#ప్రత్యక్ష నరకం
Explore tagged Tumblr posts
Video
youtube
ప్రత్యక్షనరకం - వెట్టి Episode 7 | Vetti Telugu Novel by MadhuBabu | SMBAB
#youtube#ప్రత్యక్షనరకం#ప్రత్యక్ష నరకం#వెట్టి#vetti novel#vetti#smbab#vetti telugu novel by madhubabu#vetti novel by madhubabu#Vetti Episode 7#shadow madhu babu audiobooks#madhu babu novels#telugu audiobooks#madhu babu novel vetti#shadow madhubabu novel#voice of sudha#podcast#podcast telugu#తెలుగు పుస్తకాలు#telugu books#telugu novels#audiobooks#telugu audiobook#listen to novels#socio crime novels#crime novels by madhubabu#read books#read book#vetti story#vetti audiobook
0 notes
Text
Massacre in Korea -by Pablo Picasso
చారిత్రక కోణం
ఒక భూతంగా, ప్రపంచ సమస్యగా అమెరికా ముందుకు తెచ్చిన ఉత్తర కొరియా విషయంలో చారిత్రక కోణం తరచుగా విస్మరణకు గురవుతోంది. సమకాలీన రాజకీయార్ధిక విశ్లేషణా నిపుణులు సైతం ఉత్తర కొరియాపై ఆరంభం నుండి అమెరికా అనుసరిస్తూ వచ్చిన దాష్టీకం గురించి వివరించి చెప్పడంలో విఫలం అవుతున్నారు. ఉత్తర కొరియా – అమెరికా, ఉత్తర కొరియా – జపాన్, ఉత్తర కొరియా – చైనాల మధ్య చోటు చేసుకున్న చారిత్రక పరిణామాలను చెప్పుకోకపోతే సమస్యను పాక్షికంగా పరిశీలించినట్లే అవుతుంది. 1950-53 కొరియా యుద్ధంలో అటు ఉత్తర కొరియా పైనా, ఇటు దక్షిణ కొరియాలోని ప్రజాస్వామిక పీపుల్స్ కమిటీల పైనా అమెరికా రుద్దిన పాశవిక, అమానవీయ, రక్తపిపాస యుద్ధాన్ని, అమెరికా జరిపిన మారణ హోమాన్నీ తెలుసుకోకపోతే అమెరికా పట్ల నేడు ఉత్తర కొరియా ప్రకటిస్తున్న భయాందోళనలను అర్ధం చేసుకోలేము. స్వయం పాలన నిర్వహించుకుంటున్న లక్షలాది కొరియా ప్రజా కమిటీలను అమెరికా సైన్యం, కొరియా కులీన భూస్వామ్య వర్గాలు కుమ్మక్కై ఊచకోత కోసిన చరిత్ర గురించి తెలియనట్లయితే అమెరికా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు ప్రతి యేటా జరిపే సంయుక్త యుద్ధ విన్యాసాల పట్ల పేచీకోరుతనంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించే ఉత్తర కొరియా ప్రవర్తనను అర్ధం చేసుకోలేము.
జపాన్ తన ఆర్ధిక, సైనిక ప్రయోజనాల కోసం (ఉమ్మడి) కొరియాను ఆక్రమించుకునేందుకు 1871 నుండీ పధకాలు మొదలు పెట్టింది. కొరియాలోని కులీన దోపిడీ వర్గాలు జపాన్ తో కుమ్మక్కు కావడంతో 1905 నాటికి కొరియా, జపాన్ రక్షిత ప్రాంతం (ప్రొటెక్టరేట్) గా అవతరించింది. (పరోక్ష వలస పాలననే నాజూకుగా రక్షిత ప్రాంతంగా చెప్పడం వలసాధిపత్య దేశాల���ు పరిపాటి.) 1910 నాటికి జపాన్, కొరియాను పూర్తి స్ధాయిలో ప్రత్యక్ష వలసగా మార్చుకుంది. అప్పటికి అనేక శతాబ్దాలుగా కొరియా ప్రజలు కొద్ది సంఖ్యలోని భూస్వామ్య ప్రభువుల దోపిడి అణచివేతలో మగ్గుతూ వచ్చారు. భూస్వామ్యవర్గం కాక ఇతర కొరియన్లు దాదాపు అందరూ అర్ధ బానిసత్వంలో మగ్గిన పేద రైతులే. భూస్వామ్య వర్గానికి విలాసవంతమైన సౌకర్యాలు అందజేసి వారిని జపాన్ వలస పాలకులు తమ ఏలుబడిలోకి తెచ్చుకున్నారు. మూడు దశాబ్దాల పాటు జపాన్ వలస ప్రభుత్వం, కొరియా భూస్వాముకు సంయుక్తంగా కొరియా ప్రజలకు నరకం చూపించారు. వలస ఆక్రమణలో కొరియన్లపై జపాన్ అనేక అకృత్యాలకు పాల్పడింది. కొరియా ప్రజల భాష, సంస్కృతులను అణగదొక్కింది. జపనీయ ఇంటి పేర్లను తమ ఇంటి పెర్లుగా కొరియన్లు పెట్టుకునేలా బలవంతం చేశారు. అత్యంత విలువైన కొరియన్ వారసత్వ సంపదను, ప్రాచీన కళలను, కళాకృతులను ధ్వంసం చేశారు.
కొరియా ప్రజలు వివిధ రూపాల్లో ప్రతిఘటించినప్పుడల్లా పాశవికంగా అణచివేశారు. ఉదాహరణకు 1919 మార్చి 1 తేదీన కొరియా ప్రజలు వలస దోపిడీకి వ్యతిరేకంగా శాంతియుత ప్రదర్శన నిర్వహిస్తుండగా జపాన్ పోలీసులు, సైన్యం ప్రదర్శనపై ద��డి చేసి 7000 మందికి పైగా ప్రదర్శకులను కొట్టి, పొడిచి, కాల్చి చంపారు. 1931లో మంచూరియా (కొరియాకు అనుకుని ఉండే ఈశాన్య చైనా) ను ఆక్రమించాక జపాన్ వలస అణచివేత మరింత తీవ్రం అయింది. కొరియా పురుషులపై బలవంతంగా వెట్టి చాకిరీలు రుద్దారు. కొరియా మరియు మంచూరియాలలో 2 లక్షలకు పైగా స్త్రీలను (అత్యధికులు కొరియన్లు) చెరబట్టి జపాన్ సైనికులకు, అధికారులకు లైంగిక సేవలు అందజేసే కంఫర్ట్ వుమెన్ గా మార్చుకున్నారు. (జపాన్ ఈ నేరాన్ని అంగీకరించి పరిహారం చెల్లించాలని అనేక కొరియా కుటుంబాలు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాయి.)
వలస అణచివేత పెరిగిన కొద్దీ సహజంగానే కొరియా ప్రజల ప్రతిఘటన కూడా పెరిగింది. 1930ల మధ్య కాలంలో కొరియా ఉత్తర భాగంలోని ప్రజా ప్రతిఘటనకు కిమ్ ఇల్ సంగ్ నాయకుడుగా అవతరించాడు. అప్పటి చైనా కమ్యూనిస్టు పార్టీ నేత మావో-జెడాంగ్ బోధించిన కమ్యూనిస్టు సామాజిక సిద్ధాంతాలు ఆయనకు స్ఫూర్తిగా పని చేశాయి. ఆయనపై కొరియా భూస్వామ్యవర్గం కత్తికడితే ప్రజలు (ప్రధానంగా ఉత్తర భాగంలోని ప్రజలు) పూర్తి మద్దతు అందించారు.
ఈ లోపు రెండవ ప్రపంచ యుద్ధం (1939-45) బద్దలయింది. జపాన్ సామ్రాజ్యవాదం అవమానకర ఓటమికి గురయింది. కొరియాకు విముక్తి లభించింది. లభించిందని కొరియన్లు భావించారు. కానీ వారి ఆశలు త్వరలోనే గల్లంతయ్యాయి. కిమ్ ఇల్ సంగ్ నేతృత్వంలో ��త్తర ప్రాంతంలోని ప్రజలు సామ్యవాద స్ఫూర్తితో సమాజ నిర్మాణానికి పూనుకోగా దక్షిణ భాగంలోని ప్రజలు తమ సొంత పద్ధతుల్లో దేశీయంగా అభివృద్ధి చేసుకున్న ‘పీపుల్స్ కమిటీ’ పాలనను ఆచరణలోకి తెచ్చుకున్నారు. ఈ పీపుల్స్ కమిటీలు ప్రధానంగా కార్మికుల నేతృత్వంలో నడిచాయి. తమదైన పద్ధతిలో సమీకృతమై ప్రజాస్వామ్య పద్ధతిలో ఫ్యాక్టరీలు, వ్యవసాయం, సహకార వ్యవస్ధలను నిర్మించుకోవడం ప్రారంభించారు. ఈ కమిటీలు ప్రజల, కార్మికుల హక్కులు, గౌరవం, ఆరోగ్యంలను సమానతా ప్రాతిపదికన సంరక్షించుకున్నాయి. ఈ వ్యవస్ధ ఎంతటి ప్రాధమిక రూపంలో ఉన్న��్పటికీ ప్రజాస్వామిక సంస్కృతిని పాటించింది. ప్రజా కమిటీల ఉద్యమం అప్పటి వరకూ కొనసాగిన భూస్వామ్య ఆధిపత్య పాలన, సంస్కృతులకు ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకుని భూస్వామ్య, వ్యాపార వర్గాలను భయభ్రాంతులకు గురి చేసింది. ఉత్తర భాగంలో కమ్యూనిస్టు స్ఫూర్తితో సామాజిక నిర్మాణం జరగడం, వారిని అనుకరిస్తూ దక్షిణ భాగంలో పీపుల్స్ కమిటీ ఉద్యమం ఊపందుకోవడంతో అమెరికా గంగవెర్రులెత్తింది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాతో జరిగిన ఒప్పందం మేరకు జపాన్ పై యుద్ధం ప్రకటించిన సోవియట్ రష్యా 38 డిగ్రీల ఉత్తర అక్షాంశానికి ఉత్తరాన ఉన్న కొరియా భూభాగాన్ని జపాన్ ఆక్రమణ నుండి విముక్తి చేసింది. అమెరికా మాత్రం కొరియా ప్రజలతో సంబంధం లేకుండా భూస్వామ్య, వ్యాపారవర్గాలను ఆసరా చేసుకుని దక్షిణ కొరియాలోకి తన సైన్యాన్ని నడిపించింది. ఉత్తరార్ధ గోళంలో 38 డిగ్రీల అక్షాంశ రేఖను సరిహద్దుగా ఉత్తర, దక్షిణ కొరియాల విభజన జరిగిపోయింది. ఈ విభజన అమెరికా, రష్యాల ఒప్పందం మేరకు జరిగిందని పశ్చిమ రాజ్యాలు చెబుతాయి. కానీ ఈ ఒప్పందం కొరియాను జపాన్ వలస పాలన నుండి కొరియాను విముక్తి చేయడం వరకే గానీ విభజించడానికి కాదు. కానీ అమెరికాయే ఏకపక్షంగా విభజనకు కారణం అయిందని “ద కొరియన్ వార్: ఎ హిస్టరీ” పుస్తకంలో రచయిత బ్రూస్ కమ్మింగ్స్ (అమెరికాకు చెందిన తూర్పు ఆసియా చరిత్రకారుడు) వెల్లడించాడు. పశ్చిమ మీడియా తప్ప అనేకమంది చరిత్రకారులు బ్రూస్ కమ్మింగ్స్ తో ఏకీభవిస్తారు. ఆ విధంగా సోవియట్ సోషలిస్టు రష్యాపై అమెరికా ప్రారంభించిన ప్రచ్చన్న యుద్ధం కొరియాను రెండు ముక్కలుగా విభజించింది.
కొరియా విభజన వల్ల ప్రధానంగా నష్టపోయింది దక్షిణ కొరియా శ్రామిక ప్రజలే. అప్పటివరకూ జపాన్ వలస పాలనలో మగ్గిన దక్షిణ కొరియా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఆక్రమణలోకి వెళ్లింది. నీతి నియమాలు లేని సింగ్మన్ రీ ని ఆ దేశానికి నేతగా అమెరికా నియమించింది. ఆయన దక్షిణ కొరియా పాత భూస్వామ్య ప్రభువులకు, పెట్టుబడిదారీ వ్యాపార వర్గాలకు ప్రతినిధి. జపాన్ వలస పాలకులతో జట్టుకట్టి ప్రజల్ని వేధించిన వర్గాలివి. రీ నేతృత్వంలో ‘రిపబ్లిక్ ఆఫ్ కొరియా’ ఏర్పడినట్లు అమెరికా ప్రకటించింది. (కిమ్ ఇల్ సంగ్ నేతృత్వంలో డెమోక���రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా -డిపిఆర్‌కే ఏర్పడింది.) దక్షిణ కొరియాలో అప్పటికే ఊపిరిపోసుకున్న పీపుల్స్ కమిటీల సామాజిక భావాలు, పధకాలు పెట్టుబడిదారీ అభివృద్ధికి ప్రమాదకరంగా అమెరికా, రీ నేతృత్వం లోని వ్యాపారవర్గాలు గ్రహించాయి. వాటిని తుదముట్టించడానికి నడుం బిగించాయి. 1945 నుండి 50 వరకు పీపుల్స్ కమిటీలపై తీవ్ర అణచివేత అమలు చేశారు. ఫ్యాక్టరీ కమిటీలను, ఇతర ప్రజా కమిటీలను భయోత్పాతానికి గురి చేశారు. ప్రతిఘటించిన కమిటీ నేతలను, ప్రజలను తరచుగా హత్యలు చేశారు.
అమెరికా, దక్షిణ కొరియా ప్రభుత్వాలు సాగించిన ఘోరకలికి చెజు తిరుగుబాటు ఒక ఉదాహరణ. కొరియా దక్షిణ తీరానికి దగ్గరలో ఉండే చెజు ద్వీపంలోని 3 లక్షల జనాభాలో మెజారిటీ ప్రజలు పీపుల్స్ కమిటీలకు మద్దతుగా నిలిచారు. కమిటీల పద్ధతిని జీవన విధానంగా స్వీకరించారు. అమెరికా ఆదేశాలతో వారిని అణచివేసే లక్ష్యంతో రీ ప్రభుత్వం పెద్ద మొత్తంలో పోలీసు బలగాలను దించింది. ద్వీపంలోని మితవాద ముఠాలు (కౌంటర్ ఇంటలిజెన్స్ కార్ప్, నార్త్ వెస్ట్ యూత్ కార్ప్స్ మొ.వి) సాయుధులై పోలీసులతో కుమ్మక్కయ్యారు. ప్రజా కమిటీలను మొదట బ్రెయిన్ వాష్ చేసేందుకు ప్రయత్నించారు. ఏ మాత్రం ప్రశ్నించినా, ప్రతిఘటించినా చంపేశారు. ఈ చంపటం అత్యంత క్రూర పద్ధతుల్లో, ఇతర కమిటీలకు హెచ్చరించే లక్ష్యంతో, జరిగింది. గర్భంతో ఉన్న స్త్రీలను సజీవంగా పొట్ట చీల్చి పిండాన్ని బైటికి లాగడం, చిన్న పిల్లల శరీరాల్ని బాయినెట్లతో పొడిచి వేలాడగట్టడం, ఇళ్ళు తగలబెట్టడం, పురుషుల తలలు పగలగొట్టి మెదడు ఛిద్రం చేయడం, గ్రామస్ధుల ముందే మహిళలపై వరుస పెట్టి అత్యాచారం జరపడం, వారి మానంలో గ్రెనేడ్లు పెట్టి పేల్చివేయడం… ఇలా ఒకటని చెప్పడానికి లేదు. ఇదంతా అమెరికా మిలట్రీ కనుసన్నల్లో, వారి ఆదేశానుసారం జరిగింది.
1948లో చెజు ప్రజలు పోలీసుల హింస, ఘోరాలపై తిరుగుబాటు చేశారు. అమెరికా, రీ ప్రభుత్వాలు తిరుగుబాటును కర్కశంగా అణచివేశారు. వేలమందిని చంపేశారు. పోలీసుల సంఖ్య తక్కువగా ఉందని భావించిన అమెరికా జపాన్ మిలట్రీ అధికారులను, సైనికులను రప్పించింది. జపాన్ సైనికులు, పోలీసులు గ్రామాలకు గ్రామాలను విచక్షణారహితంగా తగలబెట్టారు. పౌరులను ఊచకోత కోశారు. 1949 నాటికి పీపుల్స్ కమిటీ ఉద్యమాన్ని నాశనం చేశారు. అప్పటికి 70 శాతం పైగా గ్రామాలను తగలబెట్టారు. 30 వేల నుండి 60 వేల వరకు చెజు ప్రజలను చంపారని ఒక అంచనా. వారిలో మెజారిటీ అవయవాలు నరికి చంపబడ్డారు. మరో 40 వేల మంది ద్వీపం వదిలి పారిపోయారు. ప్రజా కమిటీల ఉద్యమాన్ని అణచివేశాక చెజు ద్వీపాన్ని మితవాద ముఠాల ఆధిపత్యానికి వదిలిపెట్టారు.
ఈ తరహా అణచివేత, క్రూర హింస ఒక్క చెజు ద్వీపానికే పరిమితం కాలేదు. ప్రజా కమిటీల ఉద్యమాన్ని తుదముట్టించే లక్ష్యంతో దక్షిణ కొరియా అంత���ా సాగింది. ఇది 1950లో కొరియా యుద్ధం మొదలుకాక మునుపే జరిగిందని గమనంలో ఉంచుకోవాలి. 1945-49 మధ్య కాలంలో అమెరికా/రీ పాలనలోని దక్షిణ కొరియాలో లక్ష మందికి పైగా ఉద్యమ ప్రజలను అమెరికా/ రీ ప్రభుత్వ బలగాలు చంపేశాయి.
ఈ నేపధ్యంలో 1950లో కొరియా యుద్ధం బద్దలయింది. యుద్ధాన్ని ఎవరు ప్రారంభించారన్న విషయంలో తగిన సమాచారం అందుబాటులో లేదు. యుద్ధం ముగిసిన ఆరున్నర దశాబ్దాల తర్వాత ఆ విషయాన్ని చర్చించి తప్పు ఎంచబూనడం వల్ల ప్రయోజనమూ లేదు. పశ్చిమ దేశాలు, పత్రికలు మాత్రం దక్షిణ కొరియాను దురాక్రమించడానికి ఉత్తర కొరియా దాడి చేయడంతో యుద్ధం మొదలైందని అవకాశం వచ్చిన ప్రతిసారీ చెబుతాయి. అసలు దక్షిణ కొరియాలోకి అమెరికా సైన్యాలు పెద్ద సంఖ్యలో ఎందుకు ప్రవేశించాయి అన్న ప్రశ్న వచ్చినపుడు ‘ఉత్తర కొరియా మొదటి గుండు పేల్చింద’న్న వాదన అమెరికాకు బాగా పనికొస్తుంది. ఉత్తర కొరియాకు చైనా పొరుగు దేశం. పొరుగు దేశాన్ని రక్షించుకోవడం చైనాకు సహజం. కానీ వెలమైళ్ళ దూరంలో ఉన్న అమెరికా గానీ, రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయి కొరియా ప్రజలపై సాగించిన దుర్మార్గాల కారణంగా ప్రపంచం చేత ఛీ అనిపించుకుంటున్న జపాన్ గానీ తమ సైన్యాలు కొరియాకు వెళ్లడానికి తగిన కారణాన్ని చెప్పుకోలేవు. కనుక ఉత్తర కొరియా మొదట దాడి చేసిందని చెప్పుకోవడం, ప్రచారం చేయడం అమెరికాకు అవసరం. అప్పటికే మిత్ర రాజ్యాలతో పాటు ప్రపంచం అంతా ఛీ కొట్టిన మూడు అక్ష రాజ్యాలలో (జర్మనీ, ఇటలీ, జపాన్) ఒకటైన జపాన్ ను ఉత్తర కొరియాపై యుద్ధానికి మిత్ర రాజ్యంగా స్వీకరించిన సంగతి గమనంలో ఉంచుకోవాలి. అమెరికా సామ్రాజ్యవాద ప్రయోజనాల విషయానికి వస్తే జపాన్ దుష్ట దేశం అవుతుంది. ఉత్తర కొరియా కార్మిక రాజ్యం, దక్షిణ కొరియా పీపుల్స్ కమిటీల రాజ్యంల విషయానికి వచ్చే సరికి అదే జపాన్ మిత్ర రాజ్యం అయిపోయింది. అమెరికా దుష్ట నీతికి నిదర్శనాలు ఎన్నని!
దక్షిణ కొరియాలో పీపుల్స్ కమిటీలను నిర్మూలించిన తర్వాత అమెరికా దృష్టి ఉత్తర కొరియా పైకి మళ్ళింది. కిమ్ ఇల్-సంగ్ నేతృత్వంలో సోషలిస్టు నిర్మాణంవైపు ఉత్తర కొరియా ప్రయాణించడం అమెరికాకు కంటగింపు అయింది. 1949లో జపాన్ నూ, వారితో కుమ్మక్కైన చాంగ్-కై షేక్ నేతృత్వంలోని దళారీ ముఠానూ తన్ని తగలేసి మావో సే టుంగ్ నాయకత్వంలో కమ్యూనిస్టు చైనా అవతరించింది. సోషలిస్టు/కమ్యూనిస్టు రష్యా, చైనాలను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మక స్ధావరంగా కొరియా బాగా పనికొస్తుంది. ఇటు దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల పైనా, అటు రెండు పెద్ద కమ్యూనిస్టు రాజ్యాల పైనా నిఘా పెట్టేందుకూ, అదను చూసి దెబ్బ కొట్టేందుకూ కొరియా గొప్ప వ్యూహాత్మక ప్రాంతం. అందుకు ఉత్తర కొరియా ప్రధాన అడ్డంకిగా మారింది. ఉత్తర కొరియాను దురాక్రమించేందుకు ఇంతకు మించిన కారణం అమెరికాకూ, పెట్టుబడిదారీ ప్రపంచానికి అవసరం లేదు. కనుక యుద్ధం ఎవరు మొదలు పెట్టారన్న ప్రశ్నకు ప్రాధాన్యం లేదు. అది ప్రపంచ స్ధాయిలో జరిగిన వర్గ పోరాటం. విస్తరిస్తున్న కార్మికవర్గ రాజ్యాలను అడ్డుకుని నిర్మూలించడం అమెరికా నేతృత్వం లోని ప��ట్టుబడిదారీ సామ్రాజ్యవాద వ్యవస్ధకు ముంచుకొచ్చిన అవసరం. పెట్టుబడిదారీ, భూస్వామ్య, దళారీ పాలకవర్గాల దోపిడీ, అణచివేతల నుండి ప్రజలను, జాతులను, దేశాలను విముక్తి చేయడం సోషలిస్టు రాజ్యాల కర్తవ్యం. ఈ వర్గ పోరాటంలో భాగంగానే కొరియా యుద్ధం జరిగింది. స్ధానిక స్ధాయిలో చూసినప్పుడు కూడా ఇదే విశ్లేషణ వర్తిస్తుంది. ఉత్తర కొరియాలో వేళ్లూనుకుంటున్న సోషలిస్టు నిర్మాణాన్ని కాపాడుకోవడం ఉత్తర కొరియా ప్రజల కర్తవ్యం. అలాగే దక్షిణ కొరియాలో ప్రజాస్వామిక పీపుల్స్ కమిటీలను పునరుద్ధరించుకోవడం దక్షిణ కొరియా ప్రజలకు తక్షణ అవసరం. ప్రాంతీయ స్ధాయిలో చూస్తే సోషలిస్టు ఉత్తర కొరియాను కాపాడుకోవడం సోషలిస్టు చైనా, రష్యాలకు తప్పనిసరి కర్తవ్యం.
ఉత్తర కొరియాను చేజిక్కించుకోవడం కోసం ఆ దేశ నేత కిమ్ ఇల్ సంగ్ ను నిర్మూలించాలి. సోషలిస్టు నిర్మాణాన్ని అడ్డుకోవాలి. ఈ లక్ష్యంతో అమెరికా మిలట్రీ మరిన్ని బలగాలను కొరియా యుద్ధంలో ప్రవేశపెట్టింది. యుద్ధం ఆరంభంలో దక్షిణ కొరియా సేనలపై ఉత్తర కొరియా పై చేయి సాధించింది. అమెరికా బలగాల ప్రవేశంతో పరిస్ధితి తారుమారు అయింది. అమెరికా సాగించిన యుద్ధ తంత్రాన్ని బట్టి ఉత్తర కొరియాను సర్వనాశనం చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగిందని స్పష్టం అయింది. అవి పౌరుల అవాసాలా, ప్రజా నిర్మాణాలా, యుద్ధ భూమియా అన్న విచక్షణ లేకుండా అమెరికా విమానాలు కార్పెట్ బాంబింగ్ తో విరుచుకుపడ్డాయి. ఉత్తర కొరియా ప్రజలపై 32,000 టన్నుల విషపూరిత నాపామ్ బాంబులను అమెరికా జారవిడిచింది. మొత్తం నగరాలకు నగరాలే నాశనం అయ్యాయి. భవనాలు, ఇళ్ళు, కార్యాలయాలు, ప్రజా భవనాలు సర్వం నేలమట్టం అయ్యాయి.
రాజధాని ప్యోంగ్ యాంగ్ లో 75 శాతం భాగాన్ని బాంబు దాడులతో నేలమట్టం కావించింది అమెరికా. ఏ క్షణంలోనైనా అణు బాంబులతో దాడి చేస్తానని యుద్ధం సాగినన్నాళ్లూ అమెరికా బెదిరించింది. బెదిరించడమే కాకుండా ఉత్తర కొరియా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ B-29 బాంబర్లను ఉద్దేశ్యపూర్వకంగా రంగంలోకి దించడం, అణు బాంబు ప్రయోగించనున్నట్లు సాంకేతిక సన్నాహాలు చేయడం, ఆ సన్నాహాలు ఉత్తర కొరియా ప్రజలకు, సైన్యానికి తెలిసేట్లు చేయడం, చివరికి డమ్మీ అణు బాంబులను (టిఎన్‌టి బాంబులు) జారవిడవడం… ఇలా పదే పదే చేసింది. అణు బాంబు ప్రయోగించే ముందు ఎలాంటి సన్నాహాలు చేస్తారో అవే సన్నాహాలు చేసి చివరికి డమ్మీ బాంబులు వేసేది. ఎలాంటి యుద్ధ అవసరం లేకపోయినా అమెరికా అత్యంత అనాగరికంగా హీరోషిమా, నాగసాకి నగరాలపై అణు బాంబులతో దాడి చేసి లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్న దుర్మార్గానికి సంబంధించిన జ్ఞాపకాలు అప్పటికి ఇంకా ప్రపంచం మదిలో తాజాగా మెదులుతున్నాయి. అణు దాడి వల్ల లక్షల మంది ప్రజలు వింత వ్యాధులకు గురి అవుతుండడం, వింత రూపాల్లో పిల్లలు పుడుతుండడం.. లాంటి వార్తలు జపాన్ కు సమీపంలోనే ఉన్న కొరియా ప్రజలకు నిత్యం అందుతూన్న రోజులవి. ఆ పరిస్ధితుల్లో అమెరికా సాగించిన అణు దాడి బెదిరింపులు ఉత్తర కొరియా ప్రజలకు నెలలు, సంవత్సరాల తరబడి నిద్రలేని రాత్రుళ్ళను మి��ిల్చాయి. నిత్యం అప్రమత్తంగా ఉంటూ, పేలుడు శబ్దం వినబడితే బంకర్లలోకి పరుగులు పెడుతూ పౌరులు అనేకమంది మానసిక, శారీరక రుగ్మతలకు గురయ్యారు.
అణు బాంబు ప్రయోగం పేరుతో అమెరికా సన్నాహాలు చేసిన ప్రతిసారీ ఉత్తర కొరియా ప్రభుత్వం “నిజంగా అణు బాంబు దాడి జరుగుతుందో లేక డమ్మీ బాంబు వేస్తారో” తెలియని పరిస్ధితిలో పడిపోయేది. అనుక్షణం రక్షణాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఆగత్యాన్ని ఎదుర్కొంది. క్షణ క్షణం అప్రమత్తంగా ఉండవలసి వచ్చింది. ఈ అనుభవమే ఇప్పటికీ ఉత్తర కొరియాను అమెరికా – దక్షిణ కొరియాల సైనిక-వాయుసేన-నౌకాసేన విన్యాసాల పట్ల అప్రమత్తంగా ఉంచుతోంది. ప్రతి యేటా జరిగే అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు ఎలాంటి ఘటనా లేకుండా ముగుస్తాయా లేక తమ దేశంపై దాడితో కొనసాగిస్తాయా అన్నది తేల్చుకోలేని పరిస్ధితిలో ప్రతి హెచ్చరికలు జారీ చేయడం ఉత్తర కొరియాకు అవసరంగా మారిపోయింది. అమెరికా-దక్షిణ కొరియాల సైనిక విన్యాసాలే 1950లో కొరియా యుద్ధంగా పరిణమించినట్లే ఇప్పుడూ జరుగుతుందేమో అన్న శంక ప్రతియేడూ ఆ దేశాన్ని పట్టి పీడిస్తుంది. ఉత్తర కొరియా భయానికి తగిన విధంగానే అమెరికా సైనిక విన్యాసాలు సాగడం ఎవరూ విస్మరించలేనిది. ఈ సైనిక విన్యాసాల తీవ్రతను తగ్గించాలని దక్షిణ కొరియా, అమెరికాకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి విఫలమైన ఉదాహరణలు కూడా ఉన్నాయి.
కొరియా యుద్ధంలో అమెరికా జరిపిన బాంబు దాడుల్లో ఉత్తర కొరియా ప్రజలు కనీ వినీ ఎరుగని సంఖ్యలో చనిపోయారు. ఉత్తర కొరియాలో చనిపోయినంతమంది సాధారణ పౌరులు మరే యుద్ధంలోనూ చనిపోలేదంటే అతిశయోక్తి కాదు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు రెండూ కలిపినా కూడా అంతమంది చనిపోలేదు. ఇంతకీ ఎంతమంది ఉత్తర కొరియన్లు చనిపోయారు? అమెరికాకు చెం��ిన న్యూ యార్కర్ పత్రిక, 1995 జూన్ 19 సంచికలో రిచర్డ్ రోడ్స్ (రచయిత, చరిత్రకారుడు, జర్నలిస్టు) రాసిన ఒక వ్యాసాన్ని ప్రచురించింది. ఆ వ్యాసం పేరు “ద జనరల్ అండ్ వరల్డ్ వార్ III” (జనరల్ మరియు మూడో ప్రపంచ యుద్ధం). ‘ద జనరల్’ అంటే కొరియా యుద్ధంలో పాల్గొన్న అమెరికా జనరల్ (సైనికాధికారి) ‘కర్టిస్ లీమే’. “ఆ మూడు సంవత్సరాల కొరియా యుద్ధంలో మేము 20 శాతం జనాభాని మట్టుపెట్టాము” అని జనరల్ కర్టిస్ లీమే చెప్పాడని రిచర్డ్ రోడ్స్ రాశాడు. కర్టిస్ లీమే ఇలా చెప్పాడు.
“ఉత్తర కొరియాలోని 78 నగరాలను, వేలాది గ్రామాలను నాశనం చేశాక, ఆ మూడు సంవత్సరాల యుద్ధంలో తీవ్ర స్ధాయి బాంబింగ్ ద్వారా మేము ఉత్తర కొరియా 20 శాతం జనాభాని చంపేశాము.”
మరో రచయిత, శాంతి కార్యకర్త, అమెరికన్ సైనికాధికారిగా వియత్నాం యుద్ధంలో పాల్గొన్న బ్రియాన్ విల్సన్ 2006లో కెనడా పత్రికలో ఒక ఆర్టికల్ రాస్తూ ఇలా పేర్కొన్నాడు.
“కొరియాపై రుద్దిన 38వ అక్షాంశానికి ఉత్తరాన ఉన్న భూభాగంలో కొరియా యుద్ధంలో 30 శాతం మంది ప్రజలు చనిపోయారని ఇప్పుడు నమ్ముతున్నారు. 37 నెలల పాటు సాగిన యుద్ధానికి ముందు ఉత్తర కొరియా జనాభా 8 నుండి 9 మ��లియన్లు. ఇంతవరకూ ఎన్నడూ సంభవించని ప్రాణ నష్టం ఇది. ఒక దేశం మరొక దేశాన్ని చుట్టుముట్టి జరిపిన దాడి వల్ల జరిగిన ప్రాణ నష్టం ఇది.”
వికీపీడియా (ఇంటర్నెట్ ఉచిత ఎన్ సైక్లోపీడియా) ప్రకారం:
“కొరియా యుద్ధంలో ఉత్తర కొరియాలో 1.55 మిలియన్ల పౌరులు, 215,000 మంది ఉ.కొ సైనికులు చనిపోయారని, 300,000 మంది సైనికులు గాయపడ్డారని, 120,000 మంది సైనికులు యుద్ధ బందీలుగా పట్టుబడ్డారని అమెరికా వర్గాలు అంగీకరించాయి. దక్షిణ కొరియా మిలట్రీ అధికారుల ప్రకారం కొరియా యుద్ధంలో చావులు/క్షతగాత్రులు/అదృశ్యాలు మొత్తం 2.5 మిలియన్లు. వారిలో 990,900 మంది దక్షిణ కొరియన్లు.”
కొరియా యుద్ధంలో ఉత్తర కొరియాలో జరిగిన ప్రాణ నష్టాన్ని ప్రపంచ యుద్ధాలలో ఆయా దేశాల ప్రాణ నష్టాలతో పోల్చడం ఈ సందర్భంలో సముచితం అవుతుంది. ఉదాహరణకి
రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ప్రాణ నష్టం దాని జనాభాలో 0.94%. ఫ్రాన్స్ ప్రాణ నష్టం దాని జనాభాలో 1.35%. అలాగే చైనా 1.89% జనాభాను, అమెరికా 0.32% జనాభాను నష్టపోయింది. మార్చి 2003 నుండి జూన్ 2006 వరకు అమెరికా ఇరాక్ పై దాడి చేసి దురాక్రమించిన యుద్ధంలో ఇరాకీ పౌరులు 655,000 మంది చనిపోయారని లాన్సెట్ అధ్యయనం (జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) తేల్చింది. కాగా కొరియా యుద్ధంలో ఉత్తర కొరియా 30 శాతం జనాభాని లేదా 2.4 నుండి 2.5 మిలియన్ల మంది వరకు కోల్పోయింది.
అమెరికా యుద్ధ విధ్వంసం కొనసాగినట్లయితే ఉత్తర కొరియా బ్రతికి బట్టకట్టి ఉండేది కాదు. ఉత్తర కొరియాను అమెరికా సేనలు సర్వనాశనం చేస్తున్న పరిస్ధితుల్లో కమ్యూనిస్టు చైనా అనివార్యంగా ఉత్తర కొరియా తరపున యుద్ధం లోకి దిగవలసి వచ్చింది. మావో సే టుంగ్ నేతృత్వంలో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఉత్తర కొరియాకు మద్దతుగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని దించడంతో ఉత్తర కొరియా గట్టి ప్రతిఘటన ఇవ్వగలిగింది. చివరికి ఎవరికీ విజయం దక్కని పరిస్ధితి వచ్చింది. యుద్ధం కొనసాగితే మరింత మానవ హననమే తప్ప ప్రయోజనం దక్కని ప్రతిష్టంభన ఏర్పడిన నేపధ్యంలో ఇరు పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందానికి (armistice) వచ్చాయి. 1953లో ఆర్మిస్టైజ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశాయి. ఒప్పందం మేరకు ఇరు దేశాల సరిహద్దులో “నిస్సైనిక మండలం” (డిఎంజెడ్ – డీమిలిటరైజ్డ్ జోన్) ఏర్పడింది.
ఈ ఒప్పందం శాంతి ఒప్పందం కాదు. కేవలం కాల్పుల విరమణ ఒప్పందం మాత్రమే. శాంతి ఒప్పందం చేసుకున్నప్పుడు మాత్రమే ఇరు దేశాలు ఒకరిపై మరొకరు మళ్ళీ దాడి చేయబోవన్న గ్యారంటీ ఉంటుంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అటువంటి నిబంధన లేదు. కాబట్టి సాంకేతికంగా చూస్తే అమెరికా-ఉత్తర కొరియాలు ఇప్పటికీ యుద్ధంలో ఉన్నట్లే లెక్క. ఏ క్షణంలోనైనా యుద్ధం మళ్ళీ మొదలు కావచ్చు. శాంతి ఒప్పందం కుదిరినట్లయితే అమెరికా ఏకపక్షంగా మళ్ళీ దాడి చేసేందుకు చట్టబద్ధ అవకాశం ఉండదు. అందుకు అంతర్జాతీయ చట్టాలు అంగీకరించవు. అనగా ఉత్తర కొరియాపై అమెరికా ఏకపక్ష దాడికి చట్టబద్ధమైన ఆటంకం ఏదీ 1953 నుండీ లేకుండా పోయింది. ఈ పరిస్ధితుల్లో అమెరికా దాడిని నిరోధించే “నివారక శక్తి��ని సమకూర్చుకోక తప్పని పరిస్ధితిని ఉత్తర కొరియా 1953 నుండి ఎదుర్కొంటూ వచ్చింది. అమెరికా నుండి ఎదుర్కొంటున్న “ఫస్ట్ స్ట్రైక్” (మొదటి దెబ్బ) భయాన్ని నిలువరించేందుకు ఉత్తర కొరియా సంపాదించుకున్న ఆ “దాడి నివారక శక్తి” యే ‘అణు బాంబు’.
ఉత్తర కొరియా ‘మొదటి దెబ్బ’ కొడితే (మొదట తానుగా అణు బాంబుతో దాడి చేస్తే) ఆ తర్వాత ఉత్తర కొరియాను నామ రూపాలు లేకుండా చేసేందుకు అమెరికాకు చక్కని అవకాశాన్ని పళ్లెంలో పెట్టి అప్పగించినట్లే. కనుక మొదట దాడి చేసే దుస్సాహసానికి ఉత్తర కొరియా ఎట్టి పరిస్ధితుల్లోనూ పూనుకోదు. ఉత్తర కొరియా వద్ద ఉన్న అణు బాంబు కేవలం ఆత్మ రక్షణ కోసమ���. దాడి చేసే ఆలోచనకు అమెరికా రాకుండా నివారించేందుకు ఉద్దేశించినది మాత్రమే. ఉత్తర కొరియా అణు బాంబు అమెరికా దాడిని నివారించేందుకు గట్టి అవకాశం ఉన్న ఒక డిటరెంట్! అమెరికా భద్రతకు ఉత్తర కొరియా ప్రమాదకారి అని అమెరికా చెప్పే కల్లబొల్లి మాటలను ఎవరైనా నమ్మితే అది అమాయకత్వం తప్ప మరొకటి కాదు. అటువంటి వాళ్ళు హిరోషిమా, నాగసాకి, 1950-53 కొరియా యుద్ధం, వియత్నాం, ఇరాక్, లిబియా, సిరియా, గ్రెనడా, నికరాగువా… ఇత్యాదిగా గల అమెరికా దురహంకార, దురాక్రమణ పూరిత దౌర్జన్యాలను ఒకసారి మననం చేసుకోవాలి. మానవజాతి చరిత్రలో ఎటువంటి యుద్ధ ప్రయోజనం/కారణం లేకుండా రెండు అణు బాంబులు ప్రయోగించి లక్షల మందిని చంపి, రెండు నగరాలను తుడిచి పెట్టిన అనాగరిక దౌర్జన్య చరిత్ర ఒక్క అమెరికాకే సొంతం. తప్పుడు కారణాలు చూపి, పచ్చి అబద్ధాలు చెప్పి ఐరాసను దౌర్జ్యన్యంగా లొంగదీసుకుని స్వతంత్ర దేశాలపై దాడి చేసి డిప్లిటెడ్ యురేనియం బాంబులు వేసిన దుర్మార్గం ఒక్క అమెరికాయే చేసింది. అమెరికాది ప్రపంచాధిపత్యం కోసం యుద్ధోన్మాదంతో స్వతంత్ర దేశాలను కబళించే రక్తసిక్త చరిత్ర అయితే ఉత్తర కొరియాది తన మనుగడకు ప్రపంచ దురాక్రమణదారు నుండి రక్షణ పొందేందుకు అణు బాంబు సంపాదించుకున్న సాధారణ చరిత్ర. నిత్యం యుద్ధ భయం ఎదుర్కొంటూ కూడా అమెరికా మదపుటేనుగుకు లొంగకుండా సర్వశక్తివంతమైన ఆ సామ్రాజ్యవాద దుష్టశక్తిని శక్తిమేరకు నిలువరిస్తున్న సాహస చరిత్ర ఉత్తర కొరియాది.
#gallery-0-5 { margin: auto; } #gallery-0-5 .gallery-item { float: left; margin-top: 10px; text-align: center; width: 33%; } #gallery-0-5 img { border: 2px solid #cfcfcf; } #gallery-0-5 .gallery-caption { margin-left: 0; } /* see gallery_shortcode() in wp-includes/media.php */
A woman had her breasts cut out
Armistice agreement signing
B29 bomber over North Korea during war
Korea and 38th Parallel
Leveled Pyongyang -before and after war
North Korean civilians about to be killed
Korea Hidden History
Truman orders war on North Korea
US bombing of North Korea Railways
కొరియా యుద్ధం ముగిసిన తర్వాత కూడా B-29 బాంబర్ విమానాలను ఉత్తర కొరియాకు సమీపంలో అడపా దడపా తిప్పడం అమెరికా ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నది. 1953 నుండీ ఈ బాంబర్ విమానాల బెదిరింపులు కొనసాగుతున్నాయి. అణు బాంబు వేసే సన్నాహాలతో బాంబర్లను తిప్పుతూ అమెరికా/దక్షిణ కొరియా చెలగాటం ఆడుతూనే ఉన్నాయి. డమ్మీ బాంబులు వేయకపోవడం ఒక్కటే తేడా. ఈ బాంబర్ విమానాల లక్ష్యం ఒకటే. “నేను తలచుకుంటే, నేను అనుకున్నప్పుడు నిన్ను సమూలంగా నిర్మూలించగలం” అని ఉత్తర కొరియాను మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ హెచ్చరించడమే. అమెరికా చెలగాటం 1950-53 నాటి కొరియా యుద్ధం అనుభవాల రీత్యా ఉత్తర కొరియాకు ప్రాణ సంకటం. ప్రాణ సంకటం నుండి బైటపడేందుకు ఓ చిట్టెలుక అణు బాంబు తయారు చేసుకుంటే దానిని అమెరికా మదపుటేనుగు భద్రతకు ప్రమాదంగా చెప్పడం కంటే మించిన క్రూర పరిహాసం మరొకటి ఉండబోదు.
జపాన్ పునఃసాయుధీకరణ
ఉత్తర కొరియాపై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాల నీడలో జరుగుతున్న సరికొత్త పరిణామం జపాన్ సాయుధీకరణ. రెండవ ప్రపంచ యుద్ధంలో ఓటమి అనంతరం జపాన్ పైన అనేక అవమానకర ఒప్పందాలను మిత్ర రాజ్యాలు (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మొ.వి) రుద్దాయి. అందులో ఒకటి జపాన్ ను పూర్తిగా నిరాయుద్ధం చెయ్యడం, భవిష్యత్తులో కూడా ఆయుధాలు సమకూర్చుకోకుండా నిరోధిస్తూ రాజ్యాంగాన్ని రూపొందించడం. యుద్ధ వ్యతిరేక రాజ్యాంగ రచనలో అమెరికా హస్తం ఉందన్న విషయం బహిరంగ రహస్యమే. (రాజ్యాంగం లోని పలు అంశాలను అమెరికన్లే రూపొందించారు.) ఆరంభంలో జపాన్ పారిశ్రామీకరణ చెందకుండా కూడా అమెరికా నిరోధించింది. అయితే సోవియట్ రష్యా, కమ్యూనిస్టు చైనాలను నిలువరించేందుకు, ప్రచ్ఛన్న యుద్ధంలో భాగంగా అతి త్వరలోనే అమెరికా తన వ్యూహాన్ని మార్చుకుని జపాన్ పారిశ్రామికీకరణకు సహకరించింది. కానీ యుద్ధ వ్యతిరేక రాజ్యాంగాన్ని కొనసాగింపజేసింది. రెండో ప్రపంచ యుద్ధం వల్ల తీవ్ర నష్టాన్ని, అవమానాలను ఎదుర్కొన్న నేపధ్యంలో జపాన్ ప్రజలు సైతం ఆయుధీకరణను వ్యతిరేకించారు. శాంతి లక్ష్యంతో కూడిన రాజ్యాంగానికి మద్దతు ఇచ్చారు. 1990ల నుండి తన ఆర్ధిక శక్తి సమస్యలు ఎదుర్కొంటున్న నేపధ్యంలో అమెరికా జపాన్ కు మెల్లగా సాయుధం అయ్యేందుకు ప్రోత్సాహం అందించింది. సైనికుల సంఖ్య పెంచుకునేందుకు సహకరించింది. తన దురాక్రమణ, ప్రపంచాధిపత్య దాడులకు, యుద్ధాలకు జపాన్ సహకారాన్ని తీసుకుకున్నది. ఎంత ప్రోత్సాహం ఇచ్చినప్పటికీ జపాన్ ఆయుధ శక్తి ఒక పరిమితి దాటకుండా అమెరికా నిరోధించింది.
ఇప్పుడు ఈ పరిస్ధితి మారింది. చైనా, రష్యా, ఉత్తర కొరియాలకు సమాధానంగా జపాన్ ను సాయుధం చేయడం ఇప్పటి అవసరంగా అమెరికా భావిస్తోంది. తన ప్రభావంలో ఉన్నంత వరకు, తన జూనియర్ భాగస్వామిగా ఉన్నంతవరకు జపాన్ సాయుధీకరణ వల్ల తనకు వచ్చిన ముప్పేమీ లేదని భావిస్తోంది. చివరికి తానే రుద్దిన శాంతికాముక రాజ్యాంగాన్ని సవరించుకునేందుకు కూడా అను��తి ఇచ్చింది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రెండు వారాల తేడాలో ఉత్తర కొరియా రెండు ఐసిబిఎం లను ప్రయోగించడాన్ని చూపిస్తూ జపాన్ ప్రధాని షింజో అబే జపాన్ ప్రజల్ని విపరీతంగా రెచ్చగొట్టిపెట్టాడు. మిసైల్ ప్రయోగ సమయంలో తప్పుడు సైరన్ లు మోగించి, అసత్యాలతో నిండిన మొబైల్ సందేశాలను పౌరులకు పంపించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఉత్తర కొరియా వల్ల పెను ప్రమాదం ముంచుకొచ్చిందన్న భయాలు సృష్టించాడు. జపాన్ ప్రజలు అందరూ అబే ప్రచారాన్ని నమ్మి యుద్ధ కాముకులుగా, యుద్ధ మద్దతుదారులుగా మారారని చెప్పలేము గానీ ఎన్నికల్లో గెలవడానికి తగిన సంఖ్యలో ఓటర్లనైతే ఆకర్షించగలిగాడు. అప్పటివరకూ నేలబారున ఉన్న అబే పాపులారిటీ ఉత్తర కొరియా వ్యతిరేక ప్రచారంతో పైకి ఎగబాకింది. జనం భయాందోళనలో ఉండగానే ముందస్తు ఎన్నికలు ప్రకటించాడు. అక్టోబర్ 22 ఎన్నికల్లో షింజో అబే నేతృత్వం లోని లిబరల్ డెమోక్రటిక్ పార్టీ, దాని మిత్రపక్షాల కూటమి 2/3 వంతు మెజారిటీ సాధించింది. రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు మెజారిటీ రావడంతో సంపూర్ణ మిలట్రీ నిర్మాణాన్ని, యుద్ధాలకు తయారీ కావడాన్ని నిరోధించే ఆర్టికల్ 9 రద్దు తధ్యమని విశ్లేషకులు అందరూ ఏకీభావం ప్రకటిస్తున్నారు. పునః మిలట్రీకరణ అబే ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల్లో ఒకటి. ఈ వాగ్దానం నెరవేర్చేందుకు ఉద్యుక్తం అవుతున్నట్లు అబే ఎన్నికల విజయం అనంతరం కటనలు జారీ చేశాడు కూడా.
మరోవైపు ఉత్తర కొరియా సమీపంలో అమెరికా, దక్షిణ కొరియాలు నిర్వహిస్తున్న సైనిక విన్యాసాలలో పాల్గొనేందుకు ఈ యేడు జపాన్ ను ఆహ్వానించారు. జపాన్ తో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించడం ద్వారా చైనా, రష్యాలకు అమెరికా స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఆసియాలో ఆధిపత్య వ్యూహంలో ఇక నుండి జపాన్ చురుకైన పాత్ర నిర్వహిస్తుంది అన్నదే ఈ సందేహం. కొరియా సమీపంలో యుద్ధ విన్యాసాల్లో జపాన్ పాల్గొనడం అంటే ఇరు కొరియాల ప్రజలకు రెండో ప్రపంచ యుద్ధం నాటి చేదు జ్ఞాపకాలను (కంఫర్ట్ ఫుమెన్, పీపుల్స్ కమిటీల నాశనం, కొరియా యుద్ధంలో అమెరికా జపాన్ ల మిత్రత్వం) గుర్తు చేయడమే. ఉత్తర, దక్షిణ కొరియాల ప్రజలకూ, జపాన్ ప్రజలకు మధ్య వ్యతిరేక భావోద్వేగాలను రెచ్చగొట్టడమే. తద్వారా ఉత్తర కొరియాపై యుద్ధానికి జపాన్ ప్రజల మద్దతును జపాన్ ప్రధాని సమీకరిస్తున్నాడు. ఈ విధంగా ఆసియాలో సరికొత్త యుద్ధ రంగానికి వేగంగా పునాదులు పడుతున్నాయి. హిల్లరీ క్లింటన్ ప్రతిపాదనతో ఆస్ట్రేలియా పార్లమెంటులో మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా ప్రకటించిన “ఆసియా-పివోట్” (ఆసియా కేంద్ర) వ్యూహాన్ని డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి శషభిషలు లేకుండా మరో మెట్టు పైకి చేర్చాడు. సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్ధరంగాన్ని మధ్యప్రాచ్యం, మధ్యధరా సముద్రాల నుండి తూర్పు, దక్షిణ ఆసియాలకు తరలిస్తున్నాడు.
ప్రపంచ స్ధాయి��ో చూసినప్పుడు అమెరికా ఒక వైపు, చైనా-రష్యాలు మరొకవైపు మోహరించి ఉన్న ప్రపంచాధిపత్య సామ్రాజ్యవాద యుద్ధ వ్యూహంలో ఉత్తర కొరియా ప్రధాన పావు కాగా దక్షిణ కొరియా జూనియర్ పావు. ప్రాంతీయ స్ధాయిలో జపాన్ (అమెరికా దృఢమైన మద్దతుతో) ఒకవైపు, చైనా (రష్యా మద్దతుతో) మరొకవైపు మోహరించి ఉన్న ప్రాంతీయాధిపత్య వ్యూహంలో ఉత్తర, దక్షిణ కొరియాలు పావులు. స్ధానిక స్ధాయిలో చూస్తే ఉత్తర కొరియా తన మనుగడకోసం అత్యంత శక్తివంతమైన అమెరికాకు సాహసోపేతంగా ఎదురు నిలిచి పోరాడుతుండడం ప్రధాన దృశ్యం. ఇలా ఒకే పరిస్ధితి వివిధ స్ధాయిలలో వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఈ మూడు రూపాలు వాస్తవంలో ప్రపంచాధిపత్య వ్యూహ వ్యవస్ధలోని ఒకే ఘర్షణకు ప్రతిబింబాలు. స్ధానిక స్ధాయిలో ఉన్న ఘర్షణను ప్రపంచ స్ధాయికి ప్రమోట్ చేసి చూస్తే ఉత్తర కొరియా ప్రకటనలు ఉన్మత్త ప్రేలాపనగా మాత్రమే పైకి కనిపిస్తుంది. అలా చూడడం సరైన పరిశీలన కాదు. మూడు స్ధాయిలలోని ఘర్షణలను ఒకే ఒక సామ్రాజ్యవాద-ఆధిపత్య ఘర్షణలో భాగంగా చూసినప్పుడు మాత్రమే ఉత్తర కొరియా – అమెరికా, ఉత్తర కొరియా – జపాన్, ఉత్తర కొరియా – దక్షిణ కొరియా, చైనా + రష్యా – అమెరికా లుగా పలు పాత్రల ఘర్షణలను ఒకే తలంపై జరుగుతున్న ఘర్షణగా చూడగలం. అలాగే అణ్వాయుధ కోణం, యుద్ధ కోణం, చారిత్రక కోణం, జపాన్ తాజా సాయుధీకరణలను సంయుక్తంగా కలిపి పరిశీలించినట్లయితేనే ఉత్తర కొరియా ఐసిబిఎం పరీక్షలను, అమెరికా-జపాన్-దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలను, జపాన్ తాజా యుద్ధోన్మాద చురుకుదనాన్ని ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధం గలవిగా సమగ్రంగా అర్ధం చేసుకోగలం.
ఈ విశ్లేషణ వెలుగులో పరిశీలించినప్పుడు ఉత్తర కొరియా, ఆ దేశ నేత కిమ్ జోంగ్-ఉన్ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్ధితి, మనుగడ సమస్య ఆ దేశాన్ని, దేశ నేతను ‘అణ్వాయుధ’ డిటరెంట్ ను తయారుచేసుకోక తప్పనిసరి కర్తవ్యం వైపు నేట్టాయని అర్ధం అవుతుంది. దక్షిణ కొరియాలోనూ, జపాన్ (ఒకినావా సైనిక స్ధావరం) లోనూ అమెరికా మోహరించిన అణ్వాయుధాలు ఉత్తర కొరియా నిరంతర భయానికి వనరు అయ్యాయని గమనించవచ్చు. 1953 నుండి అమెరికా, అడపా దడపా ఉత్తర కొరియాపై చక్కర్లు కొడుతున్న B-29, B-1B బాంబర్లు, నిఘా విమానాలు ఉత్తర కొరియాను మిలట్రీపై ఖర్చు పెట్టాల్సిన ఆగత్యాన్ని రుద్దాయని అర్ధం చేసుకుంటాం. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్-ఉన్ వెర్రితనంతోనో, పిచ్చి ముదరడం వల్లనో ఐసిబిఎం లు పరీక్షించలేదనీ, జపాన్ తో కలిసి అమెరికా, ద.కొరియాలు భారీ స్ధాయిలో సైనిక విన్యాసాలు చేపట్టిన నేపధ్యంలో మిసైళ్లను పరీక్షించాడని తెలుస్తుంది. ఉత్తర కొరియా ప్రయోగించిన మిసైళ్ళు వివిధ దేశాల తరపున భూమి చుట్టూ తిరుగుతున్న శాటిలైట్ల కంటే అంత్యంత ఎక్కువ ఎత్తులో ప్రయాణించాయని, మిసైళ్ళ ప్రయాణం జపాన్ ప్రజలు అత్యంత తక్కువ మంది నివసించే చిన్న ద్వీపాల మీదుగా ప్రయాణించాయి తప్ప హోక్కైడో ప్రధాన భూభాగం పైన ఎగరలేదని తెలుస్తుంది. ఉ.కొ నేతలు, శాస్త్రవేత్తలు, మిసైళ్ళ మార్గాన్ని జాగ్రత్తగా, అత్యంత బాధ్యతతో, అతి తక్కువ భూభాగం కవర్ చేసేలా నిర్ణయించారని తెలుస్తుంది. ��సిబిఎం/ఐసిఆర్‌ఎం లు పరీక్షించడానికి ఉత్తర కొరియాకు అత్యంత భద్రమైన ప్రాంతం పసిఫిక్ మహా సముద్రం తప్ప మరొకటి లేదు. జపాన్ మీదుగా ప్రయాణించినప్పటికీ ఆ దేశ గగనతల పరిమితులను (జాతీయ వాయు తలాన్ని) ఉ.కొ మిసైళ్ళు అతిక్రమించలేదు.
కనుక యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నది అమెరికా, జపాన్ లే. దక్షిణ కొరియా వారికి జూనియర్ భాగస్వామి. అమెరికా మాట వినడం తప్ప ద.కొ కు మరో దారి లేదు. ద.కొ ప్రజలు యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకం. కానీ అక్కడి ఉన్నత, ధనిక వర్గాల ప్రయోజనాలు అమెరికా మిలట్రీ ఆధిపత్యంతోనూ, వాల్ స్ట్రీట్ తోనూ ముడిపడి ఉన్నాయి. ఉత్తర కొరియా ప్రభుత్వం, ప్రజల చేతుల్లో యుద్ధాన్ని నివారించగల అవకాశం లేదు. వారికి ఉన్న ఒకే ఒక ఆప్షన్, ముంచుకొస్తున్న యుద్ధానికి తగిన విధంగా సిద్ధం కావడమే.
దీని అర్ధం యుద్ధం తప్పనిసరి అని చెప్పడం కాదు. ఉత్తర కొరియాతో శాంతి చర్చలకు అవకాశం లేకపోలేదని అమెరికా విదేశీ మంత్రి టిల్లర్సన్ ఒకానొక దశలో ప్రకటించినందున ఒక ఆశ మినుకు మినుకు మంటోంది. అమెరికాలోని అంతర్గత వైరుధ్యాలు యుద్ధం వైపు పురిగొల్పేలా పరిష్కారం అయితే యుద్ధాన్ని ఎవరూ ఆపలేరు. అలాగాక చర్చల వైపు నడిచేలా పరిష్కారం అయితే తాత్కాలికంగానైనా శాంతికి ఆస్కారం ఉంటుంది. చర్చలు జరగడం కోసం ‘ఇరు పక్షాలు వెనక్కి తగ్గాలని’ చైనా-రష్యాలు ప్రతిపాదించాయి. అమెరికా-దక్షిణ కొరియా-జపాన్ లు భారీ సైనిక విన్యాసాలను నిలిపివేయాలని, ఉత్తర కొరియా తన అణ్వాయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని పక్కనబెట్టాలని అవి ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనను ట్రంప్ అడ్డంగా తిరస్కరించాడు. అమెరికా అంగీకరిస్తే తనకు సమ్మతమేనని ఉత్తర కొరియా సంసిద్ధత ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఆసియాన్ సమావేశంలో ప్రసంగించిన రష్యా రక్షణ మంత్రి షొయిగు “ఉత్తర కొరియా ఐసిబిఎం పరీక్షలను ఖండిస్తున్నాం. కానీ అమెరికా, దక్షిణ కొరియా, జపాన్ లు భారీ స్ధాయిలో తలపెట్టిన యుద్ధ విన్యాసాలే ఉత్తర కొరియా మిసైల్ పరీక్షలను రెచ్చగొట్టిన సంగతిని విస్మరించలేము” అని ప్రకటించాడు. కనుక యుద్ధం వచ్చేదీ లేనిదీ పూర్తిగా అమెరికా చేతుల్లోనే ఉంది. ఉత్తర కొరియా చేతుల్లో ఈషణ్మాత్రం కూడా లేదు.
దశాబ్దాల విదేశాంగ విధానాన్ని అమెరికా కోసం పక్కనబెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోడి ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా నర్మగర్భమైన ప్రకటనలు జారీ చేస్తున్నాడు. ఈ ప్రకటనల వెనుక అమెరికా ఒత్తిడి ఉందన్నది నిర్వివాదాంశం. “దక్షిణాసియాలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లపై ఒక కన్నేసి ఉంచడానికి ఇండియా సహకారం మాకు చాలా అవసరం” అంటూ అమెరికా విదేశీ మంత్రి టిల్లర్సన్, ఐరాసలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీలు ప్రకటించడంతో మోడీ ప్రభుత్వం ఉబ్బి తబ్బిబ్బై ఉత్తర కొరియా వ్యతిరేక కూటమిలో చేరి యుద్ధంలో సహకరించేందుకు ఉర్రూతలూగుతున్నది. వాజ్ పేయి హయాంలోనే ఆఫ్ఘన్ యుద్ధంలో అమెరికా యుద్ధ విమానాలకు ఇండియాలో ఇంధనం నింపడానికి ఇండియా ఉత్సాహం ప్రదర్శించింది. వాజ్ పేయి కంటే తీవ్రమైన మితవాద పంధాలో పరుగెడుతున్న మోడి ఉత్తర కొరియా విషయంలో ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం పట్ల ఆశ్చర్యపడవలసింది లేదు కావచ్చు. ఈ తరహా మోడీ విధానాన్ని భారత ప్రజలు దృఢంగా తిరస్కరించాలి. అమెరికా సామ్రాజ్యవాద ఆధిపత్య యుద్ధాలలోకి భారత ప్రజలను పరోక్షంగానైనా దింపే పద్ధతిని విడనాడాలని డిమాండ్ చేయాలి. ఉత్తర కొరియా – దక్షిణ కొరియాలు తమ సమస్యను సామరస్య పూర్వకంగా చర్చలతో పరిష్కరించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. అందుకు దక్షిణ కొరియాలో మోహరించిన అమెరికా అణు పాటవాన్ని, ధడ్ మిసైళ్లను, సైనిక స్ధావరాన్ని వెంటనే ఎత్తివేయాలి. జపాన్ ప్రజల డిమాండ్లకు తలఒగ్గి అక్కడి అమెరికా సైనిక స్ధావరాన్ని ఎత్తివేయడానికి జపాన్ ప్రభుత్వం ఒత్తిడి చేయాలి. ఇవన్నీ జరిగితే -అమెరికా చొరబాటు, జోక్యంలు రద్దయితే ఆసియాలో యుద్ధం సరికదా, ఉద్రిక్తతకు కూడా సమీప భవిష్యత్తులో తావు లేదు.
28/10/2017, 3:39 AM
–
…………………..ముగిసింది
ఉత్తర కొరియా: ఆసియా-పివోట్ వ్యూహాన్ని పై మెట్టు చేర్చిన ట్రంప్ చారిత్రక కోణం ఒక భూతంగా, ప్రపంచ సమస్యగా అమెరికా ముందుకు తెచ్చిన ఉత్తర కొరియా విషయంలో చారిత్రక కోణం తరచుగా విస్మరణకు గురవుతోంది.
#ఆసియా పివోట్#ఉత్తర కొరియా అణు బాంబు#కిమ్ ఇల్-సంగ్#కొరియా యుద్ధం#జపాన్ పునఃసాయుధీకరణ#జపాన్ సామ్రాజ్యవాదం#డొనాల్డ్ ట్రంప్#నిస్సైనిక మండలం#పీపుల్స్ కమిటీలు
0 notes