#चलो_उज्जैन
Explore tagged Tumblr posts
thaporushi · 2 years ago
Photo
Tumblr media
మ‌ధ్య‌ప్ర‌దేశ్లోని ఉజ్జయినిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు శ్రీ మహాకల్ లోక్ కారిడ‌ర్ ను ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు మహాకాల్ లోక్‌ను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత ఆయ‌న‌ కమల్‌కుండ్, సప్తఋషి మండపం, నవగ్రహాలను సందర్శించ‌నున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ఆలయ కాంప్లెక్స్‌ విస్తీర్ణం 2.87 హెక్టార్ల నుంచి 47 హెక్టార్లకు విస్తరిస్తుంది. మహాకాల్ లోక్ ప్రాజెక్ట్ లో భాగంగా మార్గంలో 108 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇవి శివుని తాండవ స్వరూపాన్ని (నృత్యరూపం) సూచిస్తాయి. మహా కాల్ మార్గంలో శివుడిని వర్ణించే అనేక విగ్రహాలను ఏర్పాటు చేశారు. కారిడ‌ల్ పొడ‌వునా మ్యూరల్ వాల్ పెయింటింగ్స్, శివ పురాణంలోని కథల ఆధారంగా నిర్మించారు. సృష్టి, గణేశుడి జననం, సతి, దక్ష కథల ఆధారంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన నిర్మాణాల‌ను చేప‌ట్టారు. ఒక ఫౌంటెన్‌తో పాటు ప్రత్యేకంగా శివుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కాంప్లెక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నిఘా కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నారు. అలాగే.. అనేక మతపరమైన విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ ఆల‌య కారిడార్ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. #ujjain #mahakallok #महाआरती #mahakaal #mahakal #mahakalcorridor #mahakaleshwar #मेरे_महाकाल #चलो_उज्जैन #JaiShriMahakal #ShriMahakalLok #mahakallok #श्री_महाकाल #MahakalCorridor #श्रीमहाकाललोक #महाकालेश्वरज्योतिर्लिंग #उज्जैन #बाबामहाकाल #Mahadev #Mahakaal https://www.instagram.com/p/CjkbbgVLMWQ/?igshid=NGJjMDIxMWI=
0 notes