#ఆ అడల్ట్ మూవీని ఏకేస్తున్న విమర్శకులు
Explore tagged Tumblr posts
Photo
ఆ అడల్ట్ మూవీని ఏకేస్తున్న విమర్శకులు తమిళంలో తెరకెక్కిన వివాదాస్పద చిత్రం '90 ఎంఎల్' తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బిగ్ బాస్ స్టార్ ఓవియా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మొదటి నుండి ఈ చిత్రంపై సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఎప్పుడైతే సినిమా ట్రైలర్ విడుదల అయ్యిందో అప్పటి నుండి విమర్శలు మొదలు. అమ్మాయిల గురించి అసభ్యంగా చూపించడంతో పాటు పలు అభ్యంతరకర సీన్స్ ను ఈ చిత్రంలో పెట్టారంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్రంకు యూత్ నుండి ఆధరణ దక్కుతున్నా ఒక వర్గం వారు మాత్రం ఈ చిత్రంను తీవ్రంగా విమర్శిస్తున్నారు. తాజాగా నిర్మాత ధనుంజయన్ ఈ చిత్రంపై విరుచుకు పడ్డాడు. డబ్బులు సంపాదించేందుకు ఇలాంటి చెత్త సినిమాలు తీయడం ఏంటీ అంటూ ఆరోపించాడు. సమాజాన్ని భ్రష్టు పట్టించేలా మీ సినిమా ఉందంటూ ఆయన ఆరోపించాడు. దానికి సమాధానంగా 90 ఎంఎల్ దర్శకురాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడింది. మీరు తీస్తున్న సినిమాలో కూడా అసభ్యకర సన్నివేశాలు ఉంటున్నాయి. అవి సమాజానికి చేటు కలిగించేవి కావా అంటూ ప్రశ్నించి��ది. మొత్తానికి ఈ చిత్రం పలువురి నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటోంది. విమర్శలు వస్తున్నా కూడా కలెక్షన్స్ కూడా బాగానే ఈ చిత్రం రాబడుతున్న నేపథ్యంలో నిర్మాతలు సేఫ్ జోన్ లో పడే అవకాశం కనిపిస్తుంది.
0 notes