస్త్ర ఖండంలో కాళీయంత్రం ఉంచి యిచ్చారు స్వామివారు.
రాత్రి ఉపవాసం ఉండి భూశయనం చేసి కాళీదేవిని స్మరిస్తూ కండ్లు మూసుకొని పడుకొన్నది రత్నప్రభ. అప్పటికి మొదటిజాముదాటి రెండవజాము ప్రవేశించింది. నిద్రలో ఉన్నదో లేక మెలకువగా ఉన్నదో తెలియని స్థితిలో ఉన్నట్లుండి శరీరంలో నుండి బయటకు వచ్చినట్లు అనిపించింది. చూస్తే తాను ఆకాశంలో ఉంది. శరీరం క్రింద కనిపిస్తున్నది. గగనయానం చేస్తూ నీలిమబ్బుల మధ్య ఒక గుహలో ప్రవేశించింది. సుదీర్ఘమైన ఈ అంధకార కందరంలో వెళ్ళి వెళ్ళి చివరకు బయటకు వస్తే ఒక కాంతి పుంజం. ఆ తేజోమధ్యంలో కాళి - కాలభైరవుడు కనిపిస్తున్నారు. చిత్రం! ఇద్దరూ చాలా సుందరంగా ప్రేమమూర్తులుగా భాసిస్తున్నారు.
కాళీదేవి భైరవునితో ఇలా అంది "భైరవస్వామీ! ఈ బాలిక బృందావనంలో రాధాదేవి చెలికత్తెయైన ఇందులేఖ యొక్క అంశ. మనోరమ అనే పేరుతో ఉండి నా భక్తుడైన ఒక సిద్ధునితో అనుబంధం కలిగి భువనేశ్వరారణ్యంలోని నామందిరంలో కొంతకాలం మంత్రసాధన చేసింది. ఆ మంత్రమునే మళ్ళీ మీరిప్పుడు నా భక్తురాలికి ప్రసాదించండి. నాలో రాధాదేవి అంశయైన శ్యామకాళి మీలో కృష్ణుని అంశయైన కృష్ణభైరవుడు పూర్ణత్వ ప్రాభవం పొందటం జరిగింది. కనుక రాధాకృష్ణ భక్తురాలైన ఈ జీవి మీ అనుగ్రహానికి అర్హురాలు." కాళీ ప్రియుడైన కృష్ణ భైరవుడు రత్నప్రభకు కాళీమంత్రాన్ని ఉపదేశించాడు.
రత్నప్రభ అత్యంత వినమ్రమూర్తియై ఇద్దరికి పాదనమస్కారం చేసి ఆ మంత్రాన్ని జపించటం మొదలుపెట్టింది. ప్రారంభించిన కాసేపటికి ఆజ్ఞాచక్రంలో కదలిక వచ్చింది. మూసిన తలుపులు తెరుచుకొన్నట్లు అక్కడ సంచలనం కలిగి దివ్యదృష్టి లభించింది. వరుసగా తన జన్మపరంపర గోచరిస్తున్నది. బృందావనంలో రాధాదేవి పరివారంలో శ్యామ అనేపేరుతో ఉండి - జనమేజయుని సర్పయాగంలో హోమకుండంలో పడి దహనం కాకుండా రాధాదేవి కరుణవల్ల రక్షించబడిన సిద్ధనాగుడనే నాగజాతి తపస్వికి ఆ ధామంలో సేవచేసింది. రాధా శరీరంలోని రాసేశ్వరి బయటకువెళ్ళి కృష్ణునితో కలిసి దివ్యభూమికలోకి ప్రవేశించిన తర్వాత మిగిలిన ఉశీనర రాజకుమారి రాధ - సిద్ధాశ్రమానికి తపస్సు చేసుకోటానికి వెళ్ళిపోయింది.
అనంతరం శ్యామ సిద్ధనాగునితో ఉంది. రాధాదేవి సంకల్పంవల్ల ప్రపంచంలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించే ప్రణాళికలో భాగంగా తాను ఎన్నో జన్మలు తీసుకోవలసి వచ్చింది. సిద్ధనాగుడు కూడా పరమేశ్వరి ఇచ్ఛవల్ల జన్మపరంపర పొందటం జరిగింది. అతడు భైరవనాధుడనే సిద్ధునిగా, భానుదేవుడనే రాజయోగిగా ఉన్నప్పుడు ఆయనకు సేవచేసింది. ప్రవరసేనుడనే మహారాజుగా బృందావన ప్రాంతాన్ని పరిపాలించినపుడు ఆ నరపాలుని భార్య నాగావళిగా రాధాదేవిని కొలిచింది. ఆ సిద్ధేశ్వరుడు డెహ్రాడూన్ ప్రాంతంలో జన్మించినపుడు అనూరాధా అనే కాళీసఖిగా ఉండి భౌతికరూపం తీసుకొని ఆయనతో కాపురంచేసి సంతానంకని మళ్ళీ అమ్మ పరివారంలోకి వెళ్ళింది. తరువాత కొంతకాలం హిమాలయాలలో సిద్ధాశ్రమంలో లలితాదేవి ఆలయంలో కింకరిగా హిరణ్య అనేపేరుతో ఉంది. అక్కడ తాంత్రిక సాధనలుచేసి డాకినీ సిద్ధిని పొందింది. హిమాలయాలలో డాకిని అంటే దేవయోని జాతికి చెందిన దివ్యశక్తులు గల అప్సరస వంటిది.
( సశేషం )
🌹🌹🌹🌹🌹
0 notes