Tumgik
#fasalbheema
batukamma · 4 years
Text
రైతులకు కేసీఆర్ బంపరాఫర్లు ఇవే
Tumblr media
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన ప్రకటన చేశారు. తాను కోరుకున్న, కలలుకన్న తెలంగాణ సాకారమైందన్న ఆయన.. వారం రోజుల్లో రైతులకు గొప్ప శుభవార్త చెబుతానన్నారు. కొండపోచమ్మ సాగర్ కు నీరు విడుదల చేసిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు. కళ్లు తిరిగిపడిపోయే వార్త చెబుతానంటూ... తాను చేయబోయే ప్రకటనపై ప్రజల్లో ఆసక్తి రేకెత్తించారు. అయితే.. వారం తర్వాత కేసీఆర్ ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. దీనికి సంబంధించి కొన్ని ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముందునుంచి తనని తాను రైతు పక్షపాతిగా చెప్పుకుంటారు కేసీఆర్. మ్యాట్రిమోనీలో వల వేసింది.. 65 లక్షలు గుంజింది! నలుగురి కోసం ఎయిర్ బస్ విమానం అద్దెకు తీసుకున్నడు రైతుల సంక్షేమం కోసమే మిషన్ కాకతీయ ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటికే రుణమాఫీ, రైతుబంధు వంటి పథకాలతో రైతుల సంక్షేమానికి పాటుపడుతున్నారు కేసీఆర్. మరి ఇప్పుడు కొత్తగా ఏం చెప్పబోతున్నారన్నదే హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. రైతులకు మరిన్ని కొత్త పథకాలు ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే కొత్త వ్యవసాయ విధానం గురించి చెప్పారు కేసీఆర్. కొద్దిరోజులుగా మంత్రులు, అధికారులు, వ్యవసాయశాస్త్రవేత్తలు దీనిపైనే కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. నాణ్యమైన విత్తనాలు ఇచ్చి మంచి దిగుబడి వచ్చేలా ప్లాన్ చేస్తోంది. ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలి కాబట్టి.. ఒకవేళ నష్టం వస్తే.. ప్రభుత్వమే భరించేలా ప్రణాళిక ఉండబోతోందని టాక్. అలాగే  వరికి ఇప్పుడున్న మద్దతు ధరకంటే అధికంగా చెల్లించాలని సర్కారు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సన్న రకాలు పండించే రైతులకు మాత్రమే ఇది వర్తింపజేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. పంటల బీమాను పకడ్బందీగా అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రీమియం ఎక్కువగా ఉందనే కారణంతో రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వ పథకమైన ఫసల్ బీమా యోజన నుంచి రాష్ట్రం వైదొలిగింది. అయితే.. ఇప్పుడు రాష్ట్రమే పంటల బీమా స్కీం ప్రకటించే అవకాశముంది. తక్కువ ప్రీమియంతో ఇది ఉండనుందనే మాట వినిపిస్తోంది. మొత్తంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యమని చెప్పిన కేసీఆర్.. ఆ దిశగా అడుగులు వేస్తున్నారనే చెప్పుకోవాలి. కొండపోచమ్మసాగర్‌కు ఉండవల్లిని పిలిస్తే బాగుండేది! హీరోయిన్ లకి ఏ మాత్రం తగ్గని ‘కల్పిక’ అందాలు Read the full article
0 notes